For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid 3rd Wave:మనం ఇంకెంత కాలం మాస్కులు ధరించాలి? నీతి ఆయోగ సభ్యులు ఏం చెబుతున్నారు?

|

చైనా దేశంలో పుట్టిన కరోనా మహమ్మారి గత రెండు సంవత్సరాల ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపింది. ఇప్పటికే కరోనా మొదటి, రెండో దశలను దాటిన మనమంతా మాస్కుల పుణ్యమా కొంతవరకు కరోనా మహమ్మారి నుండి రక్షణ పొందాం.

అయితే కొన్ని దేశాల్లో ఇటీవలే వ్యాక్సిన్ల దశ పూర్తవ్వడంతో మాస్కులు అవసరం లేదని కొన్ని దేశాలు ప్రకటించాయి. అయితే కోవిద్-19 మూడో దశ మరి కొద్ది రోజుల్లో ముంచుకొస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) హెచ్చరించింది.

దీని ప్రభావం ఎక్కువగా మన దేశంపై ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో మనం ఇంకా ఎంత కాలం మాస్కులు ధరించాలి.. మనకు కరోనా మహమ్మారి ఇంకెంత కాలం ఉంటుందనే వివరాలను నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికె పాల్, వెటరన్ పీడియాట్రిషియన్ వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వచ్చే ఏడాది వరకు..

వచ్చే ఏడాది వరకు..

‘మన భారతదేశంలో వచ్చే సంవత్సరం మార్చి 2022 సంవత్సరం వరకు మాస్కులు ధరిస్తూనే ఉంటాం' అని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్య) డాక్టర్ వికె పాల్, వెటరన్ పీడియాట్రిషియన్ అన్నారు. కోవిద్ టీకాలు, అవసరమైన మందులు మరియు కోవిద్ కు తగిన చికిత్స అందుబాటులోకి వచ్చేంత వరకు ఇది తప్పదన్నారు.

ప్రమాదకర పరిస్థితులు..

ప్రమాదకర పరిస్థితులు..

ప్రస్తుతం భారతదేశంలో కోవిద్-19 మూడో దశ ముప్పు రాబోతోంది. అదే సమయంలో వరుసగా పండుగలు రాబోతున్నాయి. దీంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్నారు. కరోనా మహమ్మారి మూడో దశ ముప్పు మనపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందనేది ఇప్పుడే చెప్పలేమని ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే పరిస్థితులన్నీ గందరగోళానికి దారి తీసే అవకాశం ఉందన్నారు.

నివారణకు మార్గాలు..

నివారణకు మార్గాలు..

ఈ నేపథ్యంలో కరోనా నివారణకు మార్గాలున్నాయా? మళ్లీ ఆంక్షలు విధించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు. ‘ప్రస్తుతం సిద్ధాంత పరంగా వైరస్ ను నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు గ్రేడెడ్ పద్ధతిలో పరిమితులను అమలు చేయడానికి మార్గదర్శకాలు అందుబాటులో ఉన్నాయి. గత నెల ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు పండుగల సమయంలో పెద్దగా సమావేశాలు జరగకుండా చూసుకోవాలని సూచించింది.

కఠిన చర్యలు..

కఠిన చర్యలు..

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన చర్యలు చురుకుగా తీసుకోవాలని చెప్పింది. కరోనా మరోసారి ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసి పడకముందు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం' అని వివరించారు. ‘ఏప్రిల్ 25 నుండి జూన్ 28 నాటి వరకు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొన్న విధంగా ఇది స్థానికత దశగా చేరుకుందని' కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా వివరించారు. కోవిద్-19 మార్గదర్శకాలను సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.

హెచ్చుతగ్గుల కేసులు..

హెచ్చుతగ్గుల కేసులు..

మన దేశంలో రోజువారీ కరోనా కేసులు గత మూడు నెలలుగా 50 వేల లోపే నమోదవుతున్నాయి. నిన్న కూడా 27,254 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ సంఖ్య 3,32,64,175కి చేరింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 3,74,269కి తగ్గింది. ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్ 4,42,874-1,38,142 మంది మహారాష్ట్రలో 37,504 మంది కర్నాటకలో, తమిళనాడులో 35,168, ఢిల్లీలో 25,083, ఉత్తరప్రదేశ్ లో 22,883, కేరళలో 22,551 మరియు పశ్చిమ బెంగాల్ లో 18,577 మంది ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో 70 శాతానికి పైగా మరణాలు ఇతర రోగాల నుండి సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.26 శాతంగా నమోదైంది. గత 14 రోజులుగా ఇది మూడు శాతం తక్కువగా ఉందని, ఇప్పుడు వరుసగా 97 రోజులు ఐదు శాతం కంటే తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.11 శాతంగా నమోదైంది. గత 80 రోజులుగా ఈ సంఖ్య మూడు శాతం కంటే తక్కువగా ఉంది.

మన దేశంలో ఇంకా ఎంత కాలం మాస్కులు ధరించాలి?

మన భారతదేశంలో వచ్చే సంవత్సరం 2022 మార్చి నెల వరకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని నీతి ఆయోగ్(ఆరోగ్య)సభ్యులు డాక్టర్ వికె పాల్ తెలిపారు.

English summary

Covid 3rd Wave: How Long Will Indians Need to Wear Masks? What Niti Aayog member said

Here we are talking about the Covid 3rd wave:How long will Indians need to wear masks? Waht Niti Aayog member said in Telugu. Have a look
Story first published: Wednesday, September 15, 2021, 18:07 [IST]