For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోవిద్ టీకా కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు... మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..

జూన్ 21వ తేదీ నుండి కేంద్రం కోవిద్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మార్చబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూన్ 8వ తేదీన కోవిద్ టీకా కార్యక్రమానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

Centre Releases Revised Guidelines For National COVID Vaccination Programme; All You Need to Know in Telugu
సవరించిన మార్గదర్శకాల ప్రకారం జూన్ 21వ తేదీ నుండి ఈ కొత్త నియమ నిబంధనలు అమలులోకి రానున్నాయి. తొలుత 18 ఏళ్లకు పైబడిన వారందరికీ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించింది. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ గణనీయంగా పెరుగుతుందని సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి మోడీ నొక్కి వక్కాణించారు.

Centre Releases Revised Guidelines For National COVID Vaccination Programme; All You Need to Know in Telugu
ఇప్పటికే టీకా ఉత్పత్తి అయిన నాటి నుండి 75 శాం ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే మిగిలిన 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులలో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. దానికి కూడా సర్వీస్ ఛార్జీ కింద రూ.150 మాత్రం చెల్లించాలని తెలిపింది. ఈ సందర్భంగా దేశంలో కోవిద్-19 టీకా కోసం సవరించిన మార్గదర్శకాలేంటి.. మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

కరోనాకు టీకాలు వేయించుకున్న వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా? అద్భుతమైన అధ్యయన ఫలితాలు ...!కరోనాకు టీకాలు వేయించుకున్న వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా? అద్భుతమైన అధ్యయన ఫలితాలు ...!

75 శాతం కొనుగోలు..

75 శాతం కొనుగోలు..

దేశంలో వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న వాటిలో దాదాపు 75 శాతం భారత ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అలా సేకరించిన వ్యాక్సిన్లు జాతీయ టీకాల కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా అందించబడతాయి. ఈ టీకా మోతాదులను భారత ప్రజలందరికీ ఉచితంగా అందజేస్తారు.

వారికే ప్రాధాన్యత..

వారికే ప్రాధాన్యత..

కరోనా వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం రాష్ట్రాలకు ఉచితంగా ఇచ్చినప్పటికీ, ముందుగా ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఫ్రంట్ లైన్ కార్మికులు, 45 సంవత్సరాల వయసు పైబడిన వారికే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఇతరులకు అంటే 18 సంవత్సరాల వయసు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పౌరులకు అందజేయాలి.

రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు..

రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు..

18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రజల జనాభా సమూహంలో, టీకా సరఫరా షెడ్యూల్ లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ సొంత ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్ణయించుకోవచ్చు.

ముందే కేటాయింపులు..

ముందే కేటాయింపులు..

వ్యాక్సిన్ మోతాదుల అధునాతన సమాచారాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా టీకాల సమాచారాన్ని జిల్లాలు మరియు టీకా కేంద్రాలకు ముందుగానే మోతాదులను కేటాయించాలి. అక్కడ సేకరించిన సమాచారాన్ని ప్రజాక్షేత్రంలో ఉంచాలి. దీని వల్ల ప్రజలకు టీకా గురించి సమాచారం తెలుసుకోవడానికి సులభమవుతుంది.

మీ ప్రైవేట్ ప్రాంతంలో వాక్సిన్ చేసిన తర్వాత ఈ పనులు చేయకూడదని మీకు తెలుసా?మీ ప్రైవేట్ ప్రాంతంలో వాక్సిన్ చేసిన తర్వాత ఈ పనులు చేయకూడదని మీకు తెలుసా?

ప్రైవేట్ ఆస్పత్రులకు..

ప్రైవేట్ ఆస్పత్రులకు..

కరోనా వ్యాక్సిన్ తయారీదారుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, కొత్త వ్యాక్సిన్లను ప్రోత్సహించడానికి దేశీయ వ్యాక్సిన్ తయారీదారులకు నేరుగా ప్రయివేట్ ఆసుపత్రులకు అందించే అవకాశం ఇవ్వబడుతుంది. అయితే ఇది నెలవారీ ఉత్పత్తిలో 25 శాతానికే పరిమితం చేయబడింది. పెద్ద మరియు చిన్న ప్రైవేట్ ఆస్పత్రులు మరియు ప్రాంతీయ సమతుల్యత మధ్య సమానమైన పంపిణీ ద్రుష్టిలో ఉంచుకుని, డిమాండ్ ఆధారంగా ఈ టీకాలను ప్రైవేట్ ఆస్పత్రులకు సరఫరా చేయడానికి మరియు నేషనల్ హెల్త్ అథారిటీ యొక్క ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా వాటి చెల్లింపును సులభతరం చేస్తుంది. ఈ టీకా వేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు గరిష్టంగా సేవా ఛార్జీలను రూ.150 వరకే వసూలు చేయాల్సి ఉంటుంది.

ప్రీ బుకింగ్..

ప్రీ బుకింగ్..

భారత దేశంలో ప్రతి పౌరుడికి కోవిద్ టీకా సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా చేరేందుకు కేంద్రం ప్రీ-బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ టీకా కేంద్రాలు ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా అందిస్తాయి. ఇది వ్యక్తులకు మరియు కుటుంబసభ్యులకు కూడా అందుబాటులో ఉంటుంది.

కాల్ సెంటర్లు..

కాల్ సెంటర్లు..

ఆన్ లైనులో బుకింగ్ చేసుకోవడం రాని వారి కోసం, కోవిద్ కామన్ సర్వీసు సెంటర్లు మరియు కాల్ సెంటర్లను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. ఈ సవరించిన మార్గదర్శకాలు 2021లో జూన్ 21వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన నిధులన్నింటినీ కేంద్రమే సమకూరుస్తుంది.

ఈ మందుల తొలగింపు..

ఈ మందుల తొలగింపు..

మే 27వ తేదీన కోవిద్ చికిత్స కోసం జారీ చేయబడిన మార్గదర్శకాలలో మార్పులు వచ్చాయి. ఇందులో హైడ్రాక్సీక్లోక్విన్, ఐవర్ మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింక్, మల్టీవిటమిన్లు మొదలైన మందులను తొలగించింది. సిటి స్కాన్ల వంటి బాధిత బాధితులకు వైద్య నిపుణులు అనవసరమైన పరీక్షలను సూచించరాదని వివరించింది.

English summary

Centre Releases Revised Guidelines For National COVID Vaccination Programme; All You Need to Know in Telugu

National COVID Vaccination Programme From 21 June, Centre Releases Revised Guidelines For COVID Vaccination Drive. Here’s all you need to know about the revised guidelines issued by the Centre for the National COVID Vaccination Drive. Read on.
Desktop Bottom Promotion