ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు( సైంధవ లవణం) ఆరోగ్యలాభాలు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

రాళ్ల ఉప్పు ( సెంధానమక్ అని హిందీలో, సైంధవ లవణ అని సంస్కృతంలో అంటారు) అనేది ఒక సహజంగా తయారయ్యే ఖనిజలవణం. సోడియం క్లోరైడ్ స్పటికాలతో ఏర్పడే దీని మరో సాధారణ పేరు “హాలైట్”.

రాళ్ళ ఉప్పు అనేక రంగులలో ఉండి దానిలోని వివిధ రకాల మలినాలతో వేర్వేరు రూపాల్లో ఉంటుంది. నల్ల ఉప్పు లేదా కాలా నమక్ కూడా రాళ్ళ ఉప్పే కానీ అందులో సోడియం క్లోరైడ్ తో పాటు సల్ఫర్ కలిసి ఉంటుంది.

రాళ్ల ఉప్పు రసాయన ఫార్ములా NaCl, సాధారణ ఉప్పుది కూడా అదే. దానిలో ఉండే మలినాలు జిప్సం (CasO4) మరియు సిల్వైట్ (KCl).

రాళ్ళ ఉప్పు మెడికల్ షాపులనుంచి సూపర్ మార్కెట్ల వరకూ అన్నిచోట్లా సులువుగా దొరికే పదార్థం. ఇది పౌడర్, ద్రవరూపం లేదా బిళ్ళల రూపంలో లభిస్తుంది. జామకాయ వంటి పళ్ళు తినేప్పుడు వాటిపై రుచికోసం చల్లుకుంటారు కూడా (చిన్ననాటి జ్ఞాపకం).

ఈ పై లక్షణాలన్నింటితో పాటు, రాళ్ళ ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకో చదవండి మీకే తెలుస్తుంది !

1. జీర్ణానికి మంచిది:

1. జీర్ణానికి మంచిది:

రాళ్ళ ఉప్పులో ఉండే కాల్షియం,మెగ్నీషియం వంటి ఖనిజలవణాలు ఆరోగ్యానికి మంచిది. లాలాజలం, జీర్ణరసాల సమన్వయంలో ఇది తోడ్పడుతుంది. దీనికున్న లక్షణంతో కడుపులో గ్యాస్ రాకుండా చేస్తుంది. యాంటాసిడ్ కూడా ఉన్నది ఇందులో. ఆయుర్వేదంలో ఈ సైంధవ లవణాన్ని సోంఫు, కొత్తిమీర పొడి మరియు జీలకర్రతో కలిపి తీసుకుంటే అజీర్ణం తగ్గుతుందని చెబుతారు.

2. ఆకలిని పెంచుతుంది:

2. ఆకలిని పెంచుతుంది:

ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు మిరియాలు, అల్లం, పొడుగు మిరియాలు, ఏలకులతో కలిపి వాడితే ఆకలిని పెంచుతుంది.

3. రక్తపోటును తగ్గిస్తుంది:

3. రక్తపోటును తగ్గిస్తుంది:

ఉప్పు, రక్తపోటుల బంధం విడదీయలేనిది. తక్కువ బిపిని చిటికెడు రాళ్ళ ఉప్పును నీటిలో వేసి రోజుకు రెండు సార్లు తీసుకోటంతో పరిష్కరించవచ్చు. కానీ అధిక బిపి ఉన్నవారు మాత్రం దీన్ని ముట్టుకోకూడదు.

4. బరువు తగ్గటం:

4. బరువు తగ్గటం:

ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు కొవ్వుని కరిగిస్తుంది. ఇందులో ఉండే ఖనిజ లవణాలు తీపిపై మక్కువను ఇన్సులిన్ ను తిరిగి జీవితం చేయటంతో తగ్గించటమే కాక, కొవ్వు కణాలను కూడా తొలగిస్తాయి.

5. గొంతునొప్పికి పరిష్కారం:

5. గొంతునొప్పికి పరిష్కారం:

గోరువెచ్చని ఉప్పునీరుతో పుక్కిటపట్టటం అనే ఈ ఇంటిచిట్కా గొంతునొప్పికి చాలా సాధారణం. ఇది గొంతునొప్పిని, వాపును తగ్గిస్తుంది. పై భాగం శ్వాసకోశం ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

6. మెటబాలిజంను పెంచుతుంది:

6. మెటబాలిజంను పెంచుతుంది:

రక్తంలో ఉప్పుశాతం సరిగా ఉంటేనే కణాలు బాగా పనిచేయగలవు. రాళ్ళ ఉప్పు శరీరంలో నీరుని పీల్చుకుంటుంది, దానివల్ల కణాలు లవణాలు, పోషకాలను పీల్చుకోగలవు. కానీ అధిక బిపి వంటి సమస్యలకి దూరంగా కేవలం తగినంత ఉప్పుని మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం.

7. రక్తం కారే చిగుళ్ళకు చికిత్స:

7. రక్తం కారే చిగుళ్ళకు చికిత్స:

రాళ్ళ ఉప్పును ప్రాచీనకాలంలో పళ్ళను తెల్లగా చేయడానికి, నోటి దుర్వాసనకి పరిష్కారంగా వాడేవారు. త్రిఫల, వేప పౌడర్లతో కలిపి దీన్ని వాడితే చిగుళ్ల సమస్యలు నివారించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇదే రాళ్ళ ఉప్పు యొక్క అత్యుత్తమ లాభం.

English summary

Ayurvedic benefits of rock salt

Rock salt may not be too common; but it has plenty of health benefits. Rock salt is also used by ayurvedic experts as one of the important ingredients for the treatment of several health issues. Rock salt aids better digestion and also betters low blood pressure.