For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో శరీరం వెచ్చగా ఉంచి, ఆరోగ్యంగా ఉండటానికి అల్లం ఇలా వాడండి..

వింటర్లో శరీరం వెచ్చగా ఉంచి, ఆరోగ్యంగా ఉండటానికి అల్లం ఇలా వాడండి..

|

సాధారణంగా, రోజు ప్రారంభించేటప్పుడు మీరు చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంటేనే ఆ రోజు ఆహ్లాదంగా ఉంటుంది. రోజంత చురుకుగా ఉండటానికి శరీరానికి తగినంత శక్తి అవసరం. మరి అలాంటి శక్తి మన శరీరానికి ఎక్కడ నుండి వస్తుంది. ఆ శక్తిని పొందడానికి ఏమి చేయాలి? శరీరానికి శక్తిని పొందాలంటే ఉదయం అల్పాహారం ఎంతో సహాయపడుతుంది. మరి రోజంతా ఎనర్జిజిటిక్ గా ఉంచి అల్పాహారంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలని మనం తెలుసుకుందాం.

రాత్రి భోజనం తర్వాత ఉదయం అల్పాహారానికి మధ్య సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉదయం అల్పాహారాన్ని మిస్ చేయకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. అంతే కాదు నిత్యం మనం తీసుకునే అల్పాహారం చాలా ఆరోగ్యకరమైనదై ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా, శీతాకాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే మనం ఇతర సమయాల్లో కంటే శీతాకాలంలో ఎక్కువగా తింటాము.

Healthy Breakfast Options With Ginger To Fight Winter Cold and Keep The Body Warm

కారణం, మనం తినే ఆహారం శరీరానికి శక్తినివ్వడానికి సహాయపడుతుంది మరియు శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే మనకు అంత ఆకలిగా ఉంటుంది. అందువల్ల, మన శరీరానికి అవసరమైన వెచ్చదనాన్ని ఇవ్వడానికి తగిన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.

ఉదాహరణకు, మనం నిత్యం వండే ఆహారాల్లో ఎక్కువ అల్లం జోడించడం మంచిది. ఉదాహరణకు, శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. ఆ విధంగా, అల్పాహారం ఆహారాలలో అల్లంను ఎలా చేర్చాలో మనం ఇప్పుడు చూద్దాం...అల్లం టీ
ఉదయం నిద్రలేవగానే అందరూ కాఫీ, టీ తాగుతూ ఉంటారు. అటువంటి టీలో అల్లం కొద్దిగా వేసి కాచి, తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. అదనంగా, అల్లం టీ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి మరియు కడుపులో ఏవైనా సమస్యలున్నా తొలగిపోతాయి. అదనంగా, ఇది గర్భధారణ సమయంలో మహిళల్లో సంభవించే వికారం మరియు మలబద్ధకం సమస్యలకు మందు. మిల్క్ టీ తప్ప, అల్లం టీ తాగడం లేదా అల్లంను నీటిలో ఉడకబెట్టడం మంచిది.

Healthy Breakfast Options With Ginger To Fight Winter Cold and Keep The Body Warm
అల్లం సిరప్
మాపుల్ సిరప్‌కు బదులుగా శీతాకాలంలో అల్లం సిరప్ ఉపయోగించిన పాన్‌కేక్‌లు తినడం మంచిది. ఈ అల్లం సిరప్‌ను పానీయాలు, వోట్స్ మరియు కేక్‌లు వంటి ఆహారాలకు కూడా చేర్చవచ్చు. ఈ అల్లం సిరప్ దుకాణాల్లో కొనడానికి లేదు. ఇది ఇంట్లోనే తయారుచేసుకోవాలి. వేడినీటిలో అల్లం వేసి 30 నిముషాలు ఉడకబెట్టి ఆపై వడగట్టుకోవాలి.

అల్లం స్మూతీ
మీరు అల్పాహారంలో అల్లం స్మూతీని కూడా చేర్చవచ్చు. మీరు కూడా కొన్ని పండ్లతో అల్లం కలపవచ్చు మరియు త్రాగవచ్చు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరంలో జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, నొప్పిని తగ్గిస్తుంది, రుతు తిమ్మిరి మరియు వివిధ ఆరోగ్య సమస్యల నివారణకు సహాయపడుతుంది.

Healthy Breakfast Options With Ginger To Fight Winter Cold and Keep The Body Warm
అల్లం జామ్ మరియు బ్రెడ్
అల్లం జామ్ లేదా అల్లం మిక్స్డ్ జామ్ ఏమైనా శరీరానికి చాలా మంచిది. బ్రెడ్ మరియు అల్లం జామ్‌తో కలిపి తినవచ్చు. రుచి మరియు ఆరోగ్యంలో ఇది ఉత్తమమైనది.
Healthy Breakfast Options With Ginger To Fight Winter Cold and Keep The Body Warm

అల్లం కాఫీ
అల్లం టీ సుపరిచితమైనది. అల్లం కాఫీ అంటే ఏమిటి? మీరు టీ లాగా అల్లంతో కాఫీ తాగవచ్చు. టాక్సిన్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది మరియు రుచికరమైనది. మీరు కాఫీకి అల్లం జోడిస్తే, అది కొంచెం కారంగా మరియు రుచిగా ఉంటుంది. సాధారణ కాఫీతో బోరుకొట్టినట్లైతే మీరు, ఈ అల్లం కాఫీని ప్రయత్నించండి. అంతేకాక, కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్ రోజంతా మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది.

English summary

Healthy Breakfast Options With Ginger To Fight Winter Cold and Keep The Body Warm

Healthy Breakfast Options With Ginger To Fight Winter Cold and Keep The Body Warm
Story first published:Wednesday, January 15, 2020, 17:45 [IST]
Desktop Bottom Promotion