For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ లైంగిక పటుత్వాన్ని పెంచే 10 ఉత్తమమైన విటమిన్లు మరియు ఖనిజాలు

By Chaitanyakumar Ark
|

ప్రత్యేకంగా కొన్ని విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉన్న ఆహారాలను మీ ఆహార ప్రణాళికలో చేర్చుకోవడం ద్వారా, మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో సహాయపడుతుందని చేస్తుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాసంలో మీ లైంగిక శక్తిని పెంచుకోవడానికి సహాయపడే ఆ పోషకాల గురించి పొందుపరచబడినది.

అనేక అధ్యయనాల ప్రకారం, మీరు తీసుకునే ఆహారం మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ ప్రధాన పాత్రను పోషిస్తుంది, ప్రధానంగా జీవక్రియలు, ఆలోచనా విధానం, సంబంధం మొదలైనవి. ముఖ్యంగా మొక్క ఆధారిత ఆహారాలను మీ ఆహార ప్రణాళికలో జోడించడం ద్వారా, మీ లైంగిక పటుత్వం అభివృద్ధి చెందుతుందని చెప్పబడింది. ఇది మీ శరీరానికి సహజ సువాసనలను ఇస్తుంది క్రమంగా మీ భాగస్వామిని ఆకర్షిస్తుంది. మృదువైన చర్మం కలిగి ఉండేలా సహాయపడుతుంది, పురుషాంగంలో రక్తప్రవాహం పెరుగుతుంది మరియు మహిళల్లో లైంగిక ఉత్సుకతను పెంచుతుంది, సహజ సిద్దమైన లూబ్రికెంట్ స్థాయిలను పెంచుతుంది మరియు మీశరీరంలో శక్తిని ప్రోత్సహిస్తుంది.

Vitamins and Minerals To Improve Your Libido

మొక్క ఆధారిత ఆహారాలు శరీరంలో హిస్టామిన్స్ విడుదలకు దోహదం చేయడమే కాకుండా జననావయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా స్త్రీ పురుషులిద్దరిలోనూ లైంగిక అసౌకర్యం లేకుండా చేయగలదని అనేక పరిశోధనలు కనుగొన్నాయి కూడా. దీనికి కారణం ఆహారాలలోని విటమిన్లు మరియు ఖనిజాలు, జీవక్రియలను సక్రమంగా జరిగేలా చేసి, శరీరానికి అవసరమైన శక్తిని అందివ్వడం ద్వారా లైంగిక శక్తిని ప్రోత్సహించడమే అని ఆహార నిపుణులు చెప్తున్నారు. క్రమంగా లైంగిక సంబంధాన్ని ప్రోత్సహించడంలో అత్యంత కీలక పాత్రను పోషిస్తాయని, ముఖ్యంగా లైంగిక హార్మోన్ల విడుదలకు మద్దతును అందిస్తాయని సూచిస్తున్నారు.

మీ లైంగిక పటుత్వానికి దోహదపడే టాప్ 10 విటమిన్లు మరియు ఖనిజాల గురించిన వివరాలు మీకోసం.

ఐరన్

ఐరన్

మీ లైంగిక పటుత్వాన్ని, పునరుద్ధరించడానికి దోహదపడే మరో ముఖ్యమైన ఖనిజం ఐరన్. మీ శరీరకణాలకు ప్రాణవాయువు సరఫరా చేయడానికి ఐరన్ ఖచ్చితంగా అవసరం. మీరు ఐరన్ లోపాన్ని కలిగి ఉంటే, క్రమంగా, మీ లిబిడో ఆరోగ్యస్థాయిలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి. ఇది తక్కువ లైంగిక ప్రేరేపణలకు, సహజ సిద్దమైన లూబ్రికెంట్స్ స్థాయిల తగ్గుదలకు, క్రమంగా నిస్తేజానికి దారితీస్తుంది. ఎక్కువగా టోఫు, కాయధాన్యాలు, బీన్స్, ఆకుకూరలు వంటి వాటిలో ఐరన్ నిల్వలు అధికంగా ఉంటాయి.

జింక్

జింక్

మీ ఆహారంలో జింక్ లోపం, వంధ్యత్వానికి మరియు లైంగిక కోరికలను కోల్పోయేలా చేస్తుంది. ఈ ఖనిజం యొక్క లోపం రక్తంలో తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలకు కారణమవుతుంది. ఒక రోజులో కనీసం 30 మిల్లీగ్రాముల జింక్ నిక్షేపాలను ఆహారం ద్వారా తీసుకున్న పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగాయని ఒక పరిశోధనలో తేలింది. మీ లైంగిక ఆరోగ్యం, సెక్స్ డ్రైవ్ వంటివి ఆరోగ్యకర రీతిలో కొనసాగుటకు బీన్స్, చిక్కుళ్ళు, కాయధాన్యాలు, తృణధాన్యాలు వంటివి ఆహార ప్రణాళికలో చేర్చుకోవలసి ఉంటుంది.

విటమిన్-ఎ

విటమిన్-ఎ

ఈ విటమిన్ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయం చేస్తుంది. ఇది పురుషుల ప్రధాన సెక్స్ హార్మోన్. లైంగిక పటుత్వానికి అత్యవసరమైన పోషకాలలో విటమిన్-ఎ ఒకటి. స్త్రీలలో పునరుత్పాదక చక్రం క్రమంలో విటమిన్-ఎ కూడా ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటుంది. క్యారట్లు, చిలగడదుంపలు, గుమ్మడికాయ మరియు ఆకుపచ్చని ఆకుకూరలు వంటివాటిలో ఈ విటమిన్ -ఎ స్థాయిలు అధికంగా ఉంటాయి.

Most Read: వద్దూవద్దంటే శృంగారంలోకి దింపాడు, ఒక్కసారి పాల్గొందామంటూ బుగ్గలు గిల్లేవాడు

 విటమిన్ ఇ

విటమిన్ ఇ

మీకు విటమిన్ -ఇ ని 'సెక్స్ విటమిన్' అని పిలుస్తారని తెలుసా ? మీ జననేంద్రియాలకు రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ అందించడంలో, క్రమంగా మీ సెక్స్ డ్రైవ్ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది విటమిన్ -ఇ. కొన్ని అద్యయనాలలో, విటమిన్ -ఇ రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా, గణనీయంగా మోతాదును పెంచి తీసుకున్న పురుషులలో ఆరోగ్యకరమైన వీర్యవృద్ది మరియు వీర్యకణాల సంఖ్య పెరగడం గమనించారు. చిలగడదుంపలు, పాలకూర, ఆస్పరాగస్ మరియు చిక్పీస్ వంటి ఆహారాలలో అధికంగా విటమిన్-ఇ నిల్వలు ఉంటాయి.

సెలీనియం

సెలీనియం

సెలీనియం లేకపోవడం అంగస్తంభన సమస్యలను కలిగిస్తుంది. సెలీనియం యొక్క లోపం ప్రధానంగా వీర్య కణాల వృద్ది తగ్గడం, నిస్సత్తువ మరియు వంద్యత్వ సమస్యలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి పురుషులు ఆహారంలో సెలీనియం ఉండేలా చూసుకోవడం ముఖ్యం. సెలీనియం అధికంగా ఉండే ఆహారాలుగా పింటో/లైమా బీన్స్, వైట్ బటన్ పుట్ట గొడుగులు, బ్రొకోలీ, బచ్చలి కూర మరియు చియా విత్తనాలు ఉన్నాయి.

విటమిన్ సి

విటమిన్ సి

మందరికీ విటమిన్ సి సాధారణంగా జలుబును తగ్గించగలదని తెలుసు, కానీ ఈ విటమిన్ అంతకన్నా ఎక్కువ పనితీరును కలిగి ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్, ఆండ్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ వంటి లైంగిక మరియు సంతానోత్పత్తి హార్మోన్లు సంశ్లేషణ చెందడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ఉన్న సిట్రస్ ఫలాలు, కొన్ని మొక్క ఆధారిత ఆహారాలైన పాలకూర, బ్రొకోలీ, బ్రస్సెల్స్ మొలకలు మొదలైనవి ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

Most Read: B అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి వ్యక్తిత్వ వికాస లక్షణాలు

విటమిన్ బి3

విటమిన్ బి3

విటమిన్ బి3 లేదా నియాసిన్ మీ లైంగిక పటుత్వాన్ని మరియు లైంగిక శక్తిని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా జననేంద్రియాలకు రక్త ప్రసరణను పెంచే వాయురహిత జీవక్రియలను సజావుగా జరిగేలా బాధ్యత వహిస్తుంది. లైంగిక హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి మరియు లైంగిక స్రావాలను పెంచడానికి విటమిన్ బి3 ఎడ్రినల్ గ్రంధుల చర్యలకు కూడా సహాయపడుతుంది. విటమిన్ బి3 యొక్క మంచి మూలాలుగా పుట్టగొడుగులు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు మరియు బంగాళా దుంపలు ఉన్నాయి.

విటమిన్ బి6

విటమిన్ బి6

ఈ విటమిన్ బి6, ప్రోబ్టాక్టిన్ అధిక స్థాయిలని నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్, సెరోటోనిన్, ఎర్ర రక్త కణాలు మరియు డోపమైన్ ఉత్పత్తిని క్రమబద్దీకరిస్తుంది. అవోకాడోస్, కాల్చిన బంగాళాదుంపలు, కాటేజ్ చీజ్ మరియు టమోటాలు విటమిన్ బి6 యొక్క మంచి వనరులుగా ఉన్నాయి.

మెగ్నీషియం

మెగ్నీషియం

మెగ్నీషియం, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ మరియు లైంగిక వాంఛలను క్రమబద్దీకరించగలిగే ఎపినెఫ్రైన్ మరియు డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ హార్మోన్లను పెంచడానికి సహాయపడే మరో ఖనిజంగా ఉంది.

బచ్చలి కూర, బ్రొకోలీ, కాలే వంటి ఆకుపచ్చని ఆకుకూరలను తీసుకోవడం ద్వారా, దీనిలోని మెగ్నీషియం లైంగిక ఉద్రేకాన్ని పెంచగలుగుతుందని సూచించడమైనది. క్రమంగా లైంగిక సంబంధం నందు నిస్సత్తువ లేకుండా సంతృప్తి స్థాయిలను పెంచగలదు.

జపనీస్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, ఆకుపచ్చని ఆకుకూరలలో మెగ్నీషియం రక్తనాళాలను ఆరోగ్యకరరీతిలో నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జననాంగాలలో రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా స్త్రీ పురుషుల లైంగిక పటుత్వానికి దోహదం చేయగలదు.

Most Read: ఈ రాశుల్లో మీ రాశి ఉంటే.. 2018లో మీ దశ తిరిగిపోద్ది!

 నైట్రేట్స్

నైట్రేట్స్

బీట్రూట్, బచ్చలి కూర, సెలెరీ, పాలకూర, పార్స్లీ, దుంప కూరలు, కొల్లార్డ్ గ్రీన్స్ మొదలైన వాటిలో పుష్కలంగా నైట్రేట్లు కనిపిస్తాయి. అయినప్పటికీ, మీరు ఈ కూరగాయలను తీసుకునే క్రమంలో, నైట్రేట్లు, శరీరంలోని జీవక్రియల కారణంగా నైట్రిక్ ఆక్సైడ్గా మారడం జరుగుతుంది.

మరియు ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను తెరవగలిగే శక్తిని కలిగి ఉంటుంది, క్రమంగా కార్పస్ కావెర్నొసం, రక్తనాళాలలో సమృద్ధిగా ఉన్న స్పాంజ్ వంటి పురుషాంగ కణజాలంలో ఒత్తిడిని నిర్వహించడానికి ఒక "వాసోడైలేటర్" వలె పనిచేస్తుంది అని పరిశోధన పేర్కొంది. కార్పస్ కావెర్నోసం పురుషాంగానికి ఉపశమనం ఇవ్వడంతో పాటు, ఆరోగ్యకర రీతిలో పురుషాంగాన్ని రక్తంతో నింపడానికి కారణమవుతుంది. క్రమంగా అంగస్తంభన ఏర్పడుతుంది.

English summary

Vitamins and Minerals To Improve Your Libido

Researchers have found that certain plant-based diets can increase orgasms in both females and males by getting the body ready or increasing the blood flow to the sex organs. These foods contain vitamins and minerals that are considered good for sexual stamina. They play a very important role in stimulating sex drive and provide support to the sex hormones as well.
Story first published: Monday, September 24, 2018, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more