For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ బొప్పాయిని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతిరోజూ బొప్పాయిని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

|

బొప్పాయి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం మరియు రోగనిరోధకశక్తిని పెంపొందించడంతో పాటు చర్మానికి అలాగే శిరోజాలకు పోషణని అందించేందుకు బొప్పాయి ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ప్రతి రోజు ఒక బొప్పాయి స్లైస్ ను తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయిని రోజు వారి డైట్ లో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఫ్రూట్ లో ఫాస్ఫరస్, కాపర్, పొటాషియం, ఐరన్, కేల్షియం, మ్యాంగనీజ్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభ్యమవుతాయి.

Benefits Of Eating Papaya Daily

బొప్పాయిలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ ఏ, బయో ఫ్లేవనాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. బొప్పాయిలో లభ్యమయ్యే షుగర్ ను సులభంగా శరీరం గ్రహిస్తుంది. తద్వారా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

అంతేకాక, బొప్పాయిలో కేలరీలు తక్కువగా లభిస్తాయి. ముఖ్యమైన హెల్త్ ఫంక్షన్స్ సజావుగా జరిగేందుకు ఇందులో తగినన్ని ఎంజైమ్స్ లభిస్తాయి.

ప్రతి రోజూ ఒక బొప్పాయి స్లైస్ ను తీసుకోవడం ద్వారా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

1. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

బొప్పాయిలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ ఫ్రూట్ ను భోజనం తరువాత తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. అలాగే, ఇందులో లభించే ఫైబర్ అనేది మలబద్దకాన్ని అరికడుతుంది. బొప్పాయిని ఒక సెర్వింగ్ తీసుకుంటే రోజువారీ డైటరీ ఫైబర్ రిక్వయిర్మెంట్ ను మీట్ అవగలుగుతారు. తద్వారా, శరీర పనితీరు మెరుగ్గా ఉంటుంది. ప్రతి రోజూ బొప్పాయి స్లైస్ ని తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ డీటాక్స్ అవుతుంది. బౌల్ మూవ్మెంట్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి.

2. ఇంఫ్లేమేషన్ తగ్గుతుంది:

2. ఇంఫ్లేమేషన్ తగ్గుతుంది:

బొప్పాయిలో పపైన్ మరియు కైమోపపైన్ అనే ఎంజైమ్స్ కలవు. ఇవి యాంటీ ఇంఫ్లేమేటరీ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి. అలాగే, ఇవి దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ ఎంజైమ్స్ అనేవి ర్యుమటాయిడ్ ఆర్తరైటిస్, ఎడెమా వంటి ఇతర ఇంఫ్లేమేషన్స్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి.

3. ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది:

3. ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది:

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగిన విటమిన్ ఏ, విటమిన్ ఈ మరియు విటమిన్ సీ లు పుష్కలంగా లభిస్తాయి. ఈ నారింజ రంగు పండు నుండి బీ కాంప్లెక్స్ విటమిన్స్ ను అలాగే పొటాషియం, కాపర్ మరియు మెగ్నీషియం వంటి మినరల్స్ ను పొందవచ్చు. ఈ విటమిన్స్ మరియు మినరల్స్ అనేవి సెల్స్ యొక్క రీజెనెరేషన్ కు తోడ్పడతాయి. తద్వారా, ఫ్రీ రాడికల్స్ ద్వారా ఎదురయ్యే డేమేజ్ ను అరికడతాయి.

4. ప్రోటీన్స్ డైజేషన్ కు తోడ్పడుతుంది:

4. ప్రోటీన్స్ డైజేషన్ కు తోడ్పడుతుంది:

బొప్పాయిని ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా కలిగే ఈ అద్భుత ప్రయోజనం గురించి మీకు తెలుసా? బొప్పాయి అనేది ప్రోటీన్స్ జీర్ణమవడానికి తోడ్పడుతుంది. ఇందులో లభించే పపైన్ అనే ఎంజైమ్ అనేది ఇంటస్టైన్ ఆరోగ్యంగా ఉందనేందుకు తోడ్పడే బాక్టీరియల్ ఫ్లోరాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రోటీన్స్ ను బ్రేక్ డౌన్ చేసేందుకు తోడ్పడుతుంది.

5. విటమిన్ ఏ ను సమృద్ధిగా అందిస్తుంది:

5. విటమిన్ ఏ ను సమృద్ధిగా అందిస్తుంది:

బొప్పాయిని తీసుకోవడం వలన కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులో లభించే విటమిన్ ఏ అనేది కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్ ఇది. తద్వారా, కాటరాక్ట్ మరియు మ్యాక్యులర్ డీజెనెరేషన్ వంటి కంటి సమస్యలను అరికడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు బొప్పాయిని రోజుకు మూడు సెర్వింగ్స్ గా తీసుకోవచ్చు.

6. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

6. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

బొప్పాయి పండు గుజ్జులో విటమిన్ ఏ మరియు విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు తద్వారా ఇన్ఫెక్షన్స్ వృద్ధిని అరికట్టేందుకు తోడ్పడతాయి. బొప్పాయిని తరచూ తీసుకోవడం వలన జలుబు, ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ను కలిగించే బాక్టీరియా అలాగే వైరస్ ల నుంచి రక్షణ పొందవచ్చు.

7. గుండె వ్యాధులను అరికడుతుంది:

7. గుండె వ్యాధులను అరికడుతుంది:

బొప్పాయిని తీసుకోవడం వలన కలిగే అద్భుత ప్రయోజనమిది. దీని వలన కార్డియోవాస్క్యులార్ వ్యాధులను అరికట్టవచ్చు. ఇందులో ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ కంటెంట్ లు అధికంగా లభిస్తాయి. ఇవి గుండె వ్యాధులను అరికడతాయి. పొటాషియాన్ని అధికంగా తీసుకోవడం వలన గుండె వ్యాధుల బారిన అప్పడే ప్రమాదం తగ్గుతుంది. అందువలన, బొప్పాయి స్లైస్ ను తీసుకోవడం ముఖ్యం.

8. బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా అరికడుతుంది:

8. బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా అరికడుతుంది:

బ్లడ్ క్లాట్స్ వలన బ్లడ్ సర్క్యూలేషన్ మందగిస్తుంది. ఆర్టెరీస్ క్లాగ్ అవుతాయి. అత్యంత తీవ్రమైన సందర్భాలలో, దీని వలన హార్ట్ ఎటాక్ తో పాటు స్ట్రోక్స్ కూడా సంభవిస్తాయి. బొప్పాయిలో ఫైబ్రిన్ అనే పదార్థం కలదు. ఇది బ్లడ్ క్లాట్స్ ని తగ్గించి బ్లడ్ ఫ్లోను మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది.

9. చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది:

9. చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది:

బొప్పాయిలో లభించే విటమిన్ ఈ అనేది సెల్యులార్ డేమేజ్ ను అపి ప్రీమెచ్యూర్ ముడతలు రాకుండా అరికడుతుంది. విటమిన్ ఏ అనేది చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. చర్మంపై ఉన్న బ్లేమిషెస్ ను తొలగిస్తుంది. విటమిన్ సి తో పాటు విటమిన్ ఈ అనేది కొలాజెన్ ప్రొడక్షన్ ను పెంపొందించి చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. అలాగే, బొప్పాయిలో లభించే ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి చర్మంలోని తేమను నిలిపి వుంచి ఎగ్జిమా మరియు సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను అరికడతాయి. బొప్పాయిని రోజువారీ ఫ్రూట్ సలాడ్ లో జోడించుకోవచ్చు. లేదా స్మూతీస్ లో జోడించవచ్చు.

బొప్పాయిని ఎలా తీసుకోవాలి:

బొప్పాయిని ఎలా తీసుకోవాలి:

బొప్పాయిని ఎంచుకునే తప్పుడు రెడ్డిష్ ఆరెంజ్ స్కిన్ కలిగిన తాజా బొప్పాయిని ఎంచుకోవాలి. ఇవి సాఫ్ట్ గా ఉండాలి. ఈ కింది విధానాలను పాటించండి.

తాజా బొప్పాయి, మ్యాంగో మరియు పైనాపిల్ తో టాపికల్ ఫ్రూట్ సలాడ్ ను తయారుచేసుకోండి.

బొప్పాయి రసాన్ని ఒక గ్లాసుడు లేమోనేడ్, ఐస్డ్ టీ, లేదా నీళ్ళల్లో కలిపి ఫ్రూట్ ఫ్లేవర్ ని ఆస్వాదించండి.

బొప్పాయి, మ్యాంగో మరియు రెడ్ పెప్పర్స్ తో సల్సాను తయారుచేసుకోండి.

చల్లబడిన బొప్పాయిని స్మూతీస్ లో జోడించండి. స్వీట్ ట్రాపికల్ ట్రీట్ కోసం కొన్ని బొప్పాయి స్లైసెస్ ను పైనాపిల్ , బనానా అలాగే గ్రీక్ యోగర్ట్ తో జోడించండి

ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి !

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే మీ ప్రియమైన వారికి షేర్ చేయండి.

English summary

Benefits Of Eating Papaya Daily

The health benefits of papaya are both internal and external; from improving your digestion and strengthening the immune system to nourishing the skin and stimulating hair growth. Read this article to find out what happens if you eat a slice of ripe papaya every day.
Desktop Bottom Promotion