For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Holi Safety Tips:హోలీ వేళ కళ్లను కాపాడుకోవాలంటే... ఇలా చేయండి...

హోలీ పండుగ వేళ పాటించాల్సిన జాగ్రత్తలేంటో చూసెయ్యండి

|

వసంత కాలంలో వచ్చే తొలి పండుగ హోలీ..
చలికాలానికి పూర్తిగా టాటా చెప్పే హలికా దహన కాంతులే హోలీ..
తీపి, చేదును కలిపి పంచే విందుల పందిరి హోలీ..
చిన్న, పెద్దా తేడాలను మరచిపోయేలా చేసే సందడి హోలీ..
చెడు మీద మంచి గెలుపుకు ప్రతీకగా హోలీ..
ప్రపంచంలోని రంగులన్నింటినీ కలిపి జరుపుకునే గొప్ప వేడుక హోలీ..

Holi Safety Tips: Dos and Donts for Safe Holi in Telugu

మన దేశంలో హోలీని మించిన ఆహ్లాదకరమైన పండుగ మరొకటి లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పండుగ వేళ ప్రతి ఒక్కరూ తినడం, తాగడం దగ్గర్నుంచి ఒకరికొకరు ఆనందంగా రంగులు చల్లుకోవడం వరకు అంతా సరదాగా ఉంటుంది.
Holi Safety Tips: Dos and Donts for Safe Holi in Telugu

శత్రువులను సైతం మిత్రులుగా మార్చే పవర్ ఈ హోలీ పండుగకు ఉందని చెబుతారు. హోలీ వేడుకల్లో పాల్గొనడం వల్ల సంతోషం, సరదా లభించినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో కెమికల్స్ కలిపిన కలర్స్ వాడటం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Holi Safety Tips: Dos and Donts for Safe Holi in Telugu

ముఖ్యంగా కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోనందున నీళ్లతో ఆడుకోవడం, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇతరులను తాకడం ద్వారా కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. అలాగే రంగులు చల్లుకునే సమయంలో మీ కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకప్పుడు పువ్వులు, కూరగాయల నుండి సహజమైన రంగులను తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం కొన్ని కెమికల్స్ కలిపి కలర్స్ తయారు చేస్తున్నారు. వీటిని మనపై చల్లుకోవడం వల్ల అలర్జీ, ఇన్ఫెక్షన్లు, కంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా హోలీ పండుగ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటి.. చేయాల్సిన పనులేంటి.. చేయకూడని పొరపాట్లు ఏంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Science Behind Holi:హోలీ పండుగ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసా...Science Behind Holi:హోలీ పండుగ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసా...

చర్మం పాడవ్వకుండా..

చర్మం పాడవ్వకుండా..

హోలీ పండుగ సమయంలో రంగులు శరీరంపై పడటం వల్ల చర్మం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అలా పాడవ్వకుండా ఉండాలంటే.. మీరు హోలీ రోజున రంగులు చల్లుకోవడానికి ముందు కొబ్బరి నూనె లేదా బాదం నూనెను రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం పాడవ్వకుండా ఉంటుంది.

త్వరగా తొలగించడం..

త్వరగా తొలగించడం..

హోలీ పండుగ రోజున పొరపాటున మీ కళ్లలో రంగులు పడితే, వాటిని వీలైనంత త్వరగా శుభ్రం చేసుకోవాలి. అది కూడా మంచి నీటితో లేదా తాగునీటితో ఎక్కువసార్లు కడుక్కోవాలి. కంటిన్యూగా కళ్లు మూయడం, కళ్లను పైకి, కిందకు తిప్పడం వల్ల కొన్ని రకాల రంగులను తొలగించుకోవచ్చు. అయితే కళ్లలోకి డైరెక్టుగా నీళ్లు వేయకూడదు. అలా చేస్తే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

క్యాప్ పెట్టుకోండి..

క్యాప్ పెట్టుకోండి..

హోలీ పండుగ రోజున ప్రతి ఒక్కరి జుట్టు కలర్ ఫుల్ గా మారిపోవడం ఖాయం. ఎందుకంటే ముఖంపై రంగులను తప్పించుకునే క్రమంలో తలపై కచ్చితంగా కలర్స్ పడతాయి. కొందరైతే తలపై కోడిగుడ్డు కొట్టేస్తారు.. మరికొందరు టమోటాలు కూడా వేస్తారు. అప్పుడు మీ జుట్టు పాడవుతుంది. అలా కాకుండా ఉండాలంటే మీ జుట్టు ముడి వేసుకోండి. దానిపై క్యాప్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల కలర్ వాటర్ మీ జుట్టు ద్వారా కళ్లలోకి చేరే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Holi Remedies :హోలీ వేళ ఈ పరిహారాలు పాటిస్తే డబ్బు సమస్యలే ఉండవట...!Holi Remedies :హోలీ వేళ ఈ పరిహారాలు పాటిస్తే డబ్బు సమస్యలే ఉండవట...!

కళ్లు, పెదాలు క్లోజ్ చేయండి..

కళ్లు, పెదాలు క్లోజ్ చేయండి..

హోలీ రోజున మీ ముఖంపై రంగులు పడే సమయంలో మీరు కళ్లను, పెదాలను గట్టిగా మూసుకోవాలి. ఈ రెండు ప్లేసుల్లో రంగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే అది అన్ని వేళలా సాధ్యం కాదు. కాబట్టి మీరు కలర్ ప్రొటెక్టివ్ గ్లాసులు, సన్ గ్లాసెస్ లేదా ప్లెయిన్ గ్లాసులు పెట్టుకుంటే మీ కళ్లకు ఎంతో సెక్యూర్ గా ఉంటుంది. మీ కళ్లలో రంగులు చేరకుండా ఉండేందుకు ఇవి ఎంతగానో సహాయపడతాయి.

ఇలా చేయకండి..

ఇలా చేయకండి..

హోలీ రంగులను చల్లుకునే సమయంలో.. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. రంగులు తాకిన మీ చేతులతో కళ్లను పొరపాటున కూడా తాకొద్దు. అలాగే కళ్లను నలపడం వంటివి అస్సలు చేయొద్దు. ఇలా చేస్తే మీరు కళ్లకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వీటికి దూరంగా ఉండాలి..

వీటికి దూరంగా ఉండాలి..

హోలీ పండుగ వేళ వాటర్ బెలూన్స్ వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి అత్యంత ప్రమాదకరంగా ఉండటమే కాదు.. మీ కళ్లకు తీవ్ర గాయాలు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మీరు కంటిచూపు కోల్పోయే ప్రమాదం కూడా రావొచ్చు. పొరపాటున ఇలా జరిగితే, వెంటనే కంటి డాక్టర్ సంప్రదించాల్సి ఉంటుంది.

ఇవి వాడండి..

ఇవి వాడండి..

హోలీ కలర్స్ మీ కళ్లలో పడినా లేదా ఇతర పదార్థాలేమైనా పడితే వెంటనే కర్చీఫ్ లేదా టిష్యూర్ పేపర్ తో వాటిని మీ కళ్లలో నుండి తీయడానికి ప్రయత్నించొద్దు. ఇలా చేస్తే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాంటాక్ట్ లెన్సులు వంటివి వాడకండి. ఎందుకంటే వీటిని వాడితే మంచి కన్నా చెడు ఫలితాలే ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే కాంటాక్ట్ లెన్సులో నీటిని పీల్చుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మీకు అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

నిపుణులను సంప్రదించాలి..

నిపుణులను సంప్రదించాలి..

హోలీ పండుగ సందర్భంగా మీ కళ్లు ఎర్రగా మారిపోయి.. బాగా దురదలు పెడుతుంటే.. కళ్ల నుండి నీరు కారుతున్నా.. మీకు అసౌకర్యంగా ఉన్నా, లేదంటే రక్తస్రావం వంటి ప్రమాదం ఏదైనా జరిగితే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కంటి నిపుణులను సంప్రదించాలి.

FAQ's
  • హోలీ వేళ కళ్లలో రంగులు పడకూడదంటే ఏమి చేయాలి?

    హోలీ రోజున మీ ముఖంపై రంగులు పడే సమయంలో మీరు కళ్లను, పెదాలను గట్టిగా మూసుకోవాలి. ఈ రెండు ప్లేసుల్లో రంగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే అది అన్ని వేళలా సాధ్యం కాదు. కాబట్టి మీరు కలర్ ప్రొటెక్టివ్ గ్లాసులు, సన్ గ్లాసెస్ లేదా ప్లెయిన్ గ్లాసులు పెట్టుకుంటే మీ కళ్లకు ఎంతో సెక్యూర్ గా ఉంటుంది. మీ కళ్లలో రంగులు చేరకుండా ఉండేందుకు ఇవి ఎంతగానో సహాయపడతాయి.

  • 2022 సంవత్సరంలో హోలీ పండుగను ఎప్పుడు జరుపుకోనున్నారు?

    ఈ ఏడాది 2022 సంవత్సరంలో మార్చి 17, 18వ తేదీల్లో అంటే గురు, శుక్రవారం నాడు రానుంది. స్నేహాన్ని, బంధుత్వాన్ని మరింత దగ్గర చేసేందుకు హోలీ వంటి పండుగలు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఇదిలా ఉండగా.. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి రోజున హోలికా దహనం చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, రంగ్ ఉత్సవ్ హోలీని హోలికా దహన్ అంటారు. ఈ పండుగ సత్య యుగం నుండి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాల ద్వారా తెలుస్తోంది.

English summary

Holi Safety Tips: Do's and Dont's for Safe Holi in Telugu

Here are the Holi Safety Tips: Do' and Don'ts for safe Holi in Telugu. Have a look
Desktop Bottom Promotion