For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేకువజామునే నిద్రలేయడానికి పాటించదగిన 5 సులభమైన చిట్కాలు

వేకువజామునే నిద్రలేయడానికి పాటించదగిన 5 సులభమైన చిట్కాలు

|

వేకువజామునే నిద్రలేయడం మీకు కష్టమైన అంశంగా ఉందా ? మీరు నిజంగా ఇటువంటి సమస్యతో సతమతమవుతుంటే, మీరు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని సాధారణ మరియు పాటించదగిన మార్గాలు ఉన్నాయి. మనం అనుసరిస్తున్న జీవనశైలి మరియు తీవ్రమైన పని ఒత్తిడి ఏదో ఒకరీతిలో నిద్ర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా, ప్రతి విషయంలో ఆలస్యానికి గురవుతుంటాము.


ఈ వ్యాసంలో, ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో భాగంగా మీకు సహాయపడగలిగే కొన్ని సాధారణ చిట్కాలను పొందుపరచడం జరిగింది. క్రమంగా త్వరగా నిద్ర లేవడంతో పాటు, రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా పని మరియు ఇతర కార్యకలాపాల నందు దృష్టి సారించగలుగుతారు.

1. రాత్రిళ్ళు మితభోజనం

1. రాత్రిళ్ళు మితభోజనం

నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకునే డిన్నర్ మితంగా ఉండాలి. పరిమితిని మించి తీసుకునే ఆహారం, నిద్ర లేచిన తర్వాత కూడా రోజంతా మైకం ఆవరించి ఉండేలా చేస్తుంది. అతిగా తినడం అజీర్ణానికి దారితీస్తుంది, మరియు రాత్రి నిద్రవేళల్లో జరిగే కొన్ని జీవక్రియలు స్థాయిని మించి పనిచేయడం ద్వారా, పైత్య ప్రకోపాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రమంగా నిద్రపట్టకపోవడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేయడం జరుగుతుంటుంది.

కావున రాత్రివేళల్లో పరిమిత ఆహారాన్ని తీసుకోవలసినదిగా సూచించడమైనది. అలాగని అతితక్కువగా ఆహారం తీసుకోవడం కూడా సరైనది కాదు. ఈ చర్యలు సగంరాత్రిలో ఆకలి మరియు గ్యాస్ సమస్యలకు కారణం అవుతుంది. ఇది మీకు నిద్రాభంగాన్ని కలిగిస్తుంది. కావున సరైన మొతాదులోనే తీసుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా నిద్రకు ఉపక్రమించే ముందు రెండుగంటల ముందు ఆహారం తీసుకోవలసి ఉంటుంది.

2. మీ గాడ్జెట్లను స్విచ్ఆఫ్ చేయండి

2. మీ గాడ్జెట్లను స్విచ్ఆఫ్ చేయండి

మనకు తరచుగా స్మార్ట్ఫోన్లో ఏదో ఒకటి స్క్రోల్ చేయడం, అలవాటుగా ఉంటుంది. ముఖ్యంగా న్యూస్ ఫీడ్స్, సోషల్ నెట్వర్క్స్, చాటింగ్, సంగీతం వినడం మొదలైనవి. కానీ తెలీకుండానే ఏదో ఒక అంశానికి అడిక్ట్ అవడం జరుగుతుంటుంది. క్రమంగా కొన్ని గాడ్జెట్లకు పూర్తిస్థాయిలో అలవాటు పడడం జరుగుతుంటుంది. ఎంతలా అంటే సగం రాత్రి వేళల్లో పొరపాటున మూత్ర విసర్జనకు నిద్రలేచినా ఆయా అంశాలను పర్యవేక్షించేలా. కొందరైతే వాష్రూంలో కూడా మొబైల్స్ వాడకం చేస్తుంటారు. ఈ వ్యసనం కారణంగా, ఎక్కువగా నీలికాంతికి కళ్ళు ప్రభావితం అవడం జరుగుతుంది. క్రమంగా పొడిబారడం, లేదా జీవం కోల్పోవడం వంటివే కాకుండా కంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

కావున నిద్రకి ఉపక్రమించే ముందు, వీలైనంత మేర గాడ్జెట్లకు దూరంగా ఉండడం ఉత్తమం. ఇప్పటికీ నీలికాంతి వలన కళ్ళు అధికంగా ప్రభావితం అవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కావున రోజువారీ వాడకంలో, స్మార్ట్ ఫోన్స్, లాప్టాప్, డెస్క్టాప్ వంటి స్క్రీన్ ఆధారిత గాడ్జెట్లను వినియోగిస్తున్నప్పుడు యాంటీ గ్లేర్ కంటి అద్దాలు వాడడం మంచిదిగా సూచించబడుతుంది. మరియు ఎండ వేడిమి కళ్ళకు తగలకుండా UV రక్షణ కవచం కలిగిన, లేదా పోలరాయిడ్ సన్ గ్లాసెస్ వాడడం కూడా మంచిది.

Most Read: భార్య ప్రెగ్నెన్సీతో పుట్టింటికి వెళ్లడంతో ఆమెతో సంబంధం పెట్టుకున్నా, ఇప్పుడు భయమవుతోందిMost Read: భార్య ప్రెగ్నెన్సీతో పుట్టింటికి వెళ్లడంతో ఆమెతో సంబంధం పెట్టుకున్నా, ఇప్పుడు భయమవుతోంది

3. మీ పడక నుండి దూరంగా అలారం ఉంచండి

3. మీ పడక నుండి దూరంగా అలారం ఉంచండి

కొందరు పేరుకు అలారం పెడుతారు కాని, అలారం మోగిన తర్వాత దానిని ఆపివేసి మరలా నిద్రకు ఉపక్రమిస్తుంటారు. క్రమంగా ఇతరపనులకు ఆలస్యం జరుగుతుంటుంది. కావున అలారం కాస్త చేతికి అందనంత దూరంలో ఉంచాలి. కనీసం పడక నుండి 3అడుగులు వేసేలా. క్రమంగా అలారం ఆపే క్రమంలో ఖచ్చితంగా పడక దిగవలసి వస్తుంది. తద్వారా నిద్రమత్తు నుండి ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాసు చల్లని నీళ్ళు తాగడం లేదా చల్లని నీటితో మొహం కడగడం వంటి చర్యలు కూడా బద్దకాన్ని తరిమికొడుతాయి.

4. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ నీరు తాగడం

4. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ నీరు తాగడం

ఈ చర్య మీ మూత్రాశయం సరైనరీతిలో పనిచేసేందుకు దోహదపడుతుంది. క్రమంగా మీ జీవక్రియలు ఆరోగ్యకరరీతిలో పనిచేసేలా సహాయం చేస్తుంది. తద్వారా నిద్రలో అసౌకర్యం లేని కారణాన, నిద్రాభంగం కలుగదు. కానీ అతిమూత్ర వ్యాధి సమస్యలతో భాదపడేవారు, వీలైనంత తక్కువగా నీటిని తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే నిద్రాభంగం కలిగే అవకాశాలు ఉన్నాయి.

Most Read:అతను నాకంటే చిన్నోడు, అయినా సెక్స్ లో పాల్గొన్నాను, అంతలా చేస్తాడని అస్సలు అనుకోలేదు #mystory242Most Read:అతను నాకంటే చిన్నోడు, అయినా సెక్స్ లో పాల్గొన్నాను, అంతలా చేస్తాడని అస్సలు అనుకోలేదు #mystory242

5. పడక నుండి దిగిన వెంటనే చల్లని నీటితో స్నానం చేయడం.

5. పడక నుండి దిగిన వెంటనే చల్లని నీటితో స్నానం చేయడం.

ఒక్కోసారి నిద్ర లేచినా కూడా బద్ధకం వెన్నాడుతుంటుంది, క్రమంగా నిద్రలోకి తిరిగి వెళ్లాలని కోరుకోవడం సహజం. కావున, దంత ధావనం, స్నానం వంటి రోజువారీ దినచర్యలతోనే ప్రారంభించినా, చల్లని నీటిని వినియోగించండి. క్రమంగా మైకం వంటి సమస్యలు దూరమై, రోజంతా చురుకుగా ఉండేలా దోహదం చేస్తుంది. వీలయితే చల్లని నీటితో షవర్ ఉపక్రమించడం మంచిది. కానీ రక్తపోటు లేదా స్ట్రోక్ సమస్యలు ఉండేవారు గోరు వెచ్చని నీటినే తీసుకోవలసి ఉంటుంది. వీరికి అధిక చల్లదనం, లేదా అధిక వేడి ఆరోగ్య సమస్యలను తీసుకుని వస్తాయి.

నిద్రలేచేందుకు ఈ చర్యలను అనుసరిస్తున్నట్లు నిర్ధారించుకోండి. లేనిచో అలవాట్లను కలిగి ఉండేలా ప్రణాళికలు చేసుకోండి. ఏ అలవాటైనా ఒక్కరోజుతో రాదు, కానీ క్రమశిక్షణతో సాధిస్తే ఎప్పటికైనా ఫలితాలను పొందగలరు. నిద్ర లేమి, ఆలస్యం వంటివి మీ వృత్తి పరమైన సమస్యలకే కాదు, మీ దైనందిక జీవన శైలి మరియు జీవక్రియలకు సైతం ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తాయి. కావున, నిద్రలేమి, నిద్రా భంగం వంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవలసిన అవసరం ఉంది.

రోజులో త్వరగా నిద్ర లేయడం కారణంగా, యోగా వంటి ఆరోగ్యకర విషయాలకు సమయాన్ని కూడా కేటాయించగలుగుతారు. ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అనారోగ్యాలను దూరంగా ఉంచడంతో పాటు, మెదడు చురుకుగా పనిచేయడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. క్రమంగా వృత్తిపరమైన అంశాలలో, మరియు కుటుంబ సంబంధిత విషయాలలో తెలివితో కూడిన నిర్ణయాత్మక ధోరణి అలవడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Simple Tips To Wake Up Early In The Morning

If you find it difficult to wake up early in the morning, here is what you really need to do - have a light dinner, switch off your gadgets when going to bed, keep your alarm clock away from the bed, have a glass of water before sleeping & once awake don't stay in bed & shower with cold water. You can also do yoga after waking up to feel fresh through the day.
Desktop Bottom Promotion