For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Coronavirus symptoms in Voice:కరోనా సోకినట్లు డౌటొస్తుందా? అయితే మీ గొంతులో ఈ మార్పులొస్తాయట...!

|

ప్రస్తుతం కరోనా మహమ్మారి తొలి దశ కంటే రెండో దశలో మరింత వేగంగా భయంకరంగా వ్యాపిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ వైరస్ లక్షణాల్లో కూడా అనేక మార్పులు వచ్చినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో కరోనా రోగులలో జ్వరం, దగ్గు, నాలుకకు రుచి తెలియకపోవడం, ముక్కు వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఇప్పటివరకు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ లక్షణాలపై ఓ అధ్యయనం జరపగా.. మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

కరోనా సోకిన వ్యక్తుల గొంతులో మార్పులు వస్తున్నాయని తేలింది. సాధారణంగా మనలో గొంతులో వాతావరణం బట్టి కొంచెం మార్పులు వస్తుంటాయి. దీన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. కానీ గొంతు బొంగురుగా రావడమే కాకుండా.. పెద్దగా సౌండ్ రావడం జరుగుతుందని యూకేలోని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వచ్చిన వారి గొంతులో కొన్ని చిన్న చిన్న మార్పులు వస్తాయని వివరించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

COVID-19కు ముందు, తర్వాత.. కరోనా వేళ.. ఈ శ్వాస వ్యాయామాలతో కచ్చితమైన ఫలాలు..!!

గొంతు పొడిబారడం..

గొంతు పొడిబారడం..

ఇటీవలి కాలంలో మీ గొంతు తరచుగా పొడిబారుతూ ఉంటే మీకు కరోనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉన్నట్టుండి మీ గొంత శబ్దం చిన్నగా రావడం, గొంతులో పిచ్ కలిగి ఉన్నట్టు అనిపిస్తే.. అవి కరోనా లక్షణాలే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కోవిద్-19 మహమ్మారి శ్వాసకోశ వ్యవస్థలోని కణజాలలను ప్రభావితం చేస్తుందని.. స్వరపేటికపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఈ కారణంగానే గొంతులో మార్పులు వస్తాయని వివరించారు.

గొంతు సమస్యలన్నీ..

గొంతు సమస్యలన్నీ..

అయితే గొంతుకు సంబంధించిన సమస్యలన్నీ కరోనా లక్షణాలు కాదని.. గొంతు ఎప్పుడైతే రఫ్ గా అనిపిస్తుందో.. అప్పుడు మీరు తప్పకుండా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ టెస్టు ఫలితాలను బట్టి మీకు కరోనా సోకిందా లేదా నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు..

కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు..

ప్రస్తుతం కరోనా సోకిన వారిలో జ్వరం, పొడి దగ్గు, గొంతులో మంట, ముక్కు పట్టుకుపోవడం, ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, జీర్ణమశయాంతర సంక్రమణ, రుచి, వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మీకు కరోనా సెకండ్ వేవ్ సోకిందని కన్ఫార్మ్ చేసుకోవచ్చు.

కోవిడ్ -19: 40 ఏళ్లు పైబడిన స్త్రీ, పురుషులకు రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు

ఓ అధ్యయనం ప్రకారం..

ఓ అధ్యయనం ప్రకారం..

కోవిద్-19కు సంబంధించిన పరిశోధనల్లో ఓ అధ్యయనం ప్రకారం, కరోనా వైరస్ సోకిన వారిలో మిలియన్ల మంది ప్రజల స్వరం(గొంతు)లో మార్పులను గమనించారట. లక్షలాది మంది నుండి వచ్చిన డేటా ప్రకారం, గొంతులో మార్పు కూడా కోవిద్-19 యొక్క లక్షణమని నిర్ధారించట.

వాయిస్ మారిపోవడం..

వాయిస్ మారిపోవడం..

ఈ పరిశోధన ప్రకారం, కోవిద్-19 సోకిన వారి గొంతులో అసాధారణ లక్షణాలు కనిపిస్తాయట. యునైటెడ్ కింగ్ డమ్(యుకె)లోని చాలా మంది క్లినికల్ సిబ్బంది దీనిని అంతగా పట్టించుకోలేదట. అయితే ఎవరైతే గొంతుకు సంబంధించిన అనారోగ్యంతో ఇబ్బంది పడేవారో.. అలాంటి వారిలో గొంతుకు సంబంధించిన ప్రాథమిక మార్పును గుర్తించారట. దీని ప్రకారం, కరోనా సోకిన వారి గొంతు బిగ్గరగా మారడం లేదా కఠినంగా మారడం వంటి లక్షణాలను గుర్తించారట. ఇది శ్వాసకోశ వ్యవస్థలోని కణజాలలను ప్రభావితం చేస్తుందని, దీనిలో వాయిస్ బాక్స్ (స్వర పేటిక)లో ఒక భాగం అని తేలిందట. కొందరు కోవిద్-19 సోకే సమయంలో గొంతు పెద్దగా మారిపోతుందని వారు స్పష్టం చేశారు.

గొంతులో మార్పులొస్తే.. ఏం చేయాలంటే..

గొంతులో మార్పులొస్తే.. ఏం చేయాలంటే..

వాతావరణం బట్టి మన గొంతులో సాధారణంగా కొంత మార్పులు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం కరోనా వంటి కష్ట కాలంలో మీ గొంతులో అలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే.. మీ ఇంట్లో వారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఇంట్లో ఉన్న సమయంలోనూ మాస్క్ ధరించాలి. అదే సమయంలో వేసవి కాలం అని చల్లని పదార్థాలను తినకండి. ఎల్లప్పుడూ వేడి చేసుకుని చల్లారిన తర్వాత లేదా వెచ్చగా ఉండే నీటిని తాగండి. అనునిత్యం మీ గొంతును హైడ్రేటెడ్ (తడి)గా ఉంచాలి. అదేవిధంగా మీ గొంతు నొప్పిని తగ్గించేందుకు హెర్బల్ ట్రీట్మెంట్ కూడా ప్రయత్నించొచ్చు.

English summary

Coronavirus symptoms in Voice: What happens to your voice when you have COVID-19?

Coronavirus symptoms in Voice: Data from millions of app contributors has shown that a hoarse voice can be a symptom of COVID-19.
Story first published: Wednesday, April 28, 2021, 14:10 [IST]