For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నైట్ షిఫ్టు లతో సతమతమవుతున్నారా, ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

|

నైట్ షిఫ్టు లతో సతమతమవుతున్నారా, ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

కాలంతో సమానంగా మనిషి జీవ గడియారం ప్రకృతి తో మమేకమై పయనిస్తూ ఉంటుంది. అందువలనే మన పూర్వీకుల కాలం నుండి సూర్యోదయంతో నిద్ర లేచి, సూర్యాస్తమయానికి సేద తీరేలా మన శరీరం తీర్చిదిద్దబడి ఉంటుంది. కానీ కాలక్రమేణా వృత్తిపరమైన భాద్యతల మూలంగా రాత్రి వేళల యందు కూడా ఉద్యోగ భాద్యతలు నిర్వహించక తప్పని పరిస్తితి నెలకొంది. ప్రపంచవ్యాప్త దేశాల సమిష్టి ప్రయోజనాలకై, ఈ పరిస్తితి తప్పడంలేదు.

సూర్యాస్తమయానికి రోజు పూర్తయిన భావన మనందరిదీ. రోజంతా ఉన్న పని ఒత్తిడిని దూరం చేసి మరుసటి రోజు సమాయత్తం అవడానికి రాత్రి నిద్ర అత్యంత అవసరం. కానీ అన్ని వేళలా మనం అనుకున్నట్లే జరగదు కదా.

Working In Night Shift?
మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ప్రపంచీకరణకు అడుగులు పడుతూ దేశంలో అనేక ఉద్యోగాలు లభించడం నిరుద్యోగులకు ఆహ్వానించదగ్గ పరిణామమే. కాకపోతే అధిక శాతం నైట్ షిఫ్ట్లు ఉండడం సర్వ సాధారణమైపోయింది ఈరోజుల్లో.

ప్రపంచంలో తూర్పు వైపున మనదేశంలో మనిషి రాత్రివేళల యందు పని చేస్తున్నాడు అంటే, పశ్చిమ దేశాల్లోని తన ఖాతాదారులకు సౌలభ్యంగా సేవలందిస్తున్నట్లు అర్ధం. కానీ ఈ పరిస్తితుల కారణంగా నైట్ షిఫ్ట్ అనేది ఈ కాలంలో అనివార్యమే.

కానీ పనివేళల అసాధారణ మార్పులు ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతాయని తెలియనిది కాదు. కానీ కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని, తద్వారా ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలరు. కావున రాత్రి వేళల పనిచేసే ఉద్యోగులు తీసుకోవలసిన చిట్కాలను ఇచ్చట పొందుపరచడం జరిగినది.

1.మిమ్మల్ని మీరు సిద్దపరచుకోండి

1.మిమ్మల్ని మీరు సిద్దపరచుకోండి

నైట్ షిఫ్ట్ నందు ప్రవేశించడం నిజానికి అంత తేలికైన విషయo కాదు. కానీ ఉద్యోగంలో చేరుటకు కనీసం రెండు రోజుల ముందు నుండే శరీరాన్ని సమాయత్తపరచుకోవడం వలన, ఉద్యోగ వేళలయందు సమస్యలు లేకుండా అడుగుపెట్టవచ్చు. ఈ విధంగా రెండు రోజుల ముందు నుండే నిద్ర సమయాలను మార్చుకోవడం ద్వారా జీవక్రియలు, నైట్ షిఫ్ట్ లందు మీకు సహాయపడేలా మీ శరీరం మార్చుకోగలుగుతుంది.

ఒక వేళ మీరో మెట్రోపాలిటన్ నగరాలలో నివసిస్తున్నట్లయితే మీ జీవన శైలి మీరు ట్రాఫిక్ నందు వెచ్చించే సమయం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. కావున ఇలాంటి పరిస్థితుల్లో పైన చెప్పిన విధంగా జీవన శైలిలో మార్పులు అంటే, జరగని పనే అవుతుంది.

2.ఆహారానికి ప్రాముఖ్యతనివ్వండి

2.ఆహారానికి ప్రాముఖ్యతనివ్వండి

రాత్రివేళల ఉద్యోగాలు చేసే వారిలో ఎక్కువ శాతం ఒక పూట కనీసం భోజనాన్ని మానేస్తూ ఉండడం సర్వసాధారణం. కానీ ఇలాంటి పనులు శరీరంపై దుష్ప్రభావాలని చూపిస్తాయి. మీరు ఏ సమయాన పని చేస్తున్నారు అని జీవక్రియలకు సంబంధం ఉండదు, మీ జీవక్రియలు సవ్యంగా కొనసాగాలి అంటే మీ శరీరానికి కావలసిన పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అలా సరిగ్గా మీ శరీరానికి మీరు అందివ్వగలుగుతున్నారో లేదో సరిచూసుకోండి. ఒకే సారి ఎక్కువ తినే కన్నా, మిత భోజనం ఎక్కువసార్లు చేసేలా ఉండండి. అవసరానికి డ్రైఫ్రూట్స్ వంటివి మీతో కారీ చేయండి. మీ ఆహారంలో భాగంగా పండ్లు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ భాగంగా ఉన్నాయో లేదో చూసుకోండి. సమయానుసారం ఆహారం, నీరు తీసుకోవడం వలన శరీరo డీ హైడ్రేట్ కి గురవకుండా ఉంటుంది. తద్వారా ఉద్యోగాన్ని, ఆరోగ్యాన్ని మరియు ఇంటినీ సమానంగా క్రమబద్దీకరించగలుగుతారు.

3.తగినంత నిద్ర కలిగి ఉన్నారా ?

3.తగినంత నిద్ర కలిగి ఉన్నారా ?

సగటు మనిషికి కనీసం రోజుకి 8 గంటల నిద్ర అవసరం. వైద్యుల సూచనల ప్రకారం, నిద్ర పోవడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. శరీరాన్ని సేద తీర్చేలా రోజులో ఒకటికి రెండు సార్లు నిద్రపోయినా సరిపోతుంది. కానీ కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవడం వలన జీవక్రియలకు ఎటువంటి విఘాతం కలగదు. కావున ఏది ఏమైనా ఎటువంటి పరిస్థితులలో అయినా రోజుకి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం ముఖ్యం.

4.వ్యాయామం చేయండి.

4.వ్యాయామం చేయండి.

రాత్రి వేళల ఉద్యోగాలు చేసేవారిలో అధికశాతం వ్యాయామానికి సరైన సమయం వెచ్చించలేక పోతున్నామని చెప్తుంటారు. కానీ పగటి వేళల పని చేసే వారికన్నా రాత్రివేళల పని చేసే వారికి మిగులు సమయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. పగటివేళల పనిచేసేవారికి ట్రాఫిక్ వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. కావున వ్యాయామానికి సమయం సరిపోవడం లేదు అనడం సరికాదు. రోజులో 24 గంటలలో అరగంట వ్యాయామానికి కేటాయిస్తే రోజంతా శరీరం ఉత్తేజంగా పని చేస్తుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి.

5.కెఫీన్ పదార్ధాలు తగ్గించండి

5.కెఫీన్ పదార్ధాలు తగ్గించండి

రాత్రివేళల పనులకు సమాయత్తం అవడానికి, నిద్రని దూరo చేయడానికి ఎక్కువ శాతం కాఫీ, టీ లకు మొగ్గు చూపుతూ ఉంటారు. కొందరైతే ఏకంగా గంటలో రెండు మూడు కాఫీలు తాగే అలవాటు కలిగి ఉంటారు. కానీ ఇలా కెఫీన్ అధికంగా తీసుకోవడం వలన జీవక్రియలపై ప్రభావం పడి అనేక రకములైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మానసిక ఆందోళనలు పెరగడం, నిద్రలేమి, డీ హైడ్రేషన్ వంటి సమస్యలు అధికమవడం జరుగుతాయి. కావున వీలైనoత వరకు కెఫీన్ స్వీకరించడం తగ్గించండి. కొందరు ఎనర్జీ డ్రింక్స్ కు కూడా అలవాటు పడి ఉంటారు. ఇలాంటివి అత్యంత ప్రమాదకరం అని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవి శరీరానికి మంచికన్నా, చెడే ఎక్కువ చేస్తాయి.

6.మానసిక ఆందోళనలు తగ్గించండి

6.మానసిక ఆందోళనలు తగ్గించండి

వారంతరంలో మీ ప్రియమైన వారితో సమయం వెచ్చించడానికి కేటాయించండి. ఒకవేళ వారిని నేరుగా కలవలేని పక్షంలో వారితో కనీసం మెసేజ్, కాల్స్ రూపంలో అయినా దగ్గరగా ఉండండి. సెలవు దినాల్లో, మీకు నచ్చిన కార్యక్రమాలపై దృష్టి సారించండి. వినసొంపైన పాటలు వినడం, క్రీడలు, స్విమ్మింగ్ వంటివి మీ మానసిక ఆందోళనలను తగ్గించుటలో ఎంతగానో సహాయపడుతాయి. జీవితంలో ప్రతి ఒక్క కోణాన్ని ఆస్వాదించాలి. కేవలం ఒకే విషయానికి పరిమితమై బ్రతకడం సగం ఆందోళనలకు కారణం. గమనించండి.

7.ముదురురంగు కర్టెన్లకు ప్రాధాన్యం ఇవ్వండి

7.ముదురురంగు కర్టెన్లకు ప్రాధాన్యం ఇవ్వండి

కొందరు ఇది తేలికగా తీసుకుంటారు. కానీ ఇది ఎంతో ముఖ్యమైన విషయం. చాలామంది నైట్ షిఫ్ట్ ఉద్యోగులు పగటివేళల యందు నిద్రపోవడం సమస్యగా ఉందని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం, పగటివేళలనందున్న సూర్యకాంతి. తేలికపాటి కర్టెన్లు సూర్యకాంతిని ప్రసరించకుండా ఆపలేవు, కావున ముదురు వర్ణంలోని దృఢమైన కర్టెన్లను వాడడం మూలంగా సూర్యకాంతి తగ్గి, నిద్ర కి అనువుగా ఉంటుంది.

8.ప్రయాణాలు తక్కువగా ఉండేలా చూసుకోండి

8.ప్రయాణాలు తక్కువగా ఉండేలా చూసుకోండి

మీ కార్యాలయానికి , ఇంటికి మద్య దూరం తక్కువ ఉండేలా చూసుకోవడం మొదటి భాద్యత. దీనివలన ఖర్చు, శ్రమ తగ్గడంతో పాటు ఇతరములైన కార్యాలకు కూడా సమయాన్ని వెచ్చించగలుగుతారు. కావున వీలైనంతగా ట్రాఫిక్ లో తక్కువ సమయం గడిపేలా దూరం కలిగి ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఇది మీకు ఆరోగ్యకరమైన గమనాన్ని సుగమం చేస్తుంది.

9.రొటేటింగ్ షిఫ్ట్ల విషయం లో జాగ్రత్త

9.రొటేటింగ్ షిఫ్ట్ల విషయం లో జాగ్రత్త

అధిక శాతం ఉద్యోగులు కార్యాలయాలయందు ఈ తరహా సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు. ఒకరోజు పగటి వేళ షిఫ్ట్ ఉంటే, మరుసటి రోజు రాత్రివేళ షిఫ్ట్ ఉంటుంది. ఇలాంటివి ఆరోగ్యంపై పెను ప్రభావాన్నే చూపిస్తాయి. కావున ఈ రొటేటింగ్ షిఫ్ట్ల విషయంలో మీ జీవగడియారం తగిన విధంగా ఉందో లేదో సరిచూసుకోండి. మీ నిద్ర సమయం సరిపోతుందా లేదా చూసుకోవడం కూడా ముఖ్యం. లేనిచో జీవక్రియలపై ప్రభావం పడి అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది.

10.వ్యక్తిగత సమయం కూడా ముఖ్యమే

10.వ్యక్తిగత సమయం కూడా ముఖ్యమే

మీరు ఒక రాత్రి షిఫ్ట్ లో ఉన్నందువల్ల, మీకు నచ్చిన పనిని కానీ అలవాటుని కానీ నిలిపివేయాలని దీని అర్ధం కాదు. మీకంటూ వ్యక్తిగత స్వేచ్చ కూడా అవసరమని నిర్ధారించుకోండి. మీ అలవాట్లని త్యజింపనవసరంలేదు. ఈ విధంగా మీకు నచ్చిన, తోచిన పనులకు సమయాన్ని కేటాయించడం మూలంగా మీ ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన మానసిక ప్రశాంతతని కూడా ఇస్తుంది.


English summary

Working In Night Shift? These Simple Tips Can Help You Manage Your Health Like A Boss!

It is a common belief that this type of a work schedule takes a toll on one's health. While to some extent this is true, the fact remains that by taking certain care, it can be ensured that one maintains their health even while doing a night-shift job. For those working in night shifts, here is a list of ten tips that will enable them to maintain their health and fitness.
Desktop Bottom Promotion