For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టీఫెన్ హాకింగ్ మరణానికి కారణమైన మోటార్ న్యూరాన్ వ్యాధి గురించి మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

స్టీఫెన్ హాకింగ్ ఒక ఆంగ్ల సైద్ధాంతిక భౌతికశాస్త్రవేత్త, విశ్వసృష్టి శాస్త్రవేత్త, కేమ్ బ్రిడ్జి విశ్వవిద్యాలయంలో సైద్ధాంతిక విశ్వ సృష్టికి సంబంధించిన పరిశోధన విభాగాధిపతి. ఈ 76 సంవత్సరాల యుగపురుషుడు ఈ బుధవారం నాడు ఎప్పటి నుండో బాధపెడుతున్న ఒక అనారోగ్య సమస్య వల్ల మరణించాడు. ఆ అనారోగ్యం పేరు మోటార్ న్యూరాన్ వ్యాధి.

ఈయనకు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు న్యూరో డీ జనరేటివ్ వ్యాధి ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వ్యాధి సోకిన తర్వాత కూడా ఆత్మస్తైర్యాన్ని కోల్పోకుండా ఎంతో పట్టుదలతో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. కృష్ణ బిలాలు పై చేసిన పనికి గాను, ఈయనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

Stephen Hawking Dies Of Motor Neuron Disease; What Is Motor Neuron Disease?

సాధారణంగా భారతీయుల్లో వెన్నుముక్కకు సంబంధించిన వ్యాధులు సోకుతూ ఉంటాయి. కానీ, అవి 60 సంవత్సరాల పైబడిన వారిపై ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మోటార్ న్యూరాన్ వ్యాధి క్రిందకు వస్తాయి.

అసలు మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే ఏమిటి ?

అసలు మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే ఏమిటి ?

మెదడు పై విపరీతమైన ప్రభావం చూపిస్తూ, వెన్నులో ఉన్న నరాల పై కూడా ప్రభావం చూపి వాటి పనితీరుని దెబ్బతీసే వివిధరకాల పరిస్థితులనే మోటార్ న్యూరాన్ వ్యాధి అని పిలుస్తారు. ఇది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. ఈ వ్యాధిని ఎవరూ నయం చేయలేరు.

మోటార్ న్యూరాన్స్ అనేటివి నాడి సంబంధిత కణాలు. ఇవి కండరాలకు కావాల్సిన సంజ్ఞలను పంపి వాటి సామర్ధ్యాన్ని బట్టి పనులన్నీ సక్రమంగా అయ్యేలా చేయడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈవ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావొచ్చు. కానీ, ఎక్కువ శాతం 40 సంవత్సరాలు పై బడిన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనపడుతుంది. మరొక అంశం ఏమిటంటే, మహిళలు కంటే పురుషుల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది.

మోటార్ న్యూరాన్ వ్యాధి లో సాధారణంగా సోకే రకం ఏమిటంటే, వెన్నుపూస పార్శ్వ గట్టిపడుట అనే రకం ఎక్కువగా వస్తుంటుంది. మోటార్ న్యూరాన్ వ్యాధి కి సంబంధించి కొన్ని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మోటార్ న్యూరాన్ వ్యాధి సోకిన వ్యక్తుల శరీరంలో కండరాలు క్రమక్రమంగా బలహీనం అవుతాయి. చివరకు పరిస్థితి ఎంత బలహీనంగా తయారవుతుందంటే, ఆఖరికి ఊపిరితీసుకోవడం కూడా చాలా కష్టతరంగా మారుతుంది.

వారసత్వంగా, పర్యావరణం, మరికొన్ని ఇతర వైరస్ సంబంధిత సమస్యలు మోటార్ న్యూరాన్ వ్యాధి సోకడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ఈ వ్యాధికి ఎటువంటి నివారణ లేదు. కానీ, కొన్ని చికిత్సలు అయితే ఉన్నాయి.

ఈ వ్యాధిని గుర్తించిన తర్వాత, 3 నుండి 10 సంవత్సరాల వరకు మాత్రమే సాధారణంగా వ్యక్తులు జీవించడం జరుగుతుంది.

మోటార్ న్యూరాన్ వ్యాధి లో వివిధ రకాలు :

మోటార్ న్యూరాన్ వ్యాధి లో వివిధ రకాలు :

మోటార్ న్యూరాన్ వ్యాధి లో వివిధరకాల ఉన్నాయి. లౌ గెహ్రిగ్స్ వ్యాధి, ప్రాథమిక పార్శ్వ స్క్లెరోసిస్, పురోగమన కండరాళ్ళ క్షీణత, ప్రగతిశీల బల్బార్, వెన్నెముక కండరాల క్షీణత మొదలగునవి మోటార్ న్యూరాన్ వ్యాధి కిందకు వస్తాయి.

లౌ గెహ్రిగ్స్ వ్యాధి :

ఈ వ్యాధి సాధారణంగా ఎక్కువ మందికి సోకుతుంది. ఇది చేతులు, కాళ్ళు, నోరు మరియు శ్వాసకోశ సంబంధిత వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ వ్యాధి సోకిన వారు 3 నుండి 5 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతారు. ఈ వ్యాధి గనుక ముందే గుర్తించినట్లయితే, వారి జీవిత కాలం కొద్దిగా పెరగవచ్చు.

ప్రగతిశీల బల్బార్ :

ఈ వ్యాధి మెదడు పై ప్రభావాన్ని చూపుతుంది. ఈ వ్యాధి సోకిన వారు మాట్లాడటమే కష్టతరం అవుతుంది. సరిగ్గా ఆహారాన్ని తినలేరు, మింగలేరు, మాట్లాడిన మాటలే ఎక్కువగా మాట్లాడుతూ తప్పులు కూడా మాట్లాడే అవకాశం ఉంది.

పురోగమన కండరాల క్షీణత :

ఈ వ్యాధి చాలా నెమ్మదిగా వ్యాప్తి చెందుతుంది. కానీ, కండరాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా కాళ్ళు, చేతులు, నోటి కండరాల పై దీని ప్రభావం ఎక్కువ.

ప్రాథమిక పార్శ్వ స్క్లెరోసిస్ :

మోటార్ న్యూరాన్ వ్యాధులలో ఇది చాలా అరుదైన వ్యాధి. ఇది మరీ అంత ప్రాణాంతకం కాదు గాని, నాణ్యమైన జీవితం పై ప్రభావం చూపిస్తుంది.

వెన్నెముక కండరాల క్షీణత :

ఈ వ్యాధి సాధారణంగా వారసత్వంగా సంక్రమించడం జరుగుతుంది. పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి భారిన పడుతుంటారు. చేతులు, కాళ్ళు, మొండెం భాగంలో ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.

 మోటార్ న్యూరాన్ వ్యాధి రావడానికి కారణాలు :

మోటార్ న్యూరాన్ వ్యాధి రావడానికి కారణాలు :

మోటార్ న్యూరాన్ లు మెదడు నుండి కండరాలు, ఎముకలకు సంజ్ఞలను పంపించడం జరుగుతుంది. ఈ చర్యల వల్లనే కండరాలు కదులుతాయి, పనిచేస్తాయి. వీటిల్లో చేతల కదలికలు, స్వయంచాలిక కదలికలు ఉంటాయి. ఊపిరి తీసుకోవడం, మింగటం లాంటి చర్యలు అన్నీ వీటి క్రిందకు వస్తాయి.

ఈ వ్యాధి ఎందుకు సోకుతుంది అనే విషయం స్పష్టంగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ, జాతీయ నరాల వ్యాధులకు సంబంధించిన విశ్వ విద్యాలయం ఈ వ్యాధి వారసత్వంగా, వైరస్, పర్యావరణంలో ఉన్న వివిధరకాల కారకాలు ఈ వ్యాధి రావడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని చెప్పింది .

మోటార్ న్యూరాన్ వ్యాధి లక్షణాలు :

మోటార్ న్యూరాన్ వ్యాధి లక్షణాలు :

మోటార్ న్యూరాన్ వ్యాధి సోకినప్పుడు వివిధరకాల లక్షణాలు, ముందుగా కొన్ని సంజ్ఞలు కనపడుతుంటాయి. వివిధరకాల శరీర భాగాల్లో విభిన్న రకాలుగా దాని ప్రభావం ఉంటుంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే....

కండరాలు బలహీనం అవుతాయి. ఇందువల్ల దేనిని గట్టిగా పట్టుకోలేము, వస్తువులను తీసుకెళ్ళలేము.

కండరాల నొప్పులు, కండరాల్లో పక్షపాతం

అలసట

చేతులు, కాళ్లల్లో బలహీనత

మింగటం కష్టతరం అవడం

ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం

మాట్లాడేటప్పుడు తడబడటం

 మోటార్ న్యూరాన్ వ్యాధి రోగ నిర్ధారణ :

మోటార్ న్యూరాన్ వ్యాధి రోగ నిర్ధారణ :

మోటార్ న్యూరాన్ వ్యాధిని గుర్తించడానికి ఒక నిర్ధారణ పరీక్ష మాత్రమే లేదు. ఈ వ్యాధి నిర్ధారణకు మీ గత ఆరోగ్య చరిత్ర, అందుకు సంబంధించిన పరీక్షలు, వీటితో పాటు విద్యుత్ శారీరిక పరీక్షలు చేయవలసి ఉంటుంది. వీటితో పాటు రక్త పరీక్షలు, నడుము పంచర్, కండరాల జీవాణువు పరీక్ష మొదలగు పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.

English summary

Stephen Hawking Dies Of Motor Neuron Disease; What Is Motor Neuron Disease?

Stephen Hawking Dies Of Motor Neuron Disease; What Is Motor Neuron Disease,Stephen Hawking was diagnosed with an impaired neurodegenerative disease. Know what is motor neuron disease and what are its causes in this article.
Desktop Bottom Promotion