For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?వీటిని ఏ సమయంలో తినాలి? ఎలా తినాలి?

ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?వీటిని ఏ సమయంలో తినాలి? ఎలా తినాలి?

|

ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు అని ఎంత మందికి తెలుసు?మీకు తెలియక పోతే, మీకు ఈ వ్యాసం ఖచ్ఛితంగా సహాయపడుతుంది. దాంతో మీరు డైట్ లో ఖచ్ఛితంగా ఖర్జూరాలను చేర్చుకుంటారు. వీటిని డ్రై ఫ్రూట్స్ లో ఒకటిగా పరిగణిస్తారు. ఖర్జూరాలను డేట్స్ అని ఫీనిక్స్ డాక్టిలిఫెరా అని పిలువబడే ఈ ఆరోగ్యకరమైన పండ్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ నిరోధక మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే గుణాలున్నాయి.

ఎముక ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాలుగా సహజ వైద్య ప్రయోజనాల కోసం ఖర్జూరాలను ఉపయోగించబడుతున్నాయి. అదనంగా, మలబద్ధకం, ఉదర క్యాన్సర్ మరియు విరేచనాలతో సహా కొన్ని ఆరోగ్య పరిస్థితులకు ఖర్జూరాలను మంచి హోం రెమెడీస్ గా పిలుస్తారు. కాబట్టి, ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తినడం ద్వారా పొందే మేజర్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం..

1. పేగుల్లో పరాన్న జీవులను నాశనం చేస్తుంది

1. పేగుల్లో పరాన్న జీవులను నాశనం చేస్తుంది

ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఖర్జూరాలు తినడం వల్ల ప్రేగులో పరాన్నజీవులను నాశనం చేస్తుంది, హృదయాన్ని బలోపేతం చేయడానికి, కాలేయాన్ని శుభ్రపరచడానికి మరియు రక్తాన్ని పోషించడానికి సహాయపడుతుంది

2. తక్షణ శక్తిని పొందుతారు

2. తక్షణ శక్తిని పొందుతారు

దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత శరీరంలోని శక్తిని పునరుద్ధరించడానికి ఖర్జూరాలు సహాయపడతాయి మరియు ముఖ నరాల పక్షవాతం రాకుండా సహాయపడుతుంది

3. మలబద్దకాన్ని నయం చేస్తుంది మరియు రెగ్యులర్ ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది

3. మలబద్దకాన్ని నయం చేస్తుంది మరియు రెగ్యులర్ ప్రేగు కదలికను ప్రోత్సహిస్తుంది

ఖర్జూరాల్లో డైటరీ ఫైబర్స్ ఎక్కువగా ఉన్నాయని చెబుతారు, ఇది ప్రేగు కదలికకు సహాయపడుతుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

4. ఆకలిని తగ్గిస్తుంది

4. ఆకలిని తగ్గిస్తుంది

ఉదయాన్నే ఖర్జూరాలు తినడం వల్ల ఆకలితో బాధపడకుండా రోజంతా సంతృప్తతను కలిగిస్తుంది. ఖర్జూరాలు క్రమం తప్పకుండా తింటే హృదయనాళ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు సామర్థ్యం మరియు శక్తిని పెంచుతుంది.

5. ఆరోగ్యకరమైన చర్మం

5. ఆరోగ్యకరమైన చర్మం

విటమిన్ సి, బి 5, ఫ్లేవనాయిడ్లు మరియు యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలతో ఖర్జూరాలలో నిండి ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ ముఖ్యమైన అంశాలు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయని అంటారు.

ఉదాహరణకు, విటమిన్ సి మరియు ఫ్లేవనాయిడ్లు చర్మం స్థితిస్థాపకతను ప్రోత్సహిస్తాయి, తద్వారా మీ చర్మంపై, ముఖ్యంగా ముఖం మీద ముడతలు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తాయి. మీ శరీరంపై ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన ప్రభావాల కారణంగా మీ చర్మంలో సున్నితత్వం తగ్గకుండా ఆక్సిడేటేషన్ కాంపొనెంట్ సహాయపడుతుంది . విటమిన్ బి 5 స్ట్రెచ్ మార్కులు మరియు ఇతర చర్మ వ్యాధులు ఏర్పడకుండా చేస్తుంది. ఇవి చర్మం కోసం ఖర్జూరాలు తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు, వాస్తవానికి, అవి ఇంకా అయిపోవు..!

6. ఆరోగ్యకరమైన జుట్టు

6. ఆరోగ్యకరమైన జుట్టు

విటమిన్స్ బి 5 మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఖర్జూరాలలలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలను మరియు మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ముఖ్యమైనవి. ఖర్జూరాలు మీ తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, తద్వారా చుండ్రు మరియు జుట్టు రాలడం వంటి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. మీ జుట్టు బలహీనంగా ఉంటే, మీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చడాన్ని ప్రయత్నించండి మరియు మీరు ఎప్పుడైనా మెరుగుదల గమనించవచ్చు.

7. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

7. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

పరిశోధనల ప్రకారం, ఒత్తిడి మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఖర్జూరాలు ఉపయోగపడతాయి. వీటిలో కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్ ఉండవు, ఫైబర్ మరియు ఐరన్ అధికంగా ఉంటాయి. మీరు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించాలనుకుంటే, మీరు మీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చాలి.

8. లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

8. లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

దశాబ్దాలుగా, ఖర్జూరాలను ఒక పండుగా మరియు లైంగిక బలహీనతకు పూర్తి సహజ నివారణగా ఉపయోగించబడుతున్నాయి. భారతీయ సమాజంలో, మగ సంతానోత్పత్తిని పెంచడానికి సాంప్రదాయ ఔషధాల తయారీలో ఖర్జూరపు ప్పొడిని ఉపయోగిస్తున్నారు. అధిక పోషక అంశాలైన ఫ్లేవనాయిడ్ మరియు ఎస్ట్రాడియోల్ కాంపోనెంట్స్ స్పెర్మ్ కౌంట్ మరియు చలనశీలతను పెంచుతాయని నమ్ముతారు. అదనంగా, రెగ్యులర్ గా ఖర్జూరాలు తినే మహిళల్లో రొమ్ము పరిమాణాన్ని మరియు పురుషులకు వృషణ పరిమాణాన్ని పెంచడానికి సహాయపడతాయి.

9. మలబద్ధకంతో కూడి కడుపు నొప్పి

9. మలబద్ధకంతో కూడి కడుపు నొప్పి

ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా ఉన్నందున, మలబద్దకం కారణంగా వచ్చే కడుపు నొప్పికి చికిత్సకు వీటిని ఉపయోగించవచ్చు . రోచెస్టర్ మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం, తగినంత ఫైబర్ తీసుకోకోపోవడం వల్ల మలబద్దకానికి కారణమవుతుంది. అదనంగా, ఖర్జూరాలు సాధారణ ప్రేగు కదలికను ప్రోత్సహిస్తాయి, ఇది సాధారణ మలం ఏర్పడటాన్ని ప్రోత్సహిస్తుంది, తద్వారా మీ మొత్తం డైజెస్టివ్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

10. రక్తంలో చక్కెరను నియంత్రించండి

10. రక్తంలో చక్కెరను నియంత్రించండి

ఖర్జూరాలు తినడం వల్ల ఇది మరొక ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి ఖర్జూరాలు తప్పనిసరి అని పరిశోధనలు చెబుతున్నాయి ఎందుకంటే అవి తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉంటాయి.

11. రేచీకటికి మంచి చికిత్స

11. రేచీకటికి మంచి చికిత్స

పరిశోధన ప్రకారం, విటమిన్ ఎ తగినంతగా తీసుకోకపోవడం వల్ల రేచీకటికి కారణం అవుతుంది. కాబట్టి, మీరు రేచీకటితో బాధపడుతుంటే, విటమిన్ ఎ పోషకాలు పుష్కలంగా ఉన్న ఖర్జూర పండ్లు తినడం ప్రారంభించండి. మీరు వారంలో కొన్ని సార్లు మీరు తినే సలాడ్లు లేదా అల్పాహారానికి ఖర్జూరాలను జోడించాలని నిర్ధారించుకోండి.

12. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

12. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఖర్జూరపండ్లలో సహజంగా విటమిన్లు, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు మరియు ఖనిజాలతో లోడ్ చేయబడి ఉన్నాయి. ఇవి మీ మెదడు కణాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు నిర్వహించడానికి సహాయపడతాయి. ఉదాహరణకు, ఖర్జూరాలలోని పొటాషియం కాంపోనెంట్స్ మీ నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి, ఇది మీ మెమరీ కార్యాచరణను గణనీయంగా మెరుగుపరుస్తుంది.

అదనంగా, ఖర్జూర పండ్లలో బ్రెయిన్ బూస్టింగ్ అంశాలు అధికంగా ఉన్నాయి. ఇవి మీ మెదడులో ఆక్సీకరణ మంట మరియు ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి. న్యూరోడెజెనరేటివ్ మరియు అల్జీమర్స్ పరిస్థితులను అభివృద్ధి చేసే అవకాశాలను తొలగించేటప్పుడు మీరు మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటే, మీరు ఉదయాన్నే ఖర్జూరాలను తినాలని నిర్ధారించుకోండి.

ఖాలీ కడుపుతో ఖర్జూరాలను ఎలా తినాలి?

ఖాలీ కడుపుతో ఖర్జూరాలను ఎలా తినాలి?

ఖర్జూలను ఏ సమయంలో తినాలన్న మీకు ఖచ్చితంగా తెలిసుండకపోవచ్చు. వీటిని ఉదయాన్నే పరడగడుపు తింటే మంచిది. అయితే , ఖర్జూరం పండ్లు ఆరోగ్యకరమైనవి కాబట్టి, రోజులో ఎప్పుడైనా తినవచ్చు. మీ డైట్ లో ఖర్జూరాలను చేర్చుకోవడానికి ఈక్రింద కొన్ని మార్గాలను సూచించాము.

ఎలా తినాలి?

ఎలా తినాలి?

  • ఖర్జూరాలను కట్ చేసి సలాడ్స్ తో జోడించి తినండి.
  • లోపలి విత్తనాలు తొలగించి స్నాక్స్ తయారుచేసుకోవచ్చు.
  • ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు తీసుకుని త్రుణ ధాన్యంతో కలిపి తీసుకోవచ్చు.
  • చికెన్ లేదా తునా ఫిష్ సలాడ్స్ తో కలిపి తినవచ్చు.
  • ఖర్జూరాలను పాలు లేదా ఫ్రోజోన్ వెనిల్లా పెరుగుతో కలిపి తినండి
  • లేదా న్యాచురల్ గా వాటిని అలాగే తినండి!!
  • ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా తినే ఆహారంలో వీటిని

    ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా తినే ఆహారంలో వీటిని

    ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా తినే ఆహారంలో వీటిని చేర్చుకోవడం చాలా మంచిది. ఇవి రుచిగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి అత్యవసరమైన అనేక పోషకాలను కలిగి ఉన్నాయి. పరిమితికి మించి తినడం వల్ల మధుమేహం మరియు బరువు పెరగడం వంటి ప్రతికూల ఫలితాలను ప్రోత్సహిస్తుందని గుర్తుంచుకోండి.

    ఖర్జూరాలు ఎంత ఆరోగ్యకరంవైనా

    ఖర్జూరాలు ఎంత ఆరోగ్యకరంవైనా

    కాబట్టి, ఖర్జూరాలు ఎంత ఆరోగ్యకరంవైనా వాటిని పరిమితంగా మాత్రమే తినాలి. పరగడపున ఖర్జూరాలను తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. అందువల్ల వెంటనే ఖర్జూరాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి. మీరు ఎంత పరిమాణంలో తినాలో తెలియని పక్షంలో మీరు మీ డైటీషియన్ ను కలవండి.

English summary

Health Benefits Of Eating Dates In An Empty Stomach

Health Benefits Of Eating Dates In An Empty Stomach, Read more to know about,
Story first published:Tuesday, September 17, 2019, 13:33 [IST]
Desktop Bottom Promotion