For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెర్నియా మగవారికే కాదు పిల్లలకు, స్త్రీలకూ వస్తుంది.. పట్టించుకోకుంటే ప్రాణాలకే ప్రమాదం

హెర్నియా అనేది చాలా మంది మగవారికి తెలిసే ఉంటుంది. అయితే ఇది వ్యాధి కాదు. ఇది వాపు మాత్రమే. గజ్జల్లో కానీ, ఉదరంలో కానీ కండరాలు బలహీనమైనప్పుడు వచ్చే 'ఉబ్బు'ను 'గిలక' లేదా 'హెర్నియా' అంటారు

|

హెర్నియా అనేది చాలా మంది మగవారికి తెలిసే ఉంటుంది. అయితే ఇది వ్యాధి కాదు. ఇది వాపు మాత్రమే. గజ్జల్లో కానీ, ఉదరంలో కానీ కండరాలు బలహీనమైనప్పుడు, కడుపులోని కొవ్వు, పేగులు వాటిగుండా బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు బయటికి కనబడే 'ఉబ్బు'ను 'గిలక' లేదా 'హెర్నియా' అంటారు. దీన్ని తొలిదశలొనే గుర్తించి తొలగిస్తే దీన్నుంచి శాశ్వతంగా విముక్తి పొందొచ్చు. అయితే దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదు.

నోటి ద్వారా తీసుకున్న ఆహారం అన్నవాహిక నుంచి జీర్ణాశయానికి చేరుకుని జీర్ణమౌతుంది. అక్కడి నుంచి వ్యర్థాలన్నీ పేగుల ద్వారా విసర్జనవ్యవస్థకు చేరతాయి. జీర్ణవ్యవస్థకు, విసర్జన వ్యవస్థకు పేగులు అనుసంధానమై ఉంటాయి. వీటిపై పెరిటోనియం అనే పదార్థం ఉంటుంది.

కండరాలు బలహీనంగా ఉండడం వల్ల

కండరాలు బలహీనంగా ఉండడం వల్ల

దీని పైభాగంలో కండరాలు, వాటి పైన డీప్‌ఫెషియా ఉంటుంది. దీనిపై కొవ్వు, చర్మం ఉంటాయి. ఈ కండరాలు బలహీనంగా ఉండడం వల్ల పేగులు, పెరిటోనియం ఉబ్బి ముందుకు వస్తాయి. ఇలా ఉబ్బిన ప్రాంతంలో చర్మం ఒక సంచిలా కనిపిస్తుంది. దీనినే 'హెర్నియా' అంటారు.

ఏ వయస్సులో ఉన్న వారికైనా

ఏ వయస్సులో ఉన్న వారికైనా

నిద్రపోతున్న సమయంలో ఇది లోపలకు వెళ్లిపోతుంది. కొన్నిసార్లు మాత్రం అలాగే ఉండిపోతుంది. పిల్లలు, స్త్రీ, పురుషుల్లో ఏ వయస్సులో ఉన్న వారికైనా, ఎప్పుడైనా 'హెర్నియా' వచ్చే అవకాశాలు ఉన్నాయి.

హెర్నియాలో రకాలు

హెర్నియాలో రకాలు

హెర్నియాలో సుమారు 20 రకాలు ఉన్నాయి. ఇది ఏవిధంగానైనా రావొచ్చు. ప్రధానంగా మూడురకాల హెర్నియా ఎక్కువగా వస్తుంది. ఇంతకుముందు శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలో వచ్చే వాపును ఇన్‌సిషనల్‌ హెర్నియా అంటారు. బొడ్డు దగ్గర వచ్చే వాపు అంబెలికల్‌ హెర్నియా. పిల్లలకు పుట్టుకతో వస్తే దాన్ని కంజెనిటల్‌ హెర్నియా అంటారు. గజ్జల్లో ఏర్పడితే దాన్ని ఇంగ్వైనల్‌ హెర్నియాగా గుర్తించాలి. ఇవి కాకుండా హియటస్‌, ఎపిగ్యాస్ట్రిక్‌, ఒబ్యురేటర్‌, స్పైజెలియన్‌, ఇన్‌డైరెక్ట్‌, ఇంగ్వైనల్‌, డైరెక్ట్‌ ఇంగ్వైనల్‌ హెర్నియా ఉన్నాయి.

ఎరుపు లేక గులాబీ రంగులోకి మారితే

ఎరుపు లేక గులాబీ రంగులోకి మారితే

వీటిలో ఎక్కువగా ఇన్‌సి షనల్‌, అంబెలికల్‌, ఇంగ్వైనల్‌ హెర్నియా వస్తున్నాయి. హెర్ని యాల్లో స్ట్రాంగ్యులేటెడ్‌ హెర్నియా చాలా ప్రమాదకరమైంది. పేగు జారిన ప్రదేశం ఎరుపు లేక గులాబీ రంగులోకి మారితే దాన్ని స్ట్రాంగ్యులేటెడ్‌ హెర్నియాగా గుర్తించాలి. స్త్రీలలో వచ్చే దాన్ని వెంట్రల్‌ హెర్నియా అంటారు.

ఎలా వస్తుంది

ఎలా వస్తుంది

సహజంగా పొత్తి కడుపు కొన్ని బలహీన ప్రాంతాలను కలిగి ఉంటుంది. ఇక్కడ పొరలు బలహీనంగా ఉండడంతో హెర్నియా వస్తుంది. బరువులు ఎత్తినప్పుడు నొప్పి వచ్చినా, దగ్గినా, మలమూత్ర విసర్జనల్లో సమస్యలు ఉన్నా బలహీనంగా ఉన్న కండరాలు మరింత శక్తిని కోల్పోతాయి. పిల్లల్లో నూటికి ఇరవై మందికి, పెద్దవాళ్లల్లో నూటికి యాభై మందికి జీవితకాలంలో హెర్నియా వస్తుంది. ఇది కొంతమందిలో త్వరగా బయటపడుతుంది. మరికొందరికి ఆలస్యంగా వస్తుంది.

ప్రాణహాని కలగవచ్చు

ప్రాణహాని కలగవచ్చు

చిన్నారుల్లో కొందరికి రెండు, మూడు నెలలకే హెర్నియా వస్తుంది. ఇంకొంతమందిలో వయస్సుతోపాటు పెరుగుతూ ఉంటుంది. పేగుల పైన ఉండే కండరాలు బలహీనపడటంతో కిందకు జారిపోతాయి. వయస్సు పెరుగుతున్న వారికీ హెర్నియా రావొచ్చు. స్త్రీ, పురుషుల్లో దీని లక్షణాలు ఒకేలా ఉంటాయి. కొంతమందిలో పేగులు గజ్జల వరకు జారిపోయి అక్కడ ఇరుక్కుపోతాయి. తీసుకున్న ఆహారం ఇందులోకి చేరకపోవడంతో నొప్పి తీవ్రంగా ఉంటుంది. రక్తప్రసరణ ఆగిపోయి పేగు పాడైపోతుంది. వెంటనే శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణహాని కలగవచ్చు.

మహిళల్లో కూడా..

మహిళల్లో కూడా..

ఉదర కిందిభాగం కండరాలపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగినా ఇది వస్తుంది. ఒబిసిటీ ఉన్నా, పొగ తాగే అలవాటు ఉన్నా హెర్నియా రావొచ్చు. ఆరు నెలల వయస్సున్న పిల్లలకు ఎక్కువగా అంబెలికల్‌ హెర్నియా వస్తుంది. మహిళల్లో వచ్చే వెంట్రల్‌ హెర్నియాకు ప్రధానకారణం 'సిజేరియన్‌ ఆపరేషన్‌'. ఈ సర్జరీకి ఎక్కువ సమయం పట్టినా, సర్జరీ కోత నిలువుగా ఉన్నా, చర్మపు పొరలకు కుట్లు సరిగా వేయకపోయినా, కుట్లు ఇన్ఫెక్షన్‌కు గురైనా హెర్నియా వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

సిజేరియన్‌ చేయించుకున్న తర్వాత..

సిజేరియన్‌ చేయించుకున్న తర్వాత..

అలాగే ఎక్కువ ప్రసవాల ఫలితంగా పొత్తికడుపు కండరాలు పటుత్వం తగ్గినా ఈ సమస్య తలెత్తవచ్చు. సిజేరియన్‌ చేయించుకున్న మహిళలు తరచుగా దగ్గుతో బాధపడుతున్నా.. దగ్గినప్పుడు పొట్టపై పడే ఒత్తిడి వల్ల హెర్నియా రావొచ్చు. వీరు హెర్నియా బారిన పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సర్జరీ నుంచి కోలుకున్న రెండు నెలల నుంచే పొత్తికడుపును బలపరిచే వ్యాయామాలు చేయాలి.

మాంసకృత్తులున్న ఆహారం తీసుకోవాలి

మాంసకృత్తులున్న ఆహారం తీసుకోవాలి

సాధారణ ప్రసవమైన స్త్రీలు ప్రసవమైన రెండు వారాల నుంచే వ్యాయామాలు మొదలుపెట్టాలి. సర్జరీ కుట్లు త్వరగా మానటం కోసం మాంసకృత్తులున్న ఆహారం తీసుకోవాలి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలతోపాటు శరీర బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. సిజేరియన్‌ తర్వాత బరువు పెరిగేకొద్దీ కుట్లు దగ్గరి చర్మం సాగీ, పటుత్వం కోల్పోతుంది. దాంతో అక్కడి చర్మం అడుగునున్న పొరలన్నీ పల్చబడతాయి. దాంతో లోపలి పేగులు పొరల్ని నెట్టుకుంటూ చర్మం అడుగుకి మూటల్లాగా చేరతాయి.

వృద్ధుల్లో

వృద్ధుల్లో

వృద్ధుల్లో వయసు పెరిగేకొద్దీ కండరాల పటుత్వం తగ్గుతుంది. చర్మం అడుగునుండే కణజాలం పటుత్వం కూడా బాగా తగ్గిపోతుంది. దాంతో ఆ ప్రదేశం ఒత్తిడికి లోనైనప్పుడు హెర్నియా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు దగ్గినంత బలంగా వృద్ధులు దగ్గలేరు. బలంగా దగ్గి, కళ్లెను బయటకు తీసుకురాలేక తక్కువ శక్తితో దగ్గుతూ ఉంటారు. దాంతో పొత్తికడుపు ఒత్తిడికి గురై, హెర్నియా వస్తుంది.

మధుమేహం అదుపు తప్పినా

మధుమేహం అదుపు తప్పినా

కొందరిలో ప్రొస్టేట్‌ గ్రంథి వ్యాధులకు గురై, పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల కూడా హెర్నియా తలెత్తుతుంది. వృద్ధుల్లో మధుమేహం అదుపు తప్పినా హెర్నియా రావొచ్చు. వీరిలో మలబద్ధకం సమస్య ఉంటుంది. దాంతో మలవిసర్జన కోసం గట్టిగా ముక్కటం వల్ల కూడా హెర్నియా వస్తుంది.

పసికందులకు

పసికందులకు

తల్లి గర్భంలో ఏడునెలల వయసు మగ పిండంలో బీజాలు పొత్తికడుపులో ఉండి ప్రసవానికి ముందు కిందకి జారతాయి. ఒకవేళ బిడ్డ ముందుగానే ఏడు నెలలకే పుడితే బీజాలు కిందకి రాక లేదా పేగులు, కొవ్వు, ద్రవం పొత్తికడుపులోని బలహీన ప్రదేశంలోకి చొచ్చుకొచ్చి హెర్నియా తయారౌతుంది. దాంతో ఈ పిల్లలు బొడ్డు లేదా గజ్జల్లో వాపుతో పుడతారు. బొడ్డు వాచినట్టు కనిపిస్తుంది కాబట్టే ఈ రకం హెర్నియాను 'అంబెలికల్‌ హెర్నియా' అంటారు. ఈ సమస్య బిడ్డ పుట్టిన కొన్ని నెలల్లో కూడా కనిపించవచ్చు. ఇలాంటప్పుడు లాప్రోస్కోపీ టెక్నిక్‌తో ఆ ప్రదేశాన్ని చేరుకుని చర్మపు తిత్తికి దారంతో ముడి వేసి, వదిలేస్తారు. ఇలా ముడివేయటం వల్ల పేగులు మళ్లీ తిత్తిలోకి చేరుకోవు.

లక్షణాలు

లక్షణాలు

సాధారణంగా హెర్నియా బొడ్డు దగ్గర లేక మర్మావయాలకు కుడి, ఎడమ వైపున వస్తుంది. అంతకుముందు శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలోనూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దగ్గినా, బరువులు ఎత్తినా ఈ వాపు ఎక్కువవుతుంది. మల,మూత్ర విసర్జన చేసినప్పుడూ ఈ లక్షణం కనిపిస్తుంది. వాపు వచ్చిన ప్రదేశంలో మొదట్లో ఎటువంటి నొప్పి ఉండదు. తర్వాత నొప్పితోపాటు సమస్య తీవ్రంగా ఉంటుంది.

బలహీనంగా

బలహీనంగా

బలహీనంగా ఉన్న వారిలో హెర్నియా త్వరగా బయట పడుతుంది. ఊబకాయం ఉన్న వారికి కాస్త ఆలస్యంగా వస్తుంది. నిలబడినప్పుడు గజ్జల భాగం ఉబ్బినట్టుగా ఉండడం, పడుకున్నప్పుడు లోపలికి వెళ్లిపోవడం. గజ్జల భాగంలో తెలియని బాధ ఉంటుంది. వృషణం కిందికి జారిపోతుంది. కడుపులో తిప్పడం, వాంతులు కావడం వంటి లక్షణాలుంటాయి. దగ్గినప్పుడు, వంగినప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు సూదితో గుచ్చినట్టు నొప్పి ఎక్కువవుతుంది.

నిర్ధారణ, చికిత్స

నిర్ధారణ, చికిత్స

శరీరంలో హెర్నియా వాపు ఉన్న ప్రదేశాన్ని చూసి డాక్టర్‌ దీనిని నిర్ధారిస్తారు. ఇతర పరీక్షలేవీ ఉండవు. దీని నివారణకు ఎటువంటి మందులూ లేవు. శస్త్రచికిత్స ద్వారా మాత్రమే దీన్ని తొలగించాలి. మొత్తం మూడు రకాల శస్త్రచికిత్సల ద్వారా దీనిని తొలగించవచ్చు. మామూలు ఆపరేషన్‌తోపాటు ల్యాప్రోస్కోపిక్‌, రోబోటిక్‌ శస్త్రచికిత్సల ద్వారా హెర్నియాను తొలగించవచ్చు. పేగుల వద్ద ఉండే పెరిటోనియం, కండరాలకు మధ్యన ప్రోలీన్‌ మెష్‌ ఏర్పాటు చేస్తారు. ఇది మరోసారి హెర్నియా రాకుండా రక్షిస్తుంది.

పేషెంట్‌ ఐదు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు

పేషెంట్‌ ఐదు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు

ఈ చికిత్సల్లో కోత ద్వారా చేసే శస్త్రచికిత్స చాలా వరకూ సత్ఫలితాలనిస్తోంది. లోపల ఏర్పాటు చేసే మెష్‌ను సరిగా అమర్చడానికి ఈ విధానమే మంచిది. ల్యాప్రోస్కోపిక్‌ ఆపరేషన్‌లో ఏర్పాటుచేసే మెష్‌ సరిగా అమరకపోవచ్చు. ఇందులో ఎలాంటి తేడాలు వచ్చినా మళ్లీ హెర్నియా వచ్చే ప్రమాదం ఉంది. రోబోటిక్‌ సర్జరీ చాలా ఖర్చుతో కూడుకున్నది. సాధారణ శస్త్రచికిత్సలో లోకల్‌ అనస్తీషియా ఇచ్చి మూడు, నాలుగు అంగుళాల గాటు చేయడం ద్వారా సర్జరీ చేస్తారు. పేషెంట్‌ ఐదు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు. ఆర్థికంగా కూడా పెద్ద భారం కాదు.

జాగ్రత్తలు

జాగ్రత్తలు

హెర్నియాను గుర్తించినప్పటికీ నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదం. పొత్తి కడుపు, మర్మావయాల వద్ద వాపు ఉందని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. హెర్నియా పట్ల అశ్రద్ధ వహిస్తే ప్రేగులు బాగా పాడైపోతాయి. కొంతమంది వాపును తగ్గించుకోవడానికి బెల్టులు వంటివి ఉపయోగిస్తారు. వాటివల్ల పేగులు ఇంకా నలిగిపోతాయి. ఇటువంటి బెల్టులను ఉపయోగించకపోవడం మంచిది. శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత వారంపాటు విశ్రాంతి తీసుకుంటే చాలు. మూడు నెలల వరకూ ఎటువంటి బరువులూ ఎత్తకూడదు.

హెర్నియా రాకుండా జాగ్రత్తలు

హెర్నియా రాకుండా జాగ్రత్తలు

హెర్నియా రాకుండా ఉండాలంటే పొత్తికడుపు మీద ఒత్తిడి పనే పనులకు దూరంగా ఉండాలి. అలాగే సర్జరీల కోసం అనుభవఙ్ఞులైన వైద్యులను ఎంచుకోవాలి. హెర్నియా రాకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు మరికొన్ని...సాధారణ ప్రసవం, సిజేరియన్‌ సర్జరీ తర్వాత తప్పనిసరిగా పొట్ట కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి.

బరువులెత్తేటప్పుడు జాగ్రత్త

బరువులెత్తేటప్పుడు జాగ్రత్త

మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మధుమేహం అదుపులో ఉంచుకోవాలి. దగ్గు తెప్పించే ధూమపానం మానేయాలి. పురుషులు ప్రొస్టేట్‌ గ్రంథి సమస్యలను సరిదిద్దుకోవాలి. బరువులెత్తేటప్పుడు క్రమపద్ధతి పాటించాలి.

ఎత్తుకు తగిన బరువు మెయింటెయిన్‌ చేయాలి. అధిక బరువు తగ్గించుకోవాలి. దగ్గుకి కారణమయ్యే రుగ్మతల్ని అదుపు చేయాలి.

నిర్లక్ష్యం తగదు

నిర్లక్ష్యం తగదు

పొత్తికడుపు లేదా గజ్జల్లో హెర్నియా కనిపిస్తే వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రదించి చికిత్స మొదలుపెట్టాలి. లేదంటే పొట్టలో చర్మం అడుగున ఏర్పడిన రంధ్రం పెద్దదైపోతూ సమస్య మరింత జటిలమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ తిత్తిలోకి చేరుకున్న పేగులకు రక్త ప్రసరణ అందక కుళ్లిపోతాయి. ఇలాంటప్పుడు ఆ పేగులు సెప్టిక్‌ అవుతాయి. ఇన్ఫెక్షన్‌ ఎక్కువై, ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసే కొంతమందిలోనైతే పేగుల పనితీరు తలకిందులై మలం, ఆహారం కలిసిపోయి అవి వెళ్లే మార్గాలు తారుమారవుతాయి. ఇది చాలా ప్రమాదం. ఇలా జరగకుండా ఉండాలంటే హెర్నియా లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.

English summary

symptoms of a hernia causes treatment

symptoms of a hernia causes treatment
Desktop Bottom Promotion