For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు తరచుగా తలనొప్పి రావడానికి గల 10 కారణాలు !

|

మీరు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తున్నప్పుడు, మొదటిసారిగా తల భారాన్ని (తలనొప్పిని) అనుభూతి చెందుతారు.

మీకు ఏమైందా అని? 3 సెకన్లపాటు ఆశ్చర్యపోయి, అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు, మీ బాస్ చెప్పిన పనిని చెయ్యాల్సిన సందర్భంలో, మీరు మీ ముఖాన్ని చిట్లించుకుంటూ ఉన్నప్పుడు 2వ సారి తలనొప్పిని పొందుతారు. ఒక్కసారిగా మీ మెదడులో 1000 ఏనుగులు ఒక్కసారిగా మార్చింగ్ చేస్తున్నప్పుడు మీరు 3వ సారి తలనొప్పిని పొందుతారు.

అవన్నీ తెలిసిన సౌండ్సే? అని మనమందరం కూడా భావిస్తున్నాము. తలనొప్పి "సైలెంట్ కిల్లర్‌గా" ఉంటుంది.

ఇక్కడ మీరు, తరచుగా తలనొప్పిని కలిగి ఉండటానికి గల 10 కారణాలను & వాటిని నివారించడానికి మీరు ఏమి చెయ్యాలో అన్నదాని కోసం మరిన్ని విషయాలను తెలుసుకోగలరు.

# 1 చాలా ఎక్కువగా కాఫీ తాగడం :

# 1 చాలా ఎక్కువగా కాఫీ తాగడం :

మీరు కాఫీతో వ్యవహరించేటప్పుడు అది రెండువైపులా కత్తిలా పదునైనదని మరచిపోకండి. మీరు కాఫీను సరైన మోతాదులో తీసుకోవడం వల్ల మీ మనసుకు చైతన్యాన్ని కలిగిస్తుంది కానీ, మీరు ఆ విధంగా వినియోగించకపోతే గనక మీకు తలనొప్పిని కలుగజేస్తుంది.

కాబట్టి, మీరు రోజులో ఎన్ని కప్పుల కాఫీని తాగుతున్నారో అన్నదానిపై కాస్త జాగ్రత్తగా ఉండండి.

# 2 మీరు అతిగా నిద్రపోవడం :

# 2 మీరు అతిగా నిద్రపోవడం :

"వద్దు" మీరు ఈ విధంగా మాత్రం అస్సలు చెయ్యవద్దు. వారాంతంలో మీరు మీ ప్రణాళికల ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ లో కార్యక్రమాలను అమితంగా చూసి అతిగా నిద్రపోవడం వల్ల, మరుసటి రోజు మెల్కోనేటప్పుడు మీరు ఎక్కువగా తలనొప్పిని ఎదుర్కోవడానికి ఇదే కారణమవుతుంది.

# 3 మీరు మీ కార్యాలయాన్ని ద్వేషించడం :

# 3 మీరు మీ కార్యాలయాన్ని ద్వేషించడం :

మనలో చాలామంది రోజులో ఎక్కువ సమయాన్ని

- పనిచేసే కార్యాలయాల్లోనే గడుపుతారు. అలాంటి కార్యాలయాల్లో మనము పని చేయటానికి ఒత్తిడిలేని, అనుకూలమైన వాతావరణమును కలిగి ఉండటమనేది చాలా ముఖ్యం. ఒకవేళ మీ కార్యాలయం అలా లేకపోతే, మీరు ఒంటరితనముగా అనుభవిస్తూ ఉండటం వలన, మీలో ఒత్తిడి పెరిగి తరచుగా తలనొప్పి రావడానికి దారి తీస్తుంది.

# 4 మీ వ్యక్తిగత జీవితం గజిబిజిగా ఉంటే :

# 4 మీ వ్యక్తిగత జీవితం గజిబిజిగా ఉంటే :

పనిచేసే కార్యాలయంలో కన్నా, మీ ఇంటి వాతావరణం మరింత సానుకూలంగా ఉండటమనేది చాల ముఖ్యమైనది. మీరు బాగా అలసటను చెందిన రోజు త్వరగా ఇంటికి వెళ్లడమనేది స్వర్గంలా ఉంటుంది.

కాబట్టి, మీకు మానసిక బాధను కలిగించి, మీతో తరచుగా పోరాడుతూ, మిమ్మల్ని మనోవేదనకు గురి చేసే వ్యక్తితో కలసి ఒకే ఇంట్లో మీరు జీవిస్తున్నట్లయితే, మీకు సాధారణం కంటే ఎక్కువగా తలనొప్పి, మైగ్రేన్లు తరచుగా వస్తుంటాయి.

# 5 మీ కంప్యూటర్ స్క్రీన్ చాలా బ్రైట్‌గా ఉన్నప్పుడు :

# 5 మీ కంప్యూటర్ స్క్రీన్ చాలా బ్రైట్‌గా ఉన్నప్పుడు :

కంప్యూటర్ స్క్రీన్ నుంచి వెలువడే ప్రకాశవంతమైన కాంతిని తట్టుకుంటూ, మీ పని గంటలను కొనసాగించడానికి అనుగుణంగా మీ కళ్ళు రూపొందించబడలేదు. కాబట్టి మీరు కంప్యూటర్ స్క్రీన్‌ను చాలా దూరం నుంచి చూస్తే, కారు హెడ్ లైట్ లాంటి కాంతితో మెరుస్తూ మీ ముఖం మీద వెలుతురు పడుతుంది, అలాంటప్పుడు మీరు బాధాకరమైన తలనొప్పిని ఎదుర్కొంటారు.

దానికి పరిష్కారం:

మీ కంప్యూటర్ నుంచి వెలువడే కాంతిని పరావర్తనం చెందించే యాంటీగ్లారే స్క్రీన్‌ను వాడండి, అలానే మీ కంప్యూటర్ నుండి వెలువడే కాంతిని బాగా తగ్గించుకోవడం వల్ల, మీ కంటి రెటీనాని తీవ్రస్థాయిలో ప్రభావితం చేయదు.

# 6 మీరు సరైన స్థితిలో లేకపోవడం :

# 6 మీరు సరైన స్థితిలో లేకపోవడం :

బోరింగ్ గా ఉన్న ఉపన్యాసము మధ్యలో, మీరు అకస్మాత్తుగా నిద్రపోయే క్షణంలో, మీ తల అటూఇటూ ఊగుతూ ఒక్కసారిగా మేల్కొన్నప్పుడు - మీ తల ఎంత భారీగా ఉందో అనే విషయాన్ని మీరు గ్రహించలేరు.

కాబట్టి, అలాంటి సమయాల్లో మీ మెడ, భుజాల కండరాలతో పాటు, మీ వెన్నెముకకు అనుకూలంగా ఉండే మంచి భంగిమను (స్థితిని) కలిగి ఉండండి. అది మీ శరీర భాగాలపై అధిక ఒత్తిడిని నిరోధించి, ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పిని నివారిస్తుంది.

# 7 ఘాటైన రసాయనాల వాసనను పీల్చినప్పుడు :

# 7 ఘాటైన రసాయనాల వాసనను పీల్చినప్పుడు :

నన్ను నమ్మండి, ఒక సున్నితమైన ముక్కు త్వరగా తలనొప్పిని కలుగచేయడానికి దారితీస్తుంది. కాబట్టి, మీరు ఈ బలమైన రసాయనాల వాసనను తప్పించుకోలేకపోతే, మీరు నోటి మాస్క్‌ను ధరించడం వల్ల రసాయనాల నుండి వెలువడే వాసన నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు.

# 8 మీ జుట్టును చాలా గట్టిగా టై చేయటం :

# 8 మీ జుట్టును చాలా గట్టిగా టై చేయటం :

మీరు మీ తలపై 50 బాబీ పిన్స్‌తో బరువును పెడుతున్నట్లయితే (లేదా) చాలా గట్టిగా ఉన్న పోనీటైల్‌తో మీ జుట్టును కట్టినట్లయితే, మీకు తరచుగా తలనొప్పి రావడానికి మీ తలపై మీరు తెచ్చిపెట్టుకున్న అలంకరణ కారణము.

తర్వాత నుంచి, మీ జుట్టును మరింత సౌకర్యవంతమైన పద్ధతిలో అలంకరించుకోండి.

# 9 మీరు ఫోన్‌ను ఎక్కువగా చూడటం :

# 9 మీరు ఫోన్‌ను ఎక్కువగా చూడటం :

మీరు చాలాకాలం నుంచి తలను కిందికి దించి మీ ఫోన్‌ను చూడటం వల్ల, మీరు మీ మెడపై అనవసరమైన ఒత్తిడిని తెస్తున్నారు. ఇలా మీ తల యొక్క బరువుతో మీరు తరచూ తలనొప్పిని పొందటానికి కారణం కావచ్చు.

 # 10 మీరు ఎక్కువగా ఎండలో తిరగడం :

# 10 మీరు ఎక్కువగా ఎండలో తిరగడం :

ఆకాశంలో సూర్యుడు నిప్పులు చిమ్ముతూ, మీ చుట్టూ 1000 వోల్టుల బల్బుల కాంతిని ప్రసరిస్తూ ఉన్న సమయంలో మీరు తరచుగా ఎండబారిన పడినట్లయితే, అలాంటప్పుడు మీరు తరచుగా తలనొప్పి ఎదుర్కొంటారు.

తీవ్రమైన ఎండ లో మీరు బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్‌ను, టోపీని తప్పక ధరించాలి !

English summary

10 Reasons Why You Are Having Frequent Headaches

Wondering why you are having frequent headaches? It could be because your eyes are constantly burned by the glare of the computer, you are out in the sun too much, are being exposed to too harsh smells, or are constantly surrounded by negative energy in your workplace or at home. You could also have bad posture.
Story first published: Friday, March 30, 2018, 19:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more