For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా బరువు తగ్గాలా? అయితే కాఫీలో తేనె కలిపి చూడండి!!

త్వరగా బరువు తగ్గాలా? అయితే కాఫీలో తేనె కలిపి చూడండి!!

|

అనేక ఆహారాలకు ఔషధాలకు సమానమైన స్థానాన్ని ఇచ్చారు, అవి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఔషధాలతో సమానంగా ఈఆహారాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాంటి గొప్ప ఆహారాల్లో తేనె ఒకటి. తేనె అనేది గౌరవప్రదమైన ఒక ఉత్పత్తి, ఎందుకంటే ఇది ప్రాచీన కాలం నుండి అనేక అనారోగ్య పరిస్థితులకు పరిష్కారంగా ఉపయోగించబడుతున్నది. దాని అనేక ప్రయోజనాల్లో ఒకటి బరువు తగ్గడం. అవును తేనె బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు కాఫీలో కలిపినప్పుడు బరువు తగ్గడానికి ఇది మరింత ప్రభావంతంగా పనిచేస్తుంది. అదేలా పనిచేస్తుందో మనం ఈ రోజు తెలుసుకుందాం...

Heres how adding honey to coffee can help with weight loss

బరువు తగ్గడానికి కాఫీ ఎలా సహాయపడుతుంది

కాఫీలో తేనె కలపడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందో లేదో తెలుసుకోవడానికి ముందు, కాఫీ స్వయంగా ట్రిక్ చేయగలదా లేదా అని చూద్దాం. కాఫీని ఎనర్జీ డ్రింక్‌గా ఉపయోగించవచ్చని మనందరికీ తెలుసు, అందులో ఉన్న కెఫిన్ డోపామైన్ మరియు నోర్‌పైన్‌ఫ్రైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను విడుదల చేయడాన్ని ప్రేరేపిస్తుంది, ఇది మనకు శక్తినిస్తుంది. కాఫీ బరువు తగ్గడాన్ని ప్రేరేపిస్తుందని మీకు తెలుసా మరియు చాలా వరకు కొవ్వును కరిగించే సప్లిమెంట్స్ లో కెఫిన్ ఉపయోగించబడుతున్నది. కొవ్వు కణజాలం నుండి కొవ్వును విచ్ఛిన్నం చేయడం మరియు జీవక్రియను పెంచడం ఇలా కాఫీ రెండు విధాలుగా బరువు తగ్గడానికి సహాయపడుతుందని పరిశోధనలో కనుగొనబడినది. కాఫీకి తేనెను జోడించడం వల్ల బరువు తగ్గే ప్రక్రియను పెంచగలదా అని ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గడానికి మీరు కాఫీకి తేనె కలుపుతారా?

బరువు తగ్గడానికి మీరు కాఫీకి తేనె కలుపుతారా?

బరువు తగ్గడానికి కాఫీ కూడా సహాయపడుతుంది కాబట్టి, అదే బరువును తగ్గించడానికి దీనికి తేనె కూడా జోడిస్తే బరువు తగ్గే ప్రభావం మరింత పెరుగుతుంది. ఈ విషయంలో మరింత ఖచ్చితమైన సమాధానం కనుగొనడానికి మరింత నిశ్చయాత్మక పరిశోధన అవసరం అయినప్పటికీ, కాఫీలో ఒక చెంచా తేనెను జోడించడం వల్ల బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు మరియు అదెలాగో ఇక్కడ ఉంది.

ఇది నిల్వ చేసిన కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది

ఇది నిల్వ చేసిన కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది

కొవ్వు సాధారణంగా ఉపయోగించని వనరు, అంటే మన శరీరంలో ఎందుకు పనికిరాని వ్యర్థ పదార్థం. ఇది శరీరంలో నిల్వ చేయబడుతుంది, ఇది ఎక్కువ అయితే శరీరంలో బరువును జోడిస్తుంది. తేనె బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఎందుకంటే నిల్వ చేసిన కొవ్వును విచ్ఛిన్న చేస్తుంది, ఇది శరీరం రోజువారీ కార్యకలాపాలకు శక్తిగా ఉపయోగిస్తుంది.

ఇది జీవక్రియను పెంచుతుంది

ఇది జీవక్రియను పెంచుతుంది

కాఫీ మాదిరిగానే, జీవక్రియను పెంచడానికి తేనె గొప్ప మూలం. ఇది గుండె ఆరోగ్యాన్ని మరియు జీవక్రియను పెంచే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది మరియు మంచి జీవక్రియ అంటే కొవ్వును కరిగించే విషయానికి వచ్చినప్పుడు మీ శరీరం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, తద్వారా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుందని పరిశోధనల ద్వారా కనుగొన్నారు.

ఇది ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది

ఇది ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది

అధిక కొవ్వుకు ట్రైగ్లిజరైడ్లు రెండూ కారణం. ఊబకాయం లేదా అధిక బరువు ఉన్న వ్యక్తులు సాధారణంగా ఎక్కువ మొత్తంలో ట్రైగ్లిజరైడ్లను కలిగి ఉంటారు, మరియు అధిక మొత్తంలో ట్రైగ్లిజరైడ్లు తక్కువ కొవ్వును రక్తప్రవాహంలో నుండి తొలగించడానికి కారణమవుతాయి. తేనె ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది, తద్వారా శరీరం నుండి కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది.

ఇది కేలరీలను కరిగించే సామర్థ్యాన్ని పెంచుతుంది

ఇది కేలరీలను కరిగించే సామర్థ్యాన్ని పెంచుతుంది

తేనెలో అనేక విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి, మరియు అతి కొద్ది సూక్ష్మపోషకాల జాడ మాత్రమే ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా తేనె తినేటప్పుడు అవి కేలరీలు కరిగిపోయే రేటును పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

English summary

Here's how adding honey to coffee can help with weight loss

Many foods have been given equal status to medicines as they are at par, if not equally effective when it comes to curing ailments. Honey is one such product that has been bestowed with the honour, as it has been used as a cure to remedy a number of conditions since time immemorial. One of its many benefits is that it helps with weight loss, and today we will critique whether it works as an aid to losing weight when added to coffee.
Desktop Bottom Promotion