Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
తొలిసారిగా HIV నుండి పూర్తిగా కోలుకున్న మహిళ.. స్టెమ్ సెల్ మార్పిడితో ఈ మిరాకిల్..
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా హెచ్ఐవి నుండి ఓ మహిళ విజయవంతంగా బయటపడిందట.
ఇప్పటిదాకా HIV, ఎయిడ్స్ వ్యాధులకు మందు అనేదే లేదు. చికిత్స కూడా ఉండేది కాదు. కేవలం నివారణ ఒక్కటే మార్గం అని మనం రెగ్యులర్ గా వింటూ ఉండేవాళ్లం. గత మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా HIV, ఎయిడ్స్ ను నిర్మూలించడానికి శాస్త్రవేత్తలు ఎంతగానో కష్టపడుతున్నారు.

ఇన్నాళ్లకు వారు పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లే కనిపిస్తోంది. తాజాగా HIV సోకిన రోగికి, మొట్టమొదటి సారి ఓ మహిళకు కొత్త టెక్నాలజీతో విజయవంతంగా చికిత్స అందించి అమెరికా వైద్య నిపుణులు కొత్త రికార్డు నెలకొల్పారు. దీనికి సంబంధించిన పరిశోధకులు డెన్వర్ కు విలేకరుల సమావేశంలో ఈ చికిత్సా విధానానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు.

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఈ మిరాకిల్ జరిగినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ సందర్భంగా స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ అంటే ఏమిటి? దీని చికిత్సా విధానం ఎలా ఉంటుంది.. దీనికి ఎంత ఖర్చవుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్..
HIV సోకిన మహిళకు తొలిసారిగా స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేసినట్లు పరిశోధకులు తెలిపారు. HIV వైరస్ కు వ్యతిరేకంగా సహజ రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తి మూల కణాలను దానం చేశారు. ఈ చికిత్స సమయంలో, ఆ మహిళ యొక్క లుకేమియా చికిత్సకు డాక్టర్లు బొడ్డు తాడు రక్తాన్ని తొలిసారిగా ఉపయోగించారు. ప్రస్తుతం, ఆ మహిళ 14 నెలల పాటు ఆరోగ్యంగా ఉంది. తనకు ఎలాంటి మందులు అవసరం లేదు.

ఇద్దరు పురుషులకు..
ఈమె కంటే ముందు ఇద్దరు HIV సోకిన పురుషులు కూడా ఈ మహమ్మారి నుండి బయటపడిన రెండు కేసులు ఉన్నాయని వైద్యులు వివరించారు. వారిలో ఒకరు తెల్లజాతికి చెందిన వారు కాగా.. మరొకరు దక్షిణ అమెరికా సంతతికి చెందిన వ్యక్తి. వారిద్దరికీ స్టెమ్ సెల్ మార్పిడి కూడా జరిగింది. అయితే ఆ మూల కణాలు పెద్దల నుండి తీసుకోబడ్డాయి. ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ ప్రెసిడెంట్ షారన్ లెనిన్ మాట్లాడుతూ, ‘‘ఇప్పుడు చికిత్స యొక్క మూడో నివేదిక వస్తోంది మరియు తొలిసారిగా ఓ మహిళ HIV రోగానికి చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుంది''.

నాలుగేళ్ల పాటు చికిత్స..
ఈ మహిళకు 2013లో HIV ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. నాలుగు సంవత్సరాల తర్వాత, ఆమెకు లుకేమియా కూడా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ రక్త క్యాన్సర్ కు హ్యాప్లో-త్రాడు మార్పిది ద్వారా చికిత్స అందించబడింది. ఇందులో పాక్షికంగా సరిపోలిన దాత నుండి తాడు రక్తం తీసుకోబడింది. ఈ సమయంలో మహిళ యొక్క సన్నిహిత బంధువులు కూడా రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఆమెకు రక్తదానం చేశారు. మహిళకు చివరిసారిగా 2017 సంవత్సరంలో మార్పిడి చేయగా.. గత నాలుగు సంవత్సరాలలో ఆమె లుకేమియా నుండి పూర్తిగా కోలుకున్నారు. మూడు సంవత్సరాల తర్వాత డాక్టర్లు తనకు HIV చికిత్సను కూడా నిలిపేశారు. దీంతో ఆమె ఇప్పుడు HIV నుండి పూర్తిగా విముక్తిగా పొందినట్లు వివరించారు.

కొత్త ఆశలు..
తాజాగా ఓ మహిళ HIV నుండి పూర్తిగా కోలుకోవడంతో భవిష్యత్తులో ఎయిడ్స్ పూర్తిగా నిర్మూలించేందుకు కొత్తగా ఆశలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఈ HIV చికిత్సను ఆపేసిన తర్వాత కూడా మళ్లీ ఏదో ఒక రూపంలో వచ్చి ఇబ్బంది పెట్టేది. అయితే తాజా కేసులో ఈ లక్షణాలేవీ లేకుండా పూర్తిగా నయం కావడం విశేషం.
HIV సోకిన మహిళకు తొలిసారిగా స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేసినట్లు పరిశోధకులు తెలిపారు. HIV వైరస్ కు వ్యతిరేకంగా సహజ రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తి మూల కణాలను దానం చేశారు. ఈ చికిత్స సమయంలో, ఆ మహిళ యొక్క లుకేమియా చికిత్సకు డాక్టర్లు బొడ్డు తాడు రక్తాన్ని తొలిసారిగా ఉపయోగించారు. ప్రస్తుతం, ఆ మహిళ 14 నెలల పాటు ఆరోగ్యంగా ఉంది. తనకు ఎలాంటి మందులు అవసరం లేదు.



Click it and Unblock the Notifications