For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీదేవి ఆకస్మిక మరణం: యాక్సిడెంటల్ డ్రవునింగ్ అంటే ఏమిటి & దీని గురించి తెలుసుకోవలసిన విషయాలు.

|

దుబాయ్ పోలీసుల ప్రకారం లెజెండరీ బాలీవుడ్ యాక్ట్రెస్ శ్రీదేవి యాక్సిడెంటల్ డ్రవునింగ్ వలన మరణించిందని తెలుస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందు వరకు శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయిందని భావించారు. అయితే, శ్రీదేవి యాక్సిడెంటల్ డ్రవునింగ్ వలన మరణించిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.

శ్రీదేవి తాను బసచేస్తున్న హోటల్ లో అపస్మారక స్థితిలోబాత్ టబ్ లో పడిపోయిందని దుబాయ్ పోలీసుల సమాచారం. కారణమేదైనా, యాక్సిడెంటల్ డ్రవునింగ్ అనే విషయం గురించి చాలా మందికి తెలియదు.

యాక్సిడెంటల్ డ్రవునింగ్ కి సంబంధించిన విషయాలను ఇప్పుడు మేము వెల్లడిస్తాము.

యాక్సిడెంటల్ డ్రవునింగ్ అంటే ఏమిటి?

యాక్సిడెంటల్ డ్రవునింగ్ అంటే ఏమిటి?

శ్వాస సరిగ్గా అందకపోవడం వలన యాక్సిడెంటల్ డ్రవునింగ్ జరిగే ప్రమాదం ఉంది. అందువలన, నీటిలో మునిగిపోతారు. ఈ ప్రాసెస్ అనేది త్వరగా జరిగిపోతుంది. బాత్ టబ్స్, స్విమ్మింగ్ పూల్స్ వంటి నీటి ప్రదేశాలలో ఈ ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువ. ఇటువంటి కేసులలో విక్టిమ్ ఎక్కువ శాతం మద్యపానం సేవించి ఉండే అవకాశాలు ఎక్కువ. లేదా ఏవైనా డ్రగ్స్ ను తీసుకుని ఉండే అవకాశాలు కూడా లేకపోలేవు.

డ్రవునింగ్ వలన మరణం ఎలా సంభవిస్తుంది

డ్రవునింగ్ వలన మరణం ఎలా సంభవిస్తుంది

నీటిలో ఒక వ్యక్తి మునిగిపోయినప్పుడు ఆ వ్యక్తి శరీరం హైపోక్సియా స్థితికి చేరుకుంటుంది. ఈ స్థితిలో మెదడుకి ఆక్సిజన్ లభించదు. అందువలన, అపస్మారకస్థితిలోకి జారుకుంటారు. సరైన సమయంలో ఆ వ్యక్తిని రక్షించి సరైన మెడికేషన్స్ ని అందిస్తే ఆ వ్యక్తి బ్రతికే అవకాశాలెక్కువ ఉన్నాయి. అలాగే ఆక్సీజన్ లంగ్స్ కు అందకపోవడం వలన కార్డియాక్ అరెస్ట్ సంభవించే ప్రమాదం కూడా ఉంది. దీనివలన గుండె పనితీరు ఆగిపోతుంది. తద్వారా, శరీరానికి రక్తసరఫరా నిలిచిపోతుంది.

గణాంకాలు ఏమంటున్నాయి?

గణాంకాలు ఏమంటున్నాయి?

వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రకారం, యాక్సిడెంటల్ డ్రవునింగ్ వలన అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. యాక్సిడెంటల్ డ్రవునింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలు సంభవించడానికి గల కారణాలలో మూడవ లీడింగ్ కారణంగా నిలుస్తోంది. 2015లో దాదాపు 3,60,000 మంది యాక్సిడెంటల్ డ్రవునింగ్ వలన ప్రాణాలు కోల్పోయారు. బాంగ్లాదేశ్ లో యాక్సిడెంటల్ డ్రవునింగ్ వలన 1-14 సంవత్సరాల పిల్లలలో దాదాపు 43 శాతం మరణాలు సంభవించాయి.

ఆల్కహాల్ మరియు డ్రవునింగ్

ఆల్కహాల్ మరియు డ్రవునింగ్

గణాంకాలను పరిశీలిస్తే, ఆల్కహాల్ అనేది డ్రవునింగ్ ప్రమాదాన్ని పెంచుతుందన్న విషయం స్పష్టం అవుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం, మద్యపానం సేవించిన తరువాత నీటికి సంబంధించిన యాక్టివిటీస్ లో పాల్గొంటే డ్రవునింగ్ కి గురయ్యే ప్రమాదం ఎక్కువ.

ఆల్కహాల్ అనేది రిస్క్ ని ఎందుకు పెంచుతుంది

ఆల్కహాల్ అనేది రిస్క్ ని ఎందుకు పెంచుతుంది

ఒకరి మోటార్ స్కిల్స్ పై ఆల్కహాల్ అనేది దుష్ప్రభావం చూపుతుంది. సెంట్రల్ నెర్వస్ సిస్టంపై సెడేటివ్ గా పనిచేస్తుంది. అంటే మెదడు నుంచి వచ్చే నొప్పి లేదా ఇంజురీ వంటి సిగ్నల్స్ అనేవి తగ్గిపోతాయి. పరిసరాలపై అవేర్నెస్ కోల్పోతారు. కాబట్టి, రక్తంలో ఆల్కహాల్ అధిక మోతాదులో లభించినప్పుడు మోటార్ స్కిల్స్ పనితీరు దెబ్బతింటుంది.

బాత్ రూమ్ లో సేఫ్టీ టిప్స్

బాత్ టబ్ వద్ద రబ్బర్ మ్యాట్ ను అమర్చండి. దీని వలన నీటిలో పడిపోవటాన్ని అరికట్టవచ్చు. అలాగే, బాత్ టబ్ ను పూర్తిగా నింపి ఉంచకండి. కేవలం 2/3rd మాత్రమే నింపండి. నీటి స్థాయి ఎక్కువగా ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అలాగే బాత్ టబ్ కి దగ్గరలో ఎలెక్ట్రిక్ అప్లయన్స్ లను ఉంచవద్దు.

English summary

Sridevi Cause Of Death: What Is Accidental Drowning And Everything You Need To Know

Sridevi Cause Of Death: What Is Accidental Drowning And Everything You Need To Know,What is accidental drowning? What causes accidental drowning? Here's everything that you need to know about it.
Story first published:Thursday, March 1, 2018, 18:22 [IST]
Desktop Bottom Promotion