Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
చలికాలంలో ఈ ఆహారాలకు, డ్రింక్స్‌కు దూరంగా ఉంటేనే అనారోగ్యాన్ని దూరంగా ఉంచొచ్చు
చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి, ఏవి తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు, ఏవి తింటే జబ్బులు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలంతో పాటు ఆహారాల్లో కూడా మార్పులు చేసుకోవాలి. ఆ కాలంలో దొరికే వాటిని తినాలి. వేసవికాలం, చలికాలం, వానాకాలంలో ఎదురయ్యే రోగాలను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే పోషకాలతో కూడిన పండ్లను, కూరగాయలను ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదిస్తుంది. అందుకే సీజనల్ ఫ్రూట్స్, సీజన్‌లో దొరికే ఆహార పదార్థాలను తినాలని వైద్యులు సూచిస్తుంటారు. చలికాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, జ్వరం వెంటాడతాయి. చర్మం పొడిబారుతుంది, జుట్టు సమస్యలు ఎదురవుతాయి.

చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి, ఏవి తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు, ఏవి తింటే జబ్బులు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

1. శుద్ధి చేసిన చక్కెరతో చేసిన డెజర్ట్‌లు
రుచికరమైన డెజర్ట్‌లు తినాలని చాలా మందికి ఉంటుంది. తియ్యని పదార్థాలు తినడం చాలా మందికి ఇష్టం. రుచికరమైన డెజర్ట్ తినాలన్న కోరిక మీకు కూడా ఉంటే దాని గురించి మరోసారి ఆలోచించాలని అంటున్నారు న్యూట్రిషనిస్టులు. చలికాలంలో శుద్ధి చేసిన చక్కెరతో చేసిన డెజర్ట్‌లు అస్సలే తినొద్దని చెబుతున్నారు. చక్కెర వాపును కలిగిస్తుంది. అలాగో ఒంట్లోని రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. మీకు తీపి పదార్థాలు తినాలని కోరికగా ఉంటే కాలానుగుణంగా లభించే పండ్లను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

2. వేయించిన ఆహారాలు
చలి వాతావారణంలో వేడి వేడి బజ్జీలు, పకోడి, వేయించిన కరకరలాడే ఆహార పదార్థాలు తినాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే వేయించిన ఆహార పదార్థాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో సమస్యలు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. వేయించిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాగే వీటిలో లభించే పోషకాలూ ఏమీ ఉండవు. చలికాలంలో ఇలాంటి వేయించిన ఆహార పదార్థాలు మీ జీవక్రియ రేటును నెమ్మదిస్తాయి. దీని వల్ల బద్దకంగా కూడా అనిపిస్తుంది.

3. మజ్జిగ
మజ్జిగ ఎంతో ఆరోగ్యకరమైనది. దీని వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. కానీ చలికాలంలో మజ్జిగ తాగకపోవడమే మంచిదని అంటున్నారు వైద్యులు. చల్లని పాల ఉత్పత్తులు శ్లేష్మం విడుదలను పెంచుతాయి. దీని వల్ల కాలానుగుణంగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి జీర్ణ క్రియకు ప్రోబయోటిక్స్ అవసరం కాబట్టి మజ్జిగకు బదులు పెరుగు తినడం ఉత్తమం. తినే ముందు రిఫ్రిజిరేటర్ నుండి బయటకు తీసి ఉంచాలి. చల్లగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా వేడిగా అయ్యాక పెరుగు తినడం మంచిది. అలాగే భోజనానికి ముందు పెరుగు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

4. చల్లని డెయిరీ ఉత్పత్తులు
చల్లని మిల్క్ బేవరేజెస్ రుచిగా బాగుంటాయి. కానీ డెయిరీ డ్రింక్స్‌ను ఈ చలికాలంలో దూరంగా ఉంచాలని వైద్యులు చెబుతున్నారు. మిల్క్ షేక్‌లు, ఫ్లేవర్డ్ మిల్క్, బాదం మిల్క్ వంటివి పాలతో తయారు చేస్తారు. చలికాలంలో వీటిని తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువ. వీటిని తాగడం వల్ల విపరీతమైన దగ్గు వస్తుంది.
వీటికి బదులు చలకాలం అంతటా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడే గోరు వెచ్చని పాలు లేదా పసుపు కలిపిన గోరు వెచ్చని పాలు తీసుకోవడం చాలా మంచిది.

5. శీతల పానీయాలు, పండ్ల రసాలు
చలికాలంలో శీతల పానీయాలకు(కూల్ డ్రింక్స్)కు ఎంత దూరం ఉంటే అంత మంచిది. చల్లని పానీయాలు తాగడం వల్ల శరీరం యొక్క రక్షణ వ్యవస్థను తగ్గిస్తాయి. ఎందుకంటే శీతల పానీయం యొక్క ఉష్ణోగ్రతను శరీరక ఉష్ణోగ్రతకు తగ్గించడానికి శరీరానికి చాలా శక్తి అవసరం అవుతుంది. ఇది శరీరాన్ని బలహీన పరుస్తుంది. వ్యాధులకు గురి చేస్తుంది.
పండ్ల రసాల విషయంలో కూడా అదే జరుగుతుంది. పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ ఈ కాలంలో ఐస్ క్యూబ్స్ వేసి తీసుకునే పండ్ల రసాలను దూరంగా ఉంచాల్సిందే. పండ్ల జ్యూసులకు బదులు నేరుగా పండ్లను తినడం చాలా మంచిది.

6. ప్రిజర్వ్‌డ్ ఫుడ్స్
ఆహారాలు, ఊరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు అందులో ఎక్కువ మొత్తంలో ఉప్పు కలుపుతారు. అలాగే ఎక్కువగా నూనె వేస్తుంటారు. కానీ ఆహార పదార్థాలను నిల్వ చేసే ప్రక్రియ శరీరానికి అవసరమైన పోషకాలను నాశనం చేస్తుంది. ఇది కొంత మంది వ్యక్తుల్లో అలెర్జీని కూడా ప్రేరేపిస్తుంది. బదులుగా తాజా కాలానుగుణ ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది జీవక్రియ రేటును నిర్వహిస్తుంది. అలెర్జీలు, కాలానుగుణం వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications