For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హంసా నందినికి క్యాన్సర్.. గ్రేడ్-3 బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి? చికిత్సా పద్ధతులేంటి...

|

టాలీవుడ్ హీరోయిన్ హంసా నందిని రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ నుండి వెల్లడించింది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి నాలుగు నెలల క్రితం తెలిసిందట. తన రొమ్ములో ఏదో గడ్డలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా.. గ్రేడ్-3 క్యాన్సర్ గా నిర్ధారణ అయినట్లు వివరించింది.

అయితే ఆపరేషన్ ద్వారా ఆ భాగంలో ఉండే గడ్డలను తొలగించారని.. హెరిడెటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అని రిపోర్టులు వచ్చాయని.. ఇప్పటికే తనకు తొమ్మిది సైకిల్స్ కీమోథెరపీ పూర్తయ్యిందని.. మరో ఏడు సైకిల్స్ బ్యాలెన్స్ ఉన్నట్లు హంసా నందిని తెలిపారు. చిరునవ్వుతో క్యాన్సర్ తో జయించి.. త్వరలో మళ్లీ వెండితెరపై కనిపిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది.

అందరికీ తన గురించి చెప్పి చాలా మందికి ఈ విషయంపై అవగాహన కల్పిస్తానని తన ట్విట్టర్ అకౌంట్ నుండి తెలియజేసింది. ఈ సందర్భంగా గ్రేడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి? దాని చికిత్స విధానం అంటే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గ్రేడ్-3 బ్రెస్ట్ క్యాన్సర్ అంటే?

గ్రేడ్-3 బ్రెస్ట్ క్యాన్సర్ అంటే?

ఇది ఎక్కువగా జన్యుపరమైన సమస్యల నుండి వస్తుంది. గ్రేడ్-3 బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కణతి దాటి వ్యాపిస్తుంది. ఇది బహుశా శోషరస కణుపులు మరిు కండరాల వరకు వెళ్లొచ్చు. ఇది మిగిలిన అవయవాలకు వ్యాపించలేదు. డాక్టర్లు గ్రేడ్-3 క్యాన్సర్ (3A, 3B, 3C)ను మూడు రకాలుగా విభజించారు. ఇందులో ఏ రకమైన రొమ్ము క్యాన్సర్ ఉంది. రొమ్ము క్యాన్సర్ ఎలా పెరుగుతుంది.. ఏ చికిత్సలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయో ఇవి వివరిస్తాయి.

3A రొమ్ము క్యాన్సర్ దశలో కణతి సరిగా కనిపించదు. ఇది 5 సెంటిమీటర్ల కంటే పెద్దగా ఉండొచ్చు.

3B రొమ్ము క్యాన్సర్ దశలో కణతి కనిపిస్తుంది. ఈ సమయంలో రొమ్ము చర్మంలో క్యాన్సర్ కణాలు కనిపిస్తాయి. అప్పుడు ఆ భాగంలో ఎర్రగా మారిపోయి.. లేదా పూతలని కలిగి ఉండొచ్చు.

3C రొమ్ము క్యాన్సర్ దశలో ఏ పరిమాణంలో అయినా కణతి ఉండొచ్చు లేదా ఉండచకపోవచ్చు. ఇది మీ రొమ్ము చర్మంపై దాడి చేస్తుంది. చర్మం యొక్క వాపు లేదా పూతల నుండి ఈ క్యాన్సర్ ను గుర్తించొచ్చు.

నయం చేయొచ్చు..

నయం చేయొచ్చు..

ఈ రొమ్ము క్యాన్సర్ కు సంబంధించి 2018 సంవత్సరంలో అమెరికన్ జాయింట్ కమిటీ ఆన్ క్యాన్సర్(AJCC) ఈ రకమైన రొమ్ము క్యాన్సర్ కు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది. ఇందులో పరిస్థితిని మెరుగ్గా స్పష్టం చేయడానికి ట్యూమర్ గ్రేడ్ వంటి బయోలాజికల్ కారకాలు ఉంటాయి. గ్రేడ్-3 బ్రెస్ట్ క్యాన్సర్ నెమ్మదిగా పెరిగినా.. దాన్ని నయం చేయొచ్చని స్పష్టం చేసింది. అయితే మీ చికిత్స ఎంపికలు మరియు మీ బాడీ వివిధ కారకాలపై ఆధారపడి ఉంటుంది.

గ్రేడ్ -3 క్యాన్సర్ కాలం ఎంత?

గ్రేడ్ -3 క్యాన్సర్ కాలం ఎంత?

రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తులు సరైన పద్ధతులు పాటిస్తే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వివరించింది. గ్రేడ్-3 క్యాన్సర్ మనుగడ అనేది మీ వయసుపై ఆధారపడి ఉంటుంది. మీ మొత్తం ఆరోగ్యం, మీ బాడీ చికిత్సకు ప్రతిస్పందన కణితుల పరిమాణంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

PC :Twitter

'కాలం నా జీవితంలో ఎలాంటి ప్రభావం చూపినా.. నేను బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదు. భయం, ప్రతికూల భావాలతో నేను అస్సలు జీవించను. కేవలం ధైర్యంగా ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందుకు నడవాలని అనుకుంటాను. మా అమ్మ 18 సంవత్సరాల క్రితం క్యాన్సర్ తోనే చనిపోయారు. అప్పటినుండి నేను చాలా భయంతో బతుకుతున్నాను. నాలుగు నెలల క్రితం నా రొమ్ములో కణితి ఉన్నట్లు అనిపిస్తే.. డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆ సమయంలో టెస్టులు చేసిన డాక్టర్లు నాకు గ్రేడ్-3 క్యాన్సర్ ఉన్నట్లు స్పష్టం చేశారు. సర్జరీ చేసి దాన్ని తొలగించారు. అయితే దీన్ని నేను ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పిందనుకున్నాను. కానీ నా ఆనందం ఎక్కువ రోజులు లేవు. ఇది జన్యుపరమైన క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 70 శాతం లేదా గర్భాశయ క్యాన్సర్ నుండి బయటపడే అవకాశం 40 శాతం ఉంటుంది. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే సర్జరీలు మాత్రమే దారి. ఇప్పటివరకు 9 సైకిల్స్ కిమోథెరపీ జరగగా.. మరో 7 సైకిల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. దీనిపైనా పోరాడి.. త్వరలో మీ ముందుకు నవ్వుతూ వస్తాను.. మీకు అవగాహన కల్పించేందుకు వస్తాను. అందుకే ఈ పోస్ట్ చేస్తున్నా' అని వివరించింది హంసా నందిని.

హంసా నందిని ఏ క్యాన్సర్ తో పోరాటం చేసింది?

టాలీవుడ్ హీరోయిన్ హంసా నందిని రొమ్ముకు సంబంధించిన టెస్టులు చేయించుకోగా.. గ్రేడ్-3 క్యాన్సర్ గా నిర్ధారణ అయ్యింది. ఆపరేషన్ ద్వారా ఆ భాగంలోని గడ్డను తొలగించారని ఆమె వివరించారు.

గ్రేడ్-3 క్యాన్సర్ అంటే ఏమిటి?

ఇది ఎక్కువగా జన్యుపరమైన సమస్యల నుండి వస్తుంది. గ్రేడ్-3 బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కణతి దాటి వ్యాపిస్తుంది. ఇది బహుశా శోషరస కణుపులు మరిు కండరాల వరకు వెళ్లొచ్చు. ఇది మిగిలిన అవయవాలకు వ్యాపించలేదు. డాక్టర్లు గ్రేడ్-3 క్యాన్సర్ (3A, 3B, 3C)ను మూడు రకాలుగా విభజించారు. ఇందులో ఏ రకమైన రొమ్ము క్యాన్సర్ ఉంది. రొమ్ము క్యాన్సర్ ఎలా పెరుగుతుంది.. ఏ చికిత్సలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయో ఇవి వివరిస్తాయి.

English summary

Actress Hamsa Nandini diagnosed with Grade 3 Breast Cancer; Know life expectancy, survival rate and treatment in telugu

Here we are talking about the actress hamsa nandini diagnosed with grade 3 breast cancer; know life expectancy, survival rate and treatment in Telugu. Read on