For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్డియాక్ అరెస్ట్ వలన మరణించిన అతిలోకసుందరి శ్రీదేవి: కార్డియాక్ అరెస్ట్ కు దారితీసే ఈ పదికారణాల గురించి మీరు తెలుసుకోవాలి

|

లెజెండరీ బాలీవుడ్ ఐకాన్ శ్రీదేవి అకాల మరణం అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇటు అభిమానులను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్యంత ప్రతిభ కలిగి తన సౌందర్యంతో ఆకట్టుకున్న ఈ అతిలోకసుందరి 55 ఏళ్ళ వయసులోనే దుబాయ్ లో తుదిశ్వాసను విడిచింది.


రిపోర్ట్స్ ప్రకారం శ్రీదేవి సడన్ కార్డియాక్ అరెస్ట్ సంభవించడం వలన మరణించిందని తెలుస్తోంది. శ్రీదేవి మరణం బాలీవుడ్ ను అలాగే తెలుగు సినీప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. కార్డియాక్ అరెస్ట్ అనేది ఎటువంటి ముందస్తు లక్షణాలను తెలియచేయకుండా సంభవించింది కాబట్టి దీనిని ప్రాణాంతకమైన స్థితిగా మనం భావించాలి.


కాబట్టి, కార్డియాక్ అంటే ఏమిటి? అమెరికన్ హార్ట్ ఎసోసియేషన్ ప్రకారం కార్డియాక్ అరెస్ట్ అనగా హార్ట్ ఫంక్షన్ సడన్ గా ఆగిపోవటం. గుండె వ్యాథి అంతకు ముందే ఉన్నా ఒకవేళ లేకపోయినా కార్డియాక్ అరెస్ట్ సంభవించే ప్రమాదం ఉంది.

గుండె కొట్టుకోవడం మానివేయడంతో మెదడుకి రక్తసరఫరా ఆగిపోతుంది అలాగే శరీరంలోని ఇతర అవయవాలకు కూడా రక్తప్రసరణ ఆగిపోతుంది.

కార్డియాక్ అరెస్ట్ ని సాధారణంగా హార్ట్ ఎటాక్ గా భావించి కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. కార్డియాక్ అరెస్ట్ వేరు అలాగే గుండెపోటు వేరు. కార్డియాక్ అరెస్ట్ ప్రమాదాన్ని కొన్ని లక్షణాలను గమనించడం ద్వారా గుర్తించవచ్చు. అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, శ్వాస ఆగిపోవడం, స్పృహ కోల్పోవడం, డిజ్జీనెస్, మూర్ఛపోవడం, కళ్లుబైర్లు కమ్మడం, బలహీనత అలాగే గుండె దడ వంటికి కార్డియాక్ అరెస్ట్ కు చెందిన లక్షణాలు.

కార్డియాక్ అరెస్ట్ కు సంబంధించిన కారణాలను ఒకసారి పరిశీలిద్దాం.

1. కార్డియోమయోపతి:

1. కార్డియోమయోపతి:

గుండె కండరం మందంగా తయారయినా లేదా పెద్దగా అయినా సరిగ్గా సంకోచం చెందదు. అప్పుడు ఈ గుండె కండరానికి తగినంత రక్తసరఫరా దీర్ఘకాలం పాటు అందదు. అప్పుడు, ఈ గుండె కండరం రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేదు. ప్రతి హార్ట్ బీట్ కి గుండె నుంచి రక్తాన్ని పంప్ చేయబడే మొత్తం సాధారణం కంటే 30 శాతం తక్కువగా ఉంటే వారు కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ.

2. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్:

2. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్:

కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనే కండిషన్ లో హార్ట్ పనితీరు దెబ్బతినడాన్ని గమనించవచ్చు. అప్పుడు శరీరంలోని అవయవాల అలాగే టిష్యూల అవసరాలకు తగినంత రక్తాన్ని గుండె పంపిణీ చేయలేదు. గుండె తగినంత రక్తాన్ని పంపిణీ చేయలేకపోవటం వలన రక్తసరఫరా శరీరంలోని వివిధభాగాలకు సరిగ్గా అందదు. అందువలన, క్యాపిల్లరీ బ్లడ్ వెజిల్స్ నుంచి వాటర్ లీక్ అవుతుంది.

3. కొరోనరీ ఆర్టరీ డిసీస్:

3. కొరోనరీ ఆర్టరీ డిసీస్:

గుండెలోని ఆర్టరీలనేవి సాధారణంగా మృదువుగా ఉంటాయి. అయితే, వాటి లోపల గదుల్లో ప్లేక్ బిల్డ్ అప్ అవడం వలన అవి కుచించుకుపోతాయి. దీని వలన గుండె కండరాలకు రక్తప్రసరణ అలాగే అక్షీజన్ సరఫరా అనేది తగ్గిపోతుంది. తద్వారా, సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది సంభవిస్తుంది.

4. బృగడా సిండ్రోమ్:

4. బృగడా సిండ్రోమ్:

బృగడా సిండ్రోమ్ అనేది వారసత్వంగా సంక్రమించిన హార్ట్ డిజార్డర్. ఇది గుండె యొక్క ఎలెక్ట్రికల్ సిస్టమ్ ని దెబ్బతీస్తుంది. ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్ అనేవి ఈ సిండ్రోమ్ యొక్క లక్షణాలు. వీటిని సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే సడెన్ కార్డియాక్ అరెస్ట్ సంభవించే ప్రమాదం ఎక్కువ.

5. మార్ఫన్ సిండ్రోమ్:

5. మార్ఫన్ సిండ్రోమ్:

ఇది ఒక జెనెటిక్ డిసార్డర్. శరీరంలోని లభించే కనెక్టివ్ టిష్యూలను ఇది దెబ్బతీస్తుంది. అలాగే మల్టిపుల్ ఆర్గాన్స్ ని దెబ్బతీస్తుంది. గుండె మరియు బ్లడ్ వెజిల్స్, కళ్ళు, స్కెలెటల్ సిస్టం వంటివి తీవ్రంగా దెబ్బతింటాయి. మార్ఫాన్ సిండ్రోమ్ లు రెండు రకాలు. టైప్ 1 మరియు టైప్ 2 గా వీటిని గుర్తిస్తారు.

6. కంజెనిటల్ హార్ట్ డిసీజ్:

6. కంజెనిటల్ హార్ట్ డిసీజ్:

శిశువు జన్మించక ముందే ఈ హార్ట్ కండిషన్ అనేది తల్లి గర్భంలోనే ఏర్పడుతుంది. గర్భస్థ శిశువు ఎదుగుదలలో ఏదైనా లోపం ఏర్పడితే శిశువు యొక్క గుండె సరిగ్గా వృద్ధి చెందదు. తల్లికి ప్రెగ్నన్సీ సమయంలో డయాబెటిస్ ఉన్నా లేదా ప్రెగ్నన్సీ సమయంలో ఏవైనా మెడికేషన్స్ ని వాడినా శిశువు కంజెనిటల్ హార్ట్ డిసీస్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ.

7. హార్ట్ మెడికేషన్స్:

7. హార్ట్ మెడికేషన్స్:

హార్ట్ మెడికేషన్స్ వలన అర్రిథమియా ప్రమాదానికి గురయ్యే ఆస్కారం ఎక్కువ. యాంటీ-అర్రిథమిక్ మెడిసిన్స్ ని వాడి అర్రిథమియాని ట్రీట్ చేసేటప్పుడు ప్రమాదకరమైన వెంట్రిక్యులర్ అర్రిథమియాస్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఇవి బ్లడ్ లోని మెగ్నీషియం మరియు పొటాషియం స్థాయిలపై దుష్ప్రభావం చూపిస్తాయి. అందువలన, ప్రాణాపాయం ఏర్పడవచ్చు.

8. ఇంతకు ముందు హార్ట్ ఎటాక్ కు గురయి ఉండడం:

8. ఇంతకు ముందు హార్ట్ ఎటాక్ కు గురయి ఉండడం:

ఒకవేళ రోగి ఇంతకు ముందు ఒకసారి హార్ట్ ఎటాక్ కి గురయి ఉంటే, కార్డియాక్ అరెస్ట్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. హార్ట్ ఎటాక్ వచ్చిన మొదటి ఆరు నెలలనేవి ఎంతో కీలకమైనవి. సడన్ కార్డియాక్ అరెస్ట్ సంభవించడానికి ఇది ఎక్కువ రిస్క్ ఉన్న పీరియడ్.

9. బ్లడ్ వెజిల్ అసాధారణతలు:

9. బ్లడ్ వెజిల్ అసాధారణతలు:

ఆకస్మిక మరణాన్ని పొందిన యువకులలో ఇన్బర్న్ బ్లడ్ వెజిల్ అబ్నార్మాలిటీస్ ని అలాగే అయోర్టా ని గుర్తించే అవకాశం ఉంది. తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ లేదా అథ్లెటిక్ యాక్టివిటీస్ వలన ఆడ్రెనాలిన్ అనేది విడుదలవుతుంది. ఇది సడెన్ కార్డియాక్ అరెస్ట్ కు దారితీస్తుంది.

10. హార్ట్ వాల్వ్ డిసీజ్:

10. హార్ట్ వాల్వ్ డిసీజ్:

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హార్ట్ వాల్వ్స్ అనేవి దెబ్బతింటే, గుండెకి రక్తప్రసరణకి అవి అవరోధంగా నిలువవచ్చు. అందువలన, గుండెపై ఒత్తిడి పడుతుంది. రక్తాన్ని పంపిణీ చేయడం గుండెకి కష్టతరంగా మారుతుంది. హార్ట్ వాల్వ్ అనేది సరిగ్గా మూసుకోకపోయినా రక్తం అనేది వెనుకవైపు నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివలన కూడా కార్డియాక్ అరెస్ట్ సంభవించే ప్రమాదం కలదు.

English summary

Sridevi Dies Of Cardiac Arrest: 10 Causes Of Cardiac Arrest You Should Know

Sridevi Dies Of Cardiac Arrest: 10 Causes Of Cardiac Arrest You Should Know,Cardiac arrest strikes immediately without any warnings, so it is considered as being very deadly. Know about the causes of cardiac arrest.
Desktop Bottom Promotion