For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమియోపతికి, ఆయుర్వేదానికి మధ్య గల తేడాలేంటో మీకు తెలుసా?

ఆయుర్వేదం మరియు హోమియోపతికి మధ్య గల తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుదాం.

|

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మందులకు ఏవైనా ప్రత్యామ్నాయం ఉన్నాయంటే అందరికీ గుర్తొచ్చేది హోమియోపతి మరియు ఆయుర్వేద మందులే. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో ఇవి మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Ayurveda and Homeopathy Differences In Telugu

ఒక అధ్యయనం ప్రకారం, హోమియోపతి వైద్యంపై భారతదేశంలోని జనాభాలో దాదాపు 10 శాతం మంది దీని మీదే ఆధారపడ్డారని తేలింది. ఇంగ్లీష్ మందుల తర్వాత ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రెండో వైద్య విధానంగా ఇది పరిగణించబడుతోంది. అయితే ఇదే సమయంలో ఆయుర్వేద వైద్యం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకోవడం మొదలైంది.

ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ మందులకు ప్రత్యామ్నాయంగా చాలా మంది హోమియోపతిని ఎంచుకోవాలా లేక ఆయుర్వేదం వైపు వెళ్లాలా అనే అయోమయంలో పడుతున్నారు.ఇలా గందరగోళంగా ఉండే వారి కోసం ఈ రెండింటి మధ్య గల తేడాలేంటో.. మేము వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివితే.. మీ సందేహాలకు కచ్చితంగా సమాధానం దొరుకుతుందని భావిస్తున్నాం...

COVID 19 'హోమ్ క్వారెంటైన్ ' లో, సురక్షితంగా ఉండటానికి ఈ నియమాలను పాటించండి

ఆయుర్వేదం-హోమియోపతి..

ఆయుర్వేదం-హోమియోపతి..

ప్రపంచంలో ఒక పురాతన వైద్య విధానం ఏదైనా ఉందంటే అది ఆయుర్వేద వైద్యమే. ఎందుకంటే ఇది సుమారు 5000 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది. అయితే, హోమియోపతి 1790లలో కనుగొనబడింది. ఈ రెండు వైద్య పద్ధతులు సమస్య యొక్క కారణాన్ని కనుగొనగలవు. దాని మూలం నుండి పరిష్కరించండటమే కాదు, మొత్తం శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ, ఈ రెండూ సమస్యను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుంది. అంతేకాక, ఇది సమస్యకు కచ్చితమైన పరిష్కారానికి హామీ ఇవ్వదు. అందువల్ల, వీటిలో దేనినైనా ఎంచుకునే ముందు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం అవసరం. ఈ రెండింటి మధ్య చాలా సారూప్యతలు ఉన్నప్పటికీ, వాటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హోమియోపతి అంటే?

హోమియోపతి అంటే?

ఈ వైద్య విధానాన్ని జర్మనీ ప్రాంతంలో 17వ శతాబ్దంలో అభివృద్ధి చేశారు. ఈ వైద్య వ్యవస్థ యొక్క ప్రాథమిక చర్య ఏమిటంటే, మన శరీరం దాన్ని పరిష్కరించగలదు. తన వద్దకు వచ్చే రోగుల జీవిత చరిత్రలు మరియు వైద్య పరిస్థితులను తెలుసుకున్న హోమియోపతి వైద్యులు అందుకు అనుగుణంగా చికిత్సను ప్రారంభిస్తారు. ఈ హోమియోపతి మందులు సహజమైన వస్తువల నుండి తయారవుతాయి. ఇవి మానవ శరీరాలపై ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించదని నమ్ముతారు.

హోమియోపతి వైద్యం ఉత్తమమా?

హోమియోపతి వైద్యం ఉత్తమమా?

సాధారణంగా మైగ్రెన్, ఒత్తిడి, దీర్ఘకాలిక అలసట, పేగు, సిండ్రోమ్, కడుపులో మంట మరియు ఇతర వ్యాధులకు పరిష్కారం కోసం హోమియోపతి వైపు మొగ్గు చూపుతారు. అయితే మనుషులకు వచ్చే ప్రాణాంతకమైన వచ్చే గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి వాటిని నయం చేసేందుకు ఎవ్వరూ కూడా హోమియోపతిని సిఫార్సు చేయరు.

ఆయుర్వేదాన్ని పరిశీలిస్తే..

ఆయుర్వేదాన్ని పరిశీలిస్తే..

ఈ విశ్వంలోనే అత్యంత పురాతన చికిత్స విధానం ఆయుర్వేద వైద్యం. ఇది 5 వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో కనుగొనబడింది. ఓ అధ్యయనం ప్రకారం ఆయుర్వైద వైద్యం ప్రపంచంలోని ప్రతిదీ (చనిపోయిన లేదా సజీవంగా) గాలి, అగ్ని, నీరు మరియు భూమి అనే ఐదు అంశాలతో అనుసంధానించబడిందనే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇది మనస్సు, శరీరం మరియు ఆత్మల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం. ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే.

ఆయుర్వేదం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం

ఆయుర్వేదం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం

ఆయుర్వేదం వైద్య విధానం ద్వారా శరీరంలోని హానికరమైన మరియు జీర్ణం కాని ఆహారాన్ని శుద్ధి చేయడం వంటివి జరుగుతాయి. ఇవి వ్యాధి యొక్క తీవ్రతలను మరియు లక్షణాలను తగ్గించడానికి మరియు శరీర సామర్థ్యాన్ని పెంచేందుకు, మనలో సమతులత్యతను పునరుద్ధరించేందుకు, ఆయుర్వేద వైద్యులు ‘పంచకర్మ'ను ఉపయోగిస్తారు. ఆయుర్వేద చికిత్సలో మసాజ్, రకరకాల నూనెలు, సహజంగా దొరికే వన మూలికలను మరియు సహజమైన మందులను వాడతారు.

English summary

Ayurveda and Homeopathy Differences In Telugu

What is the difference between ayurveda and homeopathy? Read on to know more..
Desktop Bottom Promotion