For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తలగడ (పిల్లో) లేకుండా నిద్రపోతే ఏమి జరుగుతుంది ?

|

మనము నిద్రపోతున్నప్పుడల్లా దిండ్లు అవసరమని మనకి తెలుసు. కొందరు నిద్రిస్తున్నప్పుడు తమ తల పెద్ద దిండ్లను ఉపయోగిస్తారు. కానీ, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దిండుతో పడుకోవాలా (లేదా) దిండు లేకుండా పడుకోవాలా? వీటిలో ఏది సరైనది ? మీలో చాలా వరకు అత్యంత సముచితమైన జవాబును కలిగి ఉండవచ్చు - మీరు ఒక దిండును ఉపయోగించేందుకు గల ప్రధాన కారణం మీ తల, మెడ & వెన్నెముకను సరైన క్రమంలో సౌకర్యవంతంగా ఉంచడం.

మీరు నిటారుగా నడిచినప్పుడు, తల & మెడ అనేవి వెన్నెముక ఎగువ భాగంలో నిలువైన సమలేఖనంలో ఉండటానికి సంక్లిష్టమైన కండరాలను కలిగి ఉంటాయి. అయితే, అలా మిమ్మల్ని నిలబెట్టుకునే కండరాలు నిద్రావస్థలో ఉన్నప్పుడు మాత్రం, మీ తల భాగంలో ఉన్న కండరాలు ముందుకు (లేదా) వెనకకు వాలి విశ్రాంతి తీసుకుంటాయి.

అలాంటి సమయంలో మీరు ఉపయోగించే దిండ్లు, మీ వెన్నెముకతో సమానంగా మీ తలను, మెడను ఉంచేవిగా చేస్తాయి. కానీ కొన్నిసార్లు మీరు మెడనొప్పితో మేలుకోవచ్చు, దానికి కారణం మీరు వాడిన దిండుల వలన కావచ్చు.

What Happens If You Dont Sleep With A Pillow

మీరు దిండు లేకుండా ఎందుకు నిద్రపోతున్నారనేందుకు అనేక కారణాలు ఉన్నాయి. మీరు ఒక దిండుతో నిద్ర పోకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకోండి ఈ క్రింది విషయాలను తప్పక చదవండి.

దిండుతో నిద్రపోకుండా ఉండటం వల్ల మీ మెడకు & వెన్నుకు కలిగే ప్రయోజనాలు !

దిండుతో నిద్రపోకుండా ఉండటం వల్ల మీ మెడకు & వెన్నుకు కలిగే ప్రయోజనాలు !

దిండ్లు లేకుండా పడుకోవడం వల్ల మీ వీపు భాగాన్ని పొడిగించడంలో సహాయం చేస్తుంది, అలాగే మీరు ఏదైనా నొప్పులతో (లేదా) అనారోగ్య పరిస్థితుల వంటివి లేకుండా సహజ స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి. మృదువైన దిండును ఉపయోగించి మీ మెడ కండరాలను వక్రీకరించడమే కాకుండా మీ తల భాగంలో సరఫరా అయ్యే రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది.

పడుకునేటప్పుడు మీరు వాడే దిండు మీకు తలను కిందకు వంచి సరైన సపోర్టును ఇవ్వకపోయినట్లయితే, అప్పుడు మీ శ్వాస వ్యవస్థ ద్వారా జరిగే వాయుప్రసరణ గణనీయంగా తగ్గింది. దీని కారణంగా, మరుసటి రోజు ఉదయాన్నే మీరు తలబరువు (లేదా) తీవ్ర తలనొప్పితో మేల్కొంటారు.

మరొక వైపు, ఒక మందపాటి దిండును (లేదా) 2-3 దిండ్లను మీ తల, మెడ కింద ఉపయోగించడం వల్ల మీ వెన్నెముక స్థితిలో అసమానతలు చోటుచేసుకుని మీకు వెన్ను నొప్పిని ప్రేరేపిస్తాయి. మీరు ఎక్కువ కాలం ఇదే స్థితిలో పడుకోవడం వల్ల దీర్ఘకాలిక నొప్పులు మిమ్మల్ని వెంటాడతాయి, అలాగే మీ కండరాలు తరచుగా ఎక్కువగా శ్రమపడటానికి కారణమవుతుంది.

మీరు ఉదయాన్నే మేల్కొన్నప్పుడు ఇలాంటి బాధలను అనుభవిస్తే గనుక, ఈ రకంగా దిండ్లను ఉపయోగించడం వెంటనే మానుకోండి. దిండ్లను ఏమాత్రం ఉపయోగించకుండా ఒక రాత్రి నిద్రించడానికి ప్రయత్నం చెయ్యండి, అలా మీ మెడ నొప్పి పోయిందా / లేదా అని ఒక్కసారి చూసుకోండి.

మెడ & వెన్ను కండరాలు సుదీర్ఘకాలం పాటు

మెడ & వెన్ను కండరాలు సుదీర్ఘకాలం పాటు

మెడ & వెన్ను కండరాలు సుదీర్ఘకాలం పాటు అధిక ఒత్తిడికి గురవుతున్నప్పుడు, ఆ నొప్పులు దీర్ఘకాలిక నొప్పులుగా మారుతాయి. అలా మిమ్మల్ని నిరంతరముగా వెంటాడే నొప్పులను వదిలించుకోవటానికి మీరు వెంటనే ఆరోగ్య నిపుణుల సహాయం పొందుతూ, మీ నిద్రపు అలవాట్లను మార్చుకోవాలి. అలాంటి విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు మీరు సరైన నిద్రావస్థను కలిగి ఉండలేరు, తరచుగా నిద్రలో నడుస్తారు & మంచంపై మీ స్థానాన్ని తరచుగా మారుస్తూ ఉంటారు.

పైన చెప్పిన ఈ లక్షణాలన్ని నిద్రలేమికి దారితీస్తుంది & అలాగే అవి మీలో ఒత్తిడులను, ఆందోళనను పెంచేవిగా ప్రేరేపిస్తాయి. మీరు ఉదయాన్నే మేల్కొన్నప్పుడు, మీ శరీరమును అసౌకర్యానికి గురి చేస్తుంది.

దిండు లేకుండా పడుకోవడం వల్ల మీ ముఖ సౌందర్యానికి సహాయపడుతుంది :-

దిండు లేకుండా పడుకోవడం వల్ల మీ ముఖ సౌందర్యానికి సహాయపడుతుంది :-

దిండుపై నిద్రపోతున్నప్పుడు, ముఖము ఇరువైపులా నలగటం వల్ల, అది రక్త ప్రసరణను నిలిపివేస్తుంది. అలాగే మీ ముఖచర్మం గంటల తరబడి దిండు మీద ఒత్తిడి పొందినందువల్ల ఎలాంటి లాభం కలగదు. దిండు మీద, మీ ముఖం నొక్కబడినప్పుడు, మీరు ఊపిరి తీసుకునేటప్పుడు పీల్చే గాలిని నిరోధిస్తుంది. అలాగే ఇది మీ ముఖ చర్మ రంధ్రాల పై గాలికి సోకనివ్వకుండా నిరోధిస్తుంది. అందువల్లనే ముఖంపై, ముఖ్యంగా వేసవికాలంలో మీ ముఖం మీద చమటను & శ్లేష్మము ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఆ దిండ్లపై ఉన్న దుమ్ము & మలినాలను మీ ముఖంతో కలిపారు.

వెన్నునొప్పిని నివారించేలా, దిండు లేకుండా పడుకోవటం ఎలా ?

వెన్నునొప్పిని నివారించేలా, దిండు లేకుండా పడుకోవటం ఎలా ?

మీరు రాత్రివేళలో మందపాటి దిండుతో నిద్రపోతున్నప్పుడు, అది మీ వెన్నెముక స్థానాన్ని మారుస్తుంది దాని ఫలితంగా తరువాతి రోజు మీరు నొప్పిని అనుభవించవచ్చు. దిండు లేకుండా పడుకోవడం ఒక్కటే వెన్నునొప్పి నివారించడానికి ఉత్తమమైన చికిత్స.

మీరు దిండు లేకుండా నిద్రించడం వల్ల, మీ వెన్నెముక సహజ వక్ర స్థితిని కలిగి, మీ శరీరమంతటికీ విశ్రాంతిని కలుగజేస్తుంది. ఇది కూడా మెడ నొప్పిని తగ్గిస్తుంది.

మరి నిపుణులు ఏమి చెబుతారు?

మరి నిపుణులు ఏమి చెబుతారు?

ఆరోగ్య నిపుణుల ప్రకారం, దిండు లేకుండా మంచం మీద పడుకోవడం మీ శరీరానికి సహజంగానే మంచిదని అంగీకరించారు. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం, దిండు లేకుండా నిద్రించడం వల్ల మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచి, మీ శరీరాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది అని వెల్లడించారు. ఒక దిండు లేకుండా నిద్రించడం వల్ల మీ వెన్నెముక & మెడ ఎముకలను గట్టిగా చేస్తుంది.

English summary

What Happens If You Don't Sleep With A Pillow

What Happens If You Don't Sleep With A Pillow,Does sleeping without a pillow has benefits? Read here to know what happens if you don't sleep with a pillow.
Story first published:Wednesday, April 18, 2018, 17:37 [IST]
Desktop Bottom Promotion