For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆహారప్రణాళిక : ఈ ప్రణాళికలో జోడించదగినవి, జోడించకూడనివి

ఆహారప్రణాళిక : ఈ ప్రణాళికలో జోడించదగినవి, జోడించకూడనివి

|

సరైన సమతుల్య ఆహారాన్ని సరైన స్థాయిలో నిర్వహించడం, మంచి ఆరోగ్యానికి చాలా అవసరం. Whole30 ఆహారప్రణాళిక అనేది, ప్రధానంగా మీరు ఏం తినవచ్చు, ఏవేవి తినకూడదు అన్న నియమాలు కలిగిన ప్రత్యేకమైన ఆహార ప్రణాళిక. Whole30 ఆహార ప్రణాళికలో జోడించదగినవి, జోడించకూడని ఆహారాల గురించిన మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసం మీకు దోహదపడుతుంది.

Whole 30 Diet: what to eat & what not to eat

అసలేమిటీ Whole30 ఆహార ప్రణాళిక?

మారుతున్న జీవన ప్రమాణాల దృష్ట్యా , ఆహార మరియు వైద్య నిపుణులు Whole30 ఆహార ప్రణాళికను సిఫార్సు చేస్తున్నారు. వయసు వర్గాల దృష్ట్యా తీసుకోవలసిన ఆహార ప్రణాళికలో జోడించదగినవి, జోడించబడకూడనివి వంటి అంశాల మీద ఆధారపడి ఈ ప్రణాళిక రూపొందించబడింది. చక్కెర, పాడి పదార్ధాలు, కొన్ని రకాల తృణధాన్యాలు మరియు చిక్కుళ్ళు వంటివి తీసుకోవడం, మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు నిపుణులు.

మీరు ప్రధానంగా మీ శరీరాన్ని, చెడుగా ప్రభావితం చేసే ఆహారాలను గుర్తించాల్సి ఉంటుంది, అయితే అవి నిజానికి ఆరోగ్యకరమైనవిగా కూడా వర్గీకరించబడి ఉండవచ్చు. మీ శక్తి స్థాయిలలో అసమతుల్యానికి లోనవుతుంటే, లేదా ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక పాటిస్తున్నప్పటికీ తరచూ బరువును కోల్పోతూ ఉంటే, మీ శరీరానికి అవసరమైన మరియు సరిపోయే ఆహారాలను తీసుకోవడం లేదనే అర్ధం.

మీ ఆహారం నుండి కొన్నిరకాల ఆహారాలను తీసివేయడం ద్వారా మంచి జీర్ణక్రియలను ప్రోత్సహిస్తుంది, మరియు దీర్ఘకాలిక నొప్పులు, కాలానుగుణ అలెర్జీల నుండి కూడా మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.


Whole30 డైట్ ఎలా పనిచేస్తుంది ?

సాంకేతికంగా, Whole30 ఆహార ప్రణాళిక వెనుక ఉన్న తర్కం, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు లేదా వాపు కలిగించే లక్షణాలు గల ఆహారపదార్ధాలను మీ ఆహార ప్రణాళిక నుండి తీసివేయడం, మరియు శరీరంలో విషతుల్య రసాయనాలను ప్రోత్సహించే చక్కెరలను తగ్గించడం. ఈ ఆహార ప్రణాళిక పాటించే సమయం కనీసం 30 రోజులుగా ఉంటుంది, మరియు ప్రతికూల ప్రభావాలు కలిగిన ఆహారాలను, మీ ఆహార ప్రణాళిక నుండి తొలగించవలసిన అవసరం ఉంది. ఈ ఆహారాల వలన కలిగిన ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి శరీరానికి కనీసం 30రోజుల గడువు అవసరం ఉంటుంది.

మీరు మీ ఆరోగ్యకర ఆహారపు అలవాట్లను మరలా తాజాగా ప్రారంభించాలి. అంతేకాక, మీరు తయారుచేసిన ఆహారప్రణాళికల ఎంపికలు మానసికంగా కూడా సానుకూల ఫలితాలను ఇచ్చేలా చూసుకోవాలి. మీ శరీరంలోని మార్పులు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులను ఈ ఆహార ప్రణాళిక ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. క్రమంగా మంచి ఆహారాల ఎంపిక మీద దృష్టి సారించాలి.

ఆహార ప్రణాళికలో ఉన్నప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి?

Whole30 ఆహారప్రణాళిక యొక్క ప్రధాన ఆలోచన, మీరు తీసుకునే ఆహారం నుండి ప్రతికూల ప్రభావాలను కలిగించే ఆహారాలను తొలగించడం. మీరు మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారా లేదా అని పరిశోధించవలసిన అవసరం ఉంటుంది. Whole30 డైట్, 30రోజులుగా ఉంటుంది.

కూరగాయలు:

కూరగాయలు:

మీరు తీసుకోదగిన అన్ని రకాల కూరగాయలను తినండి. కూరగాయలు ఆరోగ్యకరమైనవి మరియు మీ ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కూడా కలిగి ఉండదు.

పండ్లు:

పండ్లు:

ఒక మోస్తరు మోతాదులో పండ్లను తీసుకోవచ్చు. చక్కెరలను తీసుకోవడం పరిమితం అని గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది.

సీఫుడ్ :

సీఫుడ్ :

మీరు చేపలు మరియు షెల్ఫిష్ లను తీసుకోవచ్చు.

తాజా మాంసం:

తాజా మాంసం:

అదనపు చక్కెరలు, ఉప్పు జోడించకుండా నిల్వ పరచని, తాజా మాంసం తీసుకోదగినదిగా సిఫార్సు చేయడమైనది.

నూనెలు:

నూనెలు:

ఈ Whole30 ఆహార ప్రణాళికలో కొబ్బరి మరియు ఆలివ్ నూనె మంచిదిగా చెప్పబడింది. నెయ్యి (క్లారిఫైడ్ బట్టర్) కూడా వినియోగించవచ్చు.

గుడ్లు:

గుడ్లు:

అల్పాహారం సమయంలో గుడ్లను జోడించడం ద్వారా, Whole30 ఆహార ప్రణాళిక మీ శరీరానికి గొప్పగా పనిచేస్తుందని చెప్పబడింది.

నట్స్ మరియు తృణధాన్యాలు:

నట్స్ మరియు తృణధాన్యాలు:

మీరు వేరుశెనగలు తప్ప, అన్నిరకాల గింజలు తీసుకోవచ్చు. ఎందుకంటే వేరుసెనగ వర్గం లెగ్యూమ్స్(చిక్కుళ్ళు) వర్గం కిందకు వస్తాయి

కాఫీ:

కాఫీ:

కాఫీ మంచిదే కాని బ్లాక్ కాఫీ తీసుకోండి. పాలు మరియు చక్కెరలు ప్రణాళిక నుండి నిషేదించబడినవి.

Whole30 ఆహారప్రణాళికలో తీసుకోకూడనివి ఏంటి?

Whole30 ఆహారప్రణాళికలో తీసుకోకూడనివి ఏంటి?

మీరు 30రోజుల పాటు కొన్ని ప్రతికూల లక్షణాలు ఉన్న ఆహారాలను తొలగించవలసి ఉంటుంది. క్రమంగా, క్రింద తెలుపబడిన ఆహారపదార్ధాలను తొలగించుట మంచిది.

పాలపదార్ధాలు:

మీరు జున్ను, మీగడ, వెన్న, సోర్-క్రీం, ఆవు పాలు, యోగర్ట్, పెరుగు మరియు కేఫీర్ వంటి పాలపదార్ధాలను దూరంగా ఉంచాలి. పాడి ఉత్పత్తులలో నెయ్యిని మాత్రం మినహాయించవచ్చు.

మద్యం(ఆల్కహాల్):

మద్యం(ఆల్కహాల్):

Whole30 ఆహార ప్రణాళికలో, ఎట్టి పరిస్థితుల్లో మద్యం ముట్టరాదు. సేవించడమే కాదు, వంటలోకూడా మద్యాన్ని(రం,వైన్,జిన్ వంటివి విరివిగా వాడుతారు) వాడకండి. వెనీలా ఎక్స్ట్రాక్ట్ కూడా మంచిది కాదు, బదులుగా కొంబుచా ఎంచుకోవచ్చు. (దీనిలో తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉంది). అదనపు చక్కెరలు లేకుండా చూసుకోండి.

ధాన్యాలు:

ధాన్యాలు:

మీరు బియ్యం, గోధుమ, మిల్లెట్, రై, మొక్కజొన్న, క్వినోవా, అమరాంత్, బల్గర్, సోర్ఘుం, బక్వీట్ లేదా మొలకెత్తిన గింజలను తీసుకోకూడదు.

చిక్కుళ్ళు:

చిక్కుళ్ళు:

30రోజుల పాటు బీన్స్ లేదా సోయ తీసుకోవడం మానివేయాలి. చిక్పీస్, కాయధాన్యాలు, వేరుశెనగలు మరియు బఠానీలను కూడా ఆహారప్రణాళిక నుండి తొలగించాలి.

జంక్ ఫుడ్:

జంక్ ఫుడ్:

మీరు ఏ రకమైన జంక్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళకూడదు. ఏపదార్దాలనైనా, ఇంట్లో తయారు చేసుకునేలా ఉండాలి. నిల్వ పదార్ధాలు, అదనపు ఎసెన్స్, ఈస్ట్, చక్కెరలు జోడించిన పదార్ధాలు, స్పైసీ మరియు ఆమ్ల లక్షణాలు అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం పూర్తిగా నిషేదించాలి. వీలయితే, Whole30 సమయంలోనే కాకుండా, మిగిలిన రోజుల్లో కూడా వీటికి దూరంగా ఉండడమే మంచిదని, నిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ మీ మానసిక ఆరోగ్యాన్ని సైతం ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. గుడ్లు మరియు అరటిపండు ఉపయోగించి చేసే పాన్-కేక్స్ కూడా ఈ ప్రణాళిక సమయంలో తీసుకోవడం సరికాదు.

చక్కెరలు జోడించబడిన ఆహారాలు:

చక్కెరలు జోడించబడిన ఆహారాలు:

ఏ రూపంలో అయినా సరే (నిజమైన లేదా కృత్రిమ) 30 రోజులపాటు చక్కెరలను నిషేధించాలి. తేనె, మాపుల్ సిరప్, జిలిటల్, స్టెవియా లేదా అగేవ్ వంటివి సైతం దూరం ఉంచాలి. మీరు షాపింగ్ చేయడానికి ముందు లేబుల్ తనిఖీ చేయండి. శ్రీరాచా వంటి సాధారణ పదార్థాలు అదనపు చక్కెరలను కలిగి ఉంటాయని గుర్తుంచుకోండి.

MSG మరియు సల్ఫైట్స్:

MSG మరియు సల్ఫైట్స్:

మీరు ఎటువంటి ఆహారాలను కొనుగోలు చేస్తున్నా, ముందుగా లేబుల్ తనిఖీ చేయడం మంచిది. నిల్వ చేసిన ఆహార పదార్ధాలను పూర్తిగా తొలగించాలి.

Whole30 ఆహారప్రణాళికలో అనుసరించడానికి, తీసుకోవలసిన చిట్కాలు మరియు సూచనలు:

• మీరు ఎటువంటి అవరోధం లేకుండా ఖచ్చితంగా 30 రోజులు పాటించిన ఎడల ఖచ్చితమైన ఫలితాలను పొందగలరు.

• మీరు కొనుగోలు చేసే ఆహార పదార్ధాల మీద లేబుళ్ళను తనిఖీ చేయండి. పాక్ చేసిన మరియు నిల్వ ఉంచిన ఆహారపదార్ధాలను దూరం చేయండి. కృత్రిమ చక్కెరలు, రసాయనాలు ఉంటాయి కాబట్టి.

• కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, మాంసం మరియు చేపలు వంటి ఆహారాలను ఎంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

Read more about: diet డైట్ ఆహారం
English summary

Whole 30 Diet: what to eat & what not to eat

Whole30 diet is basically a program with a set of rules as to what you can eat and what you should not eat. This diet helps you to eliminate trigger food groups from your diet. Some of the best foods that you can consume for the Whole30 diet are fruits, vegetables, coffee, eggs, nuts, etc. Also, make sure not to include alcohol, grains, and dairy products in the diet.
Story first published:Tuesday, September 11, 2018, 12:27 [IST]
Desktop Bottom Promotion