Just In
- 27 min ago
బురదలో రొమాన్స్ : ఈ ఫొటో షూట్ ను చూసి తట్టుకోవడం కష్టం.. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారంటే..
- 43 min ago
40 ప్లస్‌లో కూడా ఆ విషయంలో హ్యాపిగా ఉండాలంటే ఈ చిట్కాలను అనుసరించండి..
- 2 hrs ago
సెక్సియెస్ట్ ఏషియన్ మెన్ జాబితాలో యంగ్ రెబల్ హీరో ప్ర‘భాస్‘ స్థానం ‘పది‘లం..
- 4 hrs ago
కడుపు ఎడమ వైపు నొప్పికి గల కారణాలు ఏమిటి?ఈ నొప్పి ప్రమాదకరమా?
Don't Miss
- News
పెళ్లిలో టిక్‌టాక్ వీడియో: రెండు గ్రూపుల మధ్య గొడవ, గ్యాంబ్లింగ్ డెన్‌లో కాల్పులు
- Sports
క్రీడా అకాడమీని ఏర్పాటు చేసిన జ్వాల గుత్తా!!
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Movies
బాలీవుడ్‌లోకి విజయ్.. లాంచ్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్.. కరణ్‌తో చర్చలు సఫలం
- Finance
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, కారణమిదే
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
త్వరగా బరువు తగ్గాలా? అయితే కాఫీలో తేనె కలిపి చూడండి!!
అనేక ఆహారాలకు ఔషధాలకు సమానమైన స్థానాన్ని ఇచ్చారు, అవి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఔషధాలతో సమానంగా ఈఆహారాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాంటి గొప్ప ఆహారాల్లో తేనె ఒకటి. తేనె అనేది గౌరవప్రదమైన ఒక ఉత్పత్తి, ఎందుకంటే ఇది ప్రాచీన కాలం నుండి అనేక అనారోగ్య పరిస్థితులకు పరిష్కారంగా ఉపయోగించబడుతున్నది. దాని అనేక ప్రయోజనాల్లో ఒకటి బరువు తగ్గడం. అవును తేనె బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు కాఫీలో కలిపినప్పుడు బరువు తగ్గడానికి ఇది మరింత ప్రభావంతంగా పనిచేస్తుంది. అదేలా పనిచేస్తుందో మనం ఈ రోజు తెలుసుకుందాం...
బరువు తగ్గడానికి కాఫీ ఎలా సహాయపడుతుంది
కాఫీలో తేనె కలపడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందో లేదో తెలుసుకోవడానికి ముందు, కాఫీ స్వయంగా ట్రిక్ చేయగలదా లేదా అని చూద్దాం. కాఫీని ఎనర్జీ డ్రింక్‌గా ఉపయోగించవచ్చని మనందరికీ తెలుసు, అందులో ఉన్న కెఫిన్ డోపామైన్ మరియు నోర్పైన్ఫ్రైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను విడుదల చేయడాన్ని ప్రేరేపిస్తుంది, ఇది మనకు శక్తినిస్తుంది. కాఫీ బరువు తగ్గడాన్ని ప్రేరేపిస్తుందని మీకు తెలుసా మరియు చాలా వరకు కొవ్వును కరిగించే సప్లిమెంట్స్ లో కెఫిన్ ఉపయోగించబడుతున్నది. కొవ్వు కణజాలం నుండి కొవ్వును విచ్ఛిన్నం చేయడం మరియు జీవక్రియను పెంచడం ఇలా కాఫీ రెండు విధాలుగా బరువు తగ్గడానికి సహాయపడుతుందని పరిశోధనలో కనుగొనబడినది. కాఫీకి తేనెను జోడించడం వల్ల బరువు తగ్గే ప్రక్రియను పెంచగలదా అని ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గడానికి మీరు కాఫీకి తేనె కలుపుతారా?
బరువు తగ్గడానికి కాఫీ కూడా సహాయపడుతుంది కాబట్టి, అదే బరువును తగ్గించడానికి దీనికి తేనె కూడా జోడిస్తే బరువు తగ్గే ప్రభావం మరింత పెరుగుతుంది. ఈ విషయంలో మరింత ఖచ్చితమైన సమాధానం కనుగొనడానికి మరింత నిశ్చయాత్మక పరిశోధన అవసరం అయినప్పటికీ, కాఫీలో ఒక చెంచా తేనెను జోడించడం వల్ల బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు మరియు అదెలాగో ఇక్కడ ఉంది.

ఇది నిల్వ చేసిన కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది
కొవ్వు సాధారణంగా ఉపయోగించని వనరు, అంటే మన శరీరంలో ఎందుకు పనికిరాని వ్యర్థ పదార్థం. ఇది శరీరంలో నిల్వ చేయబడుతుంది, ఇది ఎక్కువ అయితే శరీరంలో బరువును జోడిస్తుంది. తేనె బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఎందుకంటే నిల్వ చేసిన కొవ్వును విచ్ఛిన్న చేస్తుంది, ఇది శరీరం రోజువారీ కార్యకలాపాలకు శక్తిగా ఉపయోగిస్తుంది.

ఇది జీవక్రియను పెంచుతుంది
కాఫీ మాదిరిగానే, జీవక్రియను పెంచడానికి తేనె గొప్ప మూలం. ఇది గుండె ఆరోగ్యాన్ని మరియు జీవక్రియను పెంచే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది మరియు మంచి జీవక్రియ అంటే కొవ్వును కరిగించే విషయానికి వచ్చినప్పుడు మీ శరీరం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని, తద్వారా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుందని పరిశోధనల ద్వారా కనుగొన్నారు.

ఇది ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది
అధిక కొవ్వుకు ట్రైగ్లిజరైడ్లు రెండూ కారణం. ఊబకాయం లేదా అధిక బరువు ఉన్న వ్యక్తులు సాధారణంగా ఎక్కువ మొత్తంలో ట్రైగ్లిజరైడ్లను కలిగి ఉంటారు, మరియు అధిక మొత్తంలో ట్రైగ్లిజరైడ్లు తక్కువ కొవ్వును రక్తప్రవాహంలో నుండి తొలగించడానికి కారణమవుతాయి. తేనె ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది, తద్వారా శరీరం నుండి కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది.

ఇది కేలరీలను కరిగించే సామర్థ్యాన్ని పెంచుతుంది
తేనెలో అనేక విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి, మరియు అతి కొద్ది సూక్ష్మపోషకాల జాడ మాత్రమే ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా తేనె తినేటప్పుడు అవి కేలరీలు కరిగిపోయే రేటును పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.