For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ ఇన్ఫెక్షన్ గురించి తెలిపే ఈ ఎనిమిది నిశ్శబ్ద చిహ్నాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు

కిడ్నీ ఇన్ఫెక్షన్ గురించి తెలిపే ఈ ఎనిమిది నిశ్శబ్ద చిహ్నాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు

|

శరీరంలోని శక్తిని పెంపొందించుకోవడం కోసం ఆహారాన్ని అలాగే పానీయాలను తీసుకోవడం ముఖ్యమైన అంశం. కొన్ని ఆహార పదార్థాలు అలాగే పానీయాలు శక్తిని పెంపొందించేందుకు తీసుకుంటాము. మరికొన్ని మన టేస్ట్ బడ్స్ ను సంతృప్తి పరచడం కోసం తీసుకోవడం జరుగుతుంది. మనం తీసుకునే ఆహారాలు అలాగే పానీయాలు శరీరంలోని శక్తిని ఉత్పత్తి చేసేందుకు అలాగే వివిధ అవయవాలు సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడతాయి. తద్వారా, ఎల్లప్పుడూ మనల్ని యాక్టివ్ గా ఉంచుతాయి. కొన్ని లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ తో పాటు పానీయాలు విసర్జన ప్రక్రియలోకి బయటికి వెళ్లిపోతాయి.

మనం తీసుకునే అదనపు ఆహారం అలాగే పానీయాలతో పాటు కొన్ని వేస్ట్ మరియు టాక్సిన్స్ తో కలిగినవి శరీరం చేత రిజెక్ట్ చేయబడతాయి. అందువలన, శరీరం నుంచి బయటికి ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా పంపబడతాయి. ఇలాంటి సమయంలోనే కిడ్నీ ముఖ్య భూమిక పోషిస్తుంది. శరీరం నుంచి వేస్ట్ ను అలాగే టాక్సిన్స్ ను ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

7 Silent Signs Of Kidney Infection You Should Never Ignore!

కిడ్నీలు శరీరంలోని ముఖ్య అవయవాల కిందకి వస్తాయి. వెన్నుపూసకు ఇరువైపులా ఉంటాయి. రిబ్ కేజ్ కింద లొకేట్ అవబడి ఉంటాయి. బీన్ షేప్ లో ఉంటాయి. ఇవి దాదాపు నాలుగైదు ఇంచుల సైజులో ఉంటాయి. కిడ్నీల ముఖ్య కర్తవ్యం ఏంటంటే రక్తంలోంచి వేస్ట్ తో పాటు టాక్సిన్స్ ను శరీరం నుంచి యూరిన్ రూపములో ఫ్లష్ చేయడం.

కాబట్టి, ఒకవేళ ఒక కిడ్నీగాని లేదా రెండు కిడ్నీల పనితీరు గాని దెబ్బతింటే దాని వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీల పనితీరు దెబ్బతిన్నప్పుడు శరీరంలోంచి వేస్ట్ మరియు టాక్సిన్స్ అనేవి సమర్థవంతంగా బయటికి పోవటం జరగదు. చాలా సార్లు, కిడ్నీల లోకి యూరినరీ ట్రాక్ట్ నుంచి బాక్టీరియా ప్రవేశించినప్పుడు కిడ్నీస్ అనేవి ఇన్వెక్షన్ కి గురవుతాయి. ఈ చిహ్నాలు అంతగా గుర్తించదగడానికి అనువుగా ఉండవు. కిడ్నీ ఇన్ఫెక్షన్ ను ట్రీట్ చేయకపోతే కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవడంతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్ కూడా తలెత్తుతుంది.

ఇక్కడ, కిడ్నీ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన కొన్ని నిశ్శబ్ద చిహ్నాల గురించి వివరించాము. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని గుర్తించాలి.

1. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం:

1. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం:

తరచూ మూత్రానికి వెళ్లాలన్న అర్జన్సీ ఎక్కువైతే ఈ విషయాన్ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. గర్భిణీలలో, డయాబెటిక్స్ లో అలాగే లిక్విడ్ ఇంటేక్ పెరిగిన వారిలో మూత్రానికి తరచూ వెళ్లాల్సిన అవసరం రావడం సహజమే. పైన చెప్పుకోబడిన కోవలోకి రానప్పుడు మూత్రానికి తరచూ వెళ్లాల్సి రావడమనే లక్షణాన్ని గమనిస్తే ఇది ఖచ్చితంగా కిడ్నీ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన చిహ్నమే అయి ఉండవచ్చు. కాబట్టి, మెడికల్ చెక్ అప్ కి తక్షణమే వెళ్లడం మంచిది.

2. దుర్వాసనతో కూడిన మూత్రం:

2. దుర్వాసనతో కూడిన మూత్రం:

కిడ్నీ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన మరొక నిశ్శబ్ద చిహ్నమిది. మీ మూత్రం దుర్వాసనతో కూడినదై ఉంటూ ఇబ్బందికరంగా ఉన్నట్టయితే మీరు ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ దుర్వాసన అనేది సాధారణంగా యూరిన్ నుంచి వెలువడే వాసన కంటే భిన్నంగా ఉంటుంది. కిడ్నీలు ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాటిలో పస్ సెల్స్ అనేవి ఉత్పత్తి చేయబడతాయి. ఈ పస్ సెల్స్ అనేవి మూత్రం ద్వారా విసర్జితమవుతాయి. అందువలన, మూత్రం దుర్వాసనతో కూడి ఉంటుంది.

3. యురినేషన్ సమయంలో నొప్పి:

3. యురినేషన్ సమయంలో నొప్పి:

చాలా సార్లు, ముఖ్యంగా మహిళలు మూత్ర విసర్జన సమయంలో నొప్పిని లేదా మంటను ఎక్స్పీరియెన్స్ చేస్తారు. దీనిని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గా భావిస్తారు. ఇది సీరియస్ ప్రాబ్లెమ్ కాకపోవడం వలన సహజంగానే ఇగ్నోర్ చేస్తారు. అయితే, ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన సూచన కావచ్చు. ఇక్కడ ప్రస్తావించుకున్న లక్షణాలతో పాటు ఈ లక్షణం కూడా కనిపిస్తే వెంటనే కిడ్నీ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన చెక్ అప్స్ ని చేయించుకోవడం మేలు.

4. మూత్రవిసర్జన ఫ్లో ను ప్రారంభించడం కష్టతరమవుతుంది:

4. మూత్రవిసర్జన ఫ్లో ను ప్రారంభించడం కష్టతరమవుతుంది:

మీకు మూత్ర విసర్జనకు వెళ్లాలన్న అర్జన్సీ అనిపించినా కూడా మూత్ర విసర్జనను ప్రారంభించడంలో మీకు కష్టంగా అనిపించి మూత్రం బయటకు రాకపోయినట్లైతే ఇది కిడ్నీ ఇన్ఫకేషన్ కు సంబంధించిన చిహ్నం అని భావించవచ్చు. కిడ్నీలు ఇన్ఫెక్షన్ కి గురై మీకు నొప్పి కలిగినప్పుడు కిడ్నీస్ ఇంఫ్లేమేషన్ అవడం వలన శరీరం నుంచి యూరిన్ అనేది బయటకి సులభంగా రావటం జరగదు.

5. బ్యాక్ పెయిన్:

5. బ్యాక్ పెయిన్:

కిడ్నీలు శరీరంలోని వెనుక భాగంలో వెన్నుపూసకు ఇరువైపులా లొకేట్ అయి ఉంటాయన్న విషయం గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి, కిడ్నీలు ఇంఫ్లేమ్ అయి ఇన్ఫెక్ట్ అయినప్పుడు బ్యాక్ పెయిన్ సమస్య తలెత్తుతుంది. ఈ బ్యాక్ పెయిన్ అనేది ప్రారంభంలో చిన్నపాటిగా కనిపించడం వలన దీనికి ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అయితే, నిరంతర బ్యాక్ పెయిన్ అనేది కిడ్నీ ఇన్ఫెక్షన్ ని సూచించే చిహ్నంగా భావించి తగిన చెక్ అప్ ని చేయించుకోవడం మంచిది.

6. మూత్రంలో రక్తం:

6. మూత్రంలో రక్తం:

మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించినప్పుడు, మీకు నొప్పితో పాటు దుర్వాసన కలిగినప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ కు సంబంధించిన చిహ్నంగా దీనిని భావించవచ్చు. ఈ చిహ్నం అనేది కిడ్నీ ఇన్ఫెక్షన్ ముదురుతున్న దశలో కనబడేదే అయి ఉండవచ్చు. ఇంఫ్లేమేషన్ తో పాటు ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీస్ లో బ్లీడింగ్ కి దారి తీస్తుంది. రక్తం అనేది మూత్రంతో కలిసిపోయి మూత్ర విసర్జన ద్వారా బయటికి వస్తుంది.

7. ఫ్లూ:

7. ఫ్లూ:

కిడ్నీ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన ఇంకొక నిశ్శబ్ద చిహ్నమిది. ఫ్లూ ని రెగ్యులర్ ఫ్లూగా తప్పుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలోని ఏదైనా భాగం ఇన్ఫెక్షన్ కి గురయినప్పుడు ఇమ్మ్యూన్ సిస్టమ్ ఇన్ఫెక్షన్ కి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి, ఫ్లూ తో బాధపడుతున్నప్పుడు ముఖ్యంగా, పైన చెప్పబడిన లక్షణాలలో ఎదో ఒకటి మీరు గమనించినప్పుడు మీరు కిడ్నీ ఇన్ఫెక్షన్ విషయమై చెక్ చేసుకోవడం మంచిది.

English summary

7 Silent Signs Of Kidney Infection You Should Never Ignore!

Kidneys are vital organs responsible for filtering out the waste from the blood. Many a time, kidneys can get infected by bacteria, causing kidney infection. There are certain signs that you might have a kidney infection: feeling the urge to urinate even if you have not drunk water, pain during urination, foul smell in the urine, etc.
Story first published:Tuesday, September 4, 2018, 11:06 [IST]
Desktop Bottom Promotion