For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణ పిరియడ్ అంటే ఏమిటి? మీరు ఈ 5 పిరియడ్స్ ఇబ్బందుల లక్షణాలకి డాక్టరును కలవాలి

సాధారణ పిరియడ్ అంటే ఏమిటి? మీరు ఈ 5 పిరియడ్స్ ఇబ్బందుల లక్షణాలకి డాక్టరును కలవాలి

|

ఆడవాళ్ళు ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో అప్పుడు పిరియడ్స్ చెత్త విషయంగా అనుకుంటారు.నొప్పి, మూడ్లు మారిపోవటం వంటి వాటితో అసౌకర్యంగా ఉండి, పిరియడ్స్ సమయంలో ఏ పనీ చేయలేకపోవచ్చు. కానీ పిరియడ్స్ ద్వారా శరీరం మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని తెలుపుతుంది. ఈ ఆర్టికల్ లో పిరియడ్స్ ఇబ్బందులు, వాటిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం.

సాధారణ పిరియడ్స్ సైకిల్ అంటే ఏమిటి?

ఒక సగటు స్త్రీకి నెలసరి సైకిల్ 28 రోజులకి ఉంటుంది, సగటున పిరియడ్ మూడు నుండి ఐదురోజుల పాటు ఉంటుంది. ఇది ప్రతి స్త్రీకి మారుతూ ఉంటుంది.

ఆరోగ్య నిపుణులు కొంతమంది స్త్రీలకు మూడు రోజుల పిరియడ్స్ సాధారణమైనదని అంటారు. పిరియడ్స్ భారీగా ఉంటే ఏడురోజుల వరకూ కొనసాగవచ్చు. ఎన్నిరోజులు పిరియడ్స్ ఉన్నాయన్న చింతకన్నా మీరు శరీరంలో ఏ మార్పులు వచ్చాయో ఆలోచించడం మంచిది.

What Is A Normal Period? 5 Signs Of Period Troubles That Tell You Should Visit A Doctor By Neha Ghosh on June 6, 2018


ప్రతి స్త్రీ తన నెలసరి వలయంపై శ్రద్ధ వహించాలి, ఎందుకంటే దాని ద్వారా శరీరంలో ఏం జరుగుతుందోనన్న విషయాలపై ఆధారాలు లభిస్తాయి.

పిరియడ్స్ ఇబ్బందుల లక్షణాలు

1.పిరియడ్స్ తక్కువగా రావటం

నెలసరి రాకపోవటానికి కారణాన్ని అమెనోరియా అంటారు, ఇది వయస్సును బట్టి మారుతుంటుంది. ఒక యువతి తన ఇరవైల్లో లేదా ముప్ఫైల వయస్సులో, లైంగికంగా యాక్టివ్ గా ఉన్నప్పుడు, కారణం గర్భవతవ్వడం కావచ్చు. మరోవైపు, నలభైలు లేదా యాభైల వయస్సులో ఉన్నవారికి పెరిమెనోపాజ్ కావచ్చు (మెనోపాజ్ దశ చుట్టూ వచ్చే పిరియడ్స్ సమయం).ఇలా అండాశయంలో ఈస్ట్రోజెన్ తక్కువ ఉత్పత్తి కావటం వలన జరుగుతుంది, అలా పిరియడ్స్ తక్కువగా వస్తుంటాయి.

అలా 12 నెలల పాటు పూర్తిగా పిరియడ్స్ రాకపోతే మీరు మెనోపాజ్ దశలో ఉన్నట్లు. మెనోపాజ్ వచ్చే సగటు వయస్సు 51 ఏళ్ళు.

వ్యాయామం ఎక్కువగా చేసినా కూడా పిరియడ్స్ మిస్ అవచ్చు. ఆడ అథ్లెట్లు శారీరకంగా ఎక్కువ కష్టపడటం వలన వారికి పిరియడ్స్ ఆగిపోతాయి. ఇది బ్యాలే డాన్సర్లు, రన్నర్లలో కూడా సాధారణం. ఎక్కువ వ్యాయామం చేయటం ప్రత్యుత్పత్తి హార్మోన్ల ఉత్పత్తి, రెగ్యులేషన్ పై ప్రభావం చూపి నెలసరి సైకిల్ ను పాడుచేస్తుంది.

పిరియడ్స్ మిస్సవటం వెనుక ఇతర కారణాలు ఇవి కూడా కావచ్చు ;

థైరాయిడ్ డిజార్డర్లు

తినటానికి సంబంధించిన డిజార్డర్లు

తల్లిపాలివ్వటం

ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్

స్థూలకాయం

హైపోథలామస్ లో డిజార్డర్

పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్

మానసిక వత్తిడి

గర్భాశయంలో వ్యాధి

2.పిరియడ్స్ సాధారణం కన్నా ఎక్కువగా రావటం

సాధారణంగా చాలామంది స్త్రీలకి నెలకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల రక్తం పోతుంది. కొంతమంది స్త్రీలలో భారీ రక్తస్రావం జరిగి 5 టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువ రక్తం పోతుంది.ఎక్కువ రక్తస్రావం జరగటం వలన శరీరంలోంచి ఐరన్ పోతుంది. శరీరానికి హెమోగ్లోబిన్ ఉత్పత్తి చేయటానికి ఐరన్ అవసరం, దీనివలన ఎర్రరక్త కణాలు శరీరం మొత్తం ఆక్సిజన్ రవాణా చేస్తాయి.

ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గటం వలన రక్తహీనత వస్తుంది. రక్తహీనత లక్షణాలు పాలిపోయిన చర్మం, అలసట, శ్వాస ఆడకపోవటం మొదలైనవి.

భారీ రక్తస్రావానికి మరిన్ని కారణాలు;

గర్భాశయ ఫైబ్రాయిడ్లు

గర్భస్రావం

బ్లడ్ థిన్నర్ల వాడకం లేదా స్టెరాయిడ్లు

గర్భాశయ క్యాన్సర్

గర్భనిరోధక మాత్రలలో మార్పులు

అలాగే, ప్రతి కొన్ని గంటలకీ సానిటరీ నాప్కిన్లను మార్చటం కూడా భారీ రక్తస్రావానికి గుర్తు. మీకు ఆగకుండా ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంటే డాక్టరును కలవండి.

3.రెండు పిరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ జరగటం

రెండు పిరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ జరగటం అన్నది ఏ స్త్రీ నిర్లక్ష్యం వహించకూడని విషయం. యోని ప్రాంతంలో చికాకుగా నొప్పి లేదా గర్భనిరోధక మాత్ర తీసుకోవడం మర్చిపోవటం లేదా గర్భాశయ క్యాన్సర్ కారణం కావచ్చు.

4.పిరియడ్స్ సమయంలో చాలా నొప్పి రావటం

పిరియడ్స్ సమయంలో ఎక్కువ కండరాల నొప్పులు రావటం సాధారణం. కానీ చాలామంది ఆడవాళ్ళకి నెలసరి క్రాంప్స్ ఎంత తీవ్రంగా వస్తాయంటే వారు మంచం మీద నుంచి కూడా లేవలేరు. ఇలా నొప్పితో కూడిన పిరియడ్స్ ను డిస్మెనోరియా అంటారు. దీనితోపాటు ఇతర లక్షణాలు డయేరియా, వికారం, తలనొప్పి, వాంతులు, నడుం నొప్పి వంటివి కూడా ఉంటాయి.

నొప్పితో కూడిన పిరియడ్స్ కి ఎండోమెట్రియాసిస్ మరియు ఫైబ్రాయిడ్లు కూడా కారణం కావచ్చు.

5. పెద్ద రక్తం గడ్డలు

భారీ పిరియడ్స్ సమయంలో పెద్ద రక్తం గడ్డలు వస్తే ఆ స్త్రీలకి హైపర్ థైరాయిడిజం, సింప్టమేటిక్ రక్తహీనత,లేదా గర్భాశయ ఫైబ్రాయిడ్స్ ఉండవచ్చు. మీకు పిరియడ్స్ సమయంలో పెద్ద రక్తం గడ్డలు వస్తుంటే గైనకాలజిస్టును కలవాలి.

English summary

What Is A Normal Period? 5 Signs Of Period Troubles That Tell You Should Visit A Doctor By Neha Ghosh on June 6, 2018

What Is A Normal Period? 5 Signs Of Period Troubles That Tell You Should Visit A Doctor By Neha Ghosh on June 6, 2018
Story first published:Monday, June 18, 2018, 12:24 [IST]
Desktop Bottom Promotion