For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్, పైల్స్, అల్సర్ కు మంచి పరిష్కారం: నేరుడు ఆకులు..!!

డయాబెటిస్, పైల్స్, అల్సర్ కు మంచి పరిష్కారం: నేరుడు ఆకులు..!!

|

నేరుడు పండ్లు అంటే అందరికీ బహు పరిచయం ఉన్న పేరు. పేరు గొప్పదే అయినా తినే వారు మాత్రం తక్కువే వీటి గురించి తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో వీటిని వదలరు. ఎక్కడ ఉన్నా వెతికి మరీ కొని తింటారు. మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో నేరుడు పండ్లు కూడా ఒకటి. ఈ సీజన్లో బుట్టల్లో ఆకుపచ్చని ఆకుల మద్య నిగనిగలాడుతూ...నోరూరిస్తూ పలకరించే పండ్లు. వీటిని రోజూ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరం అయ్యే అన్ని రకాల న్యూట్రీషిన్లు స‌మృద్ధిగా లభిస్తాయి.

పోషకాల పరంగా ప్రతీ 100గ్రాముల నేరేడులో ప్రోటీన్స్‌ 0.07శాతం, క్రొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, నారం 0.9, పిండిపదార్ధాలు 15మి.గ్రా., ఫాస్ఫరస్‌ 15, ఐరన్‌ 1.2, విటమిన్‌ సి 18మి.గ్రా. ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రొటీన్లు, కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్‌, ప్రక్టోజ్‌లు ముఖ్యమైనవి.టిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

నేరేడు పండ్లే కాదు నేరుడు ఆకులు కూడా ఆరోగ్యానికి

నేరేడు పండ్లే కాదు నేరుడు ఆకులు కూడా ఆరోగ్యానికి

నేరేడు పండ్లే కాదు నేరుడు ఆకులు కూడా ఆరోగ్యానికి బహు విధాలుగా ఉపయోగాపడుతాయి. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, యాంటీవైరస్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి, మలబద్దకం నివారిస్తుంది, అలర్జీలను పోగొడుతాయి. ఈ ఆకులను సిల్క్ వార్మ్ కు ఆహారంగా ఉపయోగిస్తారు, ఆ లీఫ్ ఆయిల్ ను సోపులు, పెర్ఫ్యూమ్స్ వంటి సుగందాల తయారీకి ఉపయోగిస్తారు. మరి ఆరోగ్యపరంగా ఎటువంటి ఉపయోగాలున్నాయో చూద్దాం...

కిడ్నీ స్టోన్స్ కరిగిస్తుంది:

కిడ్నీ స్టోన్స్ కరిగిస్తుంది:

ఈ నేరుడు ఆకులను 10-15గ్రా తీసుకుని బాగా కడిగి ఆకులను, మూడు నల్లమిరియాలు వేసి పేస్ట్ చేసి , నీరు కలిపి జ్యూస్ చేయాలి. ఈ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చిగుళ్ల వ్యాధులతో బాధపడే వారు ఈ చెట్టు బెరడు,ఆకుల రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే చాలా మంచిది. కడుపులోకి చేరిన తల వెంట్రుకలు, లోహపు ముక్కలతో పాటు కిడ్నీల్లోని రాళ్లను సైతం కరిగిస్తుంది. ఈ పండ్ల రసంలో తేనె కలిపి తాగితే అరికాళ్లు, అరిచేతుల మంటలు, కాళ్ల మంటల నుంచి ఉపశమనం పొందవచ్చు.

క్యాన్సర్ నివారిణి

క్యాన్సర్ నివారిణి

నేరుడు ఆకుల్లో యాంటీక్యాన్సర్ గుణాలు అధికం. ఇందులో ఉండే యాంటీక్యాన్సర్ గుణాలు శరీరం క్యాన్సర్ బారీ పడకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ సెల్స్ నుండి శరీరం డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

అల్సర్:

అల్సర్:

అల్సర్ ఇది స్కిన్ డిసీజ్ మరియు వాపు కూడా. అంతే కాదు పొట్ట సమస్య కూడా. నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది. నొప్పినివారినిగా ఇతర మందులు మరియు ఆయిట్మెంట్ ఉపయోగించడానికి ముందు దీన్ని న్యాచురల్ మార్గంలో ఉపయోగించవచ్చు.

బ్లీడింగ్ పైల్స్

బ్లీడింగ్ పైల్స్

పైల్స్‌ వ్యాధికి సరైన మందు నేరేడే. నేరేడు సీజన్‌లో ప్రతిరోజు ఉదయాన్నే ఉప్పుతో ఉదయం పూట తింటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెండు ఏళ్లు సీజన్‌లో తింటే పైల్స్‌ పూర్తిగా తగ్గిపోతాయి. నేరేడును ప్రముఖంగా ఆయుర్వేద మందులలో వాడతారు. నేరేడు ఆకులు, పండ్లు, గింజలు, ఎండు లేదా పచ్చి బెరడు, వేరులను ఆయుర్వేద మందులలో ఎంతో ఉపయోగపడుతున్నాయి.

పైల్స్ కు తగిని చికిత్స తీసుకోనప్పుడు బ్లీడింగ్ పైల్స్

పైల్స్ కు తగిని చికిత్స తీసుకోనప్పుడు బ్లీడింగ్ పైల్స్

పైల్స్ కు తగిని చికిత్స తీసుకోనప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఇటువంటి సమస్యకు మంచి పరిష్కారం నేరేడు ఆకు. నేరుడు ఆకు నుండి తయారుచేసిన జ్యూస్ మంచి ఔషదంగా పనిచేస్తుంది. నేరుడు ఆకులకు పుదీనా లేదా కొత్తిమీర , కొద్దిగా బెల్లం మిక్స్ చేసి జ్యూస్ తయారుచేసి తాగాలి. అవసరం అనుకుంటే పాలతో కలిపి తాగవచ్చు. ఇలా ఒక వారం పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ అవసరం లేకుండా బ్లీడింగ్ పైల్స్ నుండి ఉపశమనం పొందవచ్చు.అల్లనేరేడు చెక్క నుంచి తీసిన కాషాయం అతిసార, నీళ్ల విరోచనాలు, జ్వరాన్ని తగ్గిస్తుంది. వాటి చిగురుతో కాషాయం కాసి రోజుకు మూడుసార్లు నాలుగైదు టేబుల్ స్ఫూన్లు తాగితే మొలలు తగ్గుతాయి. వేసవిలో దాహాన్ని అరికడుతుంది. కడుపులోని నులి పురుగులను నివారిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఆయుర్వేద మరియు యునాని పరిశోధనల ప్రకారం ఈ నేరుడు ఆకులను డయోరియా మరియు అజీర్ణం వంటి సమస్యలకు ఔషదంగా ఉపయోగించవచ్చు. ఆకులు, బెరడును ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు.

హై ఫీవర్ తగ్గిస్తుంది:

హై ఫీవర్ తగ్గిస్తుంది:

మూడు లేదా అంతకు మంచి జ్వరం వస్తుంటే ఆరోగ్యపరంగా సీరియస్ గా శరీరంలో ఏదో జరుగుతోందని గుర్తించాలి. జ్వరం వస్తుంటే మూడు నాలుగు రోజుల వరకూ వేచి చూడాల్సిన పనిలేదు. నేరేడు ఆకులను ఔషదంగా తీసుకోవచ్చు. శరీరంలో వేడిని త్వరగా తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. శరీరంలో వేడి తగ్గే వరకూ ఈ ఆకును జ్యూస్ లేదా వేడినీటిలో ఉడికించి తీసుకోవచ్చు.

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది:

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది:

శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ ప్రయోజనం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే , శరీరంలో సరైన రక్తప్రసరణ జరగడం వల్ల గుండె సక్రమంగా పనిచేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తంను బాగా సరఫరాచేస్తుంది.

English summary

Health Benefits of Jamun Leaves

This article will specifically discuss about Jamblang leaf. The shape of the leaves are thick, wide, and with a pinnate bone. The color is green. This leaf has a lot of very useful content such as antioxidants, anti-virus, anti-inflammatory, can also helping in lower blood sugar levels, treat constipation and eliminate allergies. Read on.
Desktop Bottom Promotion