For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హస్త ప్రయోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసా ?

హస్త ప్రయోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసా ?

|

పురుషుల విషయంలో హస్త ప్రయోగం అధిక ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు అనేక ప్రయోజనాలను అందివ్వగలదు. కానీ ఏది కూడా మితిమీరకూడదు అన్నట్లుగా, అధిక హస్తప్రయోగం శరీరం యొక్క సహజ కార్యాచరణకు సైతం ముప్పును కలిగిస్తుంది. ఈ వ్యాసంలో అధిక హస్త ప్రయోగం వలన కలిగే హానికర దుష్ప్రభావాల గురించిన వివరాలను పొందుపరచడం జరిగింది.

కొన్ని సందర్భాలలో ఆలోచనా స్థాయిలను దాటిపోయి ఒక వ్యసనం వలె హస్త ప్రయోగాన్ని పాటిస్తుంటారు అనేకులు. రాను రాను ఈ స్థితి ప్రమాదకరంగా, మరియు శరీరంలో మానసిక శారీరిక ఆరోగ్యాల పరంగా గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తుంది. "రోజులో అత్యధికంగా ఎన్ని మార్లు హస్త ప్రయోగం అవలంభించవచ్చు అన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసా, వారంలో మూడు నుండి నాలుగు మార్లు మాత్రమే. మితిమీరిన హస్త ప్రయోగం శరీరంలో అనేక ఇతర జీవ క్రియలు మరియు హార్మోనులపై ప్రభావాన్ని చూపి, శారీరికంగా మరియు మానసికంగా కూడా అనేక ఇతర సమస్యలకు సైతం దారితీస్తుందని చెప్పబడింది.

9 Lesser Known Side Effects Of Excessive Masturbation In Men

అధిక హస్త ప్రయోగం శరీరంలో అనేక హార్మోన్ల అసాధారణ మార్పులకు కారణంగా ఉంటుంది. ఈ హార్మోన్ల మార్పు ప్రభావాలు, హస్తప్రయోగం దృష్ట్యా ఒకదాని మీద మరొకటి అన్నట్లుగా ఆధారపడి ఉంటుంది. అధిక హస్త ప్రయోగం శారీరకంగా మరియు మానసిక దుష్ప్రభావాలకు కారణంగా మారుతాయి.

అసలు ఏమిటీ హస్తప్రయోగం?

హస్త ప్రయోగం, లైంగిక పరంగా తారాస్థాయికి చేరుకునే దిశలో భాగంగా స్వీయ ప్రేరేపిత జననేంద్రియాల చర్యను సూచిస్తుంది. పురుషులు, స్త్రీలు ఇద్దరిలో హస్త ప్రయోగం అలవాటు సర్వసాధారణంగా ఉంటుంది. నిపుణులు మరియు పరిశోధకుల ప్రకారం హస్తప్రయోగం అనేది ప్రతిఒక్కరూ ఆచరించే, మరియు ఆచరించగలిగే సర్వసాధారణ ప్రక్రియగా ఉంటుంది. అంతేకాకుండా ఒక ఆరోగ్యకరమైన లైంగికచర్యగా పరిగణించబడుతుందని సూచించబడింది. నిజానికి హస్తప్రయోగం అనేది మానసికంగా మనిషిని సావధాన పరచి, ప్రశాంతతకు లోనయ్యేలా చేస్తుంది. కానీ, ఒక వ్యసనంగా మారితే మాత్రం, హానికరమైన దుష్ప్రభావాలకు దారితీస్తుంది. అనేకమంది నిపుణులు మరియు, సెక్సాలజిస్ట్ల ప్రకారం, హస్తప్రయోగం చేయని వారు అనేక మానసిక ఒత్తిళ్లకు గురవడం, శారీరిక మానసిక సమస్యలకు గురవడం జరుగుతుంటుంది. కానీ, మితిమీరి వ్యసనంగా మారితే ప్రయోజనాలు పక్కదారి పడుతాయి.

అవేమిటో ఇప్పుడు చూద్దాం.

1) శక్తిని కోల్పోవడం :

1) శక్తిని కోల్పోవడం :

హస్త ప్రయోగం యొక్క దుష్ప్రభావాలలో ఒకటి శారీరక మరియు మానసిక శక్తి యొక్క నష్టం. హస్త ప్రయోగం అనేది మీ శరీరంలోని శక్తిని ఎక్కువగా వినియోగించుకుంటుంది. శరీరం, తన భౌతిక శక్తిని కోల్పోతున్న కారణంగా, అధికంగా మరియు తరచుగా హస్తప్రయోగం చేయడం మనిషి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతుంది. అలసట, మందబుద్ధి, మరియు ఏకాగ్రత దెబ్బతినడం, పురుషాంగంలో పూర్తిస్థాయి బలహీనత మరియు ముందస్తు వృద్దాప్య సూచనలకు ప్రధాన కారణం కాగలదు.

2) వ్యసనంగా మారుతుంది :

2) వ్యసనంగా మారుతుంది :

హస్త ప్రయోగం శరీరంలోని జీవక్రియల్లో అసంబద్దమైన అసాధారణ మార్పులకు దారితీస్తుంది మరియు బాహ్య ప్రపంచంలోని నిజమైన ఆనందాలను మరియు సంతోషాలను పూర్తి స్థాయిలో కోల్పోయేలా చేస్తుంది. క్రమంగా హస్త ప్రయోగంలో తన జననావయవాల పట్ల చూపే శ్రద్ద, ఇతర ముఖ్యమైన అంశాలపై కేంద్రీకరించలేని నీచస్థాయికి మనిషి దిగజారడం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి తనకుతానుగా ఈ పరిస్థితుల్లో ఉన్నట్లు నిర్ధారించుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు ఈ వ్యసనం నుండి బయటపడే మార్గాల మీద దృష్టిసారించగలుగుతాడు.

3) లైంగిక సున్నితత్వం పెరుగుతుంది :

3) లైంగిక సున్నితత్వం పెరుగుతుంది :

హస్త ప్రయోగం సమయంలో మీ పురుషాంగం మీద అధిక రాపిడి స్పర్శను తగ్గిస్తుంది. క్రమంగా లైంగిక సున్నితత్వాన్ని పునరుద్ధరించడానికి పురుషులు హస్త ప్రయోగంలో వారివారి పద్ధతులను తరచుగా మార్చాలని లైంగిక ఆరోగ్య నిపుణులు మరియు సెక్సాలజిస్టులు సిఫార్సు చేస్తున్నారు. క్రమంగా, అతను ఒక మంచి మరియు అనుకూలమైన లైంగిక జీవితాన్ని కలిగి ఉండగలడని సూచించబడుతుంది.

4) తలనొప్పి మరియు వికారానికి కారణమవుతుంది :

4) తలనొప్పి మరియు వికారానికి కారణమవుతుంది :

అధిక హస్త ప్రయోగం వలన కలిగే ప్రతికూల ప్రభావాల లక్షణాలుగా తలనొప్పి, వికారం మరియు మైకము ఉన్నాయి. ఒక లైంగిక పరమైన తలనొప్పి లైంగిక చర్యల సమయంలో పుర్రె మరియు మెడ భాగంలో జరుగుతుంటుంది. ఈ రకమైన లైంగికపరమైన తలనొప్పి అత్యంత అరుదుగా ఉన్నప్పటికీ, శరీరాన్ని నిరుత్సాహపరుస్తుంది, మరియు సూదులతో గుచ్చుతున్నట్లు, భారంగా అనిపిస్తుంటుంది.

5) అకాల స్ఖలన సమస్యలకు దారితీస్తుంది :

5) అకాల స్ఖలన సమస్యలకు దారితీస్తుంది :

అధిక హస్త ప్రయోగం అనేది అకాల స్ఖలన సమస్యలతో ముడిపడి ఉంటుంది. అనేకమంది హస్త ప్రయోగాన్ని ఆచరించే పురుషులు, లైంగిక సంబంధంలో ఉన్నప్పుడు స్పెర్మ్ విడుదలను నియంత్రించడానికి కష్టపడుతుంటారు. ఇది మీ భాగస్వామిని నిరాశపరచవచ్చు కూడా. పురుషాంగం అధిక రాపిడి గురైన నేపధ్యంలో సున్నితత్వానికి గురై, అకాల స్ఖలనానికి ఎక్కువ బాధ్యత వహిస్తుంది. అయితే, కొన్ని రకాల కందెనలు ఉపయోగించడం ద్వారా, మరియు ఉద్వేగానికి గురికాకుండా మానసిక నియంత్రణా పద్దతులను అనుసరించడం ద్వారా ఈ పరిస్థితిని కొంతమేర చక్కదిద్దవచ్చు.

6) ఇన్సోమ్నియాకి దారితీస్తుంది :

6) ఇన్సోమ్నియాకి దారితీస్తుంది :

నిద్రకు బాధ్యత వహించే న్యూరోకెమికల్ హార్మోన్ను మెలటోనిన్ అని వ్యవహరిస్తారు. అయితే అధిక హస్తప్రయోగం, ఈ మెలటోనిన్ హెచ్చుతగ్గులలో చూపే ప్రతికూల ప్రభావాల కారణంగా, క్రమబద్దత కోల్పోయి చివరకు నిద్రలేమికి దారితీస్తుంది. అత్యంత తరచుగా హస్త ప్రయోగానికి పూనుకోవడం వంటివి, మీ నిద్ర నమూనాలో ఒక అసంబద్దమైన మార్పును తీసుకుని రాగలదు. ఎందుకంటే, ఎక్కువగా నిద్రకు ఉపక్రమించే ముందు తక్కువ సమయాలలోనే తరచుగా, హస్త ప్రయోగానికి పూనుకునే అలవాట్లు అధికంగా ఉంటాయి అనేకులకు. క్రమంగా ఇది ఇన్సోమ్నియా సమస్యలకు దారితీస్తుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. కావున, ఒక వ్యసనంగా ఉన్న ఎడల, మీ హస్త ప్రయోగం అలవాటును వీలైనంత వరకు తగ్గించండి.

7) జుట్టు నష్టం :

7) జుట్టు నష్టం :

అధిక హస్త ప్రయోగం పురుషుల్లో తీవ్ర స్థాయిలో జుట్టు నష్టానికి కారణమవుతుంది. పురుషుల ప్రధాన హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది, ఇది DHT (డైహైడ్రోటెస్టోస్టిరాన్) కు దారితీసి, జుట్టు నష్టాన్ని పెంచుతుంది. కావున, వారంలో 6 నుండి 7 మార్ల కన్నా అధికంగా హస్త ప్రయోగం చేస్తున్నట్లయితే, క్రమంగా జుట్టును కోల్పోవడం సర్వసాధారణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ మీ జుట్టు పల్చగా సున్నితంగా ఉన్న ఎడల, సెక్సాలజిస్టును సంప్రదించండి.

8) మీ రోజువారీ జీవితాన్ని సైతం దెబ్బతీస్తుంది :

8) మీ రోజువారీ జీవితాన్ని సైతం దెబ్బతీస్తుంది :

మితిమీరిన హస్త ప్రయోగం వ్యక్తి యొక్క రోజువారీ జీవితాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఈ అలవాటు వారి కార్యక్రమాలను, ఇతర పనులను నెమ్మదిగా దూరం చేస్తుంది. లేదా ప్రధానమైన సామాజిక స్పృహను కూడా కోల్పోయేలా చేస్తుంది. అంతేకాకుండా తన బాధ్యతలను మరియు సంబంధాలను సైతం ప్రభావితం చేస్తుంది. మరియు ఊహాజనిత ప్రపంచానికి అలవాటు పడి, క్రమంగా నిజజీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది. రోజువారీ పనిజీవితాన్ని ఆటంకపరచడమే కాకుండా, మీ లైంగిక ఆనందాలను కూడా నెమ్మదిగా మీకు దూరం చేస్తుంది.

స్పర్శ బలహీనత లేదా స్పర్శను కోల్పోవడం, లైంగికపరమైన అలసట మరియు ఇతర సాధారణ శరీర బలహీనతలతో కూడుకుని, హస్తప్రయోగం యొక్క ఇతర దుష్ప్రభావాలుగా ఉన్నాయి.

ఎందుకు పురుషులు ఎక్కువగా హస్త ప్రయోగానికి పూనుకుంటారు?

ఎందుకు పురుషులు ఎక్కువగా హస్త ప్రయోగానికి పూనుకుంటారు?

వారి సాధారణ లైంగిక అభివృద్ధిలో భాగంగా పురుషులు హస్తప్రయోగానికి అలవాటు పడుతారని పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా హస్తప్రయోగం, లైంగికపరమైన హార్మోన్ల విడుదలకు మంచి రూపంగా ఉంటుంది. లైంగిక అంశాల పరంగా చురుకుగా లేని, లేదా కొన్ని సంబంధాలను నివారించడానికి ఇష్టపడేవారికి హస్తప్రయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. మరియు ఏ ఇతరత్రా లైంగిక సంక్రమణల ప్రమాదం లేని కారణంగా పురుషులు సురక్షితంగా భావించడం జరుగుతుంది.

హస్తప్రయోగం సమయంలో, వ్యక్తి తనను తానూ గాయపరచుకునే అవకాశాలు ఉన్నాయా ?

హస్తప్రయోగం సమయంలో, వ్యక్తి తనను తానూ గాయపరచుకునే అవకాశాలు ఉన్నాయా ?

మీరు దూకుడుగా మరియు అత్యంత కష్టతరంగా తరచుగా హస్త ప్రయోగానికి పూనుకుంటున్నట్లైతే, అధిక రాపిడికి లోనవడం కారణంగా జననావయవాల మీద గాయాలు ఏర్పడి, క్రమంగా అవి పుండ్లుగా మారే ప్రమాదం లేకపోలేదు.

హస్త ప్రయోగం సమయంలో తీసుకోవలసిన పొజిషన్ కూడా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. కూర్చుని ఉన్న భంగిమలో అధిక శాతం, రాపిడికి మరియు గాయాలు లోనవడానికి కారణంగా ఉండగలదు. కావున, నిలబడి కానీ, వెల్లకిలా పడుకోవడం వంటి భంగిమలను గానీ ఎంచుకోవడం మేలు. మరియు అధిక రాపిడికి గురిచేయడం లేదని నిర్ధారించుకోండి. ఎందుకంటే, రక్త నాళాలు దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. మరియు రక్త నాళాలు దెబ్బతిన్న స్థితిలో, మూత్ర విసర్జన సైతం కష్టతరం అయ్యే అవకాశాలు లేకపోలేదు. కొందరైతే, సెమెన్ బయటకు రాకుండా నిరోధించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ చర్యలు మరిన్ని సమస్యలను తీసుకుని రాగలవు. క్రమంగా మూత్రంలో రక్తం పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

హస్త ప్రయోగానికి బానిసగా మారాడని తనకు తాను తెలుసుకోవడం ఎలా?

హస్త ప్రయోగానికి బానిసగా మారాడని తనకు తాను తెలుసుకోవడం ఎలా?

• ఇది వ్యక్తి యొక్క ఆలోచనా స్థాయిలను, మరియు ఆందోళనలను తీవ్రతరం చేస్తుంది కారణమవుతుంది.

• ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి, రోజులో అనేక మార్లు హస్త ప్రయోగానికి పూనుకోవడం జరుగుతుంటుంది.

• అధిక రాపిడికి లోను చేయడం ద్వారా, మిమ్మల్ని మీరు గాయపరచడం జరుగుతుంటుంది.

• మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఏమాత్రం సమయాన్ని వెచ్చించలేని విధంగా తయారవడం.

• హస్త ప్రయోగం పాటిస్తున్న ప్రతి సారీ, మీ పురుషాంగంలో నొప్పిని అనుభవించడం జరుగుతుంటుంది.

అధిక హస్త ప్రయోగం కారణంగా ఏర్పడే సమస్యలకు సూచించదగిన ప్రధాన చికిత్స :

అధిక హస్త ప్రయోగం కారణంగా ఏర్పడే సమస్యలకు సూచించదగిన ప్రధాన చికిత్స :

ఒక మానసిక వైద్యుని లేదా మెంటల్ కౌన్సిలర్ని సంప్రదించడం లేదా మిమ్ములను మీరు సావధానపరచుకునేలా సమయాన్ని ఇతర ఆరోగ్యకర ఔత్సాహిక అంశాలకు కేటాయించడం వంటివి చేయడం ద్వారా సమస్యను కొంతమేర తగ్గించుకోవచ్చు. మానసిక వైద్యుని సంప్రదించినప్పుడు, మీ శక్తిని ఉపయోగకర రీతిలో వినియోగించేలా వారు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్రమంగా ఈ వ్యసనం, నెమ్మదిగా సాధారణ అలవాటుగా మారుతుంది. స్వీయ నియంత్రణలో భాగంగా మీరు, వ్యాయామం, కుటుంబ సభ్యులతో సమయం కేటాయించడం, ప్రయాణాలకు పూనుకోవడం, గార్డెనింగ్, పుస్తకాలు చదవడం, ఆటలు ఆడడం, ఇంటీరియర్, వంట చేయడం, వృత్తి మరియు ఇతర సామాజిక అంశాల పట్ల మనసు కేంద్రీకరించడం వంటివి కూడా మీకు సహకరించగలవు. అదనంగా, మీ లక్షణాలు మరియు, మీ ఆరోగ్య పరిస్థితుల ఆధారితంగా వైద్యులు మందులను కూడా సూచించవచ్చు.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

9 Lesser Known Side Effects Of Excessive Masturbation In Men

It sometimes becomes confusing to determine what level of masturbation is dangerous. To answer the popular question of "how much masturbation, or masturbating how many times a day is fine", medical scientists say that men shouldn't masturbate more than three or four times in a week. Excessive masturbation can lead to several complications, driving the body to act in a particular fashion.
Desktop Bottom Promotion