For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీలలో రాళ్ళను కరిగించగలిగే 6 ఉత్తమమైన ఇంటి చిట్కాలు !

కిడ్నీలలో రాళ్ళను కరిగించగలిగే 6 ఉత్తమమైన ఇంటి చిట్కాలు !

|

మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం అనేది చాలా బాధాకరంగా ఉంటాయి, కానీ ఈ రాళ్ళను సరైన సమయంలో ఎప్పటికప్పుడు గుర్తించబడితే అవి తీవ్రమైన నష్టాన్ని కలిగించవు. "వరల్డ్ కిడ్నీ డే" సందర్భంగా సహజమైన పద్ధతిలో మూత్రపిండాలలో ఉన్న రాళ్ళను ఎలా కరిగించాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం.

మూత్రపిండాల లోపల ఖనిజ-లవణాలతో కూడిన గట్టి పదార్థం ఏర్పడటం వల్ల, అవే మీ కిడ్నీలో రాళ్లుగా ఏర్పడుతాయి.

Six Home Remedies That Work Like Magic To Get Rid Of Kidney Stones

మూత్రపిండంలో ఏర్పడిన రాళ్లు చాలా గట్టిగా ఉంటాయి దానికి కారణం, మూత్రపిండాలలో (లేదా) మూత్ర నాళంలో ఏర్పడిన ఒక స్పటికాకార ఖనిజ పదార్థము. అదే సమయంలో స్పటికాలు ఏర్పడకుండా నిరోధించగలిగే పదార్ధాలు మీ మూత్రంలో లేకపోవటంవల్ల, కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి.

ఈ కిడ్నీ స్టోన్స్లో చాలా రకాలు ఉన్నాయి, స్ట్రువిట్ స్టోన్ అనేది మూత్రనాళా ఇన్ఫెక్షన్ను కలుగచేస్తుంది. యూరిక్ యాసిడ్ స్టోన్ అనేది ద్రవరూప పానీయాలను అస్సలు తీసుకోకపోయినా (లేదా) ఎక్కువగా తీసుకున్నా వారిలో వస్తుంది. చాలామందికి ఏర్పడే కిడ్నీ స్టోన్స్లో ఎక్కువగా కాల్షియం స్టోన్స్ మాత్రమే ఏర్పడతాయి. ఇది సాధారణంగా కాల్షియం ఆక్సలేట్ రూపంలో ఉంటాయి. ఈ ఆక్సలేట్ అనేది మీరు సహజంగా తీసుకొనే ఆహార పదార్థాల నుంచి సంగ్రహించిన సమ్మేళనాల ద్వారా మీ కాలేయ సహాయంతో రోజువారీగా తయారవుతుంది.

కొన్ని ఇంటి చిట్కాలు ఇక్కడ ఉన్నాయి, ఇవి మీ కిడ్నీలో ఏర్పడిన రాళ్లను తొలగించేలా చేస్తాయి.

1. ఆపిల్ సైడర్ వెనిగర్ & నిమ్మరసం :-

1. ఆపిల్ సైడర్ వెనిగర్ & నిమ్మరసం :-

కిడ్నీలో రాళ్ళను తొలగించేందుకు ఇది చాలా సమర్థవంతమైన పదార్థము, అలానే ఇది కాస్త అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఈ రెండు పదార్ధాల్లో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నందున అభినేత్రి రాళ్లను కరిగించడానికి, అలానే రక్తం మరియు మూత్రంలో ఆల్కలైజ్ను నివారించడానికి సహాయపడుతాయి. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్ధాన్ని & మలినాలను బయటకు పంపివేస్తుంది, కిడ్నీలో ఏర్పడిన స్టోన్స్ వల్ల ఏర్పడే బాధను నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది.

ఈ ప్రయోజనాల వెంటనే పొందడం కోసం, 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్కు 6-8 ఔన్సుల మంచినీటిని జోడించండి. రోజంతా ఈ మిశ్రమాన్ని మీరు తాగాలి. మీరు ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని 8 ఔన్సుల గ్లాసుల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఈ మిశ్రమాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవటం వల్ల అందులో వుండే ఆపిల్ సైడర్ వెనిగర్ మీ శరీరంలో పొటాషియం స్థాయిలను తక్కువ చేయడమే కాకుండా బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది.

2. నీటిని ఎక్కువగా తాగండి :-

2. నీటిని ఎక్కువగా తాగండి :-

మీరు ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను బయటికి పంపే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తగినంత నీటిని తాగకపోవటం కూడా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి. కిడ్నీలో రాళ్ల సమస్యను అధిగమించడానికి మీరు రోజుకు కనీసం 12 గ్లాసుల నీటిని తాగడం మంచిది అలాగే, ఏ సమయంలో మీరు డీహైడ్రేషన్కు గురి కాలేదని నిర్ధారించుకోవాలి.

3. ఆకుకూరలు :-

3. ఆకుకూరలు :-

ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి దోహదపడే విష వ్యర్ధాలను పారద్రోలుతుంది. ఇది శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే క్రమంలో రాళ్లను కూడా బయటకి సులభంగా పంపిస్తుంది.

ఇలాంటి ఫలితాలను పొందడానికి, మీరు ఒకటి కన్నా ఎక్కువ సెలెరీ కాడలను నీటిలో వేసి బాగా ఉడికించి ఆ నీటిని రోజంతా తాగాలి. మీరు తక్కువ రక్తపోటు (లేదా) షెడ్యూల్ తో కూడిన శస్త్రచికిత్సలను కలిగి ఉన్నట్లయితే, ఎక్కువ సెలెరీ కాడల కలయికలను జోడించకూడదు. మీరు సెలెరీ కాడల రసాన్ని / సెలెరీ విత్తనాలతో టీ పానీయాలను వినియోగించవచ్చు. ఇవన్నీ కూడా శరీరంలో మూత్రమును ఎక్కువగా ఉత్పత్తి చేసి, తద్వారా కిడ్నీలో రాళ్లను బయటకు పంపించేందుకు దోహదపడతాయి.

4. కిడ్నీ బీన్స్ :-

4. కిడ్నీ బీన్స్ :-

కిడ్నీ బీన్స్, మెగ్నీషియంకు అద్భుతమైన మూల వనరుగా ఉంది, ఇది మూత్రపిండాల్లో రాళ్ళకి సంబంధించిన లక్షణాలను తగ్గిస్తుంది. బాగా ఉడకబెట్టిన బీన్స్ నుంచి తయారైన రసము, మీ మూత్రాశయం & మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇది రాళ్ళు కరిగించి, వాటిని మూత్రం ద్వారా బయటకు పంపేలా చేయటంలో సహాయం చేస్తుంది. బీన్స్ రసం చేయడానికి దాని ప్యాడ్లు లోపల నుండి బీన్స్ తొలగించి, ఆపై 6 గంటల వరకూ మంచి నీటిలో బాగా ఉడకబెట్టాలి. కిడ్నీలో ఉన్న స్టోన్స్ వల్ల వచ్చే నొప్పిని తగ్గించడానికి అలా తయారుచేసుకున్న బీన్స్ రసాన్ని పలుచని వస్త్రంతో వడకట్టి, దానిని బాగా చల్లబరిచి ఆరోజు మొత్తం ఈ పానీయాన్నే వినియోగించాలి.

5. డాండెలైన్ వేర్లు :-

5. డాండెలైన్ వేర్లు :-

సేంద్రీయ డాండెలైన్ మొక్కల వేర్లు మూత్రపిండాలను శుభ్రపరచడానికి & వాటి సాధారణ పనితీరుకు సహాయం చేస్తాయి. ఇది మూత్రపిండాలకు టానిక్గా పనిచేసే పైత్యరస ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చెడు వ్యర్థాలను తొలగించడానికి, మూత్ర ఉత్పత్తిని పెంచడానికి & జీర్ణశక్తిని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. డాండెలైన్స్ లో విటమిన్లు A, B, C, D & పొటాషియం, ఐరన్ - జింక్ వంటి వివిధ ఖనిజాలను కలిగి ఉంటాయి. కాబట్టి మీరు తాజా డాండెలైన్ రసమును తయారు చేయవచ్చు (లేదా) టీగా కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ రసాన్ని తాజాగా తయారు చేస్తే, రుచి కోసం మీరు ఆరెంజ్ పీల్ను, అల్లం & ఆపిల్ వంటి వాటిని వాడవచ్చు. ఈ పానీయాన్ని రోజు మొత్తంలో 3-4 కప్పులు వరకూ తాగాలి.

6. దానిమ్మరసం :-

6. దానిమ్మరసం :-

ఇది మీ మూత్ర సంబంధ ఆమ్లత్వాన్ని తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో మీ కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది, దానిమ్మరసం మీ కిడ్నీలో రాళ్ళను ఏర్పరచగలిగే మలినాలను వదిలించుకోవడానికి సహాయపడే ఒక సహజ నిర్విషీకరణ ఏజెంట్గా పనిచేస్తుంది. అలాగే ఇది అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది కాబట్టి మీరు కావలసినంత దానిమ్మరసాన్ని తీసుకోవచ్చు.

English summary

Six Home Remedies That Work Like Magic To Get Rid Of Kidney Stones

A kidney stone is a hard, crystalline mineral material formed within the kidney or urinary tract. At the same time, your urine may lack substances that prevent crystals from sticking together, creating an ideal environment for kidney stones to form. There are various kinds of kidney stones like Struvite stones which form in response to an infection, such as a urinary tract infection, Uric acid stones which usually form in people who don't drink enough fluids or who lose too much fluid, Calcium stones which are the most common kidney stones are calcium stones, usually in the form of calcium oxalate.
Desktop Bottom Promotion