For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు తయారీ విధానం

ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు తయారీ విధానం

|

ఆయుర్వేదంలో అల్లంను సర్వరోగ నివారిణిగా భావిస్తారు. అల్లంలో ప్రతి అంశం శ్రేష్ఠమైనదే మరియు దీనిని అనాదిగా సాంప్రదాయ మరియు పశ్చిమ వైద్య విధానాలలో ఉపయోగిస్తున్నారు.

అల్లం అనేక శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అల్లంలో ఉండే జింజెరాల్ మరియు షోగోల్ అనే ఘాటైన దానికి అంతటి మహత్తుకు కారణమని పరిశోధకులు తెలియజేసారు.

అల్లం టీ అధిక స్థాయిలో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు మరియు కొద్దీ మాత్రంలో కాల్షియం, జింక్, ఫాస్పరస్, మొదలైన ఖనిజాలను కలిగి ఉంటుంది.

This Is The Reason Why You Must Drink Ginger Tea Everyday & Here Is The Right Way To Prepare

అల్లం టీ త్రాగితే, శరీరానికి పలు ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణ సమస్యలకు చికిత్సలో దీనిని ఉత్తమంగా భావిస్తారు. అల్లం టీ నెమ్మదించిన జీర్ణక్రియను కూడా ప్రేరేపిస్తుంది మరియు రుచి చూడటాన్ని కోల్పోయిన రుచి మొగ్గలను సాధారణ స్థితికి తీసుకువస్తుంది.

ఈ వ్యాసంలో అల్లం టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నింటిని తెలియజేస్తున్నాము. అల్లం టీ ప్రతిరోజు త్రాగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవడానికి ఆలస్యం చేయకుండా చదవండి.

1. యాంటీ క్యాన్సర్ లక్షణాలు:

1. యాంటీ క్యాన్సర్ లక్షణాలు:

క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధించే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధంగా అల్లంను భావిస్తారు. అల్లం ప్యాంక్రియాటిక్, కొలొరెక్టల్, ప్రోస్టేట్, మూత్రాశయం, కాలేయం మరియు రొమ్ము క్యాన్సర్ యొక్క వ్యాప్తినిని నిరోధిస్తుంది. ఇది అల్లం టీ యొక్క ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి.

2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

అల్లంలో ఉండే జింజెరాల్ మరియు షోగోల్ ,జీర్ణక్రియను ప్రేరేపించి పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. ఇది అనేక జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. అందువల్ల అల్లం టీ,జీర్ణసమస్యల నివారణకు ఉత్తమంగా భావించబడుతుంది

3. రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది:

3. రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది:

అల్లం రక్తప్రసరణను ప్రోత్సహించడం ద్వారా,అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ వంటి కార్డియోవాస్కులర్ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడుతుంది. అల్లం కూడా ధమనులు నుండి అడ్డులను తొలగించడంలో సహాయపడుతుంది కనుక గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి.

4. మెదడు శక్తిని పెంచుతుంది :

4. మెదడు శక్తిని పెంచుతుంది :

ప్రతిరోజూ అల్లం టీ సేవిస్తే, అభిజ్ఞ సామర్ధ్యాలు మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. కనుక, ఇది , మన శరీరం లో ఆక్సీకరణ ఒత్తిడి, అపోప్టోసిస్ మరియు వాపు తగ్గిస్తుంది. నడివయసు స్త్రీలలో మతిమరుపు తగ్గిస్తుంది.

5. ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ :

5. ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ :

అల్లం ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లా పనిచేసి, వాపు వలన కలిగే కీళ్ళ మరియు కండరాల నొప్పికి నివారణకు దోహదం చేస్తుంది. ప్రతిరోజూ అల్లం టీ తాగడం వలన కలిగే కొన్ని ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలలో ఇది కూడా ఒకటి.

6. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది:

6. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది:

అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది. మన శరీరానికి సోకే ఏరకమైన వ్యాధిని అయినా, నివారించడంలో కూడా సహాయపడుతుంది.

అల్లం టీ తయారీ విధానం మీ కోసం:

అల్లం టీ తయారీ విధానం మీ కోసం:

కావల్సినవి:

4-6 సన్నగా తరిగిన అల్లం ముక్కలు

తేనె, తగినంత

ఒక గ్లాసుడు నీరు

తయారీ:

నీటిని ఒక గిన్నెలో పోసి వేడి చేయండి. దీనికి అల్లం కలిపి చిన్నసెగపై పది నిమిషాలు మరగనివ్వండి. తరువాత దీనిని వడగట్టి, గ్లాసులో పోయండి. చల్లారాక తేనె కలపండి. ఇది అల్లం టీ చేసుకునే విధానం.


English summary

This Is The Reason Why You Must Drink Ginger Tea Everyday & Here Is The Right Way To Prepare

Ginger is known to have several powerful health benefits. Researchers have stated that ginger contains active volatile oils and pungent compounds like gingerol and shogaol, and these constituents are what give ginger its true powers.
Story first published:Friday, July 6, 2018, 21:49 [IST]
Desktop Bottom Promotion