For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందులతో పని లేకుండా ఒళ్ళు నొప్పులను తగ్గించుకునేందుకు మార్గాలు

మందులతో పని లేకుండా ఒళ్ళు నొప్పులను తగ్గించుకునేందుకు మార్గాలు

|

ఒక్కక్షణం మీరు ఈ మధ్యకాలంలో ఒళ్ళు నొప్పులతో బాధపడిన సందర్భాన్ని గుర్తుతెచ్చుకుని ఆ సమయంలో మీరెదుర్కున్న అసౌకర్యాన్ని కూడా గుర్తుతెచ్చుకోండి. చాలా ఇబ్బందికర పరిస్థితి కదా? శారీరక నొప్పి ఏదైనా తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రోజువారీ యాక్టివిటీస్ లలో కూడా పాలుపంచుకోలేనంత ఇబ్బంది ఎదురవుతుంది.

అనేక కారణాల వలన నొప్పులు బాధించవచ్చు. గాయాలు, వ్యాధులు, ఇన్ఫెక్షన్స్, సర్జరీల వంటివి నొప్పులను కలిగించే కొన్ని కారణాలు. నొప్పి తీవ్రత అనేది కారణంపై ఆధారపడి ఉంటుంది. అలాగే, శరీరంలో అఫెక్ట్ అయిన ప్రాంతంపై, వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిపై, వయసు అలాగే జెండర్ పై నొప్పి తీవ్రత ఆధారపడి ఉంటుంది.

8 Scientifically Proven Ways To Reduce Body Ache Without Medication!

ఉదాహరణకి, పడిపోవడం వలన లేదా మోకాళ్ళకు గాయంవలన తలెత్తే నొప్పి అనేది మైగ్రైన్ నొప్పి కంటే భిన్నంగా ఉంటుంది. వీటి తీవ్రత సమంగానే ఉన్నప్పటికీ నొప్పులలో తేడా ఉంటుంది. కారణానికి సంబంధం లేకుండా నరాలు, టిష్యూస్ లేదా మజిల్స్ ఇంఫ్లేమేషన్ వలన కూడా నొప్పులు తలెత్తుతాయి.

కాబట్టి, నొప్పులను తక్కువ కాలంలోనే తగ్గించుకునేందుకు వైద్యులు సూచించిన పెయిన్ కిల్లర్స్ ని వాడతారు. అందువలన, ఇంఫ్లేమేషన్ తగ్గుతుంది. అయితే, పెయిన్ కిల్లర్స్ అనేవి విపరీతమైన స్ట్రాంగ్ మెడికేషన్స్. కెమికల్స్ ని వీటిలో పొందుబరుస్తారు. ఇవి రాను రాను శరీరాన్ని మరింత ఇబ్బంది పెడతాయి.

కాబట్టి, నొప్పి అనేది భరించగలిగినట్లుగానే ఉన్నప్పుడు నొప్పులను సహజసిద్ధమైన రెమెడీస్ తో తగ్గించుకోవచ్చు.

సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన అటువంటి కొన్ని రెమెడీస్ గురించి ఇప్పుడు చర్చిద్దాం.

1. ఆక్యుపంక్చర్ :

1. ఆక్యుపంక్చర్ :

పెయిన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్క్రిప్స్ సెంటర్ ఫర్ ఇంటెగ్రేటివ్ మెడిసిన్ ఇన్ కాలిఫోర్నియా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఆక్యూపంక్చర్ అనేది ఒక గొప్ప నేచురల్ థేరాపేటిక్ మెథడ్. ఇది నొప్పిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఇది క్రమంగా కాగ్నిటివ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ ను మార్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. అందుకే నొప్పి పట్ల మెదడు రెస్పాన్స్ ను ఇది ప్రభావితం చేస్తుంది. కాబట్టి, ఆక్యూపంక్చర్ అనేది ఒక వ్యక్తికి నొప్పిని తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది.

2. వ్యాయామం:

2. వ్యాయామం:

యోగా మరియు ఏరోబిక్స్ వంటి కొన్ని రకాల వ్యాయామాలను క్రమం తప్పకుండా సాధన చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇవి మజిల్స్ ని కండిషన్ చేస్తాయి. కండరాల నొప్పులను తగ్గిస్తాయి. ఈ విషయం మనందరికీ తెలిసినదే. వ్యాయామం ద్వారా విడుదలైన ఎండార్ఫిన్ అనే హార్మోన్ అనేది నొప్పిని అలాగే ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తుంది.

3. మెడిటేరియన్ డైట్:

3. మెడిటేరియన్ డైట్:

బ్రెజిలియన్ రీసెర్చర్స్ గ్రూప్ నిర్వహించిన రీసెంట్ రీసెర్చ్ లో ఒక గొప్ప విషయం వెల్లడైంది. అదేంటంటే, మెడిటేరియన్ డైట్ లో భాగమైన కూరగాయలను, పండ్లను, ఆలివ్ ఆయిల్, ఫిష్ మరియు నట్స్ ను తీసుకోవడం ద్వారా నొప్పి సహజసిద్ధంగానే తగ్గుముఖం పడుతుందట . మెడిటేరియన్ డైట్ లో షుగర్ తక్కువగా ఉంటూనే. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని నొప్పిని నివారించేందుకు ఈ రెండూ అద్భుతంగా ఉపయోగపడతాయి.

4. స్ట్రెచింగ్ :

4. స్ట్రెచింగ్ :

కొన్ని రకాల నొప్పులు అంటే మజిల్ పుల్ వలన అలాగే జాయింట్స్ కు జరిగిన గాయావలన, స్ప్రెయిన్స్, ఆర్తరైటిస్ వంటి వాటికి స్ట్రెచింగ్ అనేది అద్భుత పరిష్కారం. నొప్పితో ప్రభావితమైన శరీర భాగాన్ని స్ట్రెచ్ చేయడం వలన నొప్పితో పాటు ఇంఫ్లేమేషన్ తగ్గుతుంది. ఆ ప్రాంతంలో స్టిఫ్ నెస్ తగ్గుతుంది. తద్వారా, నొప్పి సహజసిద్ధంగా తగ్గుముఖం పడుతుంది.

 5. విటమిన్ డి:

5. విటమిన్ డి:

మనందరికీ తెలిసినట్లుగానే ఆరోగ్యంగా ఉండాలంటే అత్యవసర పోషకాలను విటమిన్స్ తో పాటు పొందాలి. విటమిన్ డి అనేది అత్యంత ముఖ్యమైన విటమిన్. దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నొప్పిని తగ్గించే సామర్థ్యం కూడా దీనిలో ఉంది. విటమిన్ డి లో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి ఇంఫ్లేమేషన్ ని ముఖ్యంగా బోన్స్ మరియు జాయింట్స్ లో ఉండే ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తుంది. శరీరంలోని ఇతర ప్రాంతాల్లోని నొప్పులను కూడా తగ్గిస్తుంది.

6. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ:

6. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ:

కాగ్నిటివ్ బీహేవియరల్ థెరపీ అనేది సైకోథెరపీటిక్ టెక్నీక్ (సీబిటీ). కొన్ని రకాల మానసిక అలాగే శారీరక సమస్యలను తగ్గించేందుకు దీనిని ఉపయోగిస్తారు. సీబిటీ ని రెగ్యులర్ గా పాటించడం వలన నొప్పిలో తగ్గుదల కనిపిస్తుంది. బ్రెయిన్ రెస్పాన్స్ ను ఈ థెరపీ అనేది మార్చడం వలన నొప్పి తగ్గుతుంది. కాబట్టి, సీబీటీ అనేది ఒక వ్యక్తికి నొప్పిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది.

7. టర్మరిక్:

7. టర్మరిక్:

టర్మరిక్ అనే స్పైస్ ను వంటింట్లో సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది అనేక సమస్యలకు నేచురల్ రెమెడీగా ఉపయోగపడుతుంది. ఇది ఫ్లూ నుంచి స్కిన్ డిజార్డర్స్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది. టర్మరిక్ అనేది నొప్పులను నివారించేందుకు కూడా తోడ్పడుతుంది. ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు అలాగే దీన్ని పైపూతగా కూడా వాడవచ్చు. టర్మరిక్ లో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి ఇంఫ్లేమేషన్ మరియు పెయిన్ ను నివారిస్తాయి.

8. కాఫీ:

8. కాఫీ:

అనేక రీసెర్చ్ స్టడీస్ ను కండక్ట్ చేసిన తరువాత నేచర్ మెడిసిన్ అనే జర్నల్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం కప్పుడు కాఫీని షుగర్ లేకుండా ప్రతి రోజూ తీసుకుంటే ఏజ్ రిలేటెడ్ పెయిన్స్ అనేవి తగ్గుముఖం పడతాయట. ఆర్తరైటిస్ పెయిన్, బ్యాక్ పెయిన్ వంటివాటికి కెఫెయిన్ అనేది చెక్ పెడుతుందట. ఇంఫ్లేమేషన్ కూడా తగ్గుతుంది. అందువలన, సెల్స్ రీజెనెరేషన్ అనేది వృద్ధి చెందుతుంది.

English summary

8 Scientifically Proven Ways To Reduce Body Ache Without Medication!

Pain in the body can be caused by a number of reasons, and some type of aches could be more intense and long-term compared to the others. Many a time, people resort to taking painkillers, which are strong anti-inflammatory medications, in order to reduce pain. Acupuncture, exercise, stretching, vitamin D, etc. help you reduce body ache without any medication.
Story first published:Friday, August 31, 2018, 17:42 [IST]
Desktop Bottom Promotion