For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడ నొప్పిని న్యాచురల్ గా తగ్గించే 11 హోం రెమెడీస్

By Mallikarjuna
|

మన శరీరానికి అతి ముఖ్యమైన అవయం మెడ, మెడ శరీరంలోని ఇతర అవయవాలు పనిచేయడానికి కదలికలకు మెడ ఉపయోగపడుతుంది. శరీరం ఆరోగ్యంగా పనిచేయడానికి, కదలికలకు సహాయపడుతుంది.

మెడనొప్పి ఉన్నప్పుడు, తలను ఇటు అటు తిప్పడానికి కష్టం అవుతుంది. అంతే కాదు, ఇక ఆ నొప్పి తగ్గే వరకూ ఆ నొప్పి అలాగే ఉండి, రోజంతా పనులు చేసుకోనివ్వకుండా అసౌకర్యానికి గురిచేస్తుంది.

మెడనొప్పి ఉన్నప్పుడు నొప్పి మెడ చుట్టూ ఉంటుంది. ముఖ్యంగా మెడ కండరాలు, భుజాల చుట్టూ ఏర్పడుతుంది. ఇది తలనొప్పి, తిమ్మెర్లు, టింగ్లింగ్ సెన్షేషన్, స్టిఫ్ నెస్, ఆహారం నమలడానికి, తినడానికి, మ్రింగడానికి కష్టంగా ఉంటుంది. వాపు ఇబ్బంది కలిగిస్తుంది.

మెడనొప్పికి ముఖ్య కారణం మజిల్ టెన్షన్, మజిల్ స్ట్రెయిన్, కూర్చొనే భంగిమ సరిగా లేకపోవడం, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం. నిద్రించే భంగిమ కూడా సరిగా లేకపోవడం, వ్యాయామం చేసే సమయంలో మెడ కండరాలు పట్టడం.

ఇంకా పోషకాహార లోపం, మెడ గాయం అవ్వడం, నరాలపై ఒత్తిడి, సర్వికల్ స్పాండిలోసిస్ మొదలగు ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

కారణం ఏదైనా, మెడనొప్పిని వెంటనే చికిత్సనందివ్వకపోతే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. మెడనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఇక్కడ కొన్ని న్యాచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Top 11 Home Remedies For Neck Pain To Ease Pain Naturally

1. ఐస్ ప్యాక్

మెడనొప్పి ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ కొంత వరకూ ఉపశమనం కలిగిస్తుంది. కోల్డ్ కంప్రెసర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒక టవల్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి చుట్టి, మెడకు అప్లై చేసి 15 నిముషాలు అలాగే ఉండాలి, తర్వాత రెండు మూడు గంటకొకసారి ఇలా చేస్తే నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

2. ఎప్సమ్ సాల్ట్

2. ఎప్సమ్ సాల్ట్

ఎప్సమ్ సాల్ట్ కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల మజిల్ టెన్షన్ తగ్గుతుంది, స్ట్రెస్, తగ్గి, మెడ నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఎప్సమ్ సల్ఫేట్ లో మెగ్నీషియం సాల్ట్ అధికంగా ఉండటం వల్ల ఇది న్యాచురల్ మజిల్ రిలాక్సెంట్ గా పనిచేస్తుంది, వాపు, నొప్పిని తగ్గిస్తుంది.

రెండు కప్పుల ఎప్సమ్ సాల్ట్ ను స్నానం చేసే నీటిలో కలపాలి. ఈ నీటితో మెడకు కాపడం కూడా పెట్టుకోవచ్చు. ఈ పద్దతిని రోజూ నొప్పి తగ్గే వరకూ రిపీట్ చేయవచ్చు.

3. హైడ్రో థెరఫీ

3. హైడ్రో థెరఫీ

మెడనొప్పి తగ్గించుకోవడానికి హైడ్రోథెరఫీ చాలా ఎఫెక్టివ్ రెమెడీ. ఈ పద్దతిని ఇంట్లోనే చేసుకోవచ్చు. నీటిని ఫోర్స్ గా మెడ మీద వదలడం వల్ల నొప్పి తగ్గుతుంది. కండరాల సలుపు తగ్గుతుంది.

వేడి నీటిని మెడ మీద పోసుకుని 30-60 సెకండ్స్ తర్వాత చల్లనీటినీ పోసుకోవాలి. లేదా మొదట వార్మ్ కంప్రెసర్, తర్వాత కోల్డ్ కంప్రెసర్ ను ఉపయోగించాలి.

4. యాపిల్ సైడర్ వెనిగర్

4. యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ లో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇవి మెడనొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గిస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ ను గోరువెచ్చని నీటిలో వేసి అందులో కాటన్ టవల్ డిప్ చేసి నెక్ మీద అప్లై చేయాలి. కొన్ని గంటలు పాటు టవల్ ను అలాగే ఉంచాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే మెడనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

5. మెడ వ్యాయామాలు

5. మెడ వ్యాయామాలు

కొన్ని చిన్న పాటి వ్యాయామాలు చేయడం వల్ల మెడనొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు. వ్యాయామం చేయడానికి ముందు కొద్దిగా వేడిగా కాపడం పెట్టుకోవాలి.

మొదట సర్క్యులర్ మోషన్ లో మెడను తిప్పాలి, క్లాక్ వైజ్ మరియు యాంటీక్లాక్ వైజ్ లా మెడను తిప్పాలి. తర్వాత పైకి క్రిందికి స్ట్రెచ్ చేయడం వల్ల మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి. అలాగే కుడివైపుకు, ఎడమవైపుకు కూడా తలను అటు, ఇటు తిప్పాలి.

6. ల్యావెండర్ ఆయిల్

6. ల్యావెండర్ ఆయిల్

వేగంగా నొప్పి తగ్గించుకోవడానికి ల్యావెండర్ నూనెను ఉపయోగిస్తుంటారు. మసాజ్ తెరఫీకి ఈ నూనెను ఉపయోగించడం చాలా మంచిది. కొద్దిగా ల్యావెండర్ నూనెను మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. పది నిముషాలు మసాజ్ చేసి, తర్వాత అలాగే వదిలేయాలి.

7. మసాజ్ థెరఫీ

7. మసాజ్ థెరఫీ

వార్మ్ మసాజ్ థెరఫీ బాడీపెయిన్స్ ను తగ్గిస్తుంది. అలాగే మెడదగ్గర కూడా సున్నితమైన మసాజ్ చేయడం వల్ల ఆ ప్రదేశంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆవనూనె లేదా కొబ్బరి నూనెను వేసి వేడి చేసి, మెడకు అప్లై చేసి మసాజ్ చేయాలి. కొన్ని నిముషాల పాటు సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేయాలి.

8. పసుపు

8. పసుపు

పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మెడనొప్పిని తగ్గిస్తాయి. పసుపు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, దాంతే నొప్పి త్వరగా తగ్గుతుంది.

ఒక టీస్పూన్ పసుపును ఒక గ్లాసు వేడి పాలలో వేసి, బాగా మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా తేనె కూడా కలిపి రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

9. అల్లం

9. అల్లం

అల్లం న్యాచురల్ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగినది, ఇది సర్క్యులేషన్ మరియు రక్తప్రసరణనుమెరుగుపరుస్తుంది. దాంతో మెడనొప్పి, వాపు తగ్గతుంది.

కొద్ది అల్లంను కట్ చేసి ఒక కప్పు నీటిలో వేసి వేడి చేయాలి. 10 నిముషాలు ఉడికిన తర్వాత వడగట్టి, తేనె కలిపి రోజులో రెండుమూడు సార్లు తాగాలి.

10. కేయాన్ పెప్పర్

10. కేయాన్ పెప్పర్

కేయాన్ పెప్పర్ లో క్యాప్ససిన్ అధికంగా ఉంటుంది. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు, అనాల్జిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.ఇది మెడనొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

ఒక టీస్పూన్ కేయాన్ పెప్పర్ పౌడర్ ను రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తో కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా మెడకు అప్లై చేయాలి. రోజులో రెండు మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

11. బ్లాక్ స్ట్రాప్ మొలాసెస్

11. బ్లాక్ స్ట్రాప్ మొలాసెస్

పోషకాల లోపం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. ముఖ్యంగా క్యాల్షియం లోపం మరియు పొటాషియం లోపం ఉన్నప్పుడు మెడనొప్పి వస్తుంది. బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ బెస్ట్ రెమెడీ. ఇందులో క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మజిల్ మరియు జాయింట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ ను ఒక గ్లాస్ వార్మ్ వాటర్ లో కలపాలి. దీన్ని రోజుకు రెండు సార్లు తాగితే మెడనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.


English summary

Top 11 Home Remedies For Neck Pain To Ease Pain Naturally

Neck pain results in a sharp or dull aching in the neck and the nearby muscles areas, especially in the shoulders. This can lead to headaches, numbness, tingling sensation, stiffness, difficulty in swallowing and swelling in the neck. The main cause of neck pain is muscle tension and strain that can be due to a poor posture, working at a
Desktop Bottom Promotion