For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు స్కిన్ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి వేసవిలో పాటించవలసిన డైట్ చిట్కాలు !

మీకు స్కిన్ క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి వేసవిలో పాటించవలసిన డైట్ చిట్కాలు !

|

మీ శరీరము బయటకు కనిపించేలా ఉండే వేసవి దుస్తులను ధరించడానికి ఇష్టపడేవారు ఎవరైనా సరే, మరొక్కసారి ఆలోచించండి !

ఈ వేసవికాలంలో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు నేరుగా భూమి వాతావరణంలోకి చొచ్చుకుపోయి, మీకు చర్మ క్యాన్సర్తో సహా ఇతర వ్యాధుల వ్యాప్తికి కారణం కాగలదు.

ఈ వేసవికాలంలో, ప్రత్యేకంగా ఉష్ణమండల దేశాలలోని వాతావరణం ఎక్కువ వేడిని కలిగి తేమగా ఉన్నందున - ఆ వేడిని తట్టుకోవడానికి అక్కడ నివసించే ప్రజలు షార్ట్స్ను, స్కర్ట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ వంటి కురచ దుస్తులను ఉపయోగించడానికి ఇష్టపడతారు.

skin cancer, health, wellness

అయితే ఈ వేసవికాలంలో సూర్యుని నుండి వెలువడే యూవీ (UV) కిరణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మీరు సన్ బర్న్, హీట్ స్ట్రోక్, చర్మ క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు మీ చర్మాన్ని వీలైనంత ఎక్కువగా కప్పివేయడం చాలా ఉత్తమం.

చర్మ క్యాన్సర్ అనేది క్యాన్సర్లలో ఒకరకం. ఇది చర్మ కణాలను ప్రభావితం చేస్తుంది. అలా మీ చర్మ కణాలలో ఈ కేన్సర్ కణాల సంఖ్య అసాధారణమైన రీతిలో పెరుగుతుంది.

ఈ చర్మ క్యాన్సర్ సులభంగా గుర్తించబడలేదు & సరైన సమయంలో చికిత్సను అందించకపోతే, ఇది ప్రాణాంతకం కావచ్చు, అలానే ఈ క్యాన్సర్ మరల పునరావృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కొన్ని సంవత్సరాల నుంచి జరిపిన పరిశోధనలలో, తీవ్రమైన సూర్యరశ్మి & యూవీ (UV) కిరణాల ప్రభావంతో చాలా మంది ప్రజలలో చర్మ క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

కాబట్టి ఇక్కడ తెలియపరచిన కొన్ని ఆహార చిట్కాలను పాటించడం వల్ల ఈ వేసవిలో మీరు చర్మ క్యాన్సర్ బారిన పడకుండా, మిమ్మల్ని కాపాడేందుకు ఇవి బాగా సహాయపడతాయి.

ఓట్స్ ను అల్పాహారంగా తీసుకోండి :

ఓట్స్ ను అల్పాహారంగా తీసుకోండి :

రోజు ప్రారంభంలో అల్పాహారమనేది అత్యంత ముఖ్యమైనదని కావున ఆహారాన్ని తీసుకోవడం మర్చిపోకూడదని మనందరికీ బాగా తెలుసు. కాబట్టి మీరు పూర్తిగా అల్పాహారాన్ని తీసుకోక పోవటం లేదా కాబట్టి మీరు పూర్తిగా అల్పాహారాన్ని తీసుకోకపోవటం (లేదా) మఫిన్లు, బేగెల్స్, తృణధాన్యాలు, సమోసాలు, మిఠాయిల వంటి తీపిని & ఆయిల్ను కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల అవి మీ చర్మ కణాలకు, అలాగే మీ శరీర ఆరోగ్యానికి కూడా మరింత అనారోగ్యాలను కలుగజేస్తాయి.

పెరుగును వినియోగించండి :

పెరుగును వినియోగించండి :

క్రమం తప్పకుండా పెరుగును వినియోగించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో పెరుగని, గ్రీకులో యోగర్ట్ అని పిలవబడే ఈ పదార్ధం తప్పనిసరిగా మన డైట్లో చాలా కీలకమైనది, ముఖ్యంగా వేసవికాలంలో ! ఇది కొన్ని శరీర భాగాల్లో ఉన్న మంచి బ్యాక్టీరియా పెరుగుదలను మెరుగుపరచగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మన శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా, చర్మ క్యాన్సర్కు కారణమయ్యే ఏజెంట్తో పోరాడగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందని పలు పరిశోధనల్లో బయటపడింది.

కాఫీని తాగండి :

కాఫీని తాగండి :

కొన్ని దశాబ్దాల కాలంగా, కాఫీకి సంబంధించిన లాభనష్టాల గురించి చాలాసార్లు చర్చించబడ్డాయి. అయితే, మీరు రోజులో తీసుకునే 1-2 కప్పుల కాఫీ ఆరోగ్యానికి ఏమాత్రం హానికరం కాదని తేలింది. అలాగే మరొక శుభవార్త ఏమిటంటే, కాఫీ మిమ్మల్ని శక్తివంతులుగా చేయడమే కాకుండా చర్మ క్యాన్సర్ను కూడా నిరోధించగలదు. ఎందుకంటే వీటిలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండటం వల్ల, సూర్యరశ్మి & యూవీ (UV) కిరణాల ప్రభావంతో మీ చర్మానికి నష్టం కలిగించే స్వేచ్ఛా రాడికల్స్ను నిరోధిస్తాయి.

ఆకుపచ్చని ఆకుకూరలను తినండి :

ఆకుపచ్చని ఆకుకూరలను తినండి :

బచ్చలకూర, పుదీనా, ఆస్పరాగస్ వంటి మొదలైన ఆకుపచ్చని ఆకుకూరలను తినడం వల్ల వీటిలో ఉండే పోషక పదార్ధాలు మన ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలను కలిగిస్తాయని మన చిన్నతనం నుంచే తెలుసుకున్నాము. అంతేకాకుండా, వేసవిలో ఈ ఆకుకూరలను ప్రధాన ఆహారంగా తీసుకున్నట్లయితే - చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే వీటిలో విటమిన్ A,C లు సూర్యరశ్మి కారణంగా చర్మ కణాలకు వాటిల్లే నష్ట తీవ్రతను నివారించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

టమోటాలను ఎక్కువగా తినండి :

టమోటాలను ఎక్కువగా తినండి :

ఈ వేసవి వేడిని తట్టుకోవడానికి ఒక గ్లాసు తాజా టమోటా రసమును తీసుకోవడం చాలా మంచిది (లేదా) టమోటాలను సలాడ్ల రూపంలో రోజువారీగా తీసుకోవడం చాలా మంచిది. టమోటా చర్మ క్యాన్సర్ ను నివారించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. వీటిలో ఉండే లైకూపీస్ & ఫైటోకెమికల్స్ అని పిలవబడే సమ్మేళనాలు, సూర్యుని నుంచి వెలువడే UV కిరణాలు మన చర్మంలోనికి శోషించడాన్ని నివారించడంలో సహాయపడుతాయి, ఆ విధంగా మీరు చర్మ క్యాన్సర్ను నివారించవచ్చు.

English summary

These Summer Diet Tips Can Help Prevent The Deadly Skin Cancer!

Did you know skin cancer can be fatal, when not diagnosed and treated in time. Research studies have shown that the UV radiations from the sun are one of the main causes for skin cancer. These diet options can help prevent skin cancer: oats, yogurt, coffee, green leafy veggies, tomatoes, nuts and green tea.
Story first published:Tuesday, May 15, 2018, 17:54 [IST]
Desktop Bottom Promotion