For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు భావోద్వేగ పరిశుభ్రతని కలిగి ఉన్నారా: దలైలామా మాటలలో

మీ శరీరం యొక్క శ్రేయస్సు నిర్వహించడానికి వ్యక్తిగత పరిశుభ్రం ఎంత అవసరమో, అదేవిధంగా క్రియాశీల ఆలోచనలు చేసే మనసుకి భావోద్వేగ పరిశుభ్రత అవసరం.

|

మీ శరీరం యొక్క శ్రేయస్సు నిర్వహించడానికి వ్యక్తిగత పరిశుభ్రం ఎంత అవసరమో, అదేవిధంగా క్రియాశీల ఆలోచనలు చేసే మనసుకి భావోద్వేగ పరిశుభ్రత అవసరం.

కానీ ఏమిటీ భావోద్వేగ పరిశుభ్రత?

Mental Health: 3 Keys To Emotional Hygiene

దలైలామా చెప్పిన ప్రకారం భావోద్వేగ పరిశుభ్రత అనగా:

1. మీ మనసుపై పై దృష్టి ఉంచి, నచ్చిన పనిని రోజులో రెండు సార్లు చేయండి

ధ్యానం, వ్యాసాలు , పెయింటింగ్, సంగీతం లేక ఏదైనా కళల యందు మీ మనస్సును కేంద్రీకరించడం వంటివి, మీ భావోద్వేగ లక్షణాలను తగ్గించుకొనుటకు భిన్నమైన మార్గాలు. ఈరకమైన కార్యకలాపాల యందు మీకు నచ్చినది ఎంపిక చేసుకుని రోజులో కనీసం రెండు సార్లు వీటికి సమయం కేటాయించడం ముఖ్యం. ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్ర సమయాలలో.

ఉదయంవేళల యందు చేయు భావోద్వేగ నియంత్రణా చర్యలు మీలోని కృతజ్ఞతాభావాలు మరియు మీ ఆకాంక్షల పై ప్రభావాన్ని చూపితే, మీ సాయంత్ర చర్యలు రోజంతా మీరు నేర్చుకున్న విషయాలకి సంబంధించిన అవగాహన, తెలివితేటలను పెంచుతుంది.

Mental Health: 3 Keys To Emotional Hygiene

2. భావోద్వేగ సవాళ్ళకు భయపడకండి

యుక్తవయసు వచ్చేలోగా మనిషి రెండు దశలను దాటుతాడు ఒకటి బాల్యం, రెండు కౌమారం. శారీరిక,మానసిక మార్పుల ఆధారంగా 18 సంవత్సరాలవయసు నిండిన వారిని యుక్తవయసుగా భావిస్తాము. కాని లారెన్స్ కోహ్ల్బెర్గ్ నైతిక అభివృద్ధి నమూనా (మోడల్ of మోరల్ డెవెలప్మెంట్) ప్రకారం 13 శాతం మంది ప్రజలు 36 సంవత్సరాల వయసులో మానసికంగా యుక్తవయసుకి వస్తారు.

అనగా మనలో ఎక్కువ శాతం బాల్య దశ లోనే మానసిక ఎదుగుదల ఆపివేయబడి ఉంటుంది. మనకు ఆనందం కాని, భాదను కాని కలిగించే స్వార్ధపూరిత మానసిక ప్రవర్తనల మద్య కొట్టుమిట్టాడుతుండడమే దీనికి కారణం. దీనినే భావోద్వేగ సవాళ్లుగా నిర్ధారిస్తారు. ఇందులో కొందరు సమాజ పరిస్థితుల ఆధారంగా లావాదేవీల సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు. అనగా ఏదైనా ఫలితం ఆశించే ఏ పనైనా చెయ్యడానికి పూనుకుంటారు. తమకు లాభసాటి లేని మార్గం మంచి మార్గం అయినా ఆ మార్గాన్ని పట్టించుకోరు. వీరి మానసిక ఆనందం కోసమే ఇలాంటి జీవనాన్ని గడుపుతుంటారు. వీరు కౌమార దశలోనే మానసిక ఎదుగుదలను కోల్పోవడం జరుగుతుంది.

Mental Health: 3 Keys To Emotional Hygiene

మానసికంగా వయోజన వ్యక్తిగా మారడం:

మీసంతోషానికి , భాద కి సంబంధం లేకుండా, ఎప్పుడైతే మీరు ఏ పనిని అయినా మీ నిర్ణయాలకు కట్టుబడి చేస్తే మీరు మానసిక పరివర్తన కలిగి ఉన్నారనే అర్ధం. భావోద్వేగ సవాలు స్వీకరించడం అనేది పరిస్థితులని అర్ధం చేసుకొనుట ద్వారా లేక ఆ పరిస్థితుల్లోకి దైర్యంగా వెళ్ళడం ద్వారా జరుగుతుంది. ఎక్కువ మంది ప్రజలు నొప్పి, దుఃఖం, నిరాశ, కోపం మరియు అనేక ఇతర భావోద్వేగాలు కలిగించే పరిస్థితులను ఆమోదయోగ్యం కాని భావనలుగా పరిగణించి తిరస్కరించారు కూడా.

Mental Health: 3 Keys To Emotional Hygiene

3. వినదగునెవ్వరు చెప్పిన

మనలో ఎక్కువమంది వినడంకన్నా మాట్లాడడమే చేస్తుంటారు , ఇది మానసిక అవగాహన లేని వ్యక్తి యొక్క ప్రధాన లక్షణం.

ఒక ఆరోగ్యకరమైన భావాలు కలిగిన వ్యక్తి ఆలోచనల ప్రకారం, ఒక చర్చలో ఇద్దరికీ వినడం లోనూ, మాట్లాడుటలోనూ సమానమైన హక్కు ఉంటుంది. తాను మాట్లాడడానికి ఎంత ముందు ఉంటారో, వినేటప్పుడు కూడా అంత సహనాన్ని చూపగలరు. వీరి దృష్టిలో సంభాషణ అనేది ఒక అర్ధవంతమైన చర్చగా కొనసాగాలి . దీనికారణంగా చర్చలో ఇరుపక్కలా సత్ఫలితాలను పొందగలరు.

మీరు వినేవారు కాకపొతే , ఈ అలవాటుని ముందుగా అలవరచుకోండి. కాలక్రమేణా చర్చలయందు మీ శ్రద్ధ పెరగడమే కాకుండా, చర్చలు అర్ధవంతమైన ముగింపుని ఇస్తాయి. ఇది సాటి వ్యక్తులతో సత్సంబంధాలను కలిగి ఉండేలా పాటుపడుతుంది.

మీరు మానసికంగా పరిశుభ్రంగా ఉన్నారా

మీరు ఒకవేళ మానసిక భావోద్వేగ పరిశుభ్రతని కలిగి ఉన్నట్లయితే, మీకు ఈ వ్యాసంతో పని లేదు. లేకపోతే మాత్రం అలవరచుకోండి. ఈ భావోద్వేగ పరిశుభ్రత మీ మానసిక ఎదుగుదలకి తోడ్పడడమే కాకుండా మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుటలో , మరియు మీ సంబంధాలను ఆరోగ్యకరంగా మలచుటలో సహాయం చేస్తుంది.

English summary

Mental Health: 3 Keys To Emotional Hygiene

Mental Health: 3 Keys To Emotional Hygiene,Emotional hygiene allows one’s mind to be at peace, be contented, and be conscious of their actions. The 3 keys to emotional hygiene are: focus on your inner self every day in the morning and evening, learn to listen first, and accept emotionally challenges that come your way.
Story first published:Saturday, March 10, 2018, 16:17 [IST]
Desktop Bottom Promotion