For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా రిపోర్టు నెగిటివ్ వచ్చిందని.. నిర్లక్ష్యం చేయకండి.. ఈ విషయాలను మరువకండి...

కరోనా నెగిటివ్ వచ్చిందని.. నిర్లక్ష్యం చేయకండి.. ఈ విషయాలను మరువకండి...

|

మన దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ చాలా వేగంగా పెరుగుతోంది. కోవిద్-19 గత కొద్ది రోజులుగా విలయతాండవం చేస్తోంది.

Coronavirus symptoms in COVID negative person: Never ignore these symptoms even if you have tested negative

ప్రస్తుతం చాలా మంది కొద్దిపాటి లక్షణాలతో కరోనా రోగులు ఆసుపత్రులకు చేరుతున్నారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ కు.. సెకండ్ వేవ్ కు చాలా తేడా ఉంది. ఇప్పుడు తాజాగా కరోనా వైరస్ రిపోర్టు నెగిటివ్ వచ్చిన వారిలో సైతం ఈ మహమ్మారి నెమ్మదిగా విస్తరిస్తోంది.

Coronavirus symptoms in COVID negative person: Never ignore these symptoms even if you have tested negative

ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ కోసం రెండు రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి RT-PCR, రెండోది యాంటిజెన్ పరీక్ష. ఈ టెస్టు చేసిన తర్వాత నెగిటివ్ రిపోర్టు వచ్చిందని మీరు సంబరపడిపోవద్దు. కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చినప్పుడు ఏమి చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కోవిడ్ 19: డేంజర్ బెల్స్- రోగులకు ఆక్సిజన్ ఎప్పుడు అవసరం అవుతుంది?కోవిడ్ 19: డేంజర్ బెల్స్- రోగులకు ఆక్సిజన్ ఎప్పుడు అవసరం అవుతుంది?

కరోనా టెస్టు ఎలా చేస్తారు..

కరోనా టెస్టు ఎలా చేస్తారు..

RP-PCR రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్ స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. ఈ టెస్టులో ముక్కు లేదా గొంతు వద్ద కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. ఒక వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డాడా లేదా అనే విషయాలను RT-PCR పరీక్షలు వెల్లడిస్తున్నాయి. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో కూడా వైరస్ సులభంగా బయటపడుతుంది. అయితే ప్రస్తుతం చాలా మందిలో నెగిటివ్ రిపోర్టులు వస్తున్నప్పటికీ, కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి.

టెస్టులు ఎప్పుడు చేసుకోవాలి..

టెస్టులు ఎప్పుడు చేసుకోవాలి..

ఎవరైతే ఎక్కువగా జర్నీ చేస్తుంటారో.. జన సమూహం ఉండే చోట ఎక్కువగా తిరుగుతుంటారో.. అలాంటి సమయంలో మీరు చాలా అలర్ట్ గా ఉండాలి. మీతోటి వారికి ఎవరికైనా.. మీ స్నేహితులు, కుటుంబసభ్యులు, బంధువులలో కరోనా లక్షణాలు కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారితో మీరు ఎక్కువ సేపు గడిపినట్లయితే కచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే కరోనా సోకిన వారితో కనీసం 15 నిమిషాలు గడిపినా కూడా ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉంది.

టెస్టుకు ముందు ఇలా చేయకండి..

టెస్టుకు ముందు ఇలా చేయకండి..

మీరు కోవిద్-19 టెస్టు చేయించుకోవడానికి ముందు నీరు తాగడం లేదా ఏదైనా ఆహారం తీసుకోవడం వంటివి చేస్తే.. అది RT-PCR ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు కరోనా టెస్టు చేయించుకోవడానికి వెళ్లే ముందు ఎలాంటి ఆహారం తీసుకోవద్దు. కనీసం నీరు కూడా తాగకండి.

పలు అధ్యయనాలలో..

పలు అధ్యయనాలలో..

కరోనా మహమ్మారి మొదటి దశలో సోకినప్పుడు.. చలి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బాడీ పెయిన్స్, రుచి-వాసన లేకపోవడం, గొంతులో మంట వంటి లక్షణాలు ప్రధానంగా కనిపించేవి. కానీ సెకండ్ వేవ్ లో అదనంగా తలనొప్పి, కళ్ల రంగు మారడం లేదా రోజ్ కలర్లోకి మారడం, కళ్ల నుండి నిరంతరాయంగా నీళ్లు కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మరి కొందరికి నిరంతరం దగ్గు, జ్వరానికి బదులు గ్యాస్ సమస్యలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరికొందరికి డయేరియా, విరేచనాల సమస్యలు కూడా వస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే నోరు పొడిగా ఉండటం, చిగుళ్ల సమస్యలు ఉన్నా కూడా చాలా అలర్ట్ గా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

లాంగ్ కోవిద్ అంటే..

లాంగ్ కోవిద్ అంటే..

కోవిద్-19 వైరస్ లో కొద్ది పాటి లక్షణాలు ఉండే రోగులు ఒకటి నుండి రెండు వారాల్లో కోలుకుంటారు. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నవారు మాత్రం కోలుకోవడానికి ఆరు లేదా ఏడు వారాలు పడుతుంది. అయితే కోవిద్-19 నుండి కోలుకున్న తర్వాత రోగి రిపోర్టు నెగిటివ్ వచ్చినా కూడా కొంచెం దగ్గు, బాడీ పెయిన్స్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, దాన్ని లాంగ్ కోవిద్ అంటారు.

లాంగ్ కోవిద్ లక్షణాలు..

లాంగ్ కోవిద్ లక్షణాలు..

- చాలా మంది రోగులు కరోనా నుండి కోలుకున్న తర్వాత తాము తీసుకునే ఆహారం రుచిని తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఈ కారణంగా వీరికి ఆకలి లేకపోవడం జరుగుతుంది.

- అంతేకాదు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. కొన్ని వారాల పాటు ఈ సమస్య ఉంటుంది. దీని నివారణకు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి.

- అలసట, తలనొప్పి.. కరోనా వైరస్ సంక్రమణ సమయంలో తలనొప్పి మరియు అలసట ఉంటుంది. కరోనా రిపోర్టు నెగిటివ్ వచ్చినప్పటికీ చాలాసార్లు ఈ సమస్యలను ఎదుర్కొంటారు. మీకు మరీ ఎక్కువ తలనొప్పి లేదా అలసట ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

గమనిక : ఈ సమాచారం అంతా కేవలం మీకు కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగించేందుకు మాత్రమే. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా.. మీరు వైద్యుడిని సంప్రదించి.. వారి సలహాలు, సూచనలను తప్పక పాటించగలరు.

English summary

Coronavirus symptoms in COVID negative person: Never ignore these symptoms even if you have tested negative

Coronavirus symptoms in COVID negative person: Do not ingone these symptoms even if your testsed negative for covid-19. Read on.
Desktop Bottom Promotion