For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో బాధించే జలుబు మరియు దగ్గుకు ఉల్లిపాయ రసంతో చెక్ పెట్టండి!!

వర్షాకాలంలో బాధించే జలుబు మరియు దగ్గుకు ఉల్లిపాయ రసంతో చెక్ పెట్టండి!!

|
How To Use Onion As A Home Remedy For Cough And Cold || జలుబు కు ఉల్లిపాయ రసంతో చెక్ పెట్టండి !!

మీకు దగ్గు సమస్య ఉంటే ఇక అంతే అది శరీరాన్ని పిండి పిప్పి చేస్తుంది. ఎందుకంటే దగ్గు మొదలైతే అది మళ్ళీ ఆగే వరకు ఏ పని చేయలేము. ఇది మాత్రమే కాదు మాట్లాడటానికి కష్టంగా ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులలో దగ్గు పదే పదే ఇబ్బంది పెడుతుంది.

ఇటువంటి పరిస్థితిలో దగ్గుకు సిరప్ తీసుకుంటాము. కానీ దీనిలో నిద్రకు చెందిన కారకాలు ఉండటం వల్ల ఒక వ్యక్తి చాలా అలసిపోయినట్లుగా మరియు మగతగా ఉంటాడు. దీర్ఘకాలిక దగ్గు మరియు జలుబు నివారణ కోసం మందులను తీసుకోవడం ఆరోగ్యానికి కష్టం అవుతుంది. సాధారణ జలుబుకు తీసుకునే ఔషధాల వల్ల తీవ్రమైన తలనొప్పి, తలభారం వంటి పరిస్థితి ఏర్పడవచ్చు.

సాధారణంగా వచ్చే జలుబును తగ్గించడానికి

సాధారణంగా వచ్చే జలుబును తగ్గించడానికి

సాధారణంగా వచ్చే జలుబును తగ్గించడానికి చైనా మరియు అమెరికాలో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొన్నారు. అందులో ప్రధానంగా ఉల్లిపాయలను తీసుకున్నారు.ఇది జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే జలుబు వల్ల కలిగే చికాకు నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల గొంతులో మంటను తగ్గిస్తాయి మరియు ఛాతీలోని నిండిన కఫంను నివారిస్తుంది. జలుబు మరియు దగ్గుతో బాధపడేవారికి ఈ హోం రెమెడీ చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది.

ఇంటి చిట్కా :ఉల్లిపాయ నీరుతో

ఇంటి చిట్కా :ఉల్లిపాయ నీరుతో

ఇది కొందరికి విచిత్రంగా అనిపించవచ్చు. అలాగే కొందరికి ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ ఉల్లిపాయ నీరు దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది.. ఉల్లిపాయలు వంట రుచిని పెంచడానికి మాత్రమే ఉపయోగపడతాయని మీరు అనుకుంటే, మీరు ఖచ్చితంగా పొరబడినట్లే. దీనిలో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ నీరు అంటే ఉల్లిపాయను నీటిలో నానబెట్టడం. ఈ నీరు త్రాగటం వల్ల శరీరానికి రిఫ్రెష్ గా అనిపిస్తుంది. వర్షాకాలంలో కనిపించేఅనేక రకాల వైరల్ సమస్యలను తొలగించడానికి ఇది సహాయపడుతుంది.

ఉల్లిపాయ నీరు తయారు చేయడానికి

ఉల్లిపాయ నీరు తయారు చేయడానికి

ఉల్లిపాయ నీరు తయారు చేయడానికి ఇక్కడ ఒక సరళమైన విధానం ఉంది మరియు మీరు దీన్ని 2-3 రోజులు ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.

తయారుచేసే విధానం :

తయారుచేసే విధానం :

ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.

ఒక పింగాణీ గిన్నెతీసుకొని అందులో నీళ్ళు పోసి ఉల్లిపాయ ముక్కలను కూడా వేయండి.

పింగాణీ గిన్నెలో ఉన్ననీటిలో ఉల్లిపాయ ముక్కలు సుమారు 6-8 గంటలు నానబెట్టండి.

ఇది తయారైన తర్వాత రోజుకు రెండు టేబుల్ స్పూన్ల నీరు తీసుకోండి. ఇది పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. అయితే పరిమాణం తగ్గించండి.

మీకు రుచిగా ఉండాలనుకుంటే దీనికి కొద్దిగా తేనె జోడించి సేవించవచ్చు. దీని వల్ల జలుబు దగ్గు నివారించగలిగే వ్యాధి నిరోధక లక్షణాలను పెంచుతుంది.

ఉల్లిపాయ నీటి వల్ల కలిగే ప్రయోజనాలు

ఉల్లిపాయ నీటి వల్ల కలిగే ప్రయోజనాలు

ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నట్లు పరిగినింపబడుతుంది.ఇవి జలుబు మరియు దగ్గును నివారించడానికి సహాయపడుతాయి. ఎరుపు లేదా తెలుపు ఉల్లిపాయల్లో అధిక స్థాయిలో ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది వైరల్ వ్యాధిలతో ప్రభావవంతంగా పోరాడగలదు. ఇందులో థియోసల్ఫేట్లు, సల్ఫైడ్లు మరియు సల్ఫాక్సైడ్లు ఉన్నాయి. ఈ రసాయనాల వల్ల ఉల్లిపాయలోని యాంటీ-వైరల్ లక్షణాల వల్ల ఉల్లిపాయ కారం గుణాన్ని కలిగి ఉంటాయి.

ఉల్లిపాయలో ఉండే ఔషధ గుణాలు జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం

ఉల్లిపాయలో ఉండే ఔషధ గుణాలు జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం

ఉల్లిపాయలో ఉండే ఔషధ గుణాలు జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఉల్లిపాయ రసంలో అద్భుతమైన యాంటీ వైరస్ లక్షణాలు ఉన్నాయి. ఇది ముక్కు వాయుమార్గంలోని శ్లేష్మ పొరలో నిండిన కఫంను తొలగిస్తుంది మరియు శ్వాసకోసంలో విషపదార్థాల నుండి ఊపిరితిత్తులను సంరక్షిస్తుంది. ఉల్లిపాయ నీరు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో నీటి మట్టాలను నిర్వహించడం మరియు ఏదైనా వ్యాధి మరియు వైరల్ అంశాల నుండి రక్షించబడుతుంది.

సరైన క్రమంలో ఉల్లిపాయ నీరు నిల్వ ఉంచుకోవాలి.

సరైన క్రమంలో ఉల్లిపాయ నీరు నిల్వ ఉంచుకోవాలి.

సరైన క్రమంలో ఉల్లిపాయ నీరు నిల్వ ఉంచుకోవాలి. సరిగా మూత పెట్టాలి. నీటిని సరిగా మూసి ఉండకపోతే, బ్యాక్టీరియా చేరుతుంది . ఎప్పుడూ తాజా ఉల్లిపాయలను ఉపయోగించి ఇలా ఔషదం లేదా కషాయంను తయారుచేసుకోవాలి. మీరు ప్రాసెస్ చేసిన లేదా ముందే తరిగిన ఉల్లిపాయలను తిరిగి ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలలో ఔషధ గుణాలను నాశనం చేస్తుంది. ఉల్లిపాయ నీరు తయారుచేసుకున్న తర్వాత దాన్నివెంటనే మూత ఉన్నగిన్నె లేదా డబ్బాలో నిల్వచేసుకోవాలి.

English summary

Cough And Cold Home Remedy: Try this Onion remedies

Cold and cough are common health problems encountered during seasonal changes. Did you know that onions can help you get rid of the irritation caused due to the infection? Read on
Story first published:Monday, September 16, 2019, 22:22 [IST]
Desktop Bottom Promotion