For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊపిరితిత్తులు ఉల్లాసంగా పని చేయాలంటే.. వీటిని రెగ్యులర్ తీసుకోండి.. వీటికి దూరంగా ఉండండి...

|

ప్రస్తుతం కరోనా మహమ్మారి మన దేశంలో ప్రతి ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కరోనా భూతం ప్రతి మనిషి శ్వాసకోశ వ్యవస్థను దెబ్బ తీస్తోంది.

మొదటి దశ కేవలం శ్వాస కోశ సంబంధిత వ్యాధులనే కలుగజేసేది. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ శ్వాస సంబంధిత సమస్యలతో పాటు ఊపిరితిత్తులు, శరీరంలోని ఇతర భాగాలను బాగా ఇబ్బంది పెడుతోంది.

ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారు.. కరోనా నెగిటివ్ వచ్చిన వారు కొన్ని ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవాలి. అదే సమయంలో కొన్ని ఆహారాల జోలికి అస్సలు వెళ్లకూడదు. దీని వల్ల మీ ఊపిరితిత్తులు ఉత్సాహంగా పని చేస్తాయి. దీంతో మిమ్మల్ని మీరు కరోనా నుండి కాపాడుకోవచ్చు. ఇంతకీ మీ ఊపిరితిత్తులకు ఉల్లాసాన్నిచ్చే ఆహారాలేంటో మీరే చూడండి...

Black Fungus Infection : కోవిడ్ రోగుల అవయవాలను దెబ్బతీసున్న బ్లాక్ ఫంగస్..లక్షణాల ఎలా ఉంటాయో తెలుసా..

ఆకుకూరలు..

ఆకుకూరలు..

ప్రస్తుత రోజుల్లో మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఏం తింటున్నాం అనేది కీలకం. ఎందుకంటే మనం తినే తిండి శ్వాసకోశ సంబంధిత ఆరోగ్యానికే కాదు.. మన మూడ్ సరిగా ఉండేందుకు, మనం రోజంతా ప్రశాంతంగా ఉండేందుకు, మొత్తానికి హాయిగా, హుషారుగా ఉండేలా చేసేది మనం తీసుకునే ఆహారమే. కాబట్టి రైతు బజార్లో లభించే ఆకుకూరలు, టమోటాలు వంటి వాటిని రెగ్యులర్ గా తీసుకోవాలి. వీటిలో మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి.

పసుపు కలిపిన పాలు..

పసుపు కలిపిన పాలు..

మన ఇళ్లలో పసుపు పుష్కలంగా లభిస్తుంది. ఇది యాంటీ బయోటిక్ లక్షణాలున్న ఆహార పదార్థం. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవద్దు. తగిన మోతాదులో తీసుకోవాలి. అప్పుడే ఇది బాగా పని చేస్తుంది. మీరు రెగ్యులర్ గా వంటల్లో పసుపును వాడుతుంటారు. అయితే ఇదే పసుపు మీరు తాగే పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే మీకు జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే వీటిని మీరు తినే ఆహార పదార్థాల్లో కూడా తగిన మోతాదులో వాడితే.. ఇది శ్వాసకోశ నాళాల్లో ఏర్పడే ఇన్ ఫ్లమేషన్ ని అయినా, శ్వాస సంబంధిత సమస్యలకైనా చెక్ పెట్టేస్తోంది. అలాగే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోండి.

అల్లం టీ..

అల్లం టీ..

మనలో చాలా మంది రెగ్యులర్ గా అల్లం టీ తాగుతూ ఉంటారు. అలాంటి వారికి కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అల్లంలోనూ ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు ఊపిరితిత్తుల్లో ఉండే ఇబ్బందులను సులభంగా తగ్గిస్తుంది. దీని వల్ల మనం ఊపిరి తీసుకోవడం.. ఊపిరి వదలడం తేలికగా అవుతుంది. వీటితో పాటు వెల్లుల్లిని కూడా మీరు తీసుకునే ఆహారంలో తీసుకోవాలి.

యాపిల్ పండ్లు..

యాపిల్ పండ్లు..

మీకు రెగ్యులర్ గా పండ్లు తినే అలవాటు ఉంటే.. దాన్ని ఈ కాలంలోనూ కంటిన్యూ చేయండి. ఎందుకంటే యాపిల్ పండులో ఉండే విటమిన్ సి, బీటాకెరోటిన్లు ఊపిరితిత్తులను మరింత బలంగా మారుస్తాయి. అంతేకాదు ఊపిరితిత్తులు పని చేయడంలో ఏవైనా సమస్యలుంటే కూడా వాటికి చెక్ పెట్టేస్తాయి.

ఉదయాన్నే ఇవన్నీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

నారింజ, నిమ్మ..

నారింజ, నిమ్మ..

నిమ్మ జాతి పండ్లను రెగ్యులర్ గా తీసుకోండి. ఎందుకంటే వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్లుగా ఉంటాయి. ఇవి కూడా ఊపిరితిత్తులకు ఊపిరిలూదేస్తాయి. అంతేకాదు మీ లంగ్స్ మరింత హుషారుగా పనిచేయడంలో సహాయపడతాయి.

వాల్ నట్స్..

వాల్ నట్స్..

వాల్ నట్స్ కూడా ఊపిరితిత్తులు మెరుగ్గా పని చేయడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫాటీ యాసిడ్లు మన బాడీలోని ఊపిరితిత్తుల్లో ఏదైనా మంట ఉంటే.. వాటిని వెంటనే తగ్గించేస్తాయి. దీంతో మనకు శ్వాస కోశ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

స్ట్రా బెర్రీ..

స్ట్రా బెర్రీ..

ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉండాలంటే మీరు స్ట్రాబెర్రీస్ ను కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి లంగ్స్ కు హాని కలిగించే కణాలతో, ఫ్రీ రాడికల్స్ తో పోరాటం చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల మీ ఊపిరితిత్తులు మరింత బలపడతాయి.

కోవిడ్ వైరస్ గాలిలో ఆరు అడుగుల వరకు వ్యాపించగలదు మరియు నిలబడగలదు! కొత్త అధ్యయనం

మిరియాలు..

మిరియాలు..

ఊపిరితిత్తులు ఈ కాలంలో ఇన్ఫెక్షన్ కు గురికాకూడదంటే.. మీరు మిరియాలు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మిరియాలలో ఉండే కారం, ఘాటు, విటమిన్ సి వంటి వాటి వల్ల ఊపిరితిత్తుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే.. అవి తగ్గిపోతాయి. అంతేకాదు మీరు చాలా తేలికగా గాలి పీల్చుకోవడం, వదలడం వంటివి చేస్తారు. ముఖ్యంగా ఎవరైతే ధూమపానం చేస్తారో వారికి మిరియాలు బాగా పని చేస్తాయి.

ఇవి తినకూడదు..

ఇవి తినకూడదు..

మీ ఊపిరితిత్తులు మెరుగ్గా పని చేయాలంటే.. కాల్చిన మాంసం, మరియు నిల్వ ఉంచిన మాంసం తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు ఇలాంటివి తింటే మీ ఊపిరితిత్తుల పనితీరుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలలో తేలింది.

కూల్ డ్రింక్స్ వద్దు..

కూల్ డ్రింక్స్ వద్దు..

ప్రస్తుతం వేసవి కాలం అని అందరూ కూల్ డ్రింక్స్ తాగడానికి ఆసక్తి చూపుతారు. చల్లని వస్తువులు తినడానికి, చల్లని నీటిని తాగుతూ ఉంటారు. అయితే కరోనా వంటి కష్ట కాలంలో ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు అని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఈసారికి కూల్ డ్రింక్స్ కు, చల్లని పదార్థాలకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు వేడి పదార్థాలను తీసుకోండి.

ఎక్కువ ఉప్పు..

ఎక్కువ ఉప్పు..

మనలో కొందరు ఉప్పు, కారం ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే.. అది మీ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావమే చూపుతుందట. ఇందులో ఉండే అధిక సోడియం మీకు ఆస్తమా లక్షణాలను దిగజార్చుతుందట. ముఖ్యంగా బాగా ఉడికించిన ఆహార పదార్థాలనే ఎక్కువగా తీసుకోవాలట.

English summary

Best and Worst Foods for Lung Health in Telugu

Here are the best and worst foods for lung health in telugu. Take a look
Story first published: Thursday, May 13, 2021, 18:23 [IST]