For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు, ఈ 9 రకాల ఆరోగ్య నిబంధనల పట్ల జాగ్రత్త వహించండి !

మహిళలు, ఈ 9 రకాల ఆరోగ్య నిబంధనల పట్ల జాగ్రత్త వహించండి !

|

ఈ రోజుల్లో మహిళలు జిమ్ కి వెళ్ళడం, ఎక్కువ సమయం పనిచేయటం, కుటుంబం గూర్చి ఎక్కువ శ్రద్ధ వహించడం వంటివి ప్రధానమని భావిస్తున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్లో వారు తరచుగా వారి ఆరోగ్యాన్ని నాశనం చేసే ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, మీరు మీ ఆరోగ్య నిబంధనలను విస్మరిస్తున్నారని తెలుసుకోండి.

మీ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవటమనేది తరచుగా వెనుకబడటానికి కారణమేమంటే, మీ కుటుంబ సంరక్షణయే మీకు తొలి ప్రాధాన్యతగా మారింది.

దాని ఫలితంగా, మీ ఆరోగ్యము & శరీరానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను మీరు తరచుగా ఎదుర్కొంటున్నారు.

Women, Beware Of These 9 Worst Health Mistakes

ఆరోగ్య విషయంలో మహిళలు తరచుగా చేసే తప్పిదాలను గురించి ఇక్కడ మీరు చదివి తెలుసుకోండి.

1. తరచుగా హైహీల్స్ ను ఉపయోగించడం :-

1. తరచుగా హైహీల్స్ ను ఉపయోగించడం :-

హైహీల్స్ మీ పాదాలను నష్టపరచకపోయిన, మీరు తరచుగా పాటించినట్లయితే మీ కీళ్ల జాయింట్లలో ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి చర్యల వల్ల మీరు తరచుగా నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్, కండరాల నొప్పులు, కాళ్ల నరాలకు & ఎముకలకు నష్టం వాటిల్లడం, కాలి వేళ్ళ ఎముకలలో అస్థిరత, కాళ్ళ నరాలు గూడు కట్టడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అలా అని మీరు హీల్స్ను ఉపయోగించడం ఆపవద్దు, మీరు ధరించే హైహీల్స్ యొక్క పొడవుని 1.5 అంగుళాలు ఉండేలా చూసుకోండి, ఇన్నర్ సోల్ ఉన్న హీల్స్ను వాడటం వల్ల నేతలపై ఒత్తిడి భారం తగ్గుతుంది.

2. మేకప్ తో నిద్రించడం :-

2. మేకప్ తో నిద్రించడం :-

పని ఒత్తిడితో మీరు బాగా అలిసిపోయి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మీ మేకప్ను అలాగే వదిలేస్తున్నారా ? మీరు పడుకునేటప్పుడు మేకప్ను అలాగే వదిలివేయడం వల్ల అది ఆయిలీగా మారి, చర్మ రంధ్రాలలో ధూళిని అడ్డుకొని మీ చర్మ రంధ్రాలను పూర్తిగా మూసివేస్తుంది. మస్కరా, ఐషాడో, ఐ గ్లిట్టర్స్ వంటి మేకప్ ఉపకరణాలను తొలగించకుండా నిద్రపోవడం వల్ల అవి మీ కళ్ళను చికాకు పెడతాయి.

3. తగినంతగా నిద్రపోకపోవడం :-

3. తగినంతగా నిద్రపోకపోవడం :-

మీ శరీరం సక్రమంగా పనిచేయడానికి నిద్ర అనేది కచ్చితంగా అవసరమవుతుంది. మీరు రాత్రిళ్ళు చాలా ఆలస్యంగా నిద్రపోవడం & ఉదయాన్నే తొందరగా మేల్కోవడం వంటి చర్యలు మీరు గుర్తించలేనంత విధంగా మీ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మీరు నిరుత్సాహానికి గురవడమే కాక, మిమ్మల్ని మరింత నీరసంగా చేస్తూ, అధిక రక్తపోటు & గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితుల ప్రమాదానికి మిమ్మల్ని గురి చేస్తుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా 7 - 9 గంటల వరకూ నిద్ర పోవడమనేది చాలా ముఖ్యం.

4. అతిగా తినడం :-

4. అతిగా తినడం :-

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు మహిళలు తరచుగా ఆహారాన్ని తీసుకోవడమనేది, వారి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మీరు తరచుగా తినడం వంటి ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం వల్ల మీ ఆరోగ్యాన్ని భంగపరిచే తీవ్రమైన పరిణామాలను స్వాగతిస్తున్నారని మీరు ముందుగా తెలుసుకోవాలి. ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల మీ మానసిక భావాలు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది కానీ, దాని ఫలితంగా ఎదురయ్యే ఇతర సమస్యలను పరిష్కరించదు. మీరు తరచుగా తినడం వల్ల మీకు ఊబకాయము రావచ్చు.

5. వ్యాయామాలు చేయకపోవడం :-

5. వ్యాయామాలు చేయకపోవడం :-

మీ రోజువారీ పని ఒత్తిడి కారణంగా, మీరు వ్యాయామానికి తగిన ప్రాధాన్యత ను ఇవ్వలేకపోతున్నారు. అయినప్పటికీ, మీరు శారీరక ఉల్లాసాన్ని కలిగి ఉండేందుకు క్రమబద్ధమైన వ్యాయామమనేది చాలా ముఖ్యమైనది. దీనర్థమేమంటే, కటినమైన వ్యాయామ పద్ధతులను మీరు తప్పక ప్రయత్నించాలని కాదు, వాకింగ్ - సైక్లింగ్ - యోగా వంటి వాటిని మీ వ్యాయామంలో భాగంగా చేర్చడం వల్ల మీరు మరింత శారీరక ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఇది గుండె జబ్బులను, హార్ట్ స్ట్రోక్, వెన్నునొప్పి, బోలు ఎముకల వ్యాధి, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

6. ఒత్తిడిని నిర్లక్ష్యం చేయడం :-

6. ఒత్తిడిని నిర్లక్ష్యం చేయడం :-

ఎక్కువ పనులతో సతమతమయ్యే మహిళలు తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమి, మూర్చపోవడం, ఒత్తిడికి ఎక్కువగా గురవటం వంటి అనుభవాలను కలిగి ఉంటారు. ఒత్తిడి అనేది చాలా తేలికగా అధికమవుతుంది, దీనిని మీరు నిర్లక్ష్యం చేయడంవల్ల డిప్రెషన్ & ఆందోళన వంటి అనేక ఇతర దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది.

7. దంత సమస్యలను నిర్లక్ష్యం చేయడం :-

7. దంత సమస్యలను నిర్లక్ష్యం చేయడం :-

మీరు తగిన దంత సంరక్షణ జాగ్రత్తలను తీసుకోకపోతే, మీ దంతాలు పసుపురంగులో మీరు మారటాన్ని చూడవచ్చు. క్రమక్రమంగా ఇవి దంతక్షయానికి దారితీయవచ్చు. మీ దంత సమస్యలను అధిగమించడానికి ఫ్లోరైడ్ టూత్ పేస్టుతో రోజుకు రెండుసార్లు మీ పళ్ళను శుభ్రం చేసుకోవాలి, అంతేకాకుండా, మీ పంటి ఎనామిల్కు హాని కలిగించే చక్కెర పానీయాల వినియోగాన్ని తగ్గించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ పళ్ళు ఎక్కువగా నష్టపోవు.

8. మీరు ఎల్లప్పుడూ ఒక కప్పు సలాడ్ను ఆర్డర్ ఇస్తారు :-

8. మీరు ఎల్లప్పుడూ ఒక కప్పు సలాడ్ను ఆర్డర్ ఇస్తారు :-

మహిళలారా ! మీరు బయట తీసుకునే ఆహారంలో సలాడ్ను ఎంచుకోవడం సరైనది కాదు. మీకు రెస్టారెంట్లలో లభించే ఫ్రైడ్ చికెన్, క్రోటన్లు, సలాడ్స్ అనేవి పూర్తిగా క్యాలరీలతోనూ, కొవ్వు పదార్థాలతోనూ అలంకరించబడి ఉంటాయి. మీరు అధిక కొవ్వు పదార్థాలతో అలంకరించబడిన జున్ను, క్రోటన్లు, బేగం క్రీమ్ వంటి సలాడ్ డ్రెస్సింగ్లతో అలంకరించబడిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

పాలకూర, క్యాబేజీ & క్యారెట్లతో అలంకరించబడిన సలాడ్లో ను ఎంపిక చేసుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది.

9. సరికాని బ్రాలను ధరించటం :-

9. సరికాని బ్రాలను ధరించటం :-

చాలామంది మహిళలు వారి జీవితకాలమంతా తప్పుడు పరిమాణాన్ని కలిగిన బ్రాలను ధరిస్తారనేది అందరికీ తెలిసిన విషయం. అసమాన్యమైన పరిమాణంలో లభించి బ్రాలను ధరించడం వల్ల మీకు మెడనొప్పి, స్తనాల నొప్పి, వెన్ను నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవడానికి కారణమవుతాయి. ఒకవేళ మీరు బిగుతుగా వున్న బ్రాలను ధరించడం వల్ల అది మీ శారీరక అందాన్ని దెబ్బతినేలా చేయడమే కాక, స్కిన్ ఇరిటేషన్కు కారణం కాగలదు.

English summary

Women, Beware Of These 9 Worst Health Mistakes

For women, maintaining a good health has been put in the backburner because exhausting yourself with work and taking care of your family has become the number one priority than making your general well-being number one priority. These are the worst health mistakes: wearing high heels, not sleeping enough, emotional eating,
Desktop Bottom Promotion