For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రియమైన వారి చేతిని అందుకోవడంలో గల అంతరార్థం ఏంటి?

ప్రియమైన వారి చేతిని అందుకోవడంలో గల అంతరార్థం ఏంటి?

|

ప్రేమ అనేది ఒక గొప్ప అనుభూతి. స్వచ్ఛమైన ప్రేమను పొందడం ఒక వరం. జీవితంలోని నిజమైన ప్రేమను కనుగొనడం ఎంతో కష్టమైన విషయం. నిజమైన ప్రేమ కల్ముషం లేనిది. నిజమైన ప్రేమ ఏమీ కోరదు. ఏరేంజ్డ్ మ్యారేజ్ ద్వారానైనా లేదా ఏదైనా రొమాంటిక్ రిలేషన్ షిప్ లో నైనా మీరు ప్రేమను కనుగొన్నప్పుడు మొదటి రోజు నుంచే మీరు మీ ఛాయిస్ సరైనదా కాదా అన్న కంక్లూజన్ కి రాలేరు.

కాలంతో పాటు బంధాలు పటిష్టమవుతాయి

కాలంతో పాటు స్త్రీపురుషుల బంధం మరింత పటిష్టమవుతుంది. మీ భర్త/భార్య ఒక రోజు చాలా హంబుల్ గా అలాగే లాయల్ గా కనిపించినా ఆ మరుసటి రోజు మీకు పూర్తిగా వ్యతిరేకంగా కనిపించిన సందర్భాలు మీరు గమనించే ఉంటారు. రిలేషన్ షిప్ అనేది ఎంతో సున్నితమైనది. కొన్నిసార్లు, రిలేషన్షిప్ లోని పార్ట్నర్స్ ఎంతో పొసెసివ్ గా వ్యవహరిస్తారు కూడా.

What Does Holding A Loved Ones Hand Do To You?

కాబట్టి, సాధారణంగానే స్త్రీపురుషుల మధ్యనున్న ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ను ప్రత్యేకమైన రిలేషన్ షిప్ గా పేర్కొంటారు. అబ్బాయి మరియు అమ్మాయి మధ్య నున్న స్పెషల్ రిలేషన్షిప్ లేదా భర్త మరియు భార్య మధ్యనున్న రిలేషన్షిప్ లో రెస్పెక్ట్ తో కూడింగ్ బాండేజ్ ఉండాలి. ముఖ్యంగా, ఇద్దరి మధ్యన మ్యూచ్యువల్ ట్రస్ట్ ఉండాలి.

ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, ఈ రెస్పెక్ట్ అన్నది కాలంతో పాటు క్రమేపీ పెరుగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇది క్రమేపీ తగ్గిపోవచ్చు కూడా. మానవ సంబంధాలలో సెన్సిటివిటీ మార్జిన్ అనేది హెచ్చుతగ్గులకు గురవడం సాధారణం. రిలేషన్షిప్ స్మూత్ గా సాగుతోంది అనుకున్నంతలో ఎదో ఒక అలజడి ప్రారంభమవడం కూడా సహజం. రిలేషన్ షిప్ ను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ ముఖ్య పాత్ర పోషించాలి.

పరిస్థితులు ఏమైనా ప్రియమైన వారి చేతిని ప్రేమతో అందుకోవడం అనేది అత్యంత సంతృప్తిని అందిస్తుంది. ఈ విషయాన్ని మీరు కూడా గుర్తించే ఉంటారు.

What Does Holding A Loved Ones Hand Do To You?

మీ ప్రియమైన వారి చేతులను అందుకోవడం మీకెలాంటి అనుభూతిని ఇస్తుంది?

ప్రియమైన వారి చేతిని అందుకోవడంలో గల సంతోషం వర్ణనాతీతం. ప్రియమైన వారి చేతిని అందుకోగానే ఈ ప్రపంచంలోనున్న అన్ని రకాల ఆనందాలు తమ చేతులలోకి వచ్చేశాయన్న భావన వస్తుంది. శరీరంలోని ఎన్నో భాగాలు ప్రియమైన వారి స్పర్శతో సెన్సేషన్ కు గురవడం సహజమే. అయితే, చేతిని అందుకోవడంలో నున్న ప్రత్యేకమైన ఫీలింగ్ కి ఇవేమీ సాటి రావు.

ప్రేమకు చెందిన నిజమైన అనుభూతి మీకు లభిస్తుంది. మీ పార్ట్నర్ చేతిని మీరు అందుకోగానే, మీకు మీ పార్ట్నర్ మాత్రమే సర్వస్వము అన్న భావన కలుగుతుంది. స్నేహితులు ఎక్కువ మంది ఉన్నా కూడా మీ ప్రియమైన వారే మీకు ఒక ఫిలాసఫర్ గా ఆలాగే ఒక గైడ్ గా దర్శనమిస్తారు. మీ ప్రియమైన వారి సన్నిధిలో జీవితాన్ని గడిపేయాలని భావిస్తారు. వారిని పూజించాలని కూడా మీకు అనిపిస్తుంది.

What Does Holding A Loved Ones Hand Do To You?

ప్రియమైన వారి చేతిని అందుకోవడం వలన కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు:

ప్రియమైన వారు మీ చేతిని అందుకోగానే మీకు అప్పటి వరకు ఉన్న పెయిన్స్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అత్యంత సౌకర్యం కలుగుతుంది. బాధకు గురవుతున్న పార్ట్నర్ చేతిని అందుకోవడం వలన ఆ వ్యక్తికి అత్యంత ధైర్యం లభిస్తుంది. తమకంటూ ఒక మనిషి ఉన్నారన్న సంతృప్తి లభిస్తుంది. హార్ట్ మరియు రెస్పిరేటరీ రేట్స్ సింక్ అవడం ద్వారా వారి పెయిన్ అనేది అత్యంత వేగవంతంగా తగ్గుముఖం పడుతుంది.

బాధ అనేది శారీరకమైనది కావచ్చు లేదా ఎమోషనల్ కావచ్చు. ప్రియమైన వారిని అందుకోవడం వలన భద్రతా భావం ఏర్పడుతుంది. ఎటువంటి సమస్యలనైనా అధిగమించవచ్చన్న భావన లభిస్తుంది. ఒక వేళ మీ పార్ట్నర్ ఆఫీస్ ఒత్తిడులతో సతమతమవుతున్నా లేదా ఏదైనా విషయంలో దిగులు చెందుతున్నా మీరు మీ పార్ట్నర్ చేతిని అందుకోండి. అప్పుడు, మీ పార్ట్నర్ దిగులు తగ్గడం ప్రారంభమవుతుంది. ప్రియమైన వారి చేతిని అందుకోవడం వలన సూతింగ్ ఎఫెక్ట్ లభిస్తుంది. వారికి సాంత్వన లభిస్తుంది.

What Does Holding A Loved Ones Hand Do To You?

తమ కోసం ఒక వ్యక్తి ఉన్నారన్న సంగతి ఎంతో ధైర్యాన్నిస్తుంది. తమ ప్రియమైన వారు తమకి అన్నిరకాల పరిస్థితులలో అండగా ఉంటారన్న ధైర్యం ఎంతో సాంత్వనని కలిగిస్తుంది. ప్రేమికులు ఒకరికొకరు అరచేతులను ప్రెస్ చేస్తూ ఉంటే సాంత్వన చేకూర్చే భావనలు సొంతమవుతాయి. అన్ని రకాల ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందినట్టు వారు భావిస్తారు. ప్రపంచమంతా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ప్రియమైన వారి చేతిని అందుకోవడం ద్వారా వారికి ప్రేమను, భద్రతా భావాన్ని అలాగే అభయాన్ని అందించిన వారవుతాము. ఆప్యాయతను ప్రదర్శించడానికి ప్రియమైన వారి చేతిని అందుకోవడం ఉపయోగపడుతుంది. ఇది మీ ఆరోగ్యానికి కూడా మంచిదే.

ప్రియమైన వారి చేతిని అందుకోవడం వలన కలిగే ఫలితాల గురించి తెలియచేసిన స్టడీ రిపోర్ట్స్

ప్రియమైన వారి చేతిని అందుకోవడం వలన శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఇటీవలి స్టడీ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది.

ప్రసవం సమయంలో భార్య చేతిని భర్త అందుకున్నప్పుడు భార్యకు ప్రసవ వేదనను అధిగమించే శక్తి లభిస్తుందని సైంటిఫిక్ స్టడీస్ స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు ఒకరి చేతులను ఒకరు పట్టుకున్నప్పుడు వారి బ్రీతింగ్ తో పాటు వారి హార్ట్ రేట్ పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే, వారి బ్రెయిన్ వేవ్స్ సింక్రనైజ్ అవుతాయి. ఎంతగా ఎదుటి వ్యక్తితో సహానుభూతి పొందుతామో అంతగా వారి బ్రెయిన్ వేవ్స్ సింక్ అవడం జరుగుతుంది. వారి బాధ తగ్గుతుంది.

ప్రియమైన వారి చేతులను అందుకోవడం అనేది రిలీఫ్ బామ్ లా పనిచేస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇది ప్రేమను వ్యక్తీకరించడానికి ఉపయోగపడే గెస్చర్ అని స్టడీస్ వెల్లడిస్తున్నాయి. ప్రేమను వ్యక్తపరచి ఎదుటి వ్యక్తికి భరోసాను అందివ్వడానికి ఉపయోగపడుతుందని తెలుస్తోంది. తద్వారా, మనసులోని బాధ మటుమాయం అవుతుందని తెలుస్తోంది.

ప్రియమైన వారి చేతులను అందుకోవడంతో కలిగే భావన అనిర్వచనీయం. ఈ విషయంలో మీ అభిప్రాయమేంటి?

English summary

What Does Holding A Loved Ones Hand Do To You?

We know that our touch can trigger various sensations, but it has been scientifically proven that holding hands of our partner gives various positive effects. It calms us down when we are in pain; be it physical or emotional. It aids in syncing heart and respiratory rates. It aids in overcoming anxiety and in curbing pain.
Desktop Bottom Promotion