For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid Home Isolation:ఒమిక్రాన్ కోవిద్ పెరుగుతున్న వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలివే... కేంద్రం కొత్త గైడ్ లైన్స్.

భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిద్-19 రోగులు హోమ్ ఐసోలేషన్లో తీసుకోవాల్సిన మార్గనిర్దేశాల గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు చేసింది.

|

మన దేశంలో కరోనా రోగుల కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు.

Centre issues new guidelines for home isolation of mild, asymptomatic COVID-19 patients amid Covid Spike

బెంగళూరు, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో వీకెండ్ రోజున పూర్తిగా కర్ఫ్యూ విధించారు. విద్యా సంస్థలకు దాదాపు రెండు సెలవులిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ హోం ఐసోలేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనాకు సంబంధించి ఏ లక్షణాలు లేని, తక్కువ లక్షణాలు ఉన్న కరోనా పెషంట్లు ఇక నుండి కేవలం హోం క్వారంటైన్లో ఉండొచ్చు. అయితే కోవిద్-19 ఐసోలేషన్ గైడ్ లైన్స్ ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 5 జనవరి 2022న మరోసారి సవరించింది. ఈ సందర్భంగా ఎవరెవరు హోమ్ ఐసోలేషన్లు ఉండాలి మరియు హోమ్ ఐసోలేషన్ ను ఎప్పుడు ముగించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Centre issues new guidelines for home isolation of mild, asymptomatic COVID-19 patients amid Covid Spike

కొత్త మార్గదర్శకాలిలా..

కొద్దిపాటి లక్షణాలు లేదా కరోనా రహిత ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారి కోసం కేంద్రం హోమ్ ఐసోలేషన్ గైడ్ లైన్స్ ను సవరించింది. మన దేశంలో 58 వేల కంటే ఎక్కువ కోవిద్-19 కేసులు నమోదైన రోజున కేంద్ర ప్రభుత్వం కొత్తగా సవరించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది.
* ఎవరికైతే కరోనాకు సంబంధించి తేలికపాటి లక్షణాలు ఉంటాయో, వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* ఎవరికైనా పూర్తి పరీక్షలు, క్లినికల్ మేనేజ్ మెంట్ అవసరమవుతాయో వారికి ఆసుపత్రిలో బెడ్ కేటాయించడం జరుగుతుంది.
* మరిన్ని సేవలు అవసరమైన వారు జిల్లా/సబ్-జిల్లా స్థాయిలోని కంట్రోల్ రూమ్ కి కాల్ చేస్తే మరింత సహాయం ప్రభుత్వం అందజేస్తుంది.
* కరోనా సమయంలో స్వీయ నిర్బంధంలో ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వీలైనంత దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* కరోనా రోగుల వద్ద ఒక సంరక్షకుడు(కోవిద్ టీకాను తీసుకున్న వ్యక్తి) 24 గంటలు అందుబాటులో ఉండాలి.
* హోమ్ ఐసోలేషన్లో ఉండే వ్యక్తికి సంరక్షకుడు మరియు వైద్యాధికారి తప్పనిసరిగా అవసరం.
* 60 సంవత్సరాలు పైబడిన వ్రుద్ధ రోగులు మరియు హైపర్ టెన్షన్, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తులు/కాలేయం/మూత్రపిండాల వ్యాధి, సెరెబ్రోవాస్కులర్ వ్యాధి మొదలైన సహ-అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు చికిత్స పొందుతున్న వారు డాక్టర్ నిర్ధారించిన తర్వాత మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉండేందుకు అనుమతించబడతారు.
* హెచ్ఐవి, క్యాన్సర్ రోగులు హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకు సిఫార్సు చేయబడరు. ఇలాంటి రోగులు కేవలం డాక్టర్ నిర్ధారణ తర్వాతే హోమ్ ఐసోలేషన్ కు అనుమతించబడతారు.

Centre issues new guidelines for home isolation of mild, asymptomatic COVID-19 patients amid Covid Spike

హోమ్ ఐసోలేషన్ ఎప్పుడు ఆపేయాలి?

* హోమ్ ఐసోలేషన్లో ఉన్న కోవిద్-19 రోగి 'పాజిటివ్ వచ్చినప్పటి నుండి కనీసం వారం రోజులు గడిచిన తర్వాత డిశ్చార్జ్ అవుతాడు లేదా ఐసోలేషన్ ను ముగించుకుంటాడు.
* ఎవరికైతే వరుసగా మూడు రోజులు జ్వరం లేదని నిర్ధారణ అవుతుందో అలాంటి వారు బయట ఉండొచ్చని ప్రభుత్వం తను సవరించిన మార్గదర్శకాలలో వివరించింది.
* అయితే వారు కూడా మాస్కులు ధరించడం కొనసాగించాలి. అయితే హోమ్ ఐసోలేషన్ గడువు ముగిసిన తర్వాత, తిరిగి మళ్లీ ఎలాంటి పరీక్షలు అవసరంలేదు' అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

FAQ's
  • కోవిద్ నేపథ్యంలో కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ను ఇటీవల ఎప్పుడు సవరించింది.

    రోనా కేసులు పెరుగుతున్న వేళ హోం ఐసోలేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనాకు సంబంధించి ఏ లక్షణాలు లేని, తక్కువ లక్షణాలు ఉన్న కరోనా పెషంట్లు ఇక నుండి కేవలం హోం క్వారంటైన్లో ఉండొచ్చు. అయితే కోవిద్-19 ఐసోలేషన్ గైడ్ లైన్స్ ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 5 జనవరి 2022న మరోసారి సవరించింది.

English summary

Centre issues new guidelines for home isolation of mild, asymptomatic COVID-19 patients amid Covid Spike

Covid Home Isolation : Union Health Ministry issued revised guidelines for home isolation of mild and asymptomatic Covid-19 patients as Omicron cases surge across India
Story first published:Wednesday, January 5, 2022, 17:56 [IST]
Desktop Bottom Promotion