For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Hairy caterpillar rash:ఈ పురుగు కుడితే ప్రమాదమా? దాని నుండి ఎలా తప్పించుకోవాలి?

|

జూన్ మాసం వచ్చినా ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఈ సమ్మర్లో మన ఇంట్లో నేలపై ఎక్కువగా క్రిములు, కీటకాలు సంచరిస్తుంటాయి.

ఎందుకంటే ఇవి ఎక్కువ వేడిని తట్టుకోలేవు. వర్షాకాలం ప్రారంభం కోసం ఎదురుచూస్తూ బయటకు వస్తుంటాయి. ఎందుకంటే ఈ సమయం వాటికి సంతానోత్పత్తి సమయం. ఈ కారణంగా వర్షాకాలంలో వాటి సంఖ్య అకస్మాత్తుగా విపరీతంగా పెరుగుతుంది. అలాంటి కీటకాల్లో వెంట్రుకల గొంగళి పురుగు ప్రధానమైనది. వర్షాలకు ముందు ఇవి ఇళ్ల సమీపంలో ఎక్కువగా కనిపిస్తాయి.

మరీ ముఖ్యంగా ఇళ్లలో వర్షాకాలం ప్రారంభంలో, డోర్ కర్టెన్లు, పరుపులు వంటివి బయట వేలాడదీసినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి పురుగులు, కీటకాలు కచ్చితంగా కనిపిస్తాయి. అంతేకాదు వీటి వల్ల మన చర్మానికి సంబంధించి కొన్ని వ్యాధులకు కూడా కారణమవుతాయి. ఈ పురుగుల కాటు నుండి మీరు అనారోగ్యానికి కూడా గురి కావొచ్చు. ఎందుకంటే ఇది మన బాడీలో దద్దుర్లు ఉత్పత్తి చేస్తుంది. దీన్నే హెయిరీ క్యాటర్ పిల్లర్ రాష్ అని కూడా అంటారు. ఇది తాకిన వెంటనే తామర(దురద) మరింత ఎక్కువ అవుతుంది.

గొంగళి పురుగు కాటు తర్వాత కనిపించే లక్షణాలు..

గొంగళి పురుగు స్టింగుకు ప్రతిస్పందన కారణంగా తేలికగా ఉంటుంది. దీని కాటు సాధారణంగా దోమ కాటు ఎక్కువ బాధాకరంగా ఉంటుంది. కానీ కందిరీగ కుట్టినంత చెడ్డగా మాత్రం కాదు. అయితే ఇవి కుట్టడం వల్ల ముఖంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇవి కొన్నిరోజుల పాటు మనల్ని ఇబ్బంది పెడతారు. వాటి లక్షణాలు ఇలా ఉంటాయి.
* ఎర్రగా మారడం
* దురద రావడం
* వాపుగా ఉండటం
* బొబ్బలు రావడం

మరింత తీవ్రమైన అలర్జీ ప్రతిచర్య - మరింత తీవ్రమైన లక్షణాల్లో శ్వాస ఆడకపోవడం మరియు మింగడంలో ఇబ్బంది ఉండొచ్చు. గొంగళి పురుగు కుట్టిన తర్వాత కళ్లు లేదా నోటికి తాకినట్లయితే, మీరు అనాఫిలాక్టిక్ ప్రతిచర్య యొక్క అరుదైన సందర్భాన్ని కలిగి ఉండొచ్చు.

ఇవి గుర్తుంచుకోండి..
మీరు ఎప్పటికీ గొంగళి పురుగును తాకొద్దు. ఒకవేళ గొంగళి పురుగు మీ చర్మంపై ఉంటే, దాన్ని చేత్తో అస్సలు తాకొద్దు. ఏదైనా పట్టకారు లేదా మందంగా ఉండే గ్లోవ్ ను వాడండి. ఎందుకంటే మీరు చేత్తో దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తే, అది మిమ్మల్ని కాటు వేసే ప్రమాదం ఉంటుంది. అందుకే వాటిని చేతివేళ్లతో తాకకుండా ఉండాలి.

శుభ్రంగా ఉంచాలి..
మీకు గొంగళి పురుగు కనిపించిన ప్రదేశాల్లో సబ్బు మరియు గోరు వెచ్చని నీటితో బాగా కడగాలి. అలాగే దాని చుట్టు పక్కల ప్రాంతాలను సైతం శుభ్రంగా ఉంచాలి. ఒకవేళ అది మిమ్మల్ని కుట్టినా లేదా దాన్ని తాకినా ఆ ప్రాంతాన్ని మీరు సబ్బు మరియు హ్యాండ్ వాష్ తో బాగా కడుక్కోవాలి.

హోమ్ రెమెడీస్..
బేకింగ్ సోడా మరియు నీటిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును గొంగళి పురుగు కుట్టిన చోట అప్లై చేయడం ద్వారా మీరు మంచి ఉపశమనం పొందొచ్చు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు ఒకటి లేదా రెండు టీస్పూన్ల వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కలపండి. బేకింగ్ సోడా పేస్ట్ దురద మరియు ఇతర అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఈ పేస్ట్ ను అప్లై చేయండి.

మీ చర్మంపై చికాకుగా ఉంటే హైడ్రోకార్టిసోన్ క్రీమ్ వాడండి. ముఖ్యంగా పురుగు కుట్టిన ప్రాంతంలో దీన్ని ఉపయోగించండి.

డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి?
గొంగళి పురుగు కుట్టడం వల్ల అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. గొంగళి పురుగు యొక్క రకాన్ని బట్టి మరియు మీకు ఏవైనా అలర్జీలు ఉంటే, ఈ లక్షణాలు చాలా తేలికగా లేదా తీవ్రంగా ఉంటాయి. అందుకే మీరు దద్దుర్లు, దురద, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను గమనించిన వెంటనే వైద్యుని సహాయం తీసుకోవాలి.

English summary

Caterpillar Rash How to Spot and Treat It in Telugu

To treat caterpillar stings, you need to clean the site of the sting, treat the symptoms of the sting, and consult a medical professional if symptoms become severe.
Story first published: Monday, June 6, 2022, 14:49 [IST]
Desktop Bottom Promotion