For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతదేశంలో స్థానికత దశలో కోవిద్-19.. WHO సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ హెచ్చరిక...

భారతదేశంలో కోవిద్-19 స్థానికత ప్రవేశించనున్న సందర్భంగా స్థానిక కోవిద్ అంటే ఏమిటి? దాని వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

కరోనా వైరస్ మహమ్మారి రెండో దశ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మనందరికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) మళ్లీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా భారతదేశంలో కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందని..

Covid-19 in India May be Entering Stage of Endemicity; Know What is Endemic and its meaning in Telugu

దీని ప్రభావం సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ నెలకు తీవ్రస్థాయిలో ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్టు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మూడో దశ గురించి మన దేశ ప్రధాని కార్యాలయానికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇది వరకే ఓ రిపోర్టు కూడా పంపింది.

Covid-19 in India May be Entering Stage of Endemicity; Know What is Endemic and its meaning in Telugu

దీని గురించే డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరోనా మూడో దశ ఎలా ఉంటుంది? స్థానికత దశ కోవిద్-19 అంటే ఏమిటి? ఇది సాధారణ కరోనా మహమ్మారి కంటే భిన్నంగా ఎలా ఉంటుందనే వివరాలను వెల్లడించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

COVID-19 Vaccine Booster : కోవిద్-19 బూస్టర్ షాట్ అంటే ఏమిటి? వీటిని ఎవరు తీసుకోవాలి?COVID-19 Vaccine Booster : కోవిద్-19 బూస్టర్ షాట్ అంటే ఏమిటి? వీటిని ఎవరు తీసుకోవాలి?

స్థానికత దశ..

స్థానికత దశ..

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ సైంటిస్టు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ది వైర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోవిద్-19 స్థానికత దశ సంచలన విషయాలను బయటపెట్టారు. కొద్దిగా లేదా ఓ మోస్తరు స్థాయిలో వైరస్ వ్యాప్తి ఉన్నప్పుడు ఒక రకమైన స్థానికత దశలోకి ప్రవేశించి ఉండొచ్చని.. అంటే మనం వైరస్ తో కలిసి జీవించడం నేర్చుకునే దశ.. అదే కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందిన దశకు చాలా భిన్నంగా ఉంటుందని వివరించారు.

ఇలాగే ఉండొచ్చు..

ఇలాగే ఉండొచ్చు..

‘భారతదేశంలోని పరిస్థితులు, పరిమాణం, వివిధ ప్రాంతాల్లో జనాభా, ఆహారం, పద్ధతులు, రోగనిరోధక శక్తిని బట్టి, దేశంలోని ఆయా రాష్ట్రాల్లో వైరస్ మహమ్మారి హెచ్చుతగ్గులుగా ఉంటుందని, ఈ పరిస్థితి సాధ్యమైనంత వరకు ఇలాగే కొనసాగొచ్చని తెలిపారు. అయితే ఇపుడు మనం స్థానికత దశలోకి ప్రవేశిస్తున్నాం.. కానీ గత ఏడాదిలాగా భారీ పెరుగుదల, కరోనా తీవ్రత మాత్రం ఉండకపోవచ్చు' అని సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.

వ్యాక్సిన్ తక్కువగా ఉంటే..

వ్యాక్సిన్ తక్కువగా ఉంటే..

అయితే ప్రత్యేకించి కరోనా తొలి, రెండో దశలో మన దేశంపై తక్కువ ప్రభావం చూపినప్పటికీ.. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాలు, వ్యాక్సినేషన్ సాధారణంగా సాగుతున్న ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని తెలిపారు. 2022 చివరి నాటికి 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తయితే.. ఆ తర్వాత ప్రపంచం సాధారణ స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జైడస్ క్యాడిలాను 12 ఏళ్లలోపు పిల్లలకు వేయొచ్చా?జైడస్ క్యాడిలాను 12 ఏళ్లలోపు పిల్లలకు వేయొచ్చా?

పిల్లల గురించి ఆందోళన వద్దు..

పిల్లల గురించి ఆందోళన వద్దు..

కరోనా మహమ్మారి మూడో దశలో పిల్లలకు ఎక్కువగా ముప్పు ఉంటుందని పేరేంట్స్ ఆందోళన చెందొద్దని సూచించారు. సెరో సర్వే ఆధారంగా పిల్లలకు వైరస్ సోకే అవకాశం ఉన్నప్పటికీ, అది వారిపై అంతగా ప్రభావం చూపడం లేదు. అయితే స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఒకరిద్దరు మరణించినా.. పెద్దల కంటే చాలా తక్కువగా ఉంటుందని వివరించారు.

పీడియాట్రిక్ వార్డులు..

పీడియాట్రిక్ వార్డులు..

అయితే పిల్లల కోసం ముందుగానే ప్రత్యేకమైన పీడియాట్రిక్ వార్డులు, ఆసుపత్రులను తయారు చేయడం మంచిదని సూచించారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే పిల్లలకు ఆరోగ్య వ్యవస్థ అనేక విధాలుగా ఉపయోగపడుతుందని వివరించారు.

అంచనా అసాధ్యం..

అంచనా అసాధ్యం..

కరోనా మూడో దశను అంచనా వేయడం అసాధ్యమని.. ‘మూడో దశలో ఎప్పుడు ఎలా ఉంటుందో.. అది ఎలా వస్తుందో అంచనా వేయడం అసాధ్యమని తెలిపారు. అయితే దీని వ్యాప్తి వల్ల ప్రజలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. దీని గురించి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

English summary

Covid-19 in India May be Entering Stage of Endemicity; Know What is Endemic and its meaning in Telugu

Here we are talking about the Covid-19 in India may be entering stage of endemicity;know what is endemic and it's meaning in Telugu. Read on
Story first published:Wednesday, August 25, 2021, 15:19 [IST]
Desktop Bottom Promotion