For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊపిరితిత్తుల కాన్సర్, ధూమపానానికి మాత్రమే అంకితం కాదు! ధూమపానానికి మించిన అంశాలు ఉన్నాయి మరి.

ఊపిరితిత్తుల కాన్సర్, ధూమపానానికి మాత్రమే అంకితం కాదు! ధూమపానానికి మించిన అంశాలు ఉన్నాయి మరి.

|

పొగరాయుళ్ళని చూస్తేనే ఊపిరితిత్తుల కాన్సర్ గుర్తొస్తుందా? ఇకముందు ధూమపానం కూడా అనేక కారకాల్లో ఒకటి అని సరిపెట్టుకుంటారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ మీద జరిగిన ఒక కొత్త అధ్యయనంలో యువత మరియు స్త్రీలలో ఈవ్యాధి కారకాల మీద, ముఖ్యంగా ధూమపానం మీద ఉన్న ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చివేసేలా కనిపిస్తుంది.

ధూమపానం-ఊపిరితిత్తుల క్యాన్సర్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే, సాధారణంగా ఈవ్యాధి, పొగరాయుళ్ళ వ్యాధిగా గుర్తింపు పొందింది. దేశ రాజధాని డిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో 150మంది ఔట్-పేషంట్ విభాగంలోని రోగులమీద చేసిన అధ్యయనంలో, కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ అంచనాలు భిన్నంగా మారుతున్నట్లు కనిపిస్తుంది.

World Lung Cancer Day: Lung cancer no more a smoker’s disease: Study,

"ఊపిరితిత్తుల క్యాన్సర్, కాన్సర్ చరిత్రలోనే అధిక మరణాల రేటును కలిగి ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు. చికిత్సలో పురోగతి ఉన్నప్పటికీ, మరణాల రేటు తగ్గింపులో మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రస్తుతం భారతదేశంలోని కాన్సర్ మరణాలలో కల్లా, అధిక మొత్తంలో ఉన్నాయి. కాని అధ్యయనం ప్రకారం, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా యువత మరియు ధూమపానం చేయని వారిలో కనపడడం కొంచం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. వీరు చెప్పిన వివరాల ప్రకారం, మార్చి 2012 నుండి జూన్ 2018 వరకు మేము చికిత్స చేసిన రోగుల వివరాలను విశ్లేషించాలని నిర్ణయించాము. ఈ విశ్లేషణ ఆధారితంగా, కొత్త అంశాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము అని ఆసుపత్రిలో చైర్మన్ నీరజ్ జైన్ తెలిపారు.

World Lung Cancer Day: Lung cancer no more a smoker’s disease: Study,

ఫలితాల ప్రకారం 21 శాతం మంది రోగులు 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. వీరిలో 5 శాతం మంది 30 సంవత్సరాల వయసు కన్నా తక్కువగా ఉన్నారు. వీరిలో సగం మంది ధూమపానం చేయని వారే, వీరు వాయుకాలుష్యం బారిన పడ్డవారుగా ఉన్నారు. ఈ ఫలితాల ఆధారంగా వాయుకాలుష్యం, ధూమపానాన్ని మించిన కారకంగా ఉందని తెలుస్తూ ఉంది. 30 సంవత్సరాల కింద ఉన్న పేషంట్స్, ధూమపానం చేయని వారిగానే ఉన్నారు. పురుషుల మరియు మహిళల నిష్పత్తి, 3.8: 1 గా ఉంది. “గతంలో మహిళా రోగుల నిష్పత్తితో పోలిస్తే, ప్రస్తుత పరిస్థితులలో గణనీయమైన పెరుగుదల కనపడుతున్నట్లుగా తేలింది. ఒకప్పుడు స్త్రీలలో చాలా తక్కువగా ఉండేది." అని ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ డే సందర్భంగా పరిశోధకులు చెప్తున్న మాట.

అంతేకాకుండా, 30శాతం మంది రోగులకు వ్యాధి నిర్ధారణ మరియు చికిత్సలో ఆలస్యం జరగడానికి ప్రధాన కారణం ఊపిరితిత్తుల కాన్సర్ వ్యాధిని, క్షయవ్యాధిగా తప్పుడు నిర్ధారణ చేయడమే. సర్ గంగారాం హాస్పిటల్, సెంటర్ ఫర్ చెస్ట్ సర్జరీ చైర్మన్, డాక్టర్ అరవింద్ కుమార్, మాట్లాడుతూ, తక్కువ సంఖ్యలో రోగుల పరిమితి ఉన్నప్పటికీ, ఈ అధ్యయనం ఊపిరితిత్తుల క్యాన్సర్ సంభావ్యతలో ముఖ్యమైన ధోరణిని సూచించింది అని తెలిపారు.

World Lung Cancer Day: Lung cancer no more a smoker’s disease: Study,

"50 ఏళ్లలోపు రోగులలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపించింది, ముఖ్యంగా 30 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారిలో;

మహిళల నిష్పత్తి పెరుగుదల , ధూమపానం చేసేవారిని మరియు చేయనివారితో పోల్చినప్పుడు 1:1 నిష్పత్తిలో ఉండడం గమనార్హం. అనగా ధూమపానం చేసే వారి సంఖ్య, కాలుష్య కోరలకు గురై కాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఇంచుమించు ఒకేలా ఉన్నదని తేలిందని తెలిపారు.

ఈ అద్యయనం ప్రధానంగా దేశవ్యాప్తంగా ఊపిరితిత్తుల కాన్సర్ బారిన పడిన వ్యక్తుల వివరాలను సేకరించాల్సినదిగా, క్రమంగా వ్యాధిని తగ్గించే మార్గాల వైపుకు కార్యాచరణలు చేపట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నట్లుగా ఉంది. మరియు ప్రారంభదశలోనే గుర్తించడం, ధూమపానం, బాహ్య-అంతర్గత వాయుకాలుష్యం మొదలైన ప్రధాన అంశాలను నియంత్రించడానికి బలమైన మరియు తక్షణ కార్యాచరణలు తీసుకోవడం ద్వారా, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేస్తుంది.

World Lung Cancer Day: Lung cancer no more a smoker’s disease: Study,

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

World Lung Cancer Day: Lung cancer no more a smoker’s disease: Study

Lung cancer has a very high mortality. Despite advances in treatment, reduction in mortality rates has been marginal. This cancer currently causes the largest number of deaths due to any cancer in India. We noted a disturbing trend in out-patient clinic where we increasingly saw lung cancer in relatively younger people and non-smokers. We decided to analyse details of these patients who underwent treatment with us from March 2012 to June 2018. The objective was to unravel new trends,” Neeraj Jain, chairman, chest medicine, at the hospital said today
Story first published:Wednesday, August 1, 2018, 17:32 [IST]
Desktop Bottom Promotion