For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలబంద వేర్లను పొడి చేసుకుని తీసుకుంటే శృంగారంలో తేలిపోవొచ్చు

కలబంద ద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవొచ్చు.మగవారు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది కొన్ని క్షణాల్లోనే సెక్స్ లో ఔటైపోతుంటారు.

|

చాలామంది కొన్ని క్షణాల్లోనే సెక్స్ లో ఔటైపోతుంటారు. అలాంటి వారికి కలబంద జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఇక కలబంద గతంలో అస్సలు ఎవరూ పట్టించుకునే వారు. కొందరు దాన్ని ఒక పిచ్చి మొక్కలాగా చూసేవారు. మరికొందరు దాన్ని విషతుల్యమైన మొక్కగా భావించేవారు. రానురాను దాని వల్ల వచ్చే ప్రయోజనాలు తెలుసుకున్న జనాలు కలబందను ఉపయోగించడం ప్రారంభించారు.

అనేక ఔషధగుణాలున్నాయి

అనేక ఔషధగుణాలున్నాయి

ప్రస్తుతం మనకు కలబంద జ్యూస్ రోడ్లపై బాగానే దొరుకుతూ ఉంటుంది. అయితే అందరూ తాగుతున్నారని మనం కూడా ఆ జ్యూస్‌ తాగుతుంటాం. కానీ దాని ద్వారా ఎలాంటి లాభాలు వస్తాయనే విషయం ఎవ్వరికీ తెలియదు. కలబందలో అనేక ఔషధగుణాలున్నాయి. కలబందలో 99.3 శాతం నీరుతో పాటు ఏ, బీ, విటమిన్లు, ఎంజైములు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

కలబందలోని ఎంజైమ్స్ ఒళ్లు నొప్పులను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. కలబందను జ్యూస్‌ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. గుండె, హెపటైటీస్‌, కిడ్నీ సమస్యలను నివారిస్తుంది. లైంగిక పటుత్వాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచి మధుమేహాన్ని నివారిస్తుంది. కలబంద జ్యూస్ ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా ఎన్నో రకాల ఔషధ గుణాలున్న కలబంద గురించి మరింత తెలుసుకుందాం.

మలినాలను తొలగించుకోవచ్చు

మలినాలను తొలగించుకోవచ్చు

కలబంద రసాన్ని తాగడం వల్ల శరీరంలోని మలినాలను కూడా తొలగించుకోవచ్చు. శరీరంలో ఉండే విష పదార్థాలు మొత్తం అలోవెరా జ్యూస్ తాగితే బయటికి వెళ్లిపోతాయి. అలాగే అలోవెరా జెల్‌ను రోజూ తీసుకుంటే బరువు తగ్గుతారు.

యంగ్ గా కనిపిస్తారు

యంగ్ గా కనిపిస్తారు

వయస్సు పెరిగినా కూడా నిత్య యవ్వనంగా కనిపించాలంటే అలోవెరా జ్యూస్ ను తాగాలి. దీనివల్ల ఎప్పుడూ యంగ్ గానే కనిపిస్తారు. అలోవెరాను తీసుకోవడం ద్వారా చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.

జీర్ణ సమస్యలు తగ్గుతాయి

జీర్ణ సమస్యలు తగ్గుతాయి

జీర్ణాశయ సమస్యలు కలిగి ఉన్న వారు కలబంద రసం తీసుకోవటం వలన ప్రోటీన్ గ్రహించే ప్రక్రియ అధికమై పేగు కదలికలు మెరుగుపడతాయి. జీర్ణ వ్యవస్థలో ఉన్న వివిధ రకాల బ్యాక్టీరియా, హానికర కారకాలను కలబంద బయటకి పంపి వేస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించటమే కాకుండా గుండెమంటలను కూడా తగ్గించేస్తుంది.

ఫ్రీ-రాడికల్స్ ను తరిమికొట్టవచ్చు

ఫ్రీ-రాడికల్స్ ను తరిమికొట్టవచ్చు

కలబంద రసంలో యాంటీ-ఆక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే హానికర కారకాలకు వ్యతిరేకంగా పని చేస్తాయి. ఫ్రీ-రాడికల్స్ అస్థిరమైనవి కావున జీవక్రియలో దుష్ప్రభావాలను చూపటం, వయసు మీరిన వారిలా కనపడేలా చేయడం చేస్తాయి. క్రమంగా కలబంద రసం తాగితే ఫ్రీ-రాడికల్స్ ను తరిమికొట్టి శరీర రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవొచ్చు.

ఎర్ర రక్త కణాల సామర్థ్యం అధికం

ఎర్ర రక్త కణాల సామర్థ్యం అధికం

కలబంద రసంలో రక్త పీడనాన్ని నియంత్రించే కారకాలు ఉండటం వలన, రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా తగ్గించుకోవొచ్చు. అలాగే ఎర్ర రక్త కణాల విస్తరణ సామర్థ్యం కూడా అధికం అవుతుంది.

నోటి సమస్యలను కూడా తగ్గిస్తుంది

నోటి సమస్యలను కూడా తగ్గిస్తుంది

కలబంద రసం చిగుళ్లు, నోటిలో కలిగే సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ రసంలో యాంటీ-మైక్రోబియల్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. నోటి అల్సర్, చిగుళ్లు నుంచి రక్తస్రావం జరిగినపుడు శుభ్రమైన కలబంద రసం వాడితే చాలు.

పోషకాలను పొందవచ్చు

పోషకాలను పొందవచ్చు

మన శరీరంలో ప్రోటీన్ల నిర్మాణానికి 20 రకాల అమైనో ఆసిడ్స్ అవసరం. అయితే శరీరానికి కావాల్సని 8 రకాల అమెనో ఆసిడ్స్ మన శరీరంలో ఉత్పత్తి కావు. ఇలాంటి అమైనో ఆసిడ్స్ కలబంద రసం నుంచి మనం పొందవచ్చు. అలాగే శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను కలబంద రసం నుంచి మనం పొందవచ్చు.

దివ్య ఔషధంగా పనిచేస్తుంది

దివ్య ఔషధంగా పనిచేస్తుంది

కలబంద వల్ల ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. జీర్ణవ్యవస్థలో పేరుకు పోయిన వ్యర్థ, విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకును తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులను మటుమాయం చేస్తుంది. కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ళనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

ఆరోగ్యంగా ఉండవచ్చు

ఆరోగ్యంగా ఉండవచ్చు

కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. కలబంధ అటు తరుణ వ్యాధులకు, ఇటు దీర్ఘ వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవొచ్చు

లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవొచ్చు

కలబంద ద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవొచ్చు.

శృంగారం కోరికలు పెరిగి సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనాలంటే ఈ విధంగా చెయ్యాలి. ముందుగా కలబంద వేర్లను శుభ్రం చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో పాలను పోసి అందులో కలబంద వేర్లను ఉడికించాలి.

వేర్లను పొడిగా చేసుకోవాలి

వేర్లను పొడిగా చేసుకోవాలి

ఉడికించిన వేర్లను పాల నుంచి తీసి ఆరుబయట లేదంటే ఫ్యాన్ కింద బాగా ఎండబెట్టాలి. తర్వాత ఆ వేర్లను పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రోజుకో టీ స్పూన్ లెక్కన పాలులో కలిపి తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

ఎక్కువ సేపు సెక్స్ చేయగలుగుతారు

ఎక్కువ సేపు సెక్స్ చేయగలుగుతారు

మగవారు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది కొన్ని క్షణాల్లోనే సెక్స్ లో ఔటైపోతుంటారు. అలాంటి వారికి కలబంద వేర్ల పొడి ద్వారా తయారు చేసే జ్యూస్ సూపర్బ్ గా పని చేస్తుంది. దీన్ని ఎవరైనా తాగొచ్చు. ఇలా చేస్తే క్రమంగా మీరు ఎక్కువ సేపు సెక్స్ చేయగలుగుతారు.

విరేచనాలు కలుగుతాయి

విరేచనాలు కలుగుతాయి

కొంత మంది వారి భోజనానికి ముందుగా ఆహరం జీర్ణం అవటానికి, పోషకాలను గ్రహించుకోటానికి, ఆహర విచ్చిన్నానికి గానూ ఈ రసాన్ని తీసుకుంటారు. తగిన మొత్తంలో తీసుకోవటం వలన పేగు కదలికలకు ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువ ఉపయోగాలున్నాయని అధిక మొత్తంలో కలబంద రసం తీసుకోవటం వలన విరేచనాలు కలుగుతాయి. తిమ్మిరులు వస్తాయి.

మందులతో పాటు వద్దు

మందులతో పాటు వద్దు

ఎవరైనా డాక్టర్ చెప్పిన మందులను మీరు ఉపయోగిస్తుంటే ఆ సమయంలో మీరు కలబంద రసం తాగడం మంచిది కాదు. కలబంద జ్యూస్ మందులతో కలిసిపోయి దుష్ప్రభావాలను అధికం చేస్తుంది. కలబంద రసంలో ఉండే లాక్సైటీవ్ గుణాలు మీరు వేసుకున్న మందులను శరీరం గ్రహించకుండా చేస్తాయి.

గర్భంతో ఉన్న ఆడవారు తాగకపోవడం మంచిది

గర్భంతో ఉన్న ఆడవారు తాగకపోవడం మంచిది

మందులను వేసుకున్న సమయంలో కలబంద రసం తాగితే శరీర రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు, పొటాషియం స్థాయిలు తగ్గుతాయి. దీంతో చాలా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. అలాగే కలబంద రసాన్ని ఎక్కువగా తాగితే అలర్జీలు కూడా కలుగుతాయి. గర్భంతో ఉన్న ఆడవారు కలబంద జ్యూస్ తాగకపోవడం చాలా మంచిది.

English summary

wonderful benefits of aloe vera juice

wonderful benefits of aloe vera juice
Desktop Bottom Promotion