For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆసనం వేస్తే ఆ సమ్యలన్నీ పోతాయి, వేసి చూడండి

|

చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులుపడుతుంటారు. అయితే కొన్ని రకాల యెగా ఆసనాల ద్వారా ఇలాంటి సమస్యని తగ్గించుకోవొచ్చు. భుజంగాసనం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవొచ్చు. రోజూ భుజంగాసనం ద్వారా రోజూ వేస్తే శ్వాసకోశ వ్యాధులు మొత్తం పోతాయి.

గడ్డం నేలకు తాకేలా

గడ్డం నేలకు తాకేలా

మరి భుజంగాసనం ఎలా వేయాలో చూడండి. ముందుగా నేలమీద లేదంటే ఫ్లోర్ మీద క్లాత్ లేదంటే మ్యాట్ వేసుకోవాలి. దానిపై బోర్ల పడుకుని మీ గడ్డం నేలకు తాకేలా ఉంచండి. తర్వాత మీ ఛాతీకి కాస్త పక్కకు మీ అరచేతుల్ని చాచండి.

పాదాలు ఒక దాన్ని మరొకటి తాకుతూ

పాదాలు ఒక దాన్ని మరొకటి తాకుతూ

ఇక మీ మోచేతులు పైకి ఉండాలి. అలాగే మీ పాదాలు ఒక దాన్ని మరొకటి తాకుతూ ఉండాలి. తర్వాత మీరు నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. ఆ సమయంలో మీ బరువు మొత్తాన్ని కూడా అరచేతులపై ఉంచి అరచేతుల సహాయంతో మీ బాడీని పైకి లేపాలి. మీ తలను పైకి ఎత్తాలి. మెడ, ముఖంపైకి ఉండేలా చూసుకోవాలి.

నేలకు తాకకుండా

నేలకు తాకకుండా

మీ ఛాతితో పాటు మెడను వీలైనంతగా పైకి లేపి ఉంచాలి. దీంతో మీ వెన్ను కాస్త వంగినట్లుగా మారుతుంది. బొడ్డు దగ్గర నుంచి ముందు భాగం మొత్తం కూడా నేలకు తాకకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మీ భుజాలు బాగా బలంగా మారుతాయి. మీ చేతులకు మంచి ఎనర్జీ వస్తుంది. ఈ ఆసనాన్ని మీరు రెగ్యులర్ వేస్తే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

గర్భిణీలు వేయొద్దు

గర్భిణీలు వేయొద్దు

అయితే ఈ ఆసనాన్ని ప్రెగ్నెంట్స్ వేయకూడదు. ఎందుకంటే ఈ ఆసనం వేస్తే పొట్టపై ఎక్కువగా బరువుపడుతుంది. అందువల్ల దీన్ని వేయకూడదు. ఆపరేషన్లు చేయించుకున్న వారు అస్సలు వేయకూడదు. ఈ ఆసనం చాలా వ్యాధుల్ని నివారిస్తుంది. థైరాయిడ్‌ వ్యాధులు రావు. మెడ వాపులు, మెడ వ్యాధులు రావు. ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి. అలాగే వెన్నెముకకు మంచి శక్తి వస్తుంది. అజీర్తి సమస్యలుండువు.

Most Read :ఆ సమయంలో కలయిక జరిగితే కచ్చితంగా గర్భం వస్తుంది, ఎలాంటి అమ్మాయినైనా నెలరోజుల్లో నెల తప్పించొచ్చు

English summary

Yoga Pose for lungs cleaning and Breathing

The following asana will help you put your lungs to work and improve. your breathing capacity.