For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపునొప్పిని తగ్గించే 5 ఇంటి మేటి చిట్కాలు, వీటిని మీరు ఊహించి ఉండరు!

కడుపునొప్పులు చాలా చికాకును కలిగిస్తాయి. ఎవరన్నా మిమ్మల్ని పొట్టలో గట్టిగా గుద్దినట్లు లేదా ఒక కత్తి పెట్టి మెలితిప్పినట్లు అన్పిస్తుంది. కడుపునొప్పి గ్యాస్, ఉబ్బరం, కడుపులో ఇన్ఫెక్షన్ లేదా యూటిఐలు

|

కడుపులో తిప్పటం లేదా నొప్పి ఎవరన్నా మిమ్మల్ని పొట్టలో గట్టిగా గుద్దినట్లు లేదా ఒక కత్తి పెట్టి మెలితిప్పినట్లు అన్పిస్తుంది, అవును కడుపునొప్పి అంత ఘోరంగా ఉంటుంది! కడుపునొప్పికి ఇక్కడ మేటి ఇంటి చిట్కాలు ఉన్నాయి చదవండి.

Top 5 Home Remedies For Relief From Stomach Ache,

కడుపునొప్పులు చాలా చికాకును కలిగిస్తాయి. ఎవరన్నా మిమ్మల్ని పొట్టలో గట్టిగా గుద్దినట్లు లేదా ఒక కత్తి పెట్టి మెలితిప్పినట్లు అన్పిస్తుంది. కడుపునొప్పి గ్యాస్, ఉబ్బరం, కడుపులో ఇన్ఫెక్షన్ లేదా యూటిఐలు ఇలా వేటివల్లనైనా రావచ్చు. అన్ని కడుపునొప్పులు ఇంత తీవ్రంగా ఉండవు, కానీ కొన్నిట్లో బాధ ఉంటుంది. మీరు తరచుగా పెయిన్ కిల్లర్ మింగుతూ ఉండవచ్చు కానీ ఎక్కువసమయం మందుల మీద బ్రతకలేరు, అక్కడే ఇంటి చిట్కాలు తెరపైకి వస్తాయి. అందుకే ఇక్కడే కడుపునొప్పి తగ్గించే మేటి 5 ఇంటిచిట్కాలను పొందుపరిచాం. చదవండి.
1.మాడిపోయిన టోస్ట్

1.మాడిపోయిన టోస్ట్

కడుపునొప్పికి టోస్ట్ చాలా మంచిదని అందరికీ తెలుసు. కానీ మాడిపోయిన టోస్ట్ మరింత మెరుగైన చిట్కా. కడుపులో మిమ్మల్ని ఇబ్బందిపెట్టే విషపదార్థాలను మాడిపోయిన టోస్ట్ లోని మసి పీల్చుకుంటుంది, మీరు దానిపై జెల్లీ రాసుకుని తింటే తినగలుగుతారు.

2.యాపిల్ సిడర్ వెనిగర్

2.యాపిల్ సిడర్ వెనిగర్

ఎక్కిళ్ళు మరియు గొంతునొప్పికి మాత్రమే కాక, ఆపిల్ సిడర్ వెనిగర్ కడుపునొప్పికి కూడా మంచి చిట్కాలా పనిచేస్తుంది. ఒక చెంచా యాపిల్ సిడర్ వెనిగర్ ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ఒక చెంచా తేనె కూడా జతచేయండి. దీన్ని తాగండి, ఇది మీ పాడైన కడుపును, అజీర్తిని తగ్గించి, నొప్పిని కూడా తగ్గించవచ్చు.

3.పెరుగు

3.పెరుగు

కడుపునొప్పిగా ఉన్నప్పుడు, మీకు ఏ పాల ఉత్పత్తి తినాలనిపించకపోవచ్చు. కానీ మమ్మల్ని నమ్మండి పెరుగు కడుపునొప్పికి చాలా మంచిది. ఒక కప్పు పెరుగు తింటే చాలు. పెరుగులో ఉండే ప్రోబయాటిక్ లక్షణాలు, బ్యాక్టీరియా మీ శరీర రోగనిరోధకశక్తిని పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వులేని సాధారణ పెరుగును ఏ ఫ్లేవర్ లేకుండా ఎంచుకుని మీ పొట్టకి ఉపశమనం ఇవ్వండి.

4.పెప్పర్ మింట్ టీ

4.పెప్పర్ మింట్ టీ

పెప్పర్ మింట్ టీ సహజంగా నొప్పిని తగ్గించే పదార్థం, దీన్ని వికారం, కడుపునొప్పి నుండి ఉపశమనానికి వాడతారు. మీరు ఒక కప్పు పెప్పర్ మింట్ టీ పెట్టుకుని తాగవచ్చు లేదా పెప్పర్మింట్ వాసన చూడవచ్చు లేదా కొన్ని పెప్పర్ మింట్ ఆకులను ఉపశమనానికి తినవచ్చు.

5.వాము విత్తనాలు, ఉప్పు/పంచదార మరియు గోరువెచ్చని నీరు

5.వాము విత్తనాలు, ఉప్పు/పంచదార మరియు గోరువెచ్చని నీరు

ఇది అంత ప్రసిద్ధమైన చిట్కా కాదు, మీరు దీన్ని విని ఉండరు. కానీ మమ్మల్ని నమ్మండి, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చెంచా వాము విత్తనాలను ఉప్పు లేదా పంచదారతో కలిపి గ్లాసుడు గోరువెచ్చని నీరుతో మింగేయండి. రెండు నిమిషాలలోనే మీ ఉబ్బరం తగ్గి, కడుపు నొప్పి తగ్గటం మొదలవుతుంది.

English summary

Top 5 Home Remedies For Relief From Stomach Ache

Stomach aches are so troubling. A strange disturbance that you feel in your abdomen like someone just kicked you really hard or twisted a knife in your stomach. The abdominal pain can be due to any reason like gas, bloating, stomach infection or UTIs. Not all stomach aches are this bad, but yes some tend to be very distressing.
Story first published:Tuesday, February 13, 2018, 21:35 [IST]
Desktop Bottom Promotion