For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తులసి-అల్లంతో తయారుచేసిన ఈ టీని సేవించండి: కిడ్నీ స్టోన్ కు గుడ్ బై చెప్పండి..

తులసి-అల్లం టీ తాగండి: కిడ్నీ స్టోన్ కు గుడ్ బై చెప్పండి..

|

ఆరోగ్య సంరక్షణ విషయానికి వస్తే మనమందరం రకరకాల సమస్యలను ఎదుర్కొంటాము. దాన్ని అధిగమించడానికి మనం ఏమైనా చేయగలం. మనలో ప్రతి ఒక్కరు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఏమి చేయగలమో ఇక్కడ చూడండి.

రకరకాల రోగాలను నయం చేయడానికి సహజ మార్గాలు అనేకం ఉన్నాయి. ఆరోగ్యంలో తరచుగా తలెత్తే సమస్యలను నయం చేసుకోవడానికి మనం ప్రతి రోజూ తినె ఆహారాల్లో అల్లం మరియు తులసిని కూడా జోడించవచ్చు. ఈ రెండు హెర్బ్స్ రిమార్కబుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. తులసి ఆధ్యాత్మికంగా ప్రసిద్ది, అలాగే అల్లం ప్రతి వంటింట్లో ఉండే ఫేవరెట్ మసాలా దినుసు. ఆరోగ్య సంరక్షణలో ఎటువంటి సందేహం లేకుండా వీటిని రెగ్యులర్ డైట్ లో కలపవచ్చు.

ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక మంచి టీ తయారవుతుంది. టీ లవర్స్ కు ఈ టీ మహాఅద్భుతమైన రుచి, రంగు, సువానతో మనస్సు లాగేస్తుంది. మనస్సును ఉల్లాసభరితం చేస్తుంది. అంతే కాదు, ఈ రెండు హెర్బ్స్ లో విడివిడిగా ఔషధ గుణాలు అధికంగా ఉండటం చేత అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రెండింటి కలయికలో తయారుచేసే టీ సేవించడం వల్ల ఆరోగ్యానికి ఫర్ఫెక్ట్ హెల్తీ డ్రింక్. అదెలాగో చూద్దాం.

కిడ్నీ స్టోన్ తొలగిస్తుంది

కిడ్నీ స్టోన్ తొలగిస్తుంది

ఆరోగ్యానికి ఆటంకం కలిగించే కిడ్నీ స్టోన్ వంటివి మంచిది కాదు. కిడ్నీ స్టోన్స్ కు ముఖ్య కారణం యూరిక్ యాసిడ్. ఈ సమస్యలను తగ్గించడానికి, అల్లం తులసి టీ సహాయపడుతుంది. మూత్రంలో రాళ్ళు, లేదా మూత్రపిండాలలో రాళ్ళు వల్ల కలిగే అసౌకర్యం మారుతున్నజీవశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి, అల్లం తులసి కాంబినేషన్ టీ సేవించవచ్చు. అల్లం మరియు తులసి రెగ్యులర్ డైటేలో చేర్చుకోవడం ద్వారా కిడ్నీ స్టోన్స్ విచ్చిన్నం చేసి, నొప్పి నుండి ఉపశమనం పొందటానికి మరియు శరీరంలోని విషపదార్థాలు తొలగించడానికి సహాయపడుతుంది. అల్లం మరియు తులసి కాంబినేషన్ ను టీ రూపంలో తీసుకోవడం ద్వారా మరింత ఎఫెక్టివ్ , త్వరగా ఫలితాలను చూపెడుతుంది. కాబట్టి కిడ్నీ స్టోన్ తో భాదపడే వారు ఈ పరిస్థితి నుండి బయటపడటానికి మీరు ఈ టీని ప్రయత్నించవచ్చు.

ఒత్తిడిని తగ్గించడానికి

ఒత్తిడిని తగ్గించడానికి

నేటి ఆధునిక యుగంలో మానసిక ఒత్తిడి ఒక సమస్య. దాన్ని పరిష్కరించడానికి ఏమి చేయాలో కూడా చాలామందికి తెలియదు. కానీ ఈ పరిస్థితిని నయం చేయడానికి, మనం ఇప్పుడు అల్లం తులసి టీ తయారుచేసుకోవచ్చు. ఈ టీ సేవించడం ద్వారా మీలోని నిరాశతో కలిగే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ టీ డిప్రెషన్‌ను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. రోజూ తప్పకుండా ఒకటి రెండు కప్పుల టీని సేవించడం మంచిది.

శ్వాససంబంధిత సమస్యల నివారణకు

శ్వాససంబంధిత సమస్యల నివారణకు

శ్వాస సంబంధిత సమస్యలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అనారోగ్యమైనప్పుడు, జలుబు చేసినప్పుడు, ఇతర పరిస్థితుల్లో ఈ సమస్యను ఎదుర్కొనేవారు చాలా మంది ఉంటారు. అలాగే దీర్ఘకాలిక ఆస్త్మాతో భాదపడే వారు ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు ఈ టీని తీసుకోవచ్చు. అటువంటి అసౌకర్యాన్ని త్వరగా తొలగించడానికి ఇది సహాయపడుతుంది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు మరియు అసౌకర్యాన్ని తొలగించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ప్రత్యేకమైన టీ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది శ్వాసక్రియకు ఆటంకం కలిగించే ఉబ్బసం లాంటి ప్రమాదాన్ని తొలగిస్తుంది మరియు శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి

కొలెస్ట్రాల్ తగ్గించడానికి

ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ లాంటి హాని కలగించేవి మంచిది కాదు. ఈ సమస్యను తగ్గించడానికి మందులు తీసుకునే ముందు కొంత జాగ్రత్త తీసుకోవాలి. కానీ కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించడానికి, మనం అల్లం తులసి టీ తయారు చేసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి మరియు ఆరోగ్యంనికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి మనం ఎటువంటి సందేహం లేకుండా ఈ సమస్యను నివారణకు తులసి మరియు అల్లం టీని తాగొచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచడానికి

రోగనిరోధక శక్తిని పెంచడానికి

రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసి అల్లం టీ అత్యంత ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్లలో ఒకటి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏదేమైనా, ఆరోగ్యానికి హాని కలిగించే అనేక వ్యాధి లక్షణాలను తొలగించడానికి ఇది సహాయపడుతుంది. ఇది అలెర్జీని తగ్గిస్తుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల, ఈ అసౌకర్యాలను ఎదుర్కోవటానికి టీ అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి.

జలుబు మరియు దగ్గు:

జలుబు మరియు దగ్గు:

ఈ రెండింటి కాంబినేషన్లో ఒక కప్పు టీ తాగడం వల్ల జలుబు దగ్గును నివారిస్తుంది. అల్లంలో ఉండే లక్షణాలు ఊపిరితిత్తులను ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది. తులసిలో ఇన్ఫెక్షన్ నయం చేసే గుణాలు, అలర్జీని నివారించే లక్షణాలు, వాపు ఇతర అప్పర్ రెస్పిరేటరీ లక్షణాలను నివారించే గుణాలంటాయి. వీటన్నింటి ఎదుర్కోగల సామర్థం ఈ టీలో ఉంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణశక్తిని పెంచుతుంది. పొట్టకు సంబంధించిన ఇతర జీర్ణసమస్యలను నివారిస్తుంది. అల్లం జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. తిమ్మెర్లను నివారిస్తుంది. గ్యాస్ తొలగిస్తుంది. తులసి గ్యాస్ట్రిక్ అల్సర్ ఏర్పడకుండా చేస్తుంది. మరియు స్మూత్ ఫీలింగ్ కలిగిస్తుంది. తులసి మరియు అల్లం రెండూ వికారం తగ్గించే గుణాలు కలిగి ఉంటాయి.

బ్యాడ్ బ్రీత్ నివారిస్తుంది

బ్యాడ్ బ్రీత్ నివారిస్తుంది

ఈ రెండింటి కాంబినేషన్ టీలో బ్యాడ్ బ్రీత్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల నోటి నుండి దుర్వాసనను తొలగిస్తుంది. మీరు తాగే ప్రతి సిప్ తప్పనిసరిగా మీ నోటిని రిఫ్రెష్ చేస్తుంది.

English summary

8 Impressive Health Benefits of Tulsi Ginger Tea

Tulsi Ginger Green Tea is a remarkable combination of sacred Tulsi leaves and every Indian’s favourite spice – ginger. We have listed some of the health benefits of ginger tulsi tea, check it out.
Desktop Bottom Promotion