For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటో విత్తనాలు: ప్రయోజనాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్

|

భారతీయ వంటకాలలో టొమాటో అత్యంత కీలకమైన కూరగాయగా ఉంటుందని మనందరికీ తెలుసు. కొందరు వంటలలోనే కాకుండా, నేరుగా లేదా జ్యూస్ రూపంలో అయినా తీసుకునేందుకు మక్కువను ప్రదర్శిస్తుంటారు. ఒకరోజులో టొమాటో లేకుండా వంటలను ఊహించుకోవడం కూడా కష్టమే. ఇది కేవలం కూరగాయ లేదా పండుగా మాత్రమే కాకుండా, ఎక్కువ రసాన్ని కలిగి ఉండి, కెచప్, సాస్, సూప్, జ్యూస్, సలాడ్స్ వంటి రూపాలలో కూడా దీని వినియోగం ఉంటుంది. టొమాటో చర్మం, జ్యూస్ మరియు విత్తనాలు వాటి వాటి లక్షణాలను అనుసరించి శారీరిక ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా అనేక అవసరాలకు వినియోగించడం జరుగుతుంది.

ముఖ్యంగా టొమాటో విత్తనాలకు సంబంధించిన అనేక ఆరోగ్యకర ప్రయోజనాల గురించిన వివరాలను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. సహజంగా ఈ టొమాటోలను అనేకమంది ఇళ్ళల్లోనే పెంచడం జరుగుతుంటుంది కూడా. పెద్దగా శ్రమ అవసరం లేకుండానే, అతి తక్కువ ఖర్చు నిర్వహణతోనే మంచి ఫలితాలను సాధించగలరు. ఈ టమోటాలలో ఎక్కువగా దీని రసం గురించిన వివరాలే ఎక్కువగా చర్చిస్తుంటారు కానీ, దీని విత్తనాలలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయన్న విషయం విస్మరిస్తుంటారు. వాస్తవానికి టొమాటో విత్తనాలను ఎండిన తర్వాత వినియోగించడం జరుగుతుంటుంది, దీనిని పౌడర్ రూపంలో మరియు టొమాటో గింజల నూనె రూపంలో వినియోగించడం జరుగుతుంటుంది. వీటిలో అద్భుతమైన సౌందర్య మరియు జీర్ణ సంబంధమైన ప్రయోజనాలు దాగున్నాయని చెప్పబడుతుంది.

Tomato Seeds

వాస్తవానికి టొమాటో గింజల వెలుపలి భాగం కఠినతరంగా ఉంటూ, జీర్ణక్రియలకు అంతరాయం కలిగించేలా ఉంటాయి. అయితే మీ పేగుల్లో ఉన్న జీర్ణాశయ సంబంధిత ఆమ్లాలు గింజల వెలుపలి పొరను జీర్ణం చేసి, ఆ తర్వాత మలం ద్వారా మీ శరీరం నుండి వ్యర్దాలను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. టొమాటో గింజలకు సంబంధించిన అనేక అపోహలలో అపెండిసైటిస్ సమస్య కూడా ఒకటి. టొమాటో గింజలు అపెండిసైటిస్ సమస్యకు దారితీస్తాయని అనేకమంది అపోహ చెందుతున్నారు. నిజానికి ఈ అపెండిసైటిస్ ఉండుకానికి (అపెండిక్స్) సంబంధించిన వాపు. విటమిన్ - ఎ మరియు విటమిన్ - సి సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు, డైల్యూటెడ్ ఫైబర్ నిల్వలకు గొప్ప మూలంగా కూడా ఉంటాయి. క్రమంగా ఇవి అపెండిసైటిస్ సమస్యకు ఏమాత్రం కారణం కాజాలదని గుర్తుంచుకోండి.

టొమాటో విత్తనాలు : ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు

టొమాటో విత్తనాల ఆరోగ్య ప్రయోజనాలు :

టొమాటో విత్తనాల ఆరోగ్య ప్రయోజనాలు :

మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో టొమాటో విత్తనాలు ఏవిధంగా, మరియు ఎటువంటి మార్గాలలో సహాయపడగలదో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రక్త ప్రసరణలో సహాయపడుతుంది :

1. రక్త ప్రసరణలో సహాయపడుతుంది :

కొన్ని వైద్యపరమైన అధ్యయనాలు మరియు యూరోపియన్ యూనియన్ ఆరోగ్య నిపుణుల ప్రకారం, టొమాటో విత్తనాల వెలుపలి భాగంలో కనిపించే సహజ సిద్దమైన జెల్ మీ రక్తప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా చేయడంలో మరియు రక్త నాళాల ద్వారా మీ రక్తం సజావుగా ప్రవహించడంలో సహాయం చేస్తుంది.

2. రక్తం గడ్డకట్టడం నిరోధిస్తుంది :

2. రక్తం గడ్డకట్టడం నిరోధిస్తుంది :

కొన్ని అధ్యయనాల ప్రకారం, ఈ టొమాటో విత్తనాలు కొన్నిప్రత్యేకమైన గుణాలను కలిగి ఉన్నాయని చెప్పబడింది. ఈ లక్షణాల ద్వారా, రక్తం గడ్డకట్టే ప్రమాదాలను తగ్గించడంలో ఈ టొమాటో విత్తనాలు సహాయం చేయగలవని సూచించబడింది. రక్తం గడ్డకట్టే ప్రమాదాలను తగ్గించడానికి ఆస్పిరిన్ టాబ్లెట్లు వినియోగించడం బదులుగా టొమాటో విత్తనాలను తీసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటుగా ఉంటుందని చెప్పబడింది. ఇది కడుపులో బ్లీడింగ్ మరియు అల్సర్స్ వంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా చేయడంలో సహాయపడుతుంది.

3. ఆస్పిరిన్ టాబ్లెట్లకు ప్రత్యామ్నాయం :

3. ఆస్పిరిన్ టాబ్లెట్లకు ప్రత్యామ్నాయం :

అధిక రక్తపోటు మరియు ఇతర హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, తరచుగా వైద్యుల సలహా మేరకు ఆస్పిరిన్ టాబ్లెట్లను అనుసరిస్తుంటారు. ఇది ఉపశమనాన్ని అందిస్తున్నప్పటికీ, దీర్ఘకాలిక వాడకం కారణంగా, అల్సర్స్ వంటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. టొమాటో విత్తనాలు ఆస్పిరిన్లో ఉన్న గుణాలను కలిగి ఉంటాయని చెప్పబడింది. అంతేకాకుండా ఆస్పిరిన్ టాబ్లెట్ల వలన కలిగే దుష్ప్రభావాలు , వీటిలో ఉండవు. ఈ విత్తనాలను తీసుకున్న మూడు గంటలలోపే రక్త ప్రవాహంలో మెరుగుదలను చూపించగలదని నిరూపించబడింది. దీనికి ఈ విత్తనాలలో ఉండే జెల్ సహకరిస్తుందని చెప్పబడింది.

4. గుండె ఆరోగ్యానికి మంచిది :

4. గుండె ఆరోగ్యానికి మంచిది :

ఈ వాదనకు నిర్ధిష్ట అధ్యయనాలు లేనప్పటికీ, వీటిలోని లక్షణాల కారణంగా మీ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో టొమాటో విత్తనాలు ప్రభావం చూపగలవని సూచిస్తున్నారు. కొన్ని ప్రత్యేకించబడిన ఆహార ప్రణాళికలలో తరచుగా ఈ టొమాటో విత్తనాలను తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణలో, కొన్ని జీవక్రియలు సవ్యంగా సాగడంలో సహాయం చేయడం ద్వారా, గుండె ఆరోగ్యానికి దోహదపడగలదని చెప్పబడింది.

5. జీర్ణక్రియకు మంచిది :

5. జీర్ణక్రియకు మంచిది :

టొమాటో విత్తనాలలో తగినంత మోతాదులో పీచు పదార్థాలు ఉన్న కారణంగా, జీర్ణక్రియలకు ఎంతో ఉత్తమంగా సహాయపడగలదని చెప్పబడింది. ఇది ఒక గణనీయమైన మొత్తంలో డైల్యూటెడ్ అమైనో ఆమ్లాలు మరియు టిమెన్లను కలిగి ఉంటుంది, ఇవి మీ జీర్ణక్రియలను మరింత మెరుగుపరుస్తాయి.

టొమాటో గింజల వలన కలిగే దుష్ప్రభావాలు :

టొమాటో గింజల వలన కలిగే దుష్ప్రభావాలు :

ఏది కూడా పరిమితి దాటితే కొన్ని దుష్ప్రభావాలను ప్రదర్శిస్తుంటాయని మనకు తెలియనిది కాదు. అనగా, మన శరీరానికి ఎంత లాభసాటి ప్రయోజనాలను కలిగి ఉన్నా, వాటి వినియోగం సరిగా లేనప్పుడు కొన్ని ప్రతికూలతలు కూడా కలిగి ఉండొచ్చు. ఇవి అనేక ఆరోగ్య పరిస్థితులు, అలెర్జీలు మరియు ఇతర కారకాల మీద కూడా ఆధారపడి ఉండవచ్చు.

1. మూత్రపిండాల్లో రాళ్లకు కారణం కావొచ్చు :

1. మూత్రపిండాల్లో రాళ్లకు కారణం కావొచ్చు :

టమాటో గింజల్ని అధిక మోతాదులో తీసుకుంటున్న ఎడల, వాటి కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశముందని శాస్త్రీయంగా పేర్కొన్నప్పటికీ ఒక పరిమిత మోతాదు వరకు తీసుకోవచ్చునని చెప్పబడుతుంది. కానీ, ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వ్యక్తికి మాత్రం, ఎట్టిపరిస్థితుల్లో ఈ టొమాటో విత్తనాలను సూచించడం జరగదు. ఇవి పరిస్థితిని తీవ్రతరం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. టొమాటో విత్తనాలలో ఉండే ఆక్సాలేట్స్, మూత్రపిండాలు కాల్షియం అధికంగా శోషించుకోవడానికి కారణమవుతుంది. క్రమంగా ఇవి మూత్ర పిండాలకు హానికరంగా పరిణమిస్తుంది. క్రమంగా ఈ కాల్షియం కారణంగా, మూత్ర పిండాల్లో రాళ్లు అభివృద్ధి చెందుతాయి. కావున, ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు టొమాటో విత్తనాలను తీసుకోవడం నివారించాలి.

2. డైవర్టిక్యులిటిస్ (పెద్దపేగుల్లో సంచులు ఏర్పడడం) సమస్యకు కారణం కావచ్చు :

2. డైవర్టిక్యులిటిస్ (పెద్దపేగుల్లో సంచులు ఏర్పడడం) సమస్యకు కారణం కావచ్చు :

నిర్ధిష్టమైన శాస్త్రీయ రుజువులు లేకపోయినప్పటికీ, డైవర్టిక్యులిటిస్ సమస్యతో ఉన్న వ్యక్తులు టొమాటో విత్తనాలను వినియోగించకూడదని సలహా ఇవ్వబడుతుంది. పెద్ద పేగులో సంచులు ఏర్పడడం, వాపును తీవ్రతరం చేసే అవకాశాలు ఉన్న కారణంగా టొమాటా గింజల పరంగా కొన్ని ప్రత్యేక సమస్యల నందు జాగ్రత్తలు సూచించబడుతాయి.

మీ ఆహారంలో టొమాటో విత్తనాలను జోడించడం ఎలా :

మీ ఆహారంలో టొమాటో విత్తనాలను జోడించడం ఎలా :

• టమోటా నుండి గింజలను వేరు చేసి మీ ఆహారంలో చేర్చుకుని తీసుకోవచ్చు.

• ఎండబెట్టి పొడి చేసి సలాడ్లకు జోడించుకోవచ్చు.

• విత్తనాలపై కొంత ఉప్పు చల్లి టొమాటో గింజలను నేరుగా తీసుకోవచ్చు ఆస్వాదించండి.

• టొమాటో గింజల గురించిన మరిన్ని వివరాలకు మీ న్యూట్రిషనిస్టుని లేదా వైద్యుని సంప్రదించండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Tomato Seeds: Benefits And Side Effects

Tomato seeds are rich in vitamin A and vitamin C. The skin, seeds and flesh of a tomato can be used for consumption due to the plethora of health benefits it possesses. The tough outer shell of tomato seeds makes it indigestible. But, the stomach acids present in your intestines digest the outer layer of the seeds, which then is removed from your body through faeces.
Desktop Bottom Promotion