For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉడికించిన కూరగాయలను తినడం ద్వారా కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు!

కూరగాయలను ఉడికించి వండటమనేది సరైన అలాగే సులభమైన పద్దతి. ఒక పాత్రలో కాస్తంత నీళ్లను పోసి అందులో కూరగాయలను వేసి వేడిచేయాలి. అయితే, తగినట్టుగా ఉడికిన కూరగాయల నుంచి మాత్రమే మనకి ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయన

|

మన ఆహారపుటలవాట్లలో కూరగాయల పాత్ర ప్రముఖమైనది. నిజానికి, కూరగాయాలనేవి లేకుండా ఆహారం తీసుకోవాలనే ఆలోచనే మనకు రాదు. అంతటి ప్రాముఖ్యత మనం కూరగాయలకిస్తాము. ఈ విధంగా, కూరగాయలు మన ఆహారంలో అంతర్భాగమయ్యాయి.

ఉడికించిన కూరగాయలను అలాగే ఆకుపచ్చని ఆకు కూరలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి తగినంత ఫైబర్, మినరల్స్, విటమిన్స్ తో పాటు మరికొన్ని అవసర పోషకాలు అందుతాయి. తద్వారా, డయాబెటిస్, గుండె జబ్బులతో పాటు క్యాన్సర్ వంటి అనేక రకాల రోగాల నుంచి మనకు తగిన రక్షణ లభిస్తుంది. అదేవిధంగా, కూరగాయలను తీసుకోవడం వలన కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే, ఆయా ప్రయోజనాలను పొందేందుకు కూరగాయలను తగిన విధంగా వాటి నాణ్యత ఏ విధంగా దెబ్బతినకుండా సరిగ్గా వండుకోవాలి.

కూరగాయలను ఉడికించి వండటమనేది సరైన అలాగే సులభమైన పద్దతి. ఒక పాత్రలో కాస్తంత నీళ్లను పోసి అందులో కూరగాయలను వేసి వేడిచేయాలి. అయితే, తగినట్టుగా ఉడికిన కూరగాయల నుంచి మాత్రమే మనకి ఆరోగ్యప్రయోజనాలు లభిస్తాయన్న విషయం మనం గమనించి తీరాలి. ఎందుకంటే, అధికంగా ఉడికించడం వలన కూరగాయలలోని పోషకవిలువలు ఆవిరైపోతాయి. తద్వారా, మనకి వాటి నుంచి లభించవలసిన పోషకాలు అందవు. అయితే, సరైన పద్దతిలో తగినంత సమయం వరకు మాత్రమే ఉడికించడం వలన మీరు కూరగాయల నుంచి సరైన పోషకవిలువలు పొందగలరు. ఈ విధమైన జాగ్రత్త తీసుకోవడం ద్వారా కూరగాయలు అద్భుతమైన రుచితో మీ టేస్ట్ బడ్స్ ను సంతృప్తి పరచడంతో పాటు మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి కూడా.

టర్నిప్ ని అలాగే పొటాటోని రెండిటినీ మ్యాష్ చేసి కాస్తంత సాల్ట్ పెప్పర్ ని కలిపి ఉడికిస్తే భలే రుచిగా ఉంటుంది కదూ! అయితే, మీకు కూరగాయల్ని ఉడికించడం వలన కలిగే ప్రయోజనాలను తెలిస్తే మీరు అదేవిధమైన రెసిపీలకు ఆకర్షితులవుతారు. ఈ పద్దతి సులభతరం అదే సమయంలో ఆరోగ్యకరం కూడా.

ఇప్పుడు, ఉడికించిన కూరగాయల వలన కలిగే ప్రయోజానాల గురించి మనం తెలుసుకుందాం....

తినడానికి సురక్షితం:

తినడానికి సురక్షితం:

కూరగాయలను సరైన విధంగా ఉడికించడం వలన వాటిలో దాగి ఉండే క్రిమికీటకాలు నశిస్తాయి. తద్వారా, కూరగాయాలనేవి తినడానికి సురక్షితంగా మారి తద్వారా ఆరోగ్యకరంగా మారతాయి.

పోషకవిలువలను భద్రపరచవచ్చు:

పోషకవిలువలను భద్రపరచవచ్చు:

అనేకరకాల అధ్యయనాల ప్రకారం ఉడికించిన కూరగాయలలో పోషకవిలువలు బ్రహ్మాండంగా లభిస్తాయి. కేరట్స్, జుచిని, బ్రొకోలి వంటివాటిని ఉడికించడం ద్వారా వాటి నుంచి గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

వ్యాధుల బారిన పడే ప్రమాదంలో తగ్గుదల:

వ్యాధుల బారిన పడే ప్రమాదంలో తగ్గుదల:

సిఫార్సు చేయబడిన మోతాదులో ఉడికించిన కూరగాయలను ప్రతి రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే క్యాన్సర్, గుండె జబ్బులు, ఒబేసిటీ వంటి వ్యాధుల నుంచి రక్షణ ఏర్పడుతుంది. తద్వారా, ఎటువంటి ఔషధాలు వాడకుండానే సహజంగానే ఆరోగ్యంగా ఉంటాము.

యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ పెరుగుదల:

యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ పెరుగుదల:

ఉడికించడం వలన కూరగాయలలో లభ్యమయ్యే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేది మరింత పెరుగుతుంది. దీని వలన శరీరంలోని ఆక్సిడేషన్ వలన ఉత్పత్తయ్యే ఫ్రీ రాడికల్స్ అనే కెమికల్స్ అనేవి నశింపబడతాయి. ఆ విధంగా, అనేక వ్యాధులు నుంచి రక్షణ లభిస్తుంది.

ఆకుకూరలను ఉడికించడం ద్వారా భారీ ప్రయోజనాలను పొందవచ్చు:

ఆకుకూరలను ఉడికించడం ద్వారా భారీ ప్రయోజనాలను పొందవచ్చు:

ఓక ప్రఖ్యాత న్యూస్ పేపర్ ప్రకారం, మెంతి, పాలకూర వంటి ఉడికించిన ఆకుకూరలను కూరగాయలను తీసుకోవడం ద్వారా వాటి నుంచి లభించే ప్రయోజనాలు మరింత రెట్టింపవుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అధిక బరువుని తగ్గించుకోవచ్చు:

అధిక బరువుని తగ్గించుకోవచ్చు:

అధిక బరువుని తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఆహారం గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టయితే ఉడికించిన కూరగాయలను చక్కని ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. ఇవి ఎసిడిటీ నుంచి మీకు ఉపశమనం కలిగిస్తాయి. అలాగే, శరీరంలోని క్రొవ్వును పేరుకోకుండా నియంత్రిస్తాయి.

సులభంగా నమలవచ్చు:

సులభంగా నమలవచ్చు:

ఉడికించిన కూరగాయలను సులభంగా నమలవచ్చు. ఇవి సులభంగా జీర్ణమవుతాయి కూడా. అందుకే, పళ్ళు ఊడిపోయిన వృద్ధులు అలాగే వ్యాథిగ్రస్తులు సులభంగా జీర్ణమవడానికి ఉడికించిన కూరగాయాలనే ఎంచుకుంటారు.

వివిధ రకాల రుచులను ఆస్వాదించవచ్చు:

వివిధ రకాల రుచులను ఆస్వాదించవచ్చు:

ఉడికించని పొటాటో రుచిని మీరు ఊహించగలరా? ఉడికించడం వలన పొటాటోకి అద్భుతమైన రుచి అనేది లభిస్తుంది. అందుకే, వంటకాలకు రుచిని అద్దడానికి కూరగాయలను ఉడికించడం ముఖ్యం. రోజువారి ఆహారంలో మనం అనేక రుచులను ఆస్వాదించడానికి ముఖ్య కారణమిదే. టమాటో చట్నీ, ఇండియన్ సమోసావంటి వాటిలో వాడే కూరగాయాలని సరైన విధంగా ఉడికించడం ద్వారానే వాటికి ప్రత్యేకమైన రుచి కలుగుతుంది.

సమయాన్నిఆదా చేయవచ్చు:

సమయాన్నిఆదా చేయవచ్చు:

ఉడికించడం వలన ఆహారానికి సరైన రుచి రావడంతో పాటు మనకు సమయం కూడా ఆదా అవుతుంది. ఉడికించడానికి అవసరమైన ఇంగ్రిడియెంట్స్ అనేవి పరిమితమైనవే.

ఆరోగ్యకరమైన మార్గం:

ఆరోగ్యకరమైన మార్గం:

ఆరోగ్యకరమైన ఆహారం కోసం మీరు ఎదురుచూస్తున్నట్టయితే ఉడికించిన కూరగాయలకే ఓటు వేయండి. వీటిలో క్రిమికీటకాలు ఉండవు. తద్వారా ఫుడ్ పాయిజనింగ్ సంభవించే ప్రమాదం తక్కువ. అదే సమయంలో, ఇవి అత్యంత పోషకమైనవి కూడా.

English summary

Benefits Of Boiled Vegetables | Benefits Of Boiled Green Vegetables | Boiled Vegetables Benefits | Health Benefits Of Eating Boiled Vegetables

Boiling is the simplest way of cooking vegetables, just pour some water in a pot, add the veggies and heat up. But you’ll be able to obtain the benefits of boiled vegetables only when it is boiled carefully. This is because most of the time boiling tends to destroy the nutritional value of vegetables. It can be escaped if you take some while boiling. Give a touch of salt and only the required amount of water, and heat up to-the-point. And it’ll turnout to be actually something delicious to taste and healthy as well.
Story first published:Friday, January 5, 2018, 12:01 [IST]
Desktop Bottom Promotion