For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విటమిన్ సి అధికంగా ఉండే మేటి 15 ఆహారపదార్థాలు

By Deepthi Tas
|

విటమిన్ సి నీటిలో కరిగే ఒక విటమిన్. ఇది శరీరం యొక్క కనెక్టివ్ కణజాలల ఆరోగ్యాన్ని సంరక్షించటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా.

విటమిన్ సి వివిధ గుండె జబ్బుల నుంచి, రోగ నిరోధక వ్యవస్థ లోపాల నుంచి, గర్భ సమయంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు , కంటి సమస్యలు మరియు ఆఖరికి చర్మం ముడతలుపడటం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.

విటమిన్ సి ను శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు, అందుకనే విటమిన్ సి లోపం చాలా సాధారణమైనది.

విటమిన్ సి లోపం యొక్క ముఖ్య కారణాలలో ఒకటి స్కర్వి. ఈ స్థితిలో మీకు చాలా అలసటగా, బలహీనంగా అన్పిస్తుంది. ఈ వ్యాధి మీ ఎముకల, కండరాల బలంపై ప్రభావం చూపి, రోగ నిరోధక వ్యవస్థ పట్టుతప్పేలా చేస్తుంది.

విటమిన్ సి లోపం లక్షణాలు మరియు వ్యాధులు ..విటమిన్ సి లోపం లక్షణాలు మరియు వ్యాధులు ..

ఆరోగ్య సమస్యలైన అధిక రక్తపోటు, గాల్ బ్లాడర్ వ్యాధి, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లు, ఎథిరో స్క్లెరోసిస్ వంటివన్నీ మీ శరీరంలో విటమిన్ సి తక్కువగా ఉంటే వస్తాయి.
అందుకని, విటమిన్ సి లోపం రాకుండా, విటమిన్ సి అధికంగా ఉండే మేటి 15 ఆహార పదార్థాల గురించి తెలుసుకోటానికి కింద చదవండి.

1. జామకాయ

1. జామకాయ

మంచి వాసనతో పండిన జామకాయలలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. 1 జామకాయలో 62.8 శాతం రోజువారీ కావాల్సిన విటమిన్ సి ఉంటుంది. అందుకని మీరు, ఈ రోజు ఒక జామకాయ తింటే, రేపు విటమిన్ సి గురించి కూడా ఆలోచించక్కర్లేదు.

2. పసుపు పచ్చ క్యాప్సికం

2. పసుపు పచ్చ క్యాప్సికం

పసుపు పచ్చ రంగు క్యాప్సికంలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఒక పెద్ద క్యాప్సికంలో 341 మి.గ్రాల విటమిన్ సి ఉంటుంది, దీన్ని తినటం వలన మీ రోగనిరోధక శక్తి పెరగటం మాత్రమే కాక, మీ భోజనం, వంటకాలు రంగురంగుల్లో అందంగా కన్పిస్తాయి.

3. కొత్తిమీర

3. కొత్తిమీర

కొత్తిమీరలో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. 1 కప్పు తాజా కొత్తిమీరలో 133 శాతం విటమిన్ సి ఉంటుంది. ఈ మొక్క మీ వంటకాలకి రుచిని మాత్రమే ఇవ్వటం కాక, మీ రోగ నిరోధకశక్తిని కూడా పెంచుతుంది. మీ రోజువారీ భోజనంలో కొత్తిమీరను కూడా చేర్చండి.

4. ఎర్ర క్యాప్సికం

4. ఎర్ర క్యాప్సికం

ఎర్ర క్యాప్సికంలో విటమిన్ సి ఉంటుంది. 1 కప్పు పచ్చి ఎర్ర క్యాప్సికంలో 317మి.గ్రాల విటమిన్ సి ఉంటుంది. ఎర్ర క్యాప్సికంలో ఉండే ఇతర విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉండటంతో అవన్నీ కలిసి మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

విటమిన్ సి లోపంతో పోరాడే అమేజింగ్ డైట్ ఫుడ్స్ ... విటమిన్ సి లోపంతో పోరాడే అమేజింగ్ డైట్ ఫుడ్స్ ...

5. కివి

5. కివి

రుచికరమైన పండు కివిలో అధికమైన విటమిన్ సి ఉంటుంది. ఒక కివి పండులో రోజుకి సరిపోయే విటమిన్ సి లో 273 మిల్లీగ్రాములు లభిస్తుంది. కివి తియ్యగా మరియు పుల్లగా ఉండి, మృదువుగా కన్పిస్తూ, విటమిన్ ఎ, పీచు పదార్థం, కాల్షియం మరియు ఇతర పోషకాలను కూడా కలిగి వుంటుంది.

6. బ్రొకోలి

6. బ్రొకోలి

బ్రొకొలీ ఆరోగ్యకరమైన కాయగూరల్లో ఒకటి మరియు ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 1 కప్పు పచ్చి బ్రోకోలిలో 135శాతం రోజుకి సరిపోయే విటమిన్ సి ని కలిగి ఉంటుంది. మీ స్మూతీల్లో లేదా ఇతర కూరల్లో బ్రొకోలీని జత చేయవచ్చు.

7.లిచీ

7.లిచీ

లిచి విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లలో ఒకటి, ఇది తియ్యగా, రసాలూరి ఉండటమేకాక, ఎంతో రుచిగా ఉండి, ఆరోగ్యకరమైనది కూడా. 100 గ్రాముల లిచీలో 71.5 మిగ్రాల విటమిన్ సి ఉంటుంది మరియు అధికంగా పొటాషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.

8. బొప్పాయి

8. బొప్పాయి

బొప్పాయిలో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. 1 కప్పు బొప్పాయిలో 144 శాతం రోజుకి సరిపోయే విటమిన్ సి ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, ఫోలేట్, పీచు, కాల్షియం, పొటాషియం మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.

9. స్ట్రాబెర్రీలు

9. స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 1 కప్పు స్ట్రాబెర్రీలలో 149 శాతం విటమిన్ సి ఉంటుంది. స్ట్రాబెర్రీలలో అధిక ప్రొటీన్ మరియు పీచుపదార్థం కూడా మంచిగానే ఉంటుంది. ఈ రుచికరమైన పండ్లను మీ సలాడ్లు, స్మూతీలు మరియు తీపి వంటకాలలో జత చేయటం వల్ల చాలా బాగుంటుంది.

10. ఆరెంజిలు

10. ఆరెంజిలు

కమలా పండ్లు విటమిన్ సి అత్యధికంగా ఉండే ప్రసిద్ధమైన పండ్లు. 1 పెద్ద కమలా పండులో 163 శాతం రోజుకి సరిపోయే విటమిన్ సి ఉంటుంది. మీరు కమలా పండ్లను పండ్ల సలాడ్లో, వ్రాప్ లలో జతచేయవచ్చు లేదా రసం తీసుకుని తాగవచ్చు.

చర్మంను కాంతివంతంగా మార్చే విటమిన్ సి ఫ్రూట్ ఫేస్ ప్యాక్ చర్మంను కాంతివంతంగా మార్చే విటమిన్ సి ఫ్రూట్ ఫేస్ ప్యాక్

11. నిమ్మ పళ్ళు

11. నిమ్మ పళ్ళు

నిమ్మ జాతి పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల నిమ్మకాయలో 53 మిగ్రాల విటమిన్ సి ఉంటే, నిమ్మ పండులో 29.1 మిగ్రాల విటమిన్ సి ఉంటుంది. ఈ పండ్లలో తక్కువ కాలరీలు మరియు సున్నా కొలెస్ట్రాల్ ఉంటాయి.

12. పైన్ ఆపిల్

12. పైన్ ఆపిల్

వేడి ప్రాంతాల్లో కాసే పైన్ ఆపిల్ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 1 కప్పు తాజా పైన్ ఆపిల్ పండులో 131 శాతం విటమిన్ సి ఉంటుంది. పైన్ ఆపిల్స్ లో విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం, పీచుపదార్థం కూడా ఎక్కువగానే ఉంటాయి.

13. కాలీఫ్లవర్

13. కాలీఫ్లవర్

కాలి ఫ్లవర్ క్యాబేజీ కుటుంబానికి చెందిన కాయగూర, ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 1 కప్పు పచ్చి కాలీఫ్లవర్ లో 77 శాతం విటమిన్ సి ఉంటుంది. కాలిఫ్లవర్ లో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ కె, పొటాషియం మరియు ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి.

14. ఉసిరి

14. ఉసిరి

దేశవాళీ ఉసిరికాయలు లేత ఆకుపచ్చ రంగులో ఉండి, రుచిలో పుల్లగా ఉంటాయి. వీటిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ఆమ్లాలో 27.7 మిగ్రాల విటమిన్ సి ఉంటుంది, ఇంకా విటమిన్ ఎ , పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు మరియు పీచు పదార్థం కూడా ఎక్కువగానే ఉంటాయి.

15. మామిడిపళ్ళు

15. మామిడిపళ్ళు

మామిడిపళ్ళు అందరికీ ఇష్టమైన వేసవి పండు, ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 1 కప్పు మామిడిపండులో 76 శాతం విటమిన్ సి ఉంటుంది. వీటిల్లో పీచుపదార్థం, ఖనిజ లవణాలు మరియు విటమిన్లు ఎక్కువగానే ఉంటాయి. రోజు విడిచి రోజు ఒక మామిడిపండు తినడం వలన మీ ఆరోగ్యానికి చాలా లాభకరంగా ఉంటుంది.

ఈ ఆర్టికల్ ను పంచుకోండి!

మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే, మీ దగ్గరివారితో షేర్ చేయండి.

ఆరెంజ్,నిమ్మఎక్కువగా తింటున్నారా?సైడ్ ఎఫెక్ట్స్ చూడండిఆరెంజ్,నిమ్మఎక్కువగా తింటున్నారా?సైడ్ ఎఫెక్ట్స్ చూడండి

English summary

Top 15 Foods Rich In Vitamin C

Vitamin C cannot be produced by the body on its own, so it is very common to have a vitamin C deficiency. Learn here about the foods that are rich in vitamin C.
Story first published:Monday, February 5, 2018, 12:05 [IST]
Desktop Bottom Promotion